లంక ప్రీమియర్ లీగ్-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్ 12) కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్‌చల్ చేసింది.
Lucky escape for @IAmIsuru17 from the RPS snake #LPL2023 🐍🇱🇰🏏 pic.twitter.com/OnYokQxzvW
— Azzam Ameen (@AzzamAmeen) August 13, 2023
మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్ అడ్జస్ట్‌మెంట్‌లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
All these snakes showing up in anticipation of a Naagin dance celebration? 🐍 #LPL2023 #LPLOnFanCode pic.twitter.com/quKUACGr9u
— FanCode (@FanCode) August 13, 2023
ఇదిలా ఉంటే, బి లవ్ క్యాండీ-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్ జామన్ (22), ఏంజెలో మాథ్యూస్ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు.
LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023
— Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023
జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్ మాలిక్ (55), తిసార పెరీరా (36), క్రిస్ లిన్ (27), డేవిడ్ మిల్లర్ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 3, నువాన్ ప్రదీప్ 2, ఇసురు ఉదాన ఓ వికెట్ పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment