
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్‌లో బి లవ్ క్యాండీ కెప్టెన్ వనిందు హసరంగ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. లీగ్‌లో భాగంగా ఆగస్ట్ 5న జాఫ్నా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (4-0-9-3, 22 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టిన హసరంగ.. ఇవాళ (ఆగస్ట్ 8) గాలే టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ అదే స్థాయిలో రెచ్చిపోయాడు.
Into the halfway mark with the Titans on 58 for 6!#LPL2023 #LiveTheAction pic.twitter.com/I3WiwI0oiP
— LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023
తొలుత బ్యాట్‌తో విధ్వంసం (27 బంతుల్లో 64; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సృష్టించిన హసరంగ.. ఆతర్వాత బంతితో (3.4-0-17-4) తనదైన స్టయిల్‌లో మ్యాజిక్ చేశాడు. హసరంగ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఇరగదీయడంతో గాలేపై క్యాండీ 89 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
World-class Wanindu welcomes 200 T20 wickets!#LPL2023 #LiveTheAction pic.twitter.com/E920VBNQa8
— LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. హసరంగ, ఫకర్ జమాన్ (35 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ఏంజెలో మాథ్యూస్ (23 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), చండీమల్ (17 బంతుల్లో 25; 3 ఫోర్లు, సిక్స్), మహ్మద్ హరీస్ (14 బంతుల్లో 17; 3 ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. గాలే బౌలర్లలో లహిరు సమరకూన్ 2 వికెట్లు పడగొట్టగా.. కసున్ రజిత, నగరవ, షంషి తలో వికెట్ దక్కించుకున్నారు.
B-Love Kandy treats their home crowd to the season’s first 200 total!#LPL2023 #LiveTheAction pic.twitter.com/8uc4aEQuws
— LPL - Lanka Premier League (@LPLT20) August 8, 2023
అనంతరం 204 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గాలే.. హసరంగ, నువాన్ ప్రదీప్ (3-0-21-3), ముజీబ్ (4-0-26-2), దుష్మంత చమీర (3-0-17-1) ధాటికి 16.4 ఓవర్లలో 114 పరుగులు మాత్రమే చేసి చాపచుట్టేసింది. గాలే ఇన్నింగ్స్‌లో లహిరు సమరకూన్ (36) టాప్ స్కోరర్‌గా నిలువగా.. లసిత్ క్రూస్‌పుల్లే (27), అషాన్ ప్రియజన్ (25), షకీబ్ అల్ హసన్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు.