Thisara Perera
-
దంచికొట్టిన పెరీరా.. హెర్షల్ గిబ్స్ జట్టు ఘన విజయం
ఇండియన్ వెటరన్ ప్రీమియర్ లీగ్ (IVPL 2024) ఎనిమిదో మ్యాచ్‌లో హెర్షల్ గిబ్స్ సారథ్యం వహిస్తున్న రెడ్ కార్పెట్ ఢిల్లీ జట్టు.. ముంబై ఛాంపియన్స్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఛాంపియన్స్.. ఆష్లే నర్స్ (4-0-33-3), విక్రాంత్ శర్మ (4-0-21-3), ఒమర్ ఆలమ్ (2-0-7-1), ఆసేల గుణరత్నే (1-0-4-1) ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై ఇన్నింగ్స్‌లో అభిషేక్ ఝున్‌ఝున్‌వాలా (38) టాప్ స్కోరర్‌గా నిలువగా.. పీటర్ ట్రెగో (27), అమిత్ సనన్ (22), వి సోలంకి (14), వినయ్ యాదవ్ (13) రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. తిసారా పెరీరా (27 బంతుల్లో 64; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) విజృంభించడంతో 14.4 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో రిచర్డ్ లెవి (26), కెప్టెన్ గిబ్స్ (14), గుణరత్నే (17) వేగంగా పరుగులు సాధించారు. ముంబై బౌలర్లలో సోలంకి 2, రాష్ట్రదీప్ యాదవ్, పీటర్ ట్రెగో, వినయ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లీగ్‌లో రేపు జరుగుబోయే మ్యాచ్‌ల్లో రాజస్థాన్ లెజెండ్స్, చత్తీస్ఘడ్ వారియర్స్.. వీవీఐపీ ఉత్తర్‌ప్రదేశ్, ముంబై ఛాంపియన్స్ జట్లు తలపడనున్నాయి. -
లంక ప్రీమియర్ లీగ్‌లో మరోసారి పాము కలకలం.. తృటిలో తప్పించుకున్న ఉదాన
లంక ప్రీమియర్ లీగ్-2023లో మరోసారి పాము కలకలం రేపింది. లీగ్‌లో భాగంగా దంబుల్లా ఔరా, గాలే టైటాన్స్ మధ్య జులై 31న జరిగిన మ్యాచ్ సందర్భంగా తొలిసారి స్టేడియంలో ప్రత్యక్షమైన పాము.. నిన్న (ఆగస్ట్ 12) కొలొంబోని ప్రేమదాస స్టేడియంలో జాఫ్నా కింగ్స్, బి లవ్ క్యాండీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా మరోసారి మైదానంలోని చొచ్చుకొచ్చి హల్చల్ చేసింది. Lucky escape for @IAmIsuru17 from the RPS snake #LPL2023 🐍🇱🇰🏏 pic.twitter.com/OnYokQxzvW — Azzam Ameen (@AzzamAmeen) August 13, 2023 మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో (జాఫ్నా ఇన్నింగ్స్ 18వ ఓవర్) ఈ ఘటన చోటు చేసుకుంది. నువాన్ ప్రదీప్ బౌలింగ్ చేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తుండగా మైదానంలోకి ప్రవేశించిన పాము ఇసురు ఉదాన పక్క నుంచి వెళ్లింది. ఫీల్డ్ అడ్జస్ట్మెంట్లో భాగంగా అటుఇటు జరుగుతున్న ఉదాన పామును తొక్కబోయాడు. ఉదాన ఆ భారీ పామును చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అనంతరం మైదానంలో నుంచి వెళ్లిపోయిన పాము బౌండరీ లైన్ అవల ఉన్న కెమెరాల వద్దకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. All these snakes showing up in anticipation of a Naagin dance celebration? 🐍 #LPL2023 #LPLOnFanCode pic.twitter.com/quKUACGr9u — FanCode (@FanCode) August 13, 2023 ఇదిలా ఉంటే, బి లవ్ క్యాండీ-జాఫ్నా కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో క్యాండీ జట్టు 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన క్యాండీ.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేయగా.. ఛేదనలో జాఫ్నా 170 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. క్యాండీ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (51 బంతుల్లో 81; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగగా.. ఫకర్ జామన్ (22), ఏంజెలో మాథ్యూస్ (22) ఓ మోస్తరు పరుగులు చేశారు. LPL match was interrupted after snake invaded the field.pic.twitter.com/SUF7iVf2St#LPL | #LPL2023 — Saikat Ghosh (@Ghosh_Analysis) July 31, 2023 జాఫ్నా బౌలర్లలో తషార 3, వెల్లలగే, మధుశంక తలో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం జాఫ్నాను షోయబ్ మాలిక్ (55), తిసార పెరీరా (36), క్రిస్ లిన్ (27), డేవిడ్ మిల్లర్ (24) గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. క్యాండీ బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్ 3, నువాన్ ప్రదీప్ 2, ఇసురు ఉదాన ఓ వికెట్ పడగొట్టారు. -
తుస్సుమన్న బాబర్ ఆజమ్.. తిప్పేసిన అనామక బౌలర్
లంక ప్రీమియర్ లీగ్ 2023 ఎడిషన్ నిన్న (జులై 30) ప్రారంభమైంది. కొలొంబో వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్, కొలొంబో స్ట్రయికర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ 21 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్.. తౌహిద్ హ్రిదోయ్ (39 బంతుల్లో 54; 4 ఫోర్లు, సిక్స్) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. A few moments from the opening ceremony earlier this evening.#LPL2023 #LiveTheAction pic.twitter.com/QlczC1FX4Y — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 నిషాన్ మధుష్క (12), గుర్భాజ్ (21), అసలంక (12), ప్రియమల్ పెరీర (22) రెండంకెల స్కోర్లు చేసినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఆఖర్లో దునిత్ వెల్లలగే (25 నాటౌట్), కెప్టెన్ తిసార పెరీరా (14 నాటౌట్) వేగంగా పరుగులు సాధించడంతో జాఫ్నా కింగ్స్ ఓ మోస్తరు స్కోర్‌ను ప్రత్యర్ధి ముందు ఉంచగలిగింది. కొలొంబో బౌలర్లలో నసీం షా, మతీష పతిరణ, చమిక కరుణరత్నే, సందకన్ తలో వికెట్ పడగొట్టారు. As promised, a spectacular opening ceremony and one to remember for a long time! Here are a few clicks. #LPL2023 #LiveTheAction pic.twitter.com/sY3FsYdQ6k — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 The young star from Bangladesh took on a powerful bowling attack like a boss, and constructed a spirited half century! #LPL2023 #LiveTheAction pic.twitter.com/kHiAwvwTWF — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తిప్పేసిన అనామక బౌలర్.. 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కొలొంబో.. జాఫ్నా బౌలర్, అనామక కుర్రాడు విజయకాంత్ వియాస్కాంత్ (4-0-17-2) మాయాజాలం ధాటికి 19.4 ఓవర్లలో 152 పరుగులకు కుప్పకూలింది. విజయకాంత్‌తో పాటు హర్దుస్ విల్జోయెన్ (3/31), దిల్షన్ మధుషంక (2/18), తిసార పెరీరా (1/29) రాణించడంతో కొలొంబో టీమ్ ఓ మోస్తరు స్కోర్‌ను కూడా ఛేదించలేకపోయింది. Jaffna Kings stars shine bright with the ball! #LPL2023 #LiveTheAction pic.twitter.com/mxfUmeGa0T — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 తుస్సుమన్న బాబర్ ఆజమ్.. జాఫ్నాతో పోలిస్తే చాలా రెట్టు పటిష్టమైన కొలొంబో స్ట్రయికర్స్ ఈ మ్యాచ్‌లో తేలిపోయింది. కెప్టెన్ నిరోషన్ డిక్వెల్లా (34 బంతుల్లో 58; 9 ఫోర్లు, సిక్స్) ఒక్కడు అర్ధసెంచరీతో రాణించాడు. పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి తుస్సుమన్నాడు. తిసార పెరీరా బౌలింగ్‌లో బౌండరీ బాదిన అనంతరం బాబర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆతర్వాత వచ్చిన నిస్సంక (1), ఫెర్నాండో (17), మహ్మద్ నవాజ్ (3), యశోధ లంక (11), నసీం షా (0), పతిరణ (8) నిరాశపరచగా.. తమిక కరుణరత్నే (23) పర్వాలేదనిపించాడు. Dickwella came back with a bang this season and showcased his batting prowess! He was a one-man army!#LPL2023 #LiveTheAction pic.twitter.com/rcfL5IeJir — LPL - Lanka Premier League (@LPLT20) July 30, 2023 -
అత్యుత్తమ టి20 జట్టు ఎంపిక.. సొంత జట్టు ఆటగాళ్లకు నో చాన్స్
శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్ తిసార పెరీరా తన 11 మందితో కూడిన అత్యుత్తమ టి20 జట్టును ప్రకటించాడు. అయితే ఆశ్యర్యంగా తన సొంత జట్టు నుంచి ఒక్క ఆటగాడికి కూడా పెరీరా చోటు ఇవ్వకపోవడం విశేషం. పెరీరా ప్రకటించిన 11 మందిలో నలుగురు టీమిండియా నుంచి.. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఇద్దరు చొప్పున.. అఫ్గానిస్తాన్ నుంచి ఒక ఆటగాడిని ఎంపిక చేశాడు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కెప్టెన్‌గా.. వికెట్‌కీపర్‌గా ఎంపిక చేశాడు. ఇక క్రిస్ గేల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా.. విరాట్ కోహ్లి మూడో స్థానంలో.. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్లకు మిడిలార్డర్లో చోటు కల్పించాడు. ఇక స్పిన్నర్లుగా రషీద్ ఖాన్, సునీల్ నరైన్‌లను ఎంపిక చేసిన పెరీరా.. పేస్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్లను ఏంచుకున్నాడు. పెరీరా టి20 అత్యుత్తమ జట్టు: క్రిస్ గేల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, AB డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఎంఎస్ ధోని(కెప్టెన్ & వికెట్ కీపర్), రషీద్ ఖాన్, సునీల్ నరైన్, జస్ప్రీత్ బుమ్రా, మిచెల్ స్టార్క్, షాన్ టైట్ చదవండి: Suranga Lakmal: టీమిండియతో సిరీస్ ఆఖరు.. రిటైర్ కానున్న స్టార్ క్రికెటర్ కాగా తిసారా పెరీరా శ్రీలంక తరపున 2009లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన పెరీరా లంక తరపున 166 వన్డేల్లో 2338 పరుగులతో పాటు 175 వికెట్లు, 84 టి20ల్లో 1204 పరుగులు.. 61 వికెట్లు, 6 టెస్టుల్లో 203 పరుగులు చేయడంతో పాటు 11 వికెట్లు తీశాడు. 2014 టి20 ప్రపంచకప్ గెలిచిన శ్రీలంక జట్టులో పెరీరా సభ్యుడిగా ఉన్నాడు. వన్డేలు, టి20ల్లో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్‌గా పెరీరా చరిత్ర సృష్టించాడు. ఇక ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన పెరీరా.. సౌతాఫ్రికాతో వన్డే మ్యాచ్‌లో రాబిన్ పీటర్సన్ బౌలింగ్‌లో ఒక ఓవర్లో 35 పరుగులు కొట్టి కొత్త రికార్డు సృష్టించాడు. మే 3, 2021న అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన పెరీరా 2017-19 మధ్య కాలంలో అన్ని ఫార్మాట్లకు లంక కెప్టెన్‌గా వ్యవహరించాడు. -
విధ్వంసం సృష్టించిన శ్రీలంక ఆల్ రౌండర్.. 20 బంతుల్లో హాఫ్ సెంచరీ..
Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్‌పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది. జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు. చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు -
క్రికెట్‌కు తిషారీ పెరీరా గుడ్ బై
కొలంబో: శ్రీలంక క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ తిషారా పెరీరా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు సోమవారం ప్రకటించాడు. తన నిర్ణయం ఈరోజు నుంచే అమల్లోకి వస్తుందని వెల్లడించాడు. ఈ మేరకు శ్రీలంక క్రికెట్(ఎస్ఎల్సీ)కి లేఖ ద్వారా పెరీరా తెలియజేశాడు. తన వీడ్కోలుకు ఇదే తగిన సమయమని భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. శ్రీలంక తరఫున ఆరు టెస్టులు మాత్రమే ఆడిన పెరీరా.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం 166 వన్డేలు, 84 టీ20లకు ప్రాతినిథ్యం వహించాడు. ఐపీఎల్లో 37 మ్యాచ్‌లు ఆడాడు. వన్డే ఫార్మాట్లో 2,338 పరుగులు చేసిన పెరీరా.. టీ20ల్లో 1204 పరుగులు చేశాడు. ఇక వన్డేల్లో 175 వికెట్లు సాధించిన పెరీరా.. అంతర్జాతీ టీ20ల్లో 51 వికెట్లు తీశాడు. ‘ నేను శ్రీలంకకు ప్రాతినిథ్యం వహించడాన్ని గొప్పగా భావిస్తున్నాను. ఓవరాల్‌గా ఏడు క్రికెట్ వరల్డ్‌కప్‌లో శ్రీలంక తరఫున ఆడాను. 2014లో టీ20 వరల్డ్‌కప్ గెలిచిన శ్రీలంక జట్టులో సభ్యుడిగా ఉన్నాను. ఇది నా జీవితంలో ఒక గొప్ప ఘనత’ అని ఎస్ఎల్సీకి రాసిన లేఖల పేర్కొన్నాడు. తిషారా పెరీరా వీడ్కోలుపై ఎస్ఎల్సీ సీఈవో అష్లే డిసిల్వా మాట్లాడుతూ.. ‘ అతనొక గొప్ప ఆల్‌రౌండర్. శ్రీలంక క్రికెట్ సాధించిన పలు ఘనతల్లో పెరీరా భాగస్వామ్యం ఉంది. లంక క్రికెట్‌కు పెరీరా ఎంతో చేశాడు’ అని పేర్కొన్నారు. ఇక్కడ చదవండి: ఐపీఎల్ రద్దు తప్పదా? ఇద్దరు ప్లేయర్లకు కరోనా, నేటి మ్యాచ్ వాయిదా! -
ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన శ్రీలంక ఆల్‌రౌండర్
కొలొంబో: శ్రీలంక ఆల్‌రౌండర్ తిసార పెరీరా అరుదైన రికార్డును సాధించాడు. ప్రొఫెషనల్ క్రికెట్లో ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన తొలి లంక క్రికెటర్‌గా చరిత్ర పుటల్లోకెక్కాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో భాగంగా శ్రీలంక ఆర్మీ అండ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. ప్రత్యర్ధి బౌలర్ దిల్హన్ కూరే బౌలింగ్‌లో వరుస సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో అతను 13 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ(52 పరుగులు) పూర్తి చేశాడు. లిస్ట్ ఏ క్రికెట్లో ఇది రెండో వేగవంతమైన హాఫ్ సెంచరీ కాగా, అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ రికార్డు శ్రీలంక ఆల్‌రౌండర్ కౌసల్య వీరరత్నే పేరిట నమోదై ఉంది. రంగన క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన వీరరత్నే 2005 నవంబర్‌లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ(18 బంతుల్లో 66) పూర్తిచేశాడు. శ్రీలంక లిస్ట్ ఏ క్రికెట్లో ఇదే వేగవంతమైన అర్ధశతకం. వీరరత్నే ఫిఫ్టీలో 2 ఫోర్లు, 8 సిక్సర్లుండగా... అందులో ఒకే ఓవర్లో 5 సిక్సర్లు సాధించడం విశేషం. కాగా, తిసార పెరీరా ఈ ఘనతను సాధించడానికి కొద్ది వారాల క్రితమే అంతర్జాతీయ టీ20లో విండీస్ యోధుడు కీరన్ పోలార్డ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదాడు. శ్రీలంకతోనే జరిగిన ఈ మ్యాచ్‌లో లంక బౌలర్ అఖిల ధనుంజయ బౌలింగ్‌లో పోలార్డ్ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో తిసార పెరీరా తొమ్మిదో స్థానంలో నిలిచాడు. పెరీరాకు ముందు గ్యారి సోబర్స్(వెస్టిండీస్), రవిశాస్త్రి(భారత్), గిబ్స్(దక్షిణాఫ్రికా), యువరాజ్(భారత్), రాస్ వైట్లీ(ఇంగ్లండ్), హజ్రతుల్లా జజాయ్(ఆఫ్ఘనిస్తాన్), లియో కార్టర్(న్యూజిలాండ్), పోలార్డ్(వెస్టిండీస్) ఉన్నారు. చదవండి: ముంబై ఇండియన్స్ శిబిరంలో రోహిత్ -
శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్ మార్చాలంటూ
-
వరల్డ్ కప్ : ఓపెనింగ్ పంపాలని.. చెట్టెక్కి నిరసన
క్రికెట్ అంటే ఓ ఆటే కాదు అదో పిచ్చిలా భావించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. తమ దేశం ఓటమి చెందితే చాలు జట్టు సమీకరణల్లో ఎక్కడో ఏదో లోపం జరిగిందంటూ లెక్కలేస్తుంటారు అభిమానులు. అయితే శ్రీలంకలో ఓ అభిమాని మాత్రం ఓ అడుగు ముందుకేసి చెట్టేకేశాడు. వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక దారుణంగా ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ అభిమాని. శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్ మార్చాలంటూ, ఆల్‌రౌండర్ తిసెరా పెరీరాను ఓపెనర్‌గా పంపాలని ఓ భారీ మర్రి చెట్టు ఎక్కి తన నిరసన తెలిపాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ అర్నాల్డ్ రీట్వీట్ చేస్తూ.. బాగుంది, అతన్ని చెట్టు ఎక్కనివ్వడం అపకండి అంటూ సెటైర్ వేశారు. కాగా, వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్ మార్చాలంటూ තිසර වෙනුවෙන්, ගසක නැග සිටිය දී හමු වූ ක්රිකට් රසිකයා.. ( A man in Srilanka protesting by climbing up in a tree demanding @OfficialSLC to promote @PereraThisara to open the batting) #CWC19 #lka ( video - News1st) pic.twitter.com/YVtVmrnk0m — Nibraz Ramzan (@nibraz88cricket) June 3, 2019 -
74 బంతుల్లో 140 పరుగులు
మౌంట్ మాంగనీ: తొలి వన్డేలో ఐదు... రెండో వన్డేలో మరో ఐదు... తన బౌలింగ్‌లో తిసారా పెరీరా ఇచ్చిన సిక్సర్లు ఇవి! ఆ కసినంతా అతను రెండో వన్డేలో తన బ్యాటింగ్‌లో చూపించాడు. పదికి తోడు అదనంగా మరో మూడు సిక్సర్లు బాది వీర విధ్వంసం సృష్టించాడు. 74 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 140 పరుగులు చేసినా సరే శ్రీలంకను పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. ముందుగా కివీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రాస్ టేలర్ (105 బంతుల్లో 90; 4 ఫోర్లు, 1 సిక్స్), మున్రో (77 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషామ్ (37 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం లంక 46.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. తిసారా జోరుకు తోడు గుణతిలక (71; 9 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. ఒక దశలో 16 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక స్కోరు 27 ఓవర్లు ముగిసేసరికి 128/7గా నిలిచింది. అయితే ఆ తర్వాత 19.2 ఓవర్ల పాటు ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడుతూ పెరీరా జోరు కొనసాగింది. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్ సెంచరీ, 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా సౌతీ ఓవర్లో అతను 4 భారీ సిక్సర్లతో చెలరేగడం ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. చివరి మూడు వికెట్లకు 75, 51, 44 పరుగులు భాగస్వామ్యాలు నెలకొల్పిన తిసారా జట్టును గెలిపించలేకపోయాడు. 23 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్‌కు ప్రయత్నించి తిసారా లాంగాన్‌లో బౌల్ట్‌కు క్యాచ్ ఇవ్వడంతో లంక ఓటమి ఖాయమైంది. -
అదరగొట్టిన ఆఫ్గాన్ బ్యాట్స్‌మెన్
అబుదాబి: బ్యాట్స్‌మన్ సమష్టిగా రాణించడంతో ఆఫ్గానిస్తాన్ జట్టు శ్రీలంకకు 250 పరుగుల గౌరవప్రదమైన లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్గాన్ సారథి అస్ఘర్ ఆఫ్గాన్ నమ్మకాన్ని బ్యాట్స్‌మెన్ నిలబెట్టారు. తొలుత ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 57 పరుగుల జోడించిన అనతరం ఓపెనింగ్ జోడిని లంక స్పిన్నర్ అఖిల ధనుంజయ విడదీశాడు. మహ్మద్ షాజాద్(34; 47 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్)ను వికెట్ల మందు దొరకబుచ్చుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన రెహ్మత్ షా(72; 90 బంతుల్లో 5ఫోర్లు)తో కలిసి మరో ఓపెనర్ ఇషానుల్లా జనత్( 45; 65 బంతుల్లో 6 ఫోర్లు) లంక బౌలర్లకు పరీక్ష పెట్టారు. రెండో వికెట్‌కు అర్దసెంచరీ భాగస్వామ్యం నమోదు చేసి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని మరోసారి ధనుంజయ విడదీశాడు. టాపార్డర్ బ్యాట్స్‌మన్ శుభారంబాన్ని అందించినప్పటికీ మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ భారీ స్కోర్ చేయటంలో విఫలమయ్యారు. దీంతో భారీ స్కోర్ సాధిస్తుందనుకున్న ఆఫ్గాన్ నిర్ణీత 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. లంక పేసర్ తిశార పెరీరా ఐదు వికెట్లు తీసి మిడిలార్డర్‌ను కుప్పకూల్చాడు. మిగతా లంక బౌలర్లలో ధనుంజయ రెండు వికెట్లు తీయగా, మలింగ, చమీరా, జయసూర్య తలో వికెట్ సాధించారు. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 262 పరుగుల లక్ష్యాన్ని చేదించలేక 124 పరుగులకే ఆలౌటై 137 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. -
అందువల్లే ఓడిపోయాం: తిషారా
కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడం పట్ల శ్రీలంక యాక్టింగ్ కెప్టెన్ తిషారా పెరీరా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన కారణంగానే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. మ్యాచ్ ఆరంభంలో బ్యాటింగ్ బాగా చేసినప్పటికీ, మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఇదే తమ ఓటమికి ప్రధాన కారణంగా తిషారా విశ్లేషించాడు. ఇది 152 పరుగుల వికెట్ కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇంకా 30-40 పరుగులు వెనుకబడిపోయామని, 175 నుంచి 180 పరుగులు చేసి ఉంటే అప్పుడు కాపాడుకోవడానికి ఆస్కారం ఉండేదన్నాడు. హాఫ్ సెంచరీ చేసిన కుశాల్ మెండిస్ వికెట్ కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పిందన్నాడు. మరొకవైపు బౌలింగ్ విషయానికొస్తే.. తొలి ఆరు ఓవర్లలో తమ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయలేకపోయమన్నాడు. ఈ ఓటమి విషయాన్ని పక్కకు పెట్టి తదుపరి మ్యాచ్‌కు సానుకూల ధోరణితో సిద్ధమవుతామన్నాడు. లంకేయులు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన సంగతి తెలిసిందే. దాంతో శ్రీలంకపై ఆరంభపు మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి భారత్ ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది. -
‘ధర్మశాల విజయాన్ని రిపీట్ చేస్తాం’
మొహాలి: ధర్మశాల విజయాన్ని పునరావృతం చేస్తామని శ్రీలంక కెప్టెన్ తిసారా పెరీరా ధీమా వ్యక్తం చేశాడు. మోహాలిలో ప్రాక్టీస్ అనంతరం మీడియాతో మాట్లాడారు. సిరీస్ గెలవడానికి ఇది ఓ మంచి అవకాశమని, పెద్ద పెద్ద జట్లకు భారత్‌లో సిరీస్ గెలవడం సాధ్యం కాలేదన్నాడు. ధర్మశాల మ్యాచ్ వలె తమ ప్రత్యేకతను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నామన్నాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదన్న పెరీరా ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్ గెలుస్తామన్న విషయం ప్రతి ఒక్కరికి మెదళ్లలో నాటుకోపోయిందన్నాడు. మ్యాచ్ గెలవడానికి 200 శాతం ప్రదర్శన కనబరుస్తామన్నాడు. గత న్యూజిలాండ్ సిరీస్‌లో భారత్ కూడా తొలి మ్యాచ్ ఓడిపోయి తరువాతి రెండు మ్యాచ్‌లు గెలిచిందన్న విషయం తెలుసని, అయినా మా బాధ్యత మేం నిర్వర్తిస్తామన్నాడు. 12 ఓటముల తర్వాత గెలవడం ఆనందంగా ఉందన్న పెరీరా.. ధర్మశాల ప్రదర్శనను కనబరిస్తే సులువుగా మొహాలి మ్యాచ్ గెలువచ్చన్నాడు. ఇక జట్టు సభ్యుల్లో ధనుంజయ డిసిల్వా ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్నాడని మిగతా వారంతా ఫిట్‌గా ఉన్నారని తెలిపాడు. ఇక ధర్మశాలలో రహానేను ఆడించకపోవడంపై స్పందిస్తూ.. నేను భారత సెలక్టర్‌ను కాదు. ఎందుకు ఆడలేదో నాకు తెలియదు. అతను ఓ గొప్ప బ్యాట్స్‌మన్. ఈ విషయంపై నేను ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేనన్నాడు. తొలి మ్యాచ్‌లో రోహిత్ సేనపై శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సాధించిన విషయం తెలిసిందే. ఇక బుధవారం జరిగే మ్యాచ్ భారత్ చావో రేవో అన్నట్లుగా ఉంది. వాతావారణ పరిస్థితుల దృష్ట్యా శ్రీలంక టీం ధర్మశాలలో ఒక రోజు ఎక్కువగా బసచేసింది. మంగళవారం ఉదయం మొహాలి చేరిన జట్టు మధ్యాహ్నం ప్రాక్టీస్‌లో పాల్గొంది. పెరీరాకు ఈ మైదానంలో కింగ్స్ఎలెవన్ పంజాబ్ తరుపున ఆడిన అనుభవం ఉంది. -
ఆ ఘనత వారిదే: లంక కెప్టెన్
ధర్మశాల:మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌తో ఇక్కడ ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో తమ జట్టు ఘన విజయం సాధించడంలో బౌలర్లదే కీలక పాత్ర అని శ్రీలంక కెప్టెన్ తిషారా పెరీరా ప్రశంసల వర్షం కురిపించాడు. భారత్ స్కోరు కనీసం 250-260 మధ్య చేస్తుందని భావిస్తే.. వారు స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన ఘనత బౌలర్లదని కొనియాడాడు. 'తొలి వన్డేలో విజయం సాధించిన ఘనత 200 శాతం మా బౌలర్లదే. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో మా బౌలర్లు బౌలింగ్ చేశారు. ఇది మా గెలుపు కారణం. కాకపోతే ఇది ఆటకు అనుకూలించే వికెట్ ఎంతమాత్రం కాదు.. ఈ తరహా వికెట్‌ను మేము ఊహించలేదు. భారత్ జట్టు 260 పరుగులు చేస్తుందని అనుకున్నాం. కానీ సురంగా లక్మల్, ఏంజెలో మాథ్యూస్‌లు క్రమశిక్షణతో కూడిన బౌలింగ్ చేసి టీమిండియాను కట్టడి చేశారు. టెస్టు సిరీస్‌లో రాణించిన లక్మల్.. తొలి వన్డే మ్యాచ్‌లో కూడా రాణించాడు. ఈ సమయంలో మాకు ఉన్న ఒకే ఒక్క ఫాస్ట్ బౌలర్ ఆప్షన్ లక్మల్. అతనిపై పెట్టుకున్న అంచనాల్ని నిజం చేస్తూ గెలుపుకు బాటలు వేశాడు. మిగతా బౌలర్లు కూడా అతనికి సహకరించడంతో ఘన విజయాన్ని అందుకున్నాం' అని పెరీరా తెలిపాడు. -
తిసారా పెరీరాకు వన్డే పగ్గాలు
భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా నియమితుడయ్యాడు. ఉపుల్ తరంగ స్థానంలో పెరీరాను నియమిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డేలతోపాటుగా టి20 జట్టుకూ పెరీరాయే కెప్టెన్‌గా ఉంటాడని వెల్లడించింది. 2009 డిసెంబర్లో అరంగేట్రం చేసిన పెరీరా ఇప్పటి వరకు 125 వన్డేలు ఆడి 108.26 స్ట్రయిక్ రేట్‌తో 1,441 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 32.62 సగటుతో 133 వికెట్లు తీశాడు. తరంగ నాయకత్వంలో శ్రీలంక జట్టు ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల చేతుల్లో వన్డే సిరీస్‌లను కోల్పోయింది. -
'హ్యాట్రిక్ చేశానని అప్పుడు తెలియదు'
రాంచీ: భారత్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక పేస్ బౌలర్ తిషారా పెరీరా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న లంక ఆశ్చర్యకర విషయాన్ని వెల్లడించాడు. భారత ఇన్నింగ్స్ 19వ ఓవర్లో హ్యాట్రిక్ వికెట్లు టీ20ల్లో ఆ ఘనత సాధించిన తొలి లంక బౌలర్ గా నిలిచాడు. అయితే, హ్యాట్రిక్ వికెట్లు తీసిన విషయమే తనకు తెలియలేదని పెరీరా చెప్పాడు. తాను కేవలం వికెట్లు తీయడం, పరుగులు కట్టడం చేయడంపైనే దృష్టిసారించడంతో ఈ విషయాన్ని పట్టించుకోలేదని వివరించాడు. 19వ ఓవర్ వేసిన పెరీరా తొలుత కొన్ని బంతులను వైడ్లు వేశాడు. ఆ ఓవర్ నాల్గో బంతికి పాండ్యాను అవుట్ చేసిన పెరీరా, ఆ తరువాత ఐదు, ఆరు బంతులకు రైనా, యువరాజ్ లను పెవిలియన్ బాట పట్టించాడు. యువరాజ్ డకౌట్(0) గా వెనుదిరిగాడు. ఆ మ్యాచ్ లో పెరీరా 3 ఓవర్లు వేసి 3 వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. ఓవరాల్ గా తనకు ఇది రెండో హ్యాట్రిక్ అని, గతంలో పాక్ తో జరిగిన వన్డే మ్యాచ్ లో తొలిసారి ఈ ఫీట్ సాధించినట్లు పెరీరా చెప్పాడు. టాస్ గెలిస్తే బౌలింగ్ చేయాలని తమ జట్టు ముందే డిసైడ్ అయినట్లు వివరించాడు. టీమిండియా బ్యాటింగ్ ఒక్క కారణం వల్లే తమ జట్టు ఓటమి పాలైందని లంక బౌలర్ అభిప్రాయపడ్డాడు. ధావన్ అద్బుతంగా బ్యాటింగ్ చేశాడు.. అశ్విన్ తన బౌలింగ్ తో తమ బ్యాట్స్ మన్ ను ఇబ్బంది పెట్టాడని రెండో టీ20 ఓటమి తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఈ వివరాలు చెప్పుకొచ్చాడు. ఓవరాల్ గా టీ 20ల్లో హ్యాట్రిక్ సాధించిన నాల్గో ఆటగాడిగా పెరీరా గుర్తింపు పొందాడు. అంతకుముందు బ్రెట్ లీ, జాకబ్ ఓరమ్, టీమ్ సౌతీలు హ్యాట్రిక్ లు ఈ ఫీట్ నెలకొల్పారు. -
లంకను గెలిపించిన పెరీరా
ఇంగ్లండ్‌తో ఏకైక టి20 లండన్: ఇంగ్లండ్ పర్యటనను శ్రీలంక ఘనంగా ఆరంభించింది. బుధవారం జరిగిన ఏకైక టి20 మ్యాచ్‌లో తిషార పెరీరా ఆల్‌రౌండ్ షో (20 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు; 1/24) కనబరచడంతో ఇంగ్లండ్‌పై లంక 9 పరుగుల తేడాతో నెగ్గింది. టాస్ కోల్పోయి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆరంభంలో వితనగే (26 బంతుల్లో 38; 7 ఫోర్లు), తిరిమన్నె (32 బంతుల్లో 40; 3 ఫోర్లు, 1 సిక్స్)లు రాణించగా, చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పెరీరా చెలరేగడంతో భారీస్కోరు నమోదైంది. అనంతరం ఇంగ్లండ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ అలెక్స్ హేల్స్ (41 బంతుల్లో 66; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు)కు తోడు బట్లర్ (26), బొపార (28 నాటౌట్)లు పోరాడినా.. లంక బౌలింగ్‌కు తలవంచారు. సంక్షిప్త స్కోర్లు: శ్రీలంక: 20 ఓవర్లలో 183/7 (తిసార పెరీరా 49, తిరిమన్నె 40; గర్నీ 2/26); ఇంగ్లండ్: 20 ఓవర్లలో 174/7 (హేల్స్ 66, బొపార 28 నాటౌట్; మలింగ 3/28). -
పెరీరా మెరుపులు
క్వాలిఫయింగ్ పోటీల ద్వారా ప్రధాన మ్యాచ్‌లకు అర్హత సాధించిన సన్‌రైజర్స్.... చాంపియన్స్ లీగ్‌ను ఘనంగా ప్రారంభించింది. ట్రినిడాడ్‌తో జరిగిన మ్యాచ్‌లో పెరీరా సంచలన బ్యాటింగ్‌తో ఒంటిచేత్తో హైదరాబాద్‌కు విజయాన్ని అందించాడు. మొహాలీ: ప్రధాన మ్యాచ్‌లకు ఒక్క రోజు ముందు సన్‌రైజర్స్ ఆటగాళ్లపై ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆటగాళ్ల స్థైర్యం కాస్తో కూస్తో దెబ్బతింటుంది. కానీ ఆ ప్రభావం తమపై ఏమాత్రం పడలేదని తమ ఆటతీరుతోనే నిరూపించారు సన్‌రైజర్స్ స్టార్స్. తిసార పెరీరా (32 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సంచలన హిట్టింగ్తో హైదరాబాద్ జట్టు లీగ్‌లో పాయింట్ల బోణీ చేసింది. పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన గ్రూప్ బి లీగ్ మ్యాచ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టుపై సన్‌రైజర్స్ 4 వికెట్ల తేడాతో గెలిచింది. 161 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్... 19.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 164 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు పార్థీవ్ (15 బంతుల్లో 17; 2 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ధావన్ (18 బంతుల్లో 23; 3 ఫోర్లు, 1 సిక్సర్) తొలి నాలుగు ఓవర్లలో 35 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. అయితే ట్రినిడాడ్ బౌలర్లు పది పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరినీ అవుట్ చేశారు. డుమిని (16 బంతుల్లో 17; 2 ఫోర్లు) నిలకడగా ఆడుతున్న దశలో రనౌట్ అయ్యాడు. విహారి (13) కూడా నిరాశపరిచాడు. దీంతో సన్‌రైజర్స్ 95 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో తిసార పెరీరా అద్భుతమైన హిట్టింగ్తో ట్రినిడాడ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. రెండో ఎండ్‌లో డారెన్ స్యామీ (15 బంతుల్లో 15; 1 ఫోర్, 1 సిక్సర్) కూడా చెలరేగిపోయాడు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కు కేవలం 4.4 ఓవర్లలోనే 47 పరుగులు జోడించి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. అయితే నరైన్ వరుస బంతుల్లో స్యామీ, ఆశిష్‌లను అవుట్ చేసి ట్రినిడాడ్ ఆశలను సజీవంగా నిలిపాడు. అయితే పెరీరా ఏ మాత్రం ఒత్తిడికి లోను కాకుండా కరణ్ శర్మ (5 బంతుల్లో 13 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్సర్) సాయంతో జట్టును గట్టెక్కించాడు. ట్రినిడాడ్ బౌలర్లలో నరైన్ (4/9) అద్భుతంగా బౌలింగ్ చేసినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు టాస్ గెలిచిన సన్‌రైజర్స్ బౌలింగ్ ఎంచుకోగా... ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 160 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ సిమ్మన్స్ (0) స్టెయిన్ బౌలింగ్‌లో తొలి బంతికే అవుటయ్యాడు. కానీ డారెన్ బ్రేవో (44 బంతుల్లో 66; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో అర్ధసెంచరీ చేసి ట్రినిడాడ్ ఇన్నింగ్స్‌కు మూలస్తంభంలా నిలిచాడు. లూయిస్ (14 బంతుల్లో 22; 4 ఫోర్లు), కెప్టెన్ రామ్‌దిన్ (15 బంతుల్లో 21; 3 ఫోర్లు) రాణించారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాంత్ శర్మ, పెరీరా, స్యామీ రెండేసి వికెట్లు తీసుకున్నారు. లెగ్‌స్పిన్నర్ కరణ్‌శర్మ తుది జట్టులో ఉన్నా... అతడితో ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ చేయించలేదు. తిసార పెరీరాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు ట్రినిడాడ్ అండ్ టొబాగో ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్థీవ్ (బి) స్టెయిన్ 0; లూయిస్ (సి) పార్థీవ్ (బి) ఇషాంత్ 22; డారెన్ బ్రేవో (సి) ధావన్ (బి) ఇషాంత్ 66; జాసన్ మహమ్మద్ (బి) స్యామీ 19; రామ్‌దిన్ (సి) స్టెయిన్ (బి) పెరీరా 21; పూరన్ (సి) పార్థీవ్ (బి) స్యామీ 6; స్టీవార్ట్ (బి) పెరీరా 17; నరైన్ రనౌట్ 0; ఎమ్రిట్ నాటౌట్ 3; బద్రీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బై 1, వైడ్లు 3, నోబాల్ 1) 5; మొత్తం (20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి) 160. వికెట్ల పతనం: 1-0; 2-49; 3-110; 4-110; 5-124; 6-153; 7-154; 8-156. బౌలింగ్: స్టెయిన్ 4-0-41-1; ఇషాంత్ 4-0-36-2; విహారి 1-0-8-0; పెరీరా 4-0-26-2; మిశ్రా 3-0-27-0; స్యామీ 4-0-21-2. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: పార్థీవ్ పటేల్ (సి) స్టీవార్ట్ (బి) నరైన్ 17; శిఖర్ ధావన్ (సి) అండ్ (బి) స్టీవార్ట్ 23; డుమిని రనౌట్ 17; విహారి (స్టం) రామ్‌దిన్ (బి) నరైన్ 13; పెరీరా నాటౌట్ 57; స్యామీ (సి) బద్రీ (బి) నరైన్ 15; ఆశిష్ రెడ్డి (సి) అండ్ (బి) నరైన్ 0; కరణ్ శర్మ నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు (లెగ్‌బైస్ 2, వైడ్లు 4, నోబాల్స్ 3) 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి) 164. వికెట్ల పతనం: 1-35; 2-45; 3-70; 4-95; 5-142; 6-142. బౌలింగ్: రామ్‌పాల్ 4-0-39-0; బద్రీ 4-0-25-0; ఎమ్రిట్ 4-0-57-0; నరైన్ 4-1-9-4; స్టీవార్ట్ 3.3-0-32-1. చాంపియన్స్ లీగ్‌లో నేడు ఒటాగో x పెర్త్ సా. గం. 4.00 నుంచి రాజస్థాన్ x లయన్స్ రా. గం. 8.00 నుంచి వేదిక: జైపూర్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం