
భారత్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంక కెప్టెన్‌గా సీనియర్ ఆల్‌రౌండర్ తిసారా పెరీరా నియమితుడయ్యాడు. ఉపుల్ తరంగ స్థానంలో పెరీరాను నియమిస్తున్నట్లు లంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. వన్డేలతోపాటుగా టి20 జట్టుకూ పెరీరాయే కెప్టెన్‌గా ఉంటాడని వెల్లడించింది. 2009 డిసెంబర్‌లో అరంగేట్రం చేసిన పెరీరా ఇప్పటి వరకు 125 వన్డేలు ఆడి 108.26 స్ట్రయిక్ రేట్‌తో 1,441 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో 32.62 సగటుతో 133 వికెట్లు తీశాడు. తరంగ నాయకత్వంలో శ్రీలంక జట్టు ఇటీవల భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ జట్ల చేతుల్లో వన్డే సిరీస్‌లను కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment