Thisara Perera scores a half century as Jaffna Kings defeat Colombo Stars by 93 runs: లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ కెప్టెన్ తిసార పెరీరా విధ్వంసం సృష్టించాడు. 23 బంతుల్లోనే 5 సిక్సర్లు, మూడు ఫోర్లతో 57 పరుగులు సాధించాడు. దీంతో కొలంబో స్టార్స్‌పై జాఫ్నా కింగ్స్ 93 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఆటను 18 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన జఫ్నా కింగ్స్ 18 ఓవర్లలో 6 వికెట్లు నష్టానికి 207 పరుగుల భారీ స్కోరు చేసింది.
జాఫ్నా కింగ్స్ బ్యాటర్లలో కోహ్లర్-కాడ్మోర్(44), మాలిక్(44), బండారా(42)పరుగులతో రాణించారు. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కొలంబో స్టార్స్ జాఫ్నా బౌలర్ల ధాటికి 114 పరుగులకే కుప్పకూలింది. కొలంబో స్టార్స్ బ్యాటర్లలో ఆషాన్ ప్రియాంజన్ 35 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జాఫ్నా బౌలర్లలో మహేశ్ తీక్షణ,వహాబ్ రియాజ్ చెరో నాలుగు వికెట్లు సాధించారు.
చదవండి: Alex Carey: డెబ్యూ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు.. పంత్ సహా ఐదుగురి రికార్డు బద్దలు
Comments
Please login to add a commentAdd a comment