కొలంబో: ముక్కోణపు టీ 20 సిరీస్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పరాజయం చెందడం పట్ల శ్రీలంక యాక్టింగ్ కెప్టెన్ తిషారా పెరీరా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధానంగా బ్యాటింగ్‌లో తీవ్రంగా నిరాశపరిచిన కారణంగానే ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు. మ్యాచ్ ఆరంభంలో బ్యాటింగ్ బాగా చేసినప‍్పటికీ, మిడిల్ ఓవర్లలో పరుగులు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఇదే తమ ఓటమికి ప్రధాన కారణంగా తిషారా విశ్లేషించాడు.
ఇది 152 పరుగుల వికెట్ కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇంకా 30-40 పరుగులు వెనుకబడిపోయామని, 175 నుంచి 180 పరుగులు చేసి ఉంటే అప్పుడు కాపాడుకోవడానికి ఆస్కారం ఉండేదన్నాడు. హాఫ్ సెంచరీ చేసిన కుశాల్ మెండిస్ వికెట్ కూడా మ్యాచ్‌ను మలుపు తిప‍్పిందన్నాడు. మరొకవైపు బౌలింగ్ విషయానికొస్తే.. తొలి ఆరు ఓవర్లలో తమ ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయలేకపోయమన్నాడు. ఈ ఓటమి విషయాన్ని పక్కకు పెట్టి తదుపరి మ్యాచ్‌కు సానుకూల ధోరణితో సిద్ధమవుతామన్నాడు.
లంకేయులు నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన సంగతి తెలిసిందే. దాంతో శ్రీలంకపై ఆరంభపు మ్యాచ్‌లో ఎదురైన ఓటమికి భారత్ ఘనంగా ప్రతీకారం తీర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment