
కొలంబో: గత రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్‌తో జరిగిన ట్రై సిరీస్ టీ 20 సిరీస్ ఫైనల్లో భారత్ ఆఖరి బంతికి విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ చివర్లో ఉత్కంఠగా మారిపోయింది. ఇది అలాంటి ఇలాంటి ఉత్కంఠ కాదు. రెండు నిమిషాల పాటు తనువును ఉన్నచోటే బంధించింది. కళ్లను రెప్పలు కొట్టకుండా కట్టేసింది. గుండె దడను అమాంతం పెంచేసింది. చివరకు టీమిండియా గెలిచి అభిమానుల్ని ఊపిరి తీసుకునేలా చేసింది.
అదే సమయంలో బంగ్లాదేశ్ అభిమానులు తమ జట్టు ఓటమిని జీర్ణించుకోలేకుండా చేసింది. ఆఖరి బంతికి దినేశ్ కార్తీక్ సిక్స్ కొట్టి భారత్‌కు విజయాన్ని.. తమ జట్టుకు తీవ్ర నిరాశను మిగుల్చుతాడని బంగ్లా అభిమానులు అస్సలు ఊహించి ఉండరు. ఇక ఇక్కడ వీరాభినులు సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి వీరంగా ఎలా ఉంటుందో ఈ తాజా వీడియో చూస్తే అర్ధమవుతుంది. భారత్ విజయాన్ని జీర్ణించుకోలేని బంగ్లాదేశ్ అభిమాని చేసిన ‘ఇంటి రణరంగం’ ఎలా ఉందో చూడండి.
Comments
Please login to add a commentAdd a comment