వరల్డ్‌ కప్‌ : ఓపెనింగ్‌ పంపాలని.. చెట్టెక్కి నిరసన | Thisara Perera to bat first fan demands in Srilanka | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ కప్‌ : ఓపెనింగ్‌ పంపాలని.. చెట్టెక్కి నిరసన

Published Tue, Jun 4 2019 1:42 PM | Last Updated on Tue, Jun 4 2019 3:40 PM

తిసెరా పెరీరా, ఇన్‌సెట్‌లో చెట్టెక్కుతున్న అభిమాని - Sakshi

తిసెరా పెరీరా, ఇన్‌సెట్‌లో చెట్టెక్కుతున్న అభిమాని

క్రికెట్‌ అంటే ఓ ఆటే కాదు అదో పిచ్చిలా భావించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. తమ దేశం ఓటమి చెందితే చాలు జట్టు సమీకరణల్లో ఎక్కడో ఏదో లోపం జరిగిందంటూ లెక్కలేస్తుంటారు అభిమానులు. అయితే శ్రీలంకలో ఓ అభిమాని మాత్రం ఓ అడుగు ముందుకేసి చెట్టేకేశాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌ చేతిలో శ్రీలంక దారుణంగా ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ అభిమాని.

శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్‌ మార్చాలంటూ, ఆల్‌రౌండ‌ర్ తిసెరా పెరీరాను ఓపెన‌ర్‌గా పంపాలని ఓ భారీ మ‌ర్రి చెట్టు ఎక్కి తన నిరసన తెలిపాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను శ్రీలంక మాజీ క్రికెట‌ర్ ర‌స్సెల్ అర్నాల్డ్ రీట్వీట్‌ చేస్తూ..  బాగుంది, అతన్ని చెట్టు ఎక్కనివ్వడం అపకండి అంటూ సెటైర్‌ వేశారు. కాగా, వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘ‌నిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్‌ మార్చాలంటూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement