Arnold
-
శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్ మార్చాలంటూ
-
వరల్డ్ కప్ : ఓపెనింగ్ పంపాలని.. చెట్టెక్కి నిరసన
క్రికెట్ అంటే ఓ ఆటే కాదు అదో పిచ్చిలా భావించే వాళ్లు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. తమ దేశం ఓటమి చెందితే చాలు జట్టు సమీకరణల్లో ఎక్కడో ఏదో లోపం జరిగిందంటూ లెక్కలేస్తుంటారు అభిమానులు. అయితే శ్రీలంకలో ఓ అభిమాని మాత్రం ఓ అడుగు ముందుకేసి చెట్టేకేశాడు. వరల్డ్‌కప్ తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక దారుణంగా ఓటమి చెందడాన్ని జీర్ణించుకోలేకపోయాడు ఆ అభిమాని. శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్ మార్చాలంటూ, ఆల్‌రౌండర్ తిసెరా పెరీరాను ఓపెనర్‌గా పంపాలని ఓ భారీ మర్రి చెట్టు ఎక్కి తన నిరసన తెలిపాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను శ్రీలంక మాజీ క్రికెటర్ రస్సెల్ అర్నాల్డ్ రీట్వీట్ చేస్తూ.. బాగుంది, అతన్ని చెట్టు ఎక్కనివ్వడం అపకండి అంటూ సెటైర్ వేశారు. కాగా, వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో శ్రీలంక తలపడనుంది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : శ్రీలంక జట్టు బ్యాటింగ్‌లైనప్ మార్చాలంటూ තිසර වෙනුවෙන්, ගසක නැග සිටිය දී හමු වූ ක්රිකට් රසිකයා.. ( A man in Srilanka protesting by climbing up in a tree demanding @OfficialSLC to promote @PereraThisara to open the batting) #CWC19 #lka ( video - News1st) pic.twitter.com/YVtVmrnk0m — Nibraz Ramzan (@nibraz88cricket) June 3, 2019 -
ఆర్నాల్డ్‌కు వీవీఎస్ లక్ష్మణ్ కౌంటర్
న్యూఢిల్లీ:శ్రీలంక క్రికెట్ వ్యాఖ్యాత రసెల్ ఆర్నాల్డ్ తప్పులో కాలేశాడు. త్వరలో భారత్‌తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌ను ఉద్దేశిస్తూ తమ జట్టు 5-0తో సిరీస్‌ను ఓడిపోదంటూ ట్వీట్ చేసి విమర్శల పాలయ్యాడు. 'భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో ఓడిపోయాం. త్వరలో ప్రారంభయ్యే వన్డే సిరీస్‌లో లంక 5-0 తేడాతో ఓటమి పాలవ్వకూడదని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. దీనికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చాడు. 'అలాగే రసూల్. నీ నమ్మకం ఒమ్ము కాదు. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఐదు వన్డేల సిరీస్ కాదు.. మూడు వన్డేల సిరీస్ మాత్రమే కదా' అని బదులిచ్చాడు. ప్రస్తుత భారత్-శ్రీలంక సిరీస్‌కు సంబంధించి లక్ష్మణ్-ఆర్నాల్డ్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే. మరొకవైపు ఆర్నాల్డ్‌కు తమ జట్టు ఎన్ని వన్డేలు ఆడుతుందో కూడా తెలియదు అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది. -
'నేను అమెరికాలో జన్మించి ఉంటేనా..'
న్యూయార్క్: తాను అమెరికాలో జన్మించి ఉంటే అధ్యక్ష పదవి రేసులో ఉండేవాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అన్నారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు (2011వరకు) కాలిఫోర్నియా గవర్నర్ గా పనిచేసిన ఆర్నాల్డ్ కు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఆస్ట్రియాలో జన్మించారు. తాను రిపబ్లికన్లకే మద్దతిస్తానని, రిపబ్లికన్‌గా చెప్పుకునేందుకు గర్విస్తానని చెప్పే ఆర్నాల్డ్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయబోనని చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరోసారి ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తాను అమెరికాలో జన్మించి ఉంటే రిపబ్లికన్ పార్టీ తరుపున తాను అధ్యక్ష రేసులో ఉండేవాడినని, ఇది చాలా మంచి సమయం అని అన్నారు. -
వజ్రాల హారం
ఆర్నాల్డ్ కుప్పకూలగానే ఆమె రివాల్వర్ని కింద పడేసి గట్టిగా అరవసాగింది. జేమ్స్‌కి ఆమె పథకం అర్థమైంది. ఏ కారణంగానో తన భర్తని చంపాలకున్న ఆమె తనని ఇరికించాలని తన ముందు ఆ పని చేసింది. కారణం డబ్బా? ప్రియుడా? కాని ఆ నేరం ఇప్పుడు తన మీదకి నెడుతుంది. మల్లాది వెంకట కృష్ణమూర్తి క్రైమ్ కథలు - 29 మన్‌హేటన్‌లోని ప్లాజా హోటల్లోంచి బయటికి వచ్చే మిసెస్ ఆర్నాల్డ్ మేడిసన్ కంఠంలోని వజ్రాల హారాన్ని ఓ దొంగ దొంగిలించి అంతా తేరుకునేలోగా తన భాగస్వామి నడిపే కారు ఎక్కి పారి పోయాడు. దానికి డోర్ మేన్ ఒక్కడే సాక్షిగా పోలీసులకి లభించాడు. మిగతా వాళ్లంతా ఆగకుండా వెళ్లిపోయారు. ‘‘దానికి ఇన్సూరెన్స్ చేశాను. అది కొంత నయం. కాని నా భర్త దాన్ని మా పెళ్లికి బహూకరించాడు. కాబట్టి అది దొరకాలనే నేను దేవుడ్ని పార్థిస్తున్నాను’’ మిసెస్ ఆర్నాల్డ్ పత్రికా విలేఖరులకి చెప్పింది. ఆమె సొసైటీ లేడీ కాబట్టి టీవీలో ఈ వార్తని, ఆమె అభ్యర్థ నని ప్రసారం చేశారు. మర్నాడు... జేమ్స్ ఫోన్ డయల్ చేశాడు. అవతలివైపు ఎత్తాక అడిగాడు. ‘‘మిసెస్ ఆర్నాల్డ్?’’ ‘‘మీరెవరు?’’ ‘‘నా పేరు జాన్’’ జేమ్స్ అబద్ధం చెప్పాడు. ‘‘నేను పనిమనిషిని. ఆమెని పిలుస్తాను. లైన్లో ఉండండి.’’ కొన్ని క్షణాల తర్వాత కొత్త కంఠం వినిపించింది... ‘‘హలో.’’ ‘‘మిసెస్ ఆర్నాల్డ్?’’ ‘‘అవును. నాతో ఏం పని?’’ ఆమె కంఠం మగవాళ్ల కంఠానికి దగ్గరగా ఉందని జేమ్స్ అనుకున్నాడు. ‘‘టీవీలో మీ మాట విన్నాను. ఆ విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను.’’ ‘‘నెక్లెస్ గురించా?’’ ‘‘అవును. దానికి మీరు నిజంగా సెంటిమెంటల్ వేల్యూని ఇస్తే అది మీకు తిరిగి చేరుతుంది. ఏభై వేల డాలర్లు ఇస్తే తిరిగి ఆ నెక్లెస్‌ని మీకు అప్పగిస్తాను.’’ కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఆమె అడిగింది. ‘‘ఇది ప్రాక్టికల్ జోకా?’’ ‘‘మీ మెళ్లోంచి కొట్టేసిన ఆ హారం నాకు చేరింది. దానికి లోపల ఎస్డబ్ల్యూ అన్న ప్లాటినం అక్షరాలు ఉన్నాయి. అంటే అది నా దగ్గర ఉందని నమ్ముతారా?’’ జాన్ అడిగాడు. మరి కొద్ది క్షణాల నిశ్శబ్దం. ‘‘ఎంతన్నారు?’’ ‘‘ఏభై వేల డాలర్లు.’’ ‘‘అది చాలా ఎక్కువ.’’ ‘‘మీ సెంటిమెంట్ బలంగా లేకపోతే ఎక్కువే. పైగా మీకు ఇన్సూరెన్స్ కంపెనీ నించి రెండు లక్షల డాలర్లు అందుతాయి. ఆ నగ మీ దగ్గర ఉంటే పోలీసులు ఇక దాన్ని రికవరీ చేయలేరు. దాంతో ఆ మొత్తాన్ని వాళ్లు మీకు చెల్లించక తప్పదు.’’ ‘‘సరే.’’ ‘‘పోలీసుల ప్రమేయం ఉంటే మాత్రం మీ నగ తిరిగి రాదు.’’ ‘‘మీ భయాన్ని అర్థం చేసుకోగలను. ఎప్పుడు? ఎక్కడ? పబ్లిక్ ప్లేస్‌లో తప్ప ఇంకెక్కడా కలవను.’’ ‘‘బ్రియంట్ పార్క్‌లో ఫ్లవర్ షో జరుగుతోంది. ఈ వారమంతా అక్కడ పెద్ద టెంట్ వేసి ఉంచుతారు. సాయంత్రం ఐదుకి రండి’’... జేమ్స్ రిసీవర్ని యథాస్థానంలో ఉంచాడు. పది నిమిషాల ముందే జేమ్స్ బ్రియంట్ పార్క్‌కి చేరుకున్నాడు. తనకి తెలిసిన మఫ్టీలోని పోలీసులు ఎక్కడైనా ఉన్నారా అని వెదికి చూశాడు. ఎవరూ కనపడలేదు. అతను మిసెస్ ఆర్నాల్డ్‌ని చూసి పలకరించాడు. ‘‘మనం ఇదివరకు కలుసుకున్నట్లున్నాం. నా పేరు జాన్.’’ అతన్ని చూసి చెప్పింది. ‘‘ఆ దొంగ మీరు కాదనుకుంటా?’’ ‘‘నేను రబ్బరు ముక్కు, మీసం పెట్టు కోలేదు. పోలీసులకి మీరు ఫోన్ చేయలేదుగా.’’ ‘‘లేదు’’ చెప్పింది. ‘‘మీరు ఆ హారాన్ని ధరించి న్యూయార్క్‌లో బయటికి రాకూడదు. నిజానికి మీలాంటి అందగత్తెకి దాన్ని ధరించాల్సిన అవసరం కూడా లేదు.’’ ‘‘మీ కాంప్లి మెంట్‌కి థ్యాంక్స్. పాతిక వేల డాలర్లు నా పరిమితి. మీరు దాన్ని దొంగ సరుకు కొనేవారికమ్మితే అంతకు మించి రాదు.’’ ‘‘సరే. డబ్బు తెచ్చారా?’’ ‘‘మీరు నెక్లెస్ తెచ్చారా?’’ ‘‘లేదు. మీరు పోలీసులకి నా గురించి చెప్తే? అది వాళ్లు స్వాధీనం చేసుకుంటే?’’ ‘‘మరి?’’ ‘‘మనం ఇంకోసారి కలుద్దాం. గ్రాండ్ సెంట్రల్ స్టేషన్‌లోని లోయర్ లెవెల్లో కలుద్దామా?’’ ‘‘ఓకే. ఎప్పుడు?’’... అడిగింది. ‘‘ఈ రాత్రి తొమ్మిదికి.’’ ‘‘సరే’’ ఆమె వెళ్లిపోయింది. పోలీసులకి ఆమె సిగ్నల్ ఇవ్వక పోవడం వల్ల తనని అరెస్ట్ చేయలేదని, వారు తననే గమనిస్తున్నారని జేమ్స్‌కి మనసులో అనుమానమే. అందుకని సరా సరి ఇంటికి వెళ్లలేదు. రాత్రి తొమ్మిదికి మిసెస్ ఆర్నాల్డ్‌తో ఆమె భర్త ఆర్నాల్డ్ కూడా వచ్చాడు. ‘‘నువ్వేనా నిన్న రాత్రి నెక్లెస్‌ని కొట్టేసింది?’’ అడిగాడు. ‘‘నేను ఆ నెక్లెస్‌ని తిరిగి మీకు అందే ఏర్పాటు చేసేవాడిగా మాత్రమే భావిం చండి. డబ్బు తెచ్చారా?’’ జేమ్స్ అడిగాడు. అతను తల ఊపి అడిగాడు... ‘‘నువ్వు నెక్లెస్‌ని తెచ్చావా?’’ ‘‘తెచ్చాను. డబ్బుని ఓసారి చూపించండి.’’ మిసెస్ ఆర్నాల్డ్ తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఓ రివాల్వర్ని తీసింది. తక్షణం తన భర్తని కాల్చి చంపింది. ఆర్నాల్డ్ కుప్పకూలగానే రివాల్వర్ని కింద పడేసి గట్టిగా అరవసాగింది. జేమ్స్‌కి ఆమె పథకం అర్థమైంది. ఏ కారణంగానో తన భర్తని చంపాలకున్న ఆమె తనని ఇరికించాలని తన ముందు ఆ పని చేసింది. కారణం డబ్బా? ప్రియుడా? కాని ఆ నేరం ఇప్పుడు తన మీదకి నెడుతుంది. నెక్లెస్ తన జేబులో లేకపోవడం తనని కాపాడుతుందని జేమ్స్ అనుకున్నాడు. తను ఆమెని కలవడానికి అక్కడికి రాలేదని చెప్పాలి. నిమిషంలో పోలీసులు అక్కడికి చేరు కున్నారు. ‘‘ఇతను నా భర్తని చంపాడు. ఇతను నిన్న నా వజ్రాల హారాన్ని కొట్టేసిన దొంగ. అది ఇస్తానని, డబ్బు తీసుకురమ్మని మా వారికి చెప్పాడు. తెస్తే ఆ డబ్బు కొట్టేయడానికి కాల్చాడు’’ మిసెస్ ఆర్నాల్డ్ చెప్పింది. ‘‘జరిగింది నేనంతా చూశా. ఈమె, ఈమె భర్త వాదించుకోవడం చూశా. కోపంగా ఈమె హ్యాండ్ బ్యాగ్‌లోంచి తన రివాల్వర్ తీసి తన భర్తని కాల్చి చంపింది’’ జేమ్స్ చెప్పాడు. ‘‘అది అబద్ధం. అతని జేబులు వెదకండి. నెక్లెస్ ఉంటుంది.’’ పోలీస్ ఆఫీసర్ జేమ్స్ వంక చూశాడు. ‘‘మీరు ఈమె కుడి గ్లవ్‌ని పరీక్షిస్తే దానిమీద గన్ పౌడర్ పార్టికల్స్ కనిపిస్తాయి. నా జేబులు మీరు వెదికినా నాకు అభ్యంతరం లేదు. ఆ నెక్లెస్ నా దగ్గర లేదు’’ జేమ్స్ చెప్పాడు. ‘‘నమ్మకండి. అతనే కాల్చాడు’’ అరిచింది. జేమ్స్ పర్స్‌లోంచి తన ఐడెంటిటీ కార్డ్‌ని తీసి పోలీస్ ఆఫీసర్‌కి చూపించాడు. ‘‘ఓ! మీరు డిటెక్టివ్ ఫస్ట్ గ్రేడ్ చార్లెస్ బార్నెసానా సార్?’’ దాన్ని చూసిన అతను అడిగాడు. ‘‘అవును. 91వ ప్రిసింక్ట్ (పోలీస్ స్టేషన్)లో పని చేస్తున్నా. కావాలంటే వాళ్లకి ఫోన్ చేసి కనుక్కోండి.’’ మిసెస్ ఆర్నాల్డ్ జేమ్స్ వంక నమ్మలేనట్లుగా చూసింది. ‘పోలీస్ ఆఫీసర్ దొంగతనం చేయడం నేరం. అందువల్ల కష్టాల్లో పడొచ్చు. కాని తేలిగ్గా బయట పడొచ్చు కూడా’ అకున్నాడు జేమ్స్. (ఎడ్వర్డ్ డి హాక్ కథకి స్వేచ్ఛానువాదం) -
శంకర్‌ను ఇబ్బంది పెడుతున్న ఆర్నాల్డ్
'ఐ' సినిమా ఫెయిల్యూర్‌తో కష్టాల్లో పడ్డ శంకర్ ఇప్పుడు మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అయిన 'రోబో' సినిమాకు సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటికే 'బాహుబలి' సెట్ చేసిన రికార్డ్లను తిరగరాసే ఆలొచనతో, ఈ సినిమాను అంతర్జాతీయ స్ధాయిలో తెరకెక్కించటం కోసం శంకర్ భారీ నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయాలే సినిమా భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేశాయన్న టాక్ వినిపిస్తోంది. 'రోబో 2' సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకురావటం కోసం, ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్‌స్టార్ ఆర్నాల్డ్‌ను విలన్‌గా నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే 100 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా అంగీకరించినా, ఆర్నాల్డ్ పెడుతున్న కండిషన్స్‌తో సినిమా యూనిట్‌కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆర్నాల్డ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు దీంతో కనీసం 50 రోజులు పాటు ఆర్నాల్డ్‌తో షూటింగ్ చేయాల్సి ఉంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. కానీ ఈ హాలీవుడ్ హీరో మాత్రం కేవలం 36 రోజులే డేట్స్ ఇవ్వడానికి అంగీకరించాడట. అంతేకాదు కథలో కూడా హాలీవుడ్ రైటర్స్‌తో మార్పులు చేయించాలని కండిషన్ పెట్టాడట. రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 300 కోట్లకు పైగా బడ్జెట్‌తో భారీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, రజనీ ప్రస్తుతం చేస్తున్న కపాలి షూటింగ్ పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరి శంకర్ ఆర్నాల్డ్ కండిషన్స్‌కు ఓకె చెప్తాడా లేక వేరే ఆఫ్షన్ ఆలోచిస్తాడా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
రోబో 2 కోసం హాలీవుడ్ సూపర్‌స్టార్
చాలా రోజులుగా ఊరిస్తూ వస్తున్న శంకర్ 'రోబో 2' కు ముహూర్తం దగ్గర పడింది. ఇప్పటికే కథ రెడీ చేసిన శంకర్ నటీనటుల ఎంపిక మీద దృష్టి పెట్టాడు. తొలి భాగంలో నటించిన రజనీ హీరోగా మరోసారి నటిస్తాడన్న విషయం ఎప్పుడో కన్ఫామ్ అయ్యింది. హీరోయిన్స్, విలన్ కోసం వేట కొనసాగుతోంది. 'రోబో 2' తెర మీదకు వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమా లో విలన్‌గా హాలీవుడ్ సూపర్ స్టార్ ఆర్నాల్డ్ చేత చేయించాలని ప్రయత్నించాడు శంకర్. తన గత సినిమా 'ఐ' ఆడియో వేడుకకు కూడా ఆర్నాల్డ్ ను ఆహ్వానించి తన సినిమాల రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో చూపించాడు. అయితే అప్పట్లో సినిమా కథ రెడీ కాకపోవటంతో ఆర్నాల్డ్ నుంచి ఎలాంటి హామీ రాలేదు. ఇటీవలే 'రోబో 2' కథను ఫైనల్ చేసిన శంకర్ మరోసారి ఆర్నాల్డ్ నటించే విధంగా ప్రయత్నాలు ప్రారంభించాడు. ఇప్పటివరకు ఆర్నాల్డ్, తన అంగీకరం తెలపకపోయినా 'రోబో 2'లో నటించటం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటీస్ కత్రినా కైఫ్, దీపిక పదుకొనేలు నటించనున్నారు. రజనీ పుట్టిన రోజు డిసెంబర్ 12న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించనున్నారు.