న్యూఢిల్లీ:శ్రీలంక క్రికెట్ వ్యాఖ్యాత రసెల్ ఆర్నాల్డ్ తప్పులో కాలేశాడు. త్వరలో భారత్‌తో ఆరంభమయ్యే మూడు వన్డేల సిరీస్‌ను ఉద్దేశిస్తూ తమ జట్టు 5-0తో సిరీస్‌ను ఓడిపోదంటూ ట్వీట్ చేసి విమర్శల పాలయ్యాడు. 'భారత్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను 1-0తో ఓడిపోయాం. త్వరలో ప్రారంభయ్యే వన్డే సిరీస్‌లో లంక 5-0 తేడాతో ఓటమి పాలవ్వకూడదని కోరుకుంటున్నాను’ అని పేర్కొన్నాడు. దీనికి భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చాడు. 'అలాగే రసూల్. నీ నమ్మకం ఒమ్ము కాదు. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఐదు వన్డేల సిరీస్ కాదు.. మూడు వన్డేల సిరీస్ మాత్రమే కదా' అని బదులిచ్చాడు. ప్రస్తుత భారత్-శ్రీలంక సిరీస్‌కు సంబంధించి లక్ష్మణ్-ఆర్నాల్డ్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవరిస్తున్న సంగతి తెలిసిందే.
మరొకవైపు ఆర్నాల్డ్‌కు తమ జట్టు ఎన్ని వన్డేలు ఆడుతుందో కూడా తెలియదు అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment