'నేను అమెరికాలో జన్మించి ఉంటేనా..' | If Id been born in the US, I would ve run for president: Arnold | Sakshi
Sakshi News home page

'నేను అమెరికాలో జన్మించి ఉంటేనా..'

Published Tue, Oct 25 2016 6:41 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

'నేను అమెరికాలో జన్మించి ఉంటేనా..' - Sakshi

'నేను అమెరికాలో జన్మించి ఉంటేనా..'

న్యూయార్క్: తాను అమెరికాలో జన్మించి ఉంటే అధ్యక్ష పదవి రేసులో ఉండేవాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్ అన్నారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు (2011వరకు) కాలిఫోర్నియా గవర్నర్ గా పనిచేసిన ఆర్నాల్డ్ కు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఆస్ట్రియాలో జన్మించారు.

తాను రిపబ్లికన్లకే మద్దతిస్తానని, రిపబ్లికన్గా చెప్పుకునేందుకు గర్విస్తానని చెప్పే ఆర్నాల్డ్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్కు ఓటు వేయబోనని చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరోసారి ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తాను అమెరికాలో జన్మించి ఉంటే రిపబ్లికన్ పార్టీ తరుపున తాను అధ్యక్ష రేసులో ఉండేవాడినని, ఇది చాలా మంచి సమయం అని అన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement