president race
-
US Presidential ElectionIns 2024: ట్రంప్‌తో కలిసి పోటీ పడడానికి సిద్ధమే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో అనూహ్యంగా పుంజుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తన రూటు మార్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఉన్న ఆయన ఇన్నాళ్లూ ఉపాధ్యక్ష పదవికైతే పోటీ పడనని చెబుతూ వస్తున్నారు. అధ్యక్ష పదవి తప్ప తనకు దేనిపైనా ఆసక్తి లేదని గతంలో చెప్పిన ఆయన ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థి నామినేషన్‌ను గెలుచుకుంటే ఆయనతో కలిసి పోటీ చేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. బ్రిటన్‌కు చెందిన జిబి న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామస్వామిని ట్రంప్‌కు ఉపాధ్యక్షుడిగా పోటీ చేయడం మీకు సంతోషమేనా అని ప్రశ్నించగా ఇప్పుడు తన వయసుకు అది మంచి పదవేనని చెప్పారు. ‘‘అమెరికాని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి పునరేకీకరణ చేయాల్సిన అవసరం ఉంది. వైట్‌హౌస్‌లో ఒక నాయకుడిగా ఉంటేనే ఆ పని నేను చెయ్యగలను’’అని చెప్పారు. 38 ఏళ్ల రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల చర్చలో తన సత్తా చూపించి రేసులో ట్రంప్ తర్వాత స్థానంలో దూసుకుపోతున్నారు. రామస్వామిని ట్రంప్ శిబిరం కూడా ప్రశంసించింది. అప్పట్నుంచి ట్రంప్, రామస్వామిలు అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులుగా అంతిమంగా బరిలో నిలుస్తారన్న చర్చ పార్టీలో జరుగుతోంది. -
మనసులో మాట చెప్పేసిన రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: తాను మరోసారి రాష్ట్రపతి రేసులో ఉండబోనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దాదాపు చెప్పేశారు. మరో రెండు నెలల్లో తాను ఈ బాధ్యతల నుంచి దిగిపోతానని, కొత్త వ్యక్తి తన స్థానంలోకి వస్తారని అన్నారు. ‘నాకు సరిగ్గా ఇక రెండు నెలల గడువు మాత్రమే ఉంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి బాధ్యతలు చేపడతారు. నాతో పనిచేస్తున్న అధికారులను వారి వారి శాఖలకు, మంత్రి వర్గాలకు పంపించేస్తున్నాను. ఒకరిని ఇప్పటికే వాణిజ్యశాఖకు పంపించాను.. అలాగే మరో ఇద్దరిని విదేశాంగ వ్యవహారాలశాఖకు పంపించాను’ అని ఆయన చెప్పారు. గురువారం రాష్ట్రపతి భవన్లో మీడియా కోసం ప్రత్యేక తేనీటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తన మీడియా కార్యదర్శి వేణు రాజమోని నెదర్లాండ్‌కు రాయబారిగా ఎంపికైన సందర్భంగా రాష్ట్రపతి కార్యదర్శి ఒమితా పౌల్ గురువారం రాష్ట్రపతి భవన్లో మీడియా కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక తేనీటి కార్యక్రమంలో ప్రణబ్ ఈ విషయం చెప్పారు. -
అమెరికా అధ్యక్షుడిగా సెహ్వాగ్!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు న్యూయర్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని శనివారం ఉదయం ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచిన సెహ్వాగ్ హ్యాపీ 'ఏప్రిల్ ఫూల్స్ డే' అని చెప్పారు. ప్రముఖ జర్నలిస్టు స్టీఫెన్ స్మిత్ ఈ కథనాన్ని రాసినట్లు సెహ్వాగ్ షేర్ చేసిన ఆర్టికల్ కటింగ్ క్లిప్‌లో ఉంది. కాగా, కొద్దిరోజుల క్రితం భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పోలుస్తూ ఆస్ట్రేలియా మీడియా కథనాలు రాసిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ షేర్ చేసిన కథనంలో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌ను ఉద్దేశించి ఇన్ డైరెక్టుగా వ్యంగ్యమైన వ్యాఖ్యలు ఉన్నాయి. తరచూ అమెరికా వస్తున్న వీరూతో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని ఆర్టికల్‌లో ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని ఆర్టికల్‌లో స్టీఫెన్ పేర్కొన్నారు. ఈ ఏడాది అమెరికా పర్యటనకు మోదీ వెళ్లిన సమయంలో ఇరువురూ మోదీతో ఈ మేరకు చర్చిస్తారని ఉంది. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్ హ్యూమరస్ ట్వీట్లతో అలరిస్తున్న విషయం తెలిసిందే. Hahaha ! pic.twitter.com/xyvzQV1Ug8 — Virender Sehwag (@virendersehwag) April 1, 2017 -
'నేను అమెరికాలో జన్మించి ఉంటేనా..'
న్యూయార్క్: తాను అమెరికాలో జన్మించి ఉంటే అధ్యక్ష పదవి రేసులో ఉండేవాడినని ప్రముఖ హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ అన్నారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు (2011వరకు) కాలిఫోర్నియా గవర్నర్ గా పనిచేసిన ఆర్నాల్డ్ కు అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు అర్హత లేదు. ఎందుకంటే ఆయన ఆస్ట్రియాలో జన్మించారు. తాను రిపబ్లికన్లకే మద్దతిస్తానని, రిపబ్లికన్‌గా చెప్పుకునేందుకు గర్విస్తానని చెప్పే ఆర్నాల్డ్ ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ తరుపున అధ్యక్ష రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్‌కు ఓటు వేయబోనని చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరోసారి ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ తాను అమెరికాలో జన్మించి ఉంటే రిపబ్లికన్ పార్టీ తరుపున తాను అధ్యక్ష రేసులో ఉండేవాడినని, ఇది చాలా మంచి సమయం అని అన్నారు. -
'హిల్లరీలా అధ్యక్ష పదవికి ఆశపడను'
వాషింగ్టన్: అధ్యక్షపదవిపై తనకు అంతగా మోజు లేదని అమెరికా ప్రథమ పౌరురాలు, బరాక్ ఒబామా సతీమణి మిషెల్ ఒబామా వ్యాఖ్యానించారు. టెక్సాస్ లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అక్కడ మాట్లాడుతూ.. అమెరికాలో రాజకీయాల కంటే కూడా వేరే విషయాలలోనే తన ప్రభావం ఎక్కువగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అధ్యక్షపదవికి బరిలో దిగేందుకు హిల్లరీ క్లింటన్ లా తాను సిద్ధంగా లేనని స్పష్టంచేశారు. దాదాపు 6కోట్ల మంది విద్యార్థినులు స్కూలుకు వెళ్లడం లేదని ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఓ పాటను పాడి వినిపించారు. ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బదులుగా... అమెరికా అధ్యక్షపదవి తనకు ఇష్టం లేదని మరోసారి ఆమె ఉద్ఘాటించారు. వైట్ హౌస్ కు బయట ఉంటేనే తాను ఎన్నో పనులు చేయగలనని ధీమా వ్యక్తంచేశారు. తాను బయట ఉంటే సాధారణ పౌరులు కూడా తన మాటలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ చమత్కరించారు. వివాదాలకు అవకాశాలు ఇవ్వకూడదని, సమస్యలపై పోరాడటం తన లక్ష్యమని ఊబకాయం సమస్యపై దృష్టిపెట్టామన్నారు. ఎనిమిదేళ్ల వైట్ హౌస్ నివాసం తర్వాత తన కూతుళ్లు మలియా, సాషాలు ఎక్కడైనా హాయిగా బతకగలిగేలా ఉంటే చాలని, ఇప్పటివరకు మాకు ఇది చాలు అని మిషెల్ ఒబామా వివరించారు. -
ఆ అధ్యక్ష అభ్యర్థికి ఫ్రెండ్స్ గుర్తు లేరట
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉండి ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటనలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన విషయం చెప్పారు. తనకు ఇరవైమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. అయితే, వారి పేర్లు చెప్పేందుకు మాత్రం నిరాకరించారు. కనీసం ఒక్కరి పేరు చెప్పలేదు. ఎన్నికల ప్రచారంలోకి వచ్చి రాగానే ముస్లింలకు వ్యతిరేకంగా ట్రంప్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అమెరికాలోకి ముస్లింల ప్రవేశాన్ని అడ్డుకోవాలంటూ ప్రకటించిన విషయం విధితమే. ఈ మాటల అనంతరం ట్రంప్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పలువురు ముస్లిం నేతలు రుసరుసలాడారు. ఈక్రమంలో ఎన్నికల ఫలితాల్లో తన మాటల ప్రభావం ఉంటుందని ఊహించిన ట్రంప్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మొన్న జరిగిన ప్రచారంలో 'నేను ముస్లింలను ప్రేమిస్తాను' అని చెప్పిన ఆయన తాజాగా, తనకు ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. కాగా, ట్రంప్ కుమారుడు మాత్రం తన తండ్రికి ముస్లిం స్నేహితులు ఉన్నారనే విషయంపై ఏమాత్రం స్పందించలేదు. అయితే, తాను మిడిల్ ఈస్ట్ లో వ్యాపార లావాదేవీల నిర్వహించినట్లు చెప్పారు.