మనసులో మాట చెప్పేసిన రాష్ట్రపతి ప్రణబ్
న్యూఢిల్లీ: తాను మరోసారి రాష్ట్రపతి రేసులో ఉండబోనని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దాదాపు చెప్పేశారు. మరో రెండు నెలల్లో తాను ఈ బాధ్యతల నుంచి దిగిపోతానని, కొత్త వ్యక్తి తన స్థానంలోకి వస్తారని అన్నారు. ‘నాకు సరిగ్గా ఇక రెండు నెలల గడువు మాత్రమే ఉంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి బాధ్యతలు చేపడతారు. నాతో పనిచేస్తున్న అధికారులను వారి వారి శాఖలకు, మంత్రి వర్గాలకు పంపించేస్తున్నాను.
ఒకరిని ఇప్పటికే వాణిజ్యశాఖకు పంపించాను.. అలాగే మరో ఇద్దరిని విదేశాంగ వ్యవహారాలశాఖకు పంపించాను’ అని ఆయన చెప్పారు. గురువారం రాష్ట్రపతి భవన్లో మీడియా కోసం ప్రత్యేక తేనీటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తన మీడియా కార్యదర్శి వేణు రాజమోని నెదర్లాండ్కు రాయబారిగా ఎంపికైన సందర్భంగా రాష్ట్రపతి కార్యదర్శి ఒమితా పౌల్ గురువారం రాష్ట్రపతి భవన్లో మీడియా కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక తేనీటి కార్యక్రమంలో ప్రణబ్ ఈ విషయం చెప్పారు.