శంకర్ను ఇబ్బంది పెడుతున్న ఆర్నాల్డ్ | Hollywood superstar troubles rajani shankars robo2 | Sakshi
Sakshi News home page

శంకర్ను ఇబ్బంది పెడుతున్న ఆర్నాల్డ్

Published Thu, Nov 5 2015 9:56 AM | Last Updated on Thu, Sep 12 2019 10:40 AM

శంకర్ను ఇబ్బంది పెడుతున్న ఆర్నాల్డ్ - Sakshi

శంకర్ను ఇబ్బంది పెడుతున్న ఆర్నాల్డ్

'ఐ' సినిమా ఫెయిల్యూర్తో కష్టాల్లో పడ్డ శంకర్ ఇప్పుడు మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. తన కెరీర్ లోనే బిగెస్ట్ హిట్ అయిన 'రోబో' సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పటికే 'బాహుబలి' సెట్ చేసిన రికార్డ్లను తిరగరాసే ఆలొచనతో, ఈ సినిమాను అంతర్జాతీయ స్ధాయిలో తెరకెక్కించటం కోసం శంకర్ భారీ నిర్ణయాలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ నిర్ణయాలే సినిమా భవిష్యత్తును ఇబ్బందుల్లో పడేశాయన్న టాక్ వినిపిస్తోంది.

'రోబో 2' సినిమాకు అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ తీసుకురావటం కోసం, ఈ సినిమాలో హాలీవుడ్ సూపర్స్టార్ ఆర్నాల్డ్ను విలన్గా నటింపజేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఇప్పటికే 100 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా అంగీకరించినా, ఆర్నాల్డ్ పెడుతున్న కండిషన్స్తో సినిమా యూనిట్కు చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో ఆర్నాల్డ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు దీంతో కనీసం 50 రోజులు పాటు ఆర్నాల్డ్తో షూటింగ్ చేయాల్సి ఉంటుందని యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. కానీ ఈ హాలీవుడ్ హీరో మాత్రం కేవలం 36 రోజులే డేట్స్ ఇవ్వడానికి అంగీకరించాడట. అంతేకాదు కథలో కూడా హాలీవుడ్ రైటర్స్తో మార్పులు చేయించాలని కండిషన్ పెట్టాడట.

రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 300 కోట్లకు పైగా బడ్జెట్తో భారీగా తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను, రజనీ ప్రస్తుతం చేస్తున్న కపాలి షూటింగ్ పూర్తి కాగానే సెట్స్ మీదకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరి శంకర్ ఆర్నాల్డ్ కండిషన్స్కు ఓకె చెప్తాడా లేక వేరే ఆఫ్షన్ ఆలోచిస్తాడా తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement