T20 World Cup 2022 SL Vs AUS Match Prediction: Who Will Win Todays Match Between Aus Vs SL - Sakshi
Sakshi News home page

T20 WC 2022: ఆసీస్‌ వర్సెస్‌ శ్రీలంక.. మ్యాక్స్‌వెల్‌ మెరుస్తాడా? హసరంగా మ్యాజిక్‌ చేస్తాడా?

Published Tue, Oct 25 2022 12:16 PM | Last Updated on Tue, Oct 25 2022 5:43 PM

T20 WC: Who Will Win Todays Match Between Australia And Sri Lanka - Sakshi

Twitter Pic

టీ20 ప్రపంచకప్‌-2022లో డిఫిండింగ్‌ ఛాంపియన్‌ ఆస్ట్రేలియా మరో కీలక పోరుకు సిద్దమైంది. పెర్త్‌ వేదికగా మంగళవారం(ఆక్టోబర్‌25) శ్రీలంకతో ఆస్ట్రేలియా తలపడనుంది.  కాగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్‌-12 తొలి మ్యాచ్‌లో ఆసీస్‌ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింటిలోనూ విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. కాన్వే(92) చేలరేగడంతో 200 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస​ కేవలం 111 పరుగులకే కుప్పకూలింది.

మ్యాక్స్‌వెల్‌ మెరుస్తాడా
ఇక శ్రీలంకతో జరగనున్న ఈ మ్యాచ్‌ ఆస్ట్రేలియాకు చాలా కీలకం. పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా ఇప్పటికే అఖరి స్థానంలో కొనసాగుతుంది. కాబట్టి వరుస మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించకపోతే గ్రూప్‌ దశలోనే ఇంటిముఖం పట్టక తప్పదు. అయితే శ్రీలంకపై మాత్రం ఆసీస్‌ విజయం సాధించే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరంగా పటిష్టంగా కన్పిస్తోంది.

బ్యాటింగ్‌లో డేవిడ్‌ వార్నర్‌, మార్ష్‌, డేవిడ్‌ చెలరేగితే శ్రీలంకకు కష్టాలు తప్పవు. అదే విధంగా బౌలింగ్‌లో హాజిల్‌ వుడ్‌, కమ్మిన్స్‌, స్టార్క్‌ ఈ ముగ్గురు పేసర్లు నిప్పులు చేరిగితే లంక బ్యాటర్లకు ముప్పు తిప్పలు తప్పవు. ఇక ఆ జట్టు స్టార్‌ ఆల్‌ రౌండర్‌ మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌ లేమి ఆస్ట్రేలియాను కాస్త కలవరపెడుతోంది. అయితే న్యూజిలాండ్‌పై మ్యాక్స్‌వెల్‌ కాస్త పర్వాలేదనపించాడు. మ్యాక్స్‌వెల్‌ తన మునపటి ఫామ్‌ను తిరిగి పొందితే ఆస్ట్రేలియాకు ఇక తిరుగుండదు.

మెండిస్‌, హాసరంగా మళ్లీ మ్యాజిక్‌ చేస్తారా
రౌండ్‌-1లో నమీబియా చేతిలో ఆనూహ్యంగా ఓటమి చెందిన శ్రీలంక.. అనంతరం యూఏఈ, నెదర్లాండ్స్‌ను మట్టి కరిపించి సూపర్‌-12లో అడుగుపెట్టింది. అదే విధంగా సూపర్‌-12 తొలి మ్యాచ్‌లోనే ఐర్లాండ్‌ను చిత్తు చేసి తమ జోరును కొనసాగించింది. శ్రీలంక బ్యాటింగ్‌ పరంగా పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం అంత అనుభవం ఉన్న బౌలర్‌ ఒక్కరూ కనిపించడం లేదు.

ఆ జట్టు స్టార్‌ పేసర్‌ చమీరా, యువ బౌలర్‌ మధుషాన్‌ గాయం కారణంగా దూరం కావడంతో లంకకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ కుశాల్‌ మెండిస్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అదే విధంగా సూపర్‌-12 తొలి మ్యాచ్‌కు దూరమైన మరో ఓపెనర్‌ నిస్సాంక.. ఆసీస్‌తో పోరుకు జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌లో మాత్రం లంక పూర్తి స్థాయిలో హాసరంగా, థీక్షణపైనే అధారపడుతోంది. ఈ మ్యాచ్‌లో హాసరంగా తన స్పిన్‌ మ్యాజిక్‌ను మరోసారి రిపేట్‌ చేస్తే ఆస్ట్రేలియా కష్టాలు తప్పవు.

హెడ్‌ టూ హెడ్‌ రికార్డులు 
ఇక ఇరు జట్లు ఇప్పటి వరకు 25 టీ20ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 15 మ్యాచ్‌ల్లో, లంక 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. వరల్డ్‌కప్‌లో అయితే ఇరు జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడగా.. ఆస్ట్రేలియా 3 సార్లు, శ్రీలంక 2 సార్లు గెలుపొందాయి.


చదవండి: T20 World Cup 2022: భువనేశ్వర్‌ కుమార్‌ సరికొత్త చరిత్ర.. తొలి బౌలర్‌గా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement