
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్‌కు 21 మంది సభ్యలతో కూడిన తమ జట్టును శ్రీలంక శుక్రవారం ప్రకటించింది. గాయం కారణంగా జింబాబ్వేతో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన స్టార్ స్పిన్నర్ వనిందు హసరంగ తిరిగి జట్టులోకి వచ్చాడు. అదే విధంగా శ్రీలంక అండర్-19 జట్టు కెప్టెన్ దునిత్ వెల్లలగే సీనియర్ జట్టు తరపున అరంగేట్రం చేయనున్నాడు.
ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శ్రీలంక తలపడనుంది. ఇక పల్లెకెలె వేదికగా జూన్14న ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరగనుంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో అఖరి మ్యాచ్ శనివారం పల్లెకెలె వేదికగా జరగనుంది.
శ్రీలంక జట్టు: దసున్ షనక, పాతుమ్ నిస్సాంక, దనుష్క గుణతిలక, కుసల్ మెండిస్, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, దినేష్ చండిమాల్, భానుక రాజపక్స, నిరోషన్ డిక్వెల్లా, వనిందు హసరంగా, చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, అసిత, రమేశ్ తుషార మ, అసిత, రమేశ్ తుషార మ జయవిక్రమ, జెఫ్రీ వాండర్సే, లహిరు మధుశంక, దునిత్ వెల్లలగే, ప్రమోద్ మదుషన్
చదవండి: David Miller Birthday: 'కిల్లర్' మిల్లర్ అనగానే ఆ ఎపిక్ ఎంట్రీ గుర్తుకురావడం ఖాయం
Comments
Please login to add a commentAdd a comment