IPL 2022 Auction: Aakash Chopra Picks Wanindu Hasaranga Out of the Box Pick at Mega Auction - Sakshi

IPL 2022 Mega Auction: "వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ ప‌డ‌డం ఖాయం"

Published Thu, Feb 3 2022 1:14 PM | Last Updated on Thu, Jun 9 2022 6:38 PM

Aakash Chopra picks Wanindu Hasaranga OUT OF THE BOX pick at mega auction - Sakshi

ఐపీఎల్-2022 మెగా వేలంలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కోసం  లక్నో, అహ్మదాబాద్‌తో సహా మొత్తం 10 జట్లు పోటీ ప‌డ‌తాయ‌ని భార‌త మాజీ ఆట‌గాడు ఆకాష్ చోప్రా అభిప్రాయ ప‌డ్డాడు. రానున్న వేలంలో అత్యంత ఖ‌రీదైన‌ టాప్ 5 బౌల‌ర్లలో హసరంగా ఒక‌డ‌ని  చోప్రా తెలిపాడు. హసరంగా అద్భుత‌మైన ఆట‌గాడు. అత‌డు బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణించ‌గ‌ల‌డు. ఒక వేళ‌ నేను వేలంలో పాల్గొంటే మొద‌టిగా అత‌డినే ఎంచుకుంటాను. అత‌డు కొత్త బంతితో కూడా బాగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు.

గ‌త ఏడాది ఆర్సీబీ అత‌డిని త‌క్కువ ధ‌రకి కొనుగోలు చేసింది. కానీ హసరంగాకి అంత‌గా ఆర్సీబీ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఫ్రాంచైజీలు అత‌డి కోసం 4 నుంచి 5 కోట్లు ఖ‌ర్చు చేయాల్సి ఉంటుంది. అత‌డు టీ20 క్రికెట్‌లో గ‌త కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. వేలంలో మొత్తం 10 జ‌ట్లు  కూడా అత‌డి కోసం పోటీ ప‌డ‌తాయి అన‌డంలో సందేహం లేదు అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఫిబ్ర‌వ‌రి 12,13 తేదీల్లో బెంగ‌ళూరు వేదిక‌గా వేలాన్ని బీసీసీఐ నిర్వ‌హించ‌నుంది. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెట‌ర్లు పాల్గొన‌బోతున్నారు. 

చ‌ద‌వండి: IPL 2022 Mega Auction: వేలంలో అత‌డికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్య‌ర్‌కి మ‌రీ ఇంత త‌క్కువా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
 
Advertisement