IPL 2022,
-
ఉమ్రాన్ మాలిక్ రికార్డును బద్దలు కొట్టిన ఫెర్గూసన్..
ఐపీఎల్-2022 ఛాంపియన్స్‌గా గుజరాత్ టైటాన్స్ నిలిచిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన ఫైనల్లో హార్ధిక్ సేన 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. కాగా ఈ ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ బౌలర్ లూకీ ఫెర్గూసన్ సరికొత్త రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఫెర్గూసన్ ఏకంగా గంటకు కు 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని సంధించాడు. దీంతో ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన తొలి బౌలర్‌గా ఫెర్గూసన్ నిలిచాడు. అంతకుముందు ఎస్ఆర్హెచ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ పేరిట ఉన్న ఫాస్టెస్ట్ డెలివరీ(157 .కి.మీ వేగం) రికార్డును ఫెర్గూసన్ బద్దలు కొట్టాడు. చదవండి: Riyan Parag: 'ఆ ఆటగాడు దండగ.. ఏ లెక్కన ఆడించారో కాస్త చెప్పండి' -
చరిత్ర సృష్టించిన లక్నో ఓపెనర్లు..ఐపీఎల్లో తొలిసారి..!
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన ఓపెనింగ్ జోడిగా రికార్డులకెక్కారు. ఐపీఎల్-2022లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో వీరిద్దరూ 210 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. డికాక్ కేవలం 70 బంతుల్లోనే 140 పరుగులు సాధించగా.. రాహుల్ 51 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కాగా అంతకుముందు విరాట్ కోహ్లి, దేవదత్ పడిక్కల్ నమోదు చేసిన 181 పరుగలు ఓపెనింగ్ భాగస్వామ్య రికార్డును వీరిద్దరూ బ్రేక్ చేశారు. ఇక ఓవరాల్‌గా ఐపీఎల్లో ఏ వికెట్‌కైనా ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం గమనార్హం. చదవండి: Nikhat Zareen: వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కి చేరిన నిఖత్ జరీన్ -
పుణేలో కాదు.. ముంబైలో ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్
ముంబై: కోవిడ్ కేసులతో తల్లడిల్లుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నేడు పంజాబ్ కింగ్స్‌తో పుణేలో ఆడాల్సిన మ్యాచ్‌ను ముంబైకి తరలించారు. అయితే ముందుగా బుధవారం ఉదయం ఢిల్లీ ఆటగాళ్లందరికీ ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తారు. రిపోర్టులన్నీ నెగెటివ్‌గా వస్తే ఏ సమస్యా ఉండదు. ఏ ఒక్క పాజిటివ్ కేసు వచ్చినా... మ్యాచ్‌ను వాయిదా వేసి ఆటగాళ్లందరినీ ఐసోలేషన్‌లో ఉంచేస్తారు. తద్వారా ఢిల్లీ ఫ్రాంచైజీకి సోకిన వైరస్‌ను అక్కడితోనే అంతం చేస్తారు. క్యాపిటల్స్ బృందంలోని ఫిజియో ప్యాట్రిక్ ఫర్హార్ట్, ఆల్‌రౌండర్ మిచెల్ మార్‡్ష, డాక్టర్ అభిజిత్ సాల్వి, మసాజ్ థెరపిస్ట్ చేతన్ కుమార్‌లకు వైరస్ సోకగా... తాజాగా సోషల్ మీడియా కంటెంట్ సభ్యుడు ఆకాశ్ మనే కోవిడ్ బారిన పడ్డారు. దీంతో కరోనా పేషెంట్ల సంఖ్య ఐదుగురికి చేరడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. మ్యాచ్ కోసం పుణేకు వెళ్లకుండా జట్టు ప్రస్తుతం బస చేసిన చోటే (ముంబై) ఉంచి వైరస్ సంక్రమణ నిరోధక చర్యలు చేపట్టింది. మంగళవారం చేసిన ఆర్టీ–పీసీఆర్ పరీక్షలన్నీ నెగెటివ్‌గా వచ్చినా.. బుధవారం నాటి టెస్టులే కీలకమని బీసీసీఐ వైద్య బృందం భావిస్తోంది. -
IPL 2022:క్రికెట్ పండగొచ్చింది..తొలి పోరులో చెన్నైతో కోల్‌కతా ‘ఢీ’
-
ఒకప్పుడు అత్యధిక వికెట్ల వీరుడు.. ఇప్పుడు నెట్‌బౌలర్‌గా.. షాకింగ్!
ఒకప్పడు ఐపీఎల్లో దుమ్ము దులిపాడు. ప్రత్యర్ధి బ్యాటర్లకు తన బౌలింగ్‌తో చుక్కలు చూపించాడు. ఐపీఎల్-2014లో అత్యధిక వికెట్ల వీరుడు. అతడే టీమిండియా పేసర్ మెహిత్ శర్మ. ఒకప్పుడు స్టార్ బౌలర్‌గా చక్రం తిప్పిన మోహిత్ శర్మ ఇప్పుడు నెట్ బౌలర్‌గా ఎంపికయ్యడంటే ఊహించడానికే కష్టంగా ఉంది. ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు నెట్ బౌలర్‌గా మెహిత్ శర్మ ఎంపికైనట్లు తెలుస్తోంది. అతడితో పాటు మరో భారత పేసర్ బరీందర్ స్రాన్ కూడా గుజరాత్ నెట్ బౌలర్‌గా ఎంపికైనట్లు సమాచారం. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో పాల్గోన్న మెహిత్ శర్మను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. మోహిత్ శర్మ చివరసారిగా ఐపీఎల్-2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్‌కు ఆడాడు. ఇక 2014 సీజన్లో 23 వికెట్లు సాధించి పర్పుల్ క్యాప్‌ను కూడా గెలుచుకున్నాడు. ఇప్పటి వరకు 86 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన మోహిత్.. 92 వికెట్లు పడగొట్టాడు. ఇక 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లో భారత్ తరుపున మోహిత్ శర్మ ప్రాతినిధ్యం వహించాడు. కాగా మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తన తొలి మ్యాచ్‌ను మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో మార్చి 28న ఆడనుంది. చదవండి: IPL 2022: కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు: హార్దిక్ పాండ్యా -
అది మీ కర్మ.. అనుకుంటే అనుకోండి: పృథ్వీ షా
ఢిల్లీ: ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్‌మన్ పృథ్వీషా యో-యో టెస్టులో ఫెయిల్ అయ్యాడంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో నిర్వహించిన యో-యో టెస్టులో విఫలం చెందినట్లు జాతీయ మీడియాలో వెలుగుచూసింది. దీనిపై నేరుగా స్పందించని పృథ్వీషా.. కర్మ సిద్ధాంతాన్ని జోడించి మరీ కౌంటర్ ఇచ్చాడు. ‘మీకు నా పరిస్థితి తెలియనప్పుడు నన్ను జడ్జ్ చేయకండి. అనుకుంటే అనుకోండి.. అది మీ కర్మ’ అంటూ సెటైరిక్‌గా ఇన్‌స్టా గ్రామ్ పోస్ట్ ద్వారా స్పందించాడు. అసలు యో-యో టెస్టులో పాస్ అయ్యాడా.. లేదా అనే విషయాన్ని చెప్పకుండా ఇలా రాసుకు రావడం విఫలం చెందే ఉంటాడనే దానికి బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం యో-యో ఫిట్నెస్ టెస్టులో పాస్ కావడానికి 16.5 స్కోరు చేయాల్సి ఉంటుంది. కానీ పృథ్వీ షా 15 కంటే తక్కువ పాయింట్లే నమోదు చేశాడనేది రిపోర్ట్లు సారాంశం. ఇదిలా ఉంచితే, ఈనెల 26వ తేదీ నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానుంది. 27వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్‌ను ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో పృథ్వీ షా ఆడతాడా.. లేదా అనేది తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే. కేఎల్ రాహుల్ జట్టుకు గుడ్ న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు! -
అప్పుడు సీఎస్కేకు చుక్కలు చూపించారు.. కట్ చేస్తే.. ఇప్పుడేమో ఏకంగా
ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ తిరగులేని జట్టుగా నిలిచిన జట్టుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 12 సీజన్లలో 11 సార్లు ప్లేఆఫ్స్‌కు చేరి చెన్నై రికార్డును సృష్టించింది. ఎంస్ ధోని సారథ్యంలోని సీఎస్కే డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఐపీఎల్-2022 బరిలోకి దిగనుంది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంలో యువ ఆటగాళ్లను చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది. అయితే ఐపీఎల్-2021 సీజన్లో తమపై బాగా ఆడిన ముగ్గురు ఆటగాళ్లను చెన్నై కొనుగోలు చేయడం విశేషం. ఇక మార్చి 26 న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. శివమ్ దూబే మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ రూ. 4 కోట్లకు శివమ్ దూబేను కొనుగోలు చేసింది. దూబే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తోన్నాడు. కాగా గత ఏడాది సీజన్లో రాజస్తాన్ తరుపున ఆడిన దుబే అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్-2021లో కేవలం 42 బంతుల్లోనే 64 పరుగులు చేసి దూబే తన కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. ఆడమ్ మిల్నే మెగా వేలంలో ఆడమ్ మిల్నే ను రూ.1.9 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. ఈ కివీ స్పీడ్‌స్టర్ గత ఏడాది ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ సెకెండ్ ఫేజ్‌లో చెన్నైపై అద్భుతమైన బౌలింగ్ చేశాడు. క్రిస్ జోర్డాన్ మెగా వేలంలో జోర్డాన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ 3.6 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది సీజన్లో జోర్డాన్ పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. సీఎస్కేతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో అద్భుతంగా జోర్డాన్ రాణించాడు. 4 ఓవర్లు వేసిన జోర్డాన్ 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. చదవండి: IPL 2022: ఐపీఎల్ ఫ్రాంచైజీలకు భారీ షాక్.. 26 మంది స్టార్ ఆటగాళ్లు దూరం! ఇక ఐపీఎల్-2022 నేపథ్యంలో సీఎస్కే ఇప్పటికే సూరత్‌లో ప్రాక్టీసు మొదలెట్టిన సంగతి తెలిసిందే. Meeting in the Middle! 🦁 in Practice! 📹👉 https://t.co/jcD4NsNQ2t#WhistlePodu 💛 pic.twitter.com/QvrHYDiLi4 — Chennai Super Kings - Mask P😷du Whistle P🥳du! (@ChennaiIPL) March 12, 2022 -
రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ..
ఐపీఎల్-2022 ఆరంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్‌గా శ్రీలంక యార్కర్ల కింగ్ లసిత్ మలింగను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. కాగా గత ఏడాది అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి మలింగ తప్పుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టుకు తాత్కాలిక బౌలింగ్ కోచ్‌గా మలింగ పనిచేశాడు. అయితే ఈ సిరీస్‌లో బౌలింగ్ పరంగా శ్రీలంక జట్టు అద్భుతంగా రాణించింది. ఇక ఐపీఎల్లో 11 సీజన్ల పాటు ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన మలింగ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. 122 ఐపీఎల్ మ్యాచ్‌లలో 7.14 ఎకానమీతో 170 వికెట్లు తీసిన మలింగ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఇప్పటికీ కొనసాగుతోన్నాడు. ఇటువంటి అద్భుతమైన బౌలర్ జట్టుకు కోచ్‌గా రావడం రాజస్తాన్‌కు మరింత బలాన్ని చేకూరుస్తుంది. నవదీప్ సైనీ, ప్రసిద్ధ్ కృష్ణ వంటి యువ పేసర్లకు మలింగ్ తన అనుభవాన్ని పంచనున్నాడు. ఇక శ్రీలంక దిగ్గజం, రాజస్తాన్ ఫ్రాంచైజీ ఆపరేషన్స్ డైరెక్టర్ కూమార సంగర్కాకరతో కలిసి మలింగ పనిచేయనున్నాడు. మరో వైపు మెగా వేలంలో రాజస్తాన్.. దేవదత్ పడిక్కల్, బౌల్ట్, హెట్‌మైర్, అశ్విన్ వంటి అద్భుతమైన ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. వాంఖడే వేదికగా తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. చదవండి: IPL 2022- CSK: అలా కాదు.. ఇలా.. ! నెట్ సెషన్లో పాల్గొన్న యువ ప్లేయర్‌కు ధోని సూచనలు! -
చెన్నై సూపర్ కింగ్స్‌లోకి శ్రీశాంత్...!
ఐపీఎల్-2022కు గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ బౌలర్ దీపక్ చాహర్ దూరమైన సంగతి తెలిసిందే. ఈక్రమంలో చాహర్ స్ధానాన్ని భర్తీ చేసేందుకు సీఎస్కే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో సీఎస్కేకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. టీమిండియా వెటరన్ పేసర్ శ్రీశాంత్‌తో చాహర్ స్థానాన్ని భర్తీ చేయాలని చెన్నై భావిస్తోంది అన్నది ఆ వార్త సారాంశం. కాగా రూ.50 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అమ్ముడుపోని ఆటగాడిగా శ్రీశాంత్ మిగిలిపోయాడు. ఇక 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన శ్రీశాంత్‌పై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. దీంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయహాజారే టోర్నీ, రంజీ ట్రోఫీల్లో కేరళ తరపున శ్రీశాంత్ ఆడుతున్నాడు. రంజీట్రోఫీలో భాగంగా మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో 40 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. అంతే కాకుండా తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ఇబ్బంది పెట్టే స్కిల్స్ శ్రీశాంత్‌కు ఉన్నాయి. అదే విధంగా పవర్‌ప్లేలో కూడా బౌలింగ్ చేసే సత్తా శ్రీశాంత్‌కు ఉంది. ఈ కారణాలతోనే చెన్నై శ్రీశాంత్‌పై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: IND vs SL: విరాట్ కోహ్లి అరుదైన రికార్డు.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా! -
గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్.. స్టార్ ఆటగాడు దూరం
ఐపీఎల్లో కొత్త జట్టుగా అవతరించిన గుజరాత్ టైటాన్స్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాసన్ రాయ్ బయో బబుల్ నిబంధనల కారణంగా కారణంగా ఐపీఎల్-2022 నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. కాగా ఐపీఎల్ మెగా వేలంలో రూ.2 కోట్లకు రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ కోనుగొలు చేసింది. అయితే రాయ్ తన నిర్ణయాన్ని గుజరాత్ ఫ్రాంచైజీకు తెలియజేసినట్లు తెలుస్తోంది. గతేడాది కూడా ఐపీఎల్ తొలి ఫేజ్‌కు దూరమైన రాయ్.. సెకెండ్ ఫేజ్‌లో సన్‌రైజర్స్ తరుపున ఆడాడు. అంతకు ముందు ఢిల్లీకు రాయ్ ప్రాతినిథ్యం వహించాడు. ఇక జాసన్ రాయ్ చివరిసారిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ -2022లో పాల్గొన్నాడు. పీఎస్‌ల్లో రాయ్ అద్భుతంగా రాణించాడు. కేవలం 6 మ్యాచ్‌లు ఆడిన రాయ్.. 303 పరుగులు సాధించించాడు. అతడి ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అదే విధంగా తన ఐపీఎల్ కెరీర్లో 13 మ్యాచ్‌లు ఆడిన రాయ్ 329 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్-2022 మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే జరగనుంది. ముంబై, పుణే వేదికగా మ్యాచ్‌లు జరగనున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే ప్రకటించనుంది. చదవండి: Kieron Pollard: స్పిన్నర్‌గా మారిన పొలార్డ్.. ముంబై ఇండియన్స్‌కు ఇక.. వీడియో వైరల్ -
ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బిగ్ షాక్.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం!
ఐపీఎల్-2022లో ప్రారంభ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు దూరం కావడం ఖాయమైంది. పాకిస్తాన్లో ఆస్ట్రేలియా పర్యటన కారణంగా డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టాయినీస్, కమిన్స్, హాజల్‌వుడ్ మిచెల్ స్టార్క్ వంటి ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్ తొలి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మార్చి లో పాకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు, టెస్ట్ సిరీస్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్ ప్రకటించిన జట్లలో వీరింత భాగమై ఉన్నారు. పాకిస్తాన్లో ఆసీస్ పర్యటన మార్చి 4న ప్రారంభమై.. ఏప్రిల్ 5 ముగిస్తోంది. అనంతరం ఏప్రిల్ 6న ఆసీస్ ఆటగాళ్లు భారత్‌కు తిరిగిరానున్నారు. కాగా ఐపీఎల్-2022 మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో మొత్తం 13 మంది ఆసీస్ క్రికెటర్లు పాల్గోనబోతున్నారు. వీరిలో పాక్‌తో సిరీస్‌లకు ఎంపిక కాని డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, నాథన్ కౌల్టర్-నైల్, టిమ్ డేవిడ్ ఐపీఎల్ ఆరంభం నుంచి అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లకు తన వివాహం కారణంగా దూరంగా ఉండనున్నాడు. చదవండి: Pak Vs Aus ODIs: పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా సిరీస్.. వార్నర్, మాక్సీ సహా కీలక ఆటగాళ్లు దూరం! -
ఆర్సీబీ కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు!
రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరుకు త్వరలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు. ఆర్సీబీ కొత్త కెప్టెన్‌గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఫాప్ డుప్లిసెస్ ఎంపిక దాదాపు ఖాయం అయినట్లు తెలుస్తోంది. డుప్లిసెస్‌ను కెప్టెన్‌గా ఆర్సీబీ యాజమాన్యం ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో డుప్లిసెస్‌ను ఆర్సీబీ రూ. 7 కోట్లకు దక్కించుకుంది. వేలంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పోటీ పడి మరి అతడిని ఆర్సీబీ దక్కించుకుంది. ఇక ఐపీఎల్-2021 సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తర్వాత కెప్టెన్‌గా ఏబీ డివిలియర్స్ అవుతాడని అంతా భావించారు. ఈ క్రమంలోనే డివిలియర్స్ అన్ని రకాల ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుని అందరని షాక్‌కు గురి చేశాడు. ఇక మాక్స్వెల్ కూడా కెప్టెన్‌గా ఒక ఆఫ్షన్‌గా ఉన్నప్పటికీ ఆర్సీబీ మేనేజ్మెంట్ డుప్లిసెస్ వైపే మెగ్లు చూపినట్లు తెలుస్తోంది. "మా జట్టు కెప్టెన్‌గా డుప్లిసెస్ సరైనోడు అని భావిస్తున్నాం. అయితే మేము నిర్ణయించుకోవడానికి మాకు సమయం ఉంది. మాక్స్వెల్ అందుబాటుపై స్పష్టత కోసం ఎదురు చూస్తున్నాము. అతడు తన వివాహం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో డుప్లిసెస్ సరైన ఎంపికగా కనిపిస్తోంది" అని ఆర్సీబీ ఆధికారి ఒకరు పేర్కొన్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) జట్టు: విరాట్ కోహ్లి: రూ. 15 కోట్లు మ్యాక్స్‌వెల్: రూ. 11 కోట్లు హర్షల్ పటేల్: రూ. 10 కోట్ల 75 లక్షలు హసరంగ: రూ. 10 కోట్ల 75 లక్షలు హాజెల్‌వుడ్: రూ. 7 కోట్ల 75 లక్షలు సిరాజ్ :రూ. 7 కోట్లు డు ప్లెసిస్: రూ. 7 కోట్లు దినేశ్ కార్తీక్: రూ. 5 కోట్ల 50 లక్షలు అనూజ్ రావత్: రూ. 3 కోట్ల 40 లక్షలు షాబాజ్ అహ్మద్: రూ. 2 కోట్ల 40 లక్షలు రూథర్‌ఫొర్డ్: రూ. 1 కోటి మహిపాల్ లామ్రోర్: రూ. 95 లక్షలు ఫిన్ అలెన్: రూ. 80 లక్షలు బెహ్రెండార్ఫ్: రూ.75 లక్షలు కరణ్ శర్మ: రూ. 50 లక్షలు సుయశ్ ప్రభుదేశాయ్: రూ.30 లక్షలు సీవీ మిలింద్: రూ. 25 లక్షలు ఆకాశ్‌దీప్: రూ. 20 లక్షలు అనీశ్వర్ గౌతమ్ : రూ. 20 లక్షలు చదవండి: Ranji Trophy- Yash Dhull: అరంగేట్రంలోనే అద్భుత సెంచరీ.. మరో కోహ్లివి.. మరీ 50 లక్షలు తక్కువే కదా! -
ప్రముఖ ఐపీఎల్ జట్టుతో అథర్ ఎనర్జీ ఈవీ కంపెనీ కీలక ఒప్పందం..!
అహ్మదాబాద్: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ, కొత్త ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అహ్మదాబాద్ ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ జట్టుతో కీలక ఒప్పందం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ జట్టు తమ ప్రధాన భాగస్వామిగా అథర్ ఎనర్జీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా తొలిసారి ఐపీఎల్లో పాల్గొంటున్న గుజరాత్ టైటాన్స్ అధికారిక జట్టు జెర్సీల మీద అథర్ ఎనర్జీ బ్రాండ్ పేరు కనిపించనుంది. అథర్ ఎనర్జీ సంస్థ దేశవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే 24 నగరాల్లో తన ఉనికిని చాటింది. రాబోయే 12 నెలల్లో 100కు పైగా నగరాల్లో విస్తరించాలని భావిస్తుంది. 2013లో మద్రాస్ పూర్వ విద్యార్థులు తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్ స్థాపించిన అథర్ ఎనర్జీ భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన ప్రత్యేకతను చాటుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా సామ్రాజ్యాన్ని విస్తరిస్తోంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశం అంతటా 30 రిటైల్ అవుట్ లెట్లు కలిగి ఉంది. మార్చి 2023 నాటికి, 100 నగరాల్లో 150 అనుభవ కేంద్రాలను ప్రారంభించాలని యోచిస్తోంది. అథర్ ఎనర్జీ అత్యంత పోటీ ఉన్న ఆటోమోటివ్ రంగంలో తన పంత ఎంతో నిరూపిస్తుంది. ఐపీఎల్లో ఇతర జట్లకు యువ జట్టు గుజరాత్ టైటాన్స్ పోటీ ఇస్తుందని సంస్థ పేర్కొంది.గుజరాత్ టైటాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందంలో భాగంగా అథర్ ఎనర్జీ దేశవ్యాప్తంగా ఎక్కువ మంది ప్రజలకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. (చదవండి: ఎలాన్ మస్క్ భారీ విరాళం.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!) -
ఐపీఎల్-2022 వేలంలో హైదరాబాద్ సీపీ కూమారుడు.. ఏ జట్టు దక్కించుకుందంటే
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 2022 ఐపీఎల్ సీజన్ కోసం మిలింద్‌ను రూ. 25 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (2015), ఢిల్లీ డేర్‌డెవిల్స్ (2016) జట్లకు హైదరాబాద్ క్రికెటర్ సీవీ మిలింద్ ఎంపికయ్యాడు. ఎడంచేతివాటం పేస్ బౌలర్ మిలింద్ 2013 నుంచి హైదరాబాద్ జట్టు తరఫున రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ముస్తాక్ అలీ ట్రోఫీ టోర్నీలలో ఆడుతూ నిలకడగా రాణిస్తున్నాడు. మిళింద్ లిస్ట్-ఏలో 45 మ్యాచ్‌లు ఆడి 82 వికెట్లను పడగొట్టాడు. 20 ఏళ్ల చామ మిళింద్ గతంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఐపీఎల్లో ఆడాడు. ఇక హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ కుమారుడే ఈ చామ మిళింద్ ఆనంద్. -
40 లక్షల కనీస ధర.. కానీ ఏకంగా 8 కోట్లు.. ఎవరీ టిమ్ డేవిడ్!
సింగపూర్ ఆటగాడు టిమ్ డేవిడ్‌కు వేలంలో జాక్ పాట్ తగిలింది. ఐపీఎల్-2022 మెగా వేలంలో డేవిడ్‌ను ముంబై ఇండియన్స్ రూ. 8 కోట్లకు కొనుగోలు చేసింది. రూ. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన టిమ్ డేవిడ్ కోసం బెంగళూరు, ముంబై ఇండియన్స్,ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. చివరకు ముంబై సొంతం చేసుకుంది. కాగా గత సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టిమ్ డేవిడ్ ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఆ సీజన్లో ఒకే ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం లభించింది. అందులో కేవంల 1 పరుగు మాత్రమే తీవ్రంగా నిరాశపరిచాడు. ఆ తరువాత అతడికి బెంగళూరు మరి అవకాశం ఇవ్వలేదు. దీంతో మెగా వేలంలో తన పేరును డేవిడ్ రిజిస్టర్ చేసుకున్నాడు. హిట్టింగ్ స్కిల్స్ ఉన్న డేవిడ్‌ను ముంబై పోటీ పడి మరి దక్కించుకుంది. బిగ్ బాష్ లీగ్, పాకిస్థాన్ సూపర్ లీగ్, టీ20 బ్లాస్ట్, ది హండ్రెడ్ వంటి టోర్నమెంట్లలో టిమ్ డేవిడ్ అద్భుతంగా రాణించాడు. డేవిడ్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అడుతున్నాడు. -
చేతన్ సకారియాకి బంపర్ ఆఫర్.. అప్పుడు 1.2 కోట్లు.. ఇప్పడు ఏకంగా..!
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియాకి కాసుల పంట పండింది. సకారియాను రూ.4.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన సకారియాను దక్కించుకోవడానికి ఆర్సీబీ, రాజస్తాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకి సకారియాను రూ.4.2 కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. కాగా గత ఏడాది సీజన్లో కేవలం రూ.1.2 కోట్లకు సకారియాను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది. అయితే గత సీజన్లో సకారియా అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 14 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్లో అద్భుతంగా రాణించడంతో ఈ యంగ్ బౌలర్‌కు టీమిండియా తరుపున ఆడే అవకాశం లభించింది. గత ఏడాది జాలైలో శ్రీలంకపై సకారియా అరంగట్రేం చేశాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ జాక్ పాట్ కొట్టాడు. గత సీజన్లో బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు అమ్ముడుపోయిన లివింగ్ స్టోన్, ఈసారి ఏకంగా రూ.11.50 కోట్లు దక్కించుకున్నాడు. లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది. చదవండి: IPL 2022 Auction: ఏడాదిలో తలకిందులు.. అప్పుడు 9.25 కోట్లు... ఇప్పుడు కేవలం! -
IPL 2022: 'అతడి కోసం వేలంలో యుద్దమే!.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే'
IPL 2022 Mega Auction: ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం దగ్గరపడింది. ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా బీసీసీఐ వేలాన్ని నిర్వహించనుంది. మొత్తం 590 మంది ఆటగాళ్లు ఈ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు. దీంట్లో 370 మంది భారత ఆటగాళ్లు, 220 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. కాగా వేలానికి ముందు గరిష్టంగా కేవలం నలుగురు ఆటగాళ్లను మాత్రమే రీటైన్ చేసుకునే అవకాశం ఉండండంతో చాలా మంది స్టార్ ఆటగాళ్లని ఫ్రాంఛైజీలు విడిచి పెట్టాల్సి వచ్చింది. దీంతో చాలా మంది స్టార్ ఆటగాళ్లు వేలంలోకి వచ్చారు. అంతే కాకుండా మరో రెండు కొత్త జట్లు రావడంతో ఈ ఏడాది వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ విషయానికి వస్తే.. ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు ఫాఫ్ డు ప్లెసిస్‌ను సీఎస్కే రీటైన్ చేసుకోలేదు. ఈ నేపథ్యంలో రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. డు ప్లెసిస్‌ను తిరిగి దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్ భారీ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా చెన్నై జట్టులో కీలక ఆటగాడిగా డుప్లెసిస్ ఉన్నాడు. 2021 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చాంఫియన్స్‌గా నిలవడంలో డుప్లెసిస్ కీలక పాత్ర పోషించాడు. "గత సీజన్లో డు ప్లెసిస్‌ను 1.5 కోట్లకు సొంతం చెన్నైసూపర్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సారి అతడి కోసం తీవ్రమైన పోటీ నెలకొననుంది. సీఎస్కే ఈ సారి డు ప్లెసిస్‌ను కొనుగోలు చేయాలనుకుంటే, గత సారి కంటే చాలా ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఈ వేలంలో అతడికి మంచి డిమాండ్ ఉంటుందని నా అభిప్రాయం. అదే విధంగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్‌కు కూడా వేలంలో భారీ ధర దక్కడం ఖాయం" అని అశ్విన్ యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా! -
ఆర్సీబీ కెప్టెన్‌గా జాసన్ హోల్డర్.. రాయుడుతో పాటు.. రూ. 27 కోట్లతో భారీ స్కెచ్..!
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. ఇప్పటికే 8 జట్లు తమ రీటైన్ చేసుకునే ఆటగాళ్ల జాబితాను ప్రకటించాయి. అదే విధంగా ఐపీఎల్లో కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయింట్స్,అహ్మదాబాద్ టైటన్స్ కూడా వేలానికి ముందు ముగ్గురు ఆటగాళ్లను సొంతం చేసుకున్నాయి. ఈ మెగా వేలాన్ని ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా బీసీసీఐ నిర్వహించనుంది. ఇక రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు విషయానికి వస్తే.. ఆ జట్టు వేలానికి ముందు విరాట్ కోహ్లి, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రీటైన్ చేసుకుంది. కాగా గత ఏడాది సీజన్ తర్వాత ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రానున్న మెగా వేలంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జాసన్ హోల్డర్‌ను దక్కించుకోవడం కోసం ఆర్సీబీ భారీ మొత్తాన్ని ఫిక్స్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా అతడితో పాటు అంబటి రాయుడు, రియాన్ పరాగ్‌లపై ఆర్సీబీ కన్నేసినట్లు తెలుస్తోంది. రాయల్ ఛాలెంజర్ప్ బెంగళూరు ఇంకా తమ పర్స్‌లో ఇంకా అత్యధికంగా 57 కోట్లను కలిగి ఉన్నారు. అయితే దీంట్లో హోల్డర్‌కి 12 కోట్లు, అంబటి రాయుడుకి 8 కోట్లు, రియాన్ పరాగ్కి 7 కోట్లు ఆర్సీబీ కెటాయించనట్లు నివేదికలు తెలుపుతున్నాయి. ఈ ఆటగాళ్లపై దాదాపు రూ.27 కోట్లు ఖర్చు చేస్తే.. ఆర్సీబీ పర్సులో ఇంకా రూ.28 కోట్లు మిగలనున్నాయి ఇక వేలంలో జాసన్ హోల్డర్‌ను సొంతం చేసుకుని కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలని ఆర్సీబీ భావిస్తోన్నట్లు సమాచారం. చదవండి: Hardik Pandya: కీలక టోర్నీ నుంచి తప్పుకున్న హార్దిక్ పాండ్యా.. కారణం అదేనా? -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా పాట్ కమిన్స్!
IPL 2022: ఐపీఎల్-2022 మెగా వేలాన్ని ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేలంలో మొత్తం 590 మంది ఆటగాళ్లు పాల్గొనబోతున్నారు. ఇక రానున్న మెగా వేలంలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్‌ను దక్కించుకోనేందుకు మూడు జట్లు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత కొద్ది సీజన్ల నుంచి కమిన్స్ కేకేఆర్ జట్టుకు ప్రతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు కేకేఆర్ అతడిని రీటైన్ చేసుకోలేదు. దీంతో ఈ వేలంలో అతడిని సొంతం చేసుకోనేందుకు ముంబై ఇండియన్స్,ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా పాట్ కమిన్స్‌ను పంజాబ్ కింగ్స్ ఎలాగైనా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతే కాకుండా జట్టు సారథ్య బాధ్యతలు కూడా అప్పజెప్పనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మెగా వేలంకు ముందు పంజాబ్ కింగ్స్ కేఎల్ రాహుల్‌ను రీటైన్ చేసుకోలేదు. పంజాబ్.. మయాంక్ ఆగర్వాల్, హర్షల్ పటేల్‌ను రీటైన్ చేసుకుంది. అయితే మయాంక్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పనున్నారని వార్తలు వినిపించాయి. మయాంక్ ఆగర్వాల్‌కు కెప్టెన్‌గా పూర్తిగా అనుభవం లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ మేనేజెమెంట్ విముఖత చూపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియాకు కెప్టెన్‌గా అద్భుత విజయం సాధించిన పాట్ కమిన్స్కి జట్టు పగ్గాలు అప్పజెప్పాలని పంజాబ్ కింగ్స్ మేనేజెమెంట్ భావిస్తోన్నట్లు సమాచారం. చదవండి: IND Vs WI 1st ODI: మళ్లీ విఫలమైన కోహ్లి.. అయితేనేం సచిన్ రికార్డు బద్దలు -
"వేలంలో అతడి కోసం 10 జట్లు పోటీ పడడం ఖాయం"
ఐపీఎల్-2022 మెగా వేలంలో శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగా కోసం లక్నో, అహ్మదాబాద్‌తో సహా మొత్తం 10 జట్లు పోటీ పడతాయని భారత మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా అభిప్రాయ పడ్డాడు. రానున్న వేలంలో అత్యంత ఖరీదైన టాప్ 5 బౌలర్లలో హసరంగా ఒకడని చోప్రా తెలిపాడు. హసరంగా అద్భుతమైన ఆటగాడు. అతడు బాల్‌తో పాటు బ్యాట్‌తో కూడా రాణించగలడు. ఒక వేళ నేను వేలంలో పాల్గొంటే మొదటిగా అతడినే ఎంచుకుంటాను. అతడు కొత్త బంతితో కూడా బాగా బౌలింగ్ చేయగలడు. గత ఏడాది ఆర్సీబీ అతడిని తక్కువ ధరకి కొనుగోలు చేసింది. కానీ హసరంగాకి అంతగా ఆర్సీబీ అవకాశం ఇవ్వలేదు. ఫ్రాంచైజీలు అతడి కోసం 4 నుంచి 5 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అతడు టీ20 క్రికెట్లో గత కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. వేలంలో మొత్తం 10 జట్లు కూడా అతడి కోసం పోటీ పడతాయి అనడంలో సందేహం లేదు అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు. ఇక ఫిబ్రవరి 12,13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. ఇక ఈ మెగా వేలంలో 590 మంది క్రికెటర్లు పాల్గొనబోతున్నారు. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్‌కి మరీ ఇంత తక్కువా! -
వేలంలోకి అతడు వచ్చేశాడు.. రికార్డులు బద్దలు అవ్వాల్సిందే!
ఐపీఎల్లో ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి పునరాగమనం చేయనున్నాడు. ఐపీఎల్-2022 సీజన్ మెగా వేలంలో జోఫ్రా ఆర్చర్ రూ. 2 కోట్ల బేస్ ధరగా తన పేరును నమోదు చేసుకున్నాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్లో గాయం కారణంగా ఆర్చర్ పాల్గొనడం అనుమానమేనని బీసీసీఐ ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలిపింది. 2023,2024 ఐపీఎల్ సీజన్లలో ఆర్చర్ పాల్గొనే అవకాశం ఉన్నందున ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అతడి పేరును నమోదు చేసింది. కాగా ఆర్చర్ గత కొన్ని సీజన్ల నుంచి రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. కాగా ఐపీఎల్-2022 మెగా వేలం ముందు ఆర్చర్‌ని రాజస్తాన్ రాయల్స్ రీటైన్ చేసుకోలేదు. ఇక అర్చర్తో పాటు మరో 44 మంది ఆటగాళ్లు పేర్లును కొత్తగా రిజిస్టర్ చేసుకున్నారని బీసీసీఐ పేర్కొంది. దీంట్లో ఆసీస్ స్టార్ ఆటగాడు ఖవాజా కూడా ఉన్నాడు. ఈ వేలంలో మొత్తం 1258 ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా వేలాన్ని బీసీసీఐ నిర్వహించనుంది. చదవండి: IPL 2022: ఆ డబ్బుతో మొదట ఐఫోన్, సెకండ్ హాండ్ కారు కొన్నా.. అందులో ఏసీ లేదు: సిరాజ్ -
వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?
ఐపీఎల్-2022 మెగా వేలానికి సమయం అసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదిల్లో మెగా వేలం జరగనుంది. కాగా ఇప్పటికే 1214 మంది ఆటగాళ్లు మెగా వేలం కోసం తమ పేర్లును రిజిస్టర్ చేశారు. కాగా భారత మాజీ పేసర్ శ్రీశాంత్ మరో సారి వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఈ సారి తన బేస్ ప్రైస్ రూ. 50 లక్షలుగా నిర్ణయించాడు. గత ఏడాది వేలంలో రూ. 75 లక్షలుగా తన కనీస ధరగా శ్రీశాంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఏ ఫ్రాంచైజీ కూడా అతడిని కొనుగొలు చేసేందుకు ఆసక్తి చూపలేదు. ఐపీఎల్లో శ్రీశాంత్ చివరిసారిగా 2013లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత అతడిపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో బీసీసీఐ అతడిపై జీవిత కాల నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ శ్రీశాంత్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. సుప్రీంకోర్టు స్పందిస్తూ.. శిక్ష కాలాన్ని తగ్గించమని బీసీసీఐను ఆదేశించింది. దీంతో బీసీసీఐ అతడిపై నిషేధాన్ని ఏడు ఏళ్లకు కుదించింది. దీంతో 13 సెప్టెంబర్ 2020 నుంచి అతడిపై నిషేధం ఎత్తివేయబడింది. కాగా గత ఏడాదిలో సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలలో కేరళ తరఫున ఆడాడు. అంతే కాకుండా త్వరలో జరగనున్న కేరళ రంజీ జట్టులో కూడా శ్రీశాంత్ భాగమై ఉన్నాడు. చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ఆల్ రౌండర్ గుడ్‌బై.. -
పని అయిపోయింది అన్నారు.. దుమ్ము రేపుతున్నాడు.. వేలంలో భారీ ధర పక్కా!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పని అయిపోయింది, ఇక భారత జట్టులో చోటు కష్టమే, అతడి స్ధానంలో కుర్రాళ్లకు అవకాశం ఇవ్వండి. ఇవన్నీ దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వినిపించిన మాటలు ఇవి. అయితే పడి లేచిన కెరటంలా ధావన్ దక్షిణాఫ్రికా టూర్లో అద్భుతంగా రాణించాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 169 పరుగులు సాధించాడు. దీంట్లో రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సిరీస్‌లో టీమిండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ధావన్ నిలిచాడు. కాగా గత ఏడాది శ్రీలంక పర్యటనలో భారత యువ జట్టుకు శిఖర్ ధావన్ సారథ్యం వహించాడు. టీ20 ప్రపంచకప్-2021, స్వదేశాన న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కూడా ధావన్‌కు చోటు దక్క లేదన్న సంగతి తెలిసిందే. ఇక ఐపీఎల్-2022 మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ధావన్‌ని రీటైన్ చేసుకోలేదు. ఆ క్రమంలో రానున్న మెగా వేలంలో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన గబ్బర్ను కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు తప్పక పోటీ పడతాయనడంలో సందేహం లేదు.. ఇక బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనుంది. చదవండి: Virat Kohli- Vamika: వామిక ఫొటోలు వైరల్.. స్పందించిన కోహ్లి... -
మూడు మ్యాచ్‌లు.. 228 పరుగులు.. అతడు వేలంలోకి వస్తే జట్లు పోటీ పడాల్సిందే!
ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం అసన్నమైంది. ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా మెగావేలం జరగనుంది. ఇక ఈసారి రెండు కొత్త జట్లు టోర్నీలో పాల్గొనబోతున్నాయి. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీలు ఇప్పటికే తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పేర్లను వెల్లడించాయి. మొత్తం ఈ ఏడాది లీగ్ కోసం 1,214 మంది క్రికెటర్లు తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారు. అయితే రానున్న మెగా వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటి నుంచే కసరత్తలు మొదలపెట్టాయి. ఈ క్రమంలో అండర్-19 ప్రపంచ కప్‌లో అదరగొడుతున్న భారత యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువన్షీ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన రఘువన్షీ 228 పరుగులు చేశాడు. దీంట్లో ఒక అర్ధసెంచరీతో పాటు, సెంచరీ కూడా ఉంది. అదే విధంగా అండర్-19 ఆసియా కప్‌లో కూడా రఘువన్షీ అధ్బుతంగా రాణించాడు. దీంతో అతడితో పాటు ఆల్‌రౌండర్ రాజ్ బావాను కూడా ఫ్రాంచైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాజ్ బావా బ్యాట్‌తోను, బాల్‌తోను ఈ మెగా టోర్నమెంట్లో రాణిస్తున్నాడు. ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో రాజ్ బావా 162 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. చదవండి: SA vs IND 3rd ODI: 'కెప్టెన్‌గా అతడు ఏం చేశాడో నాకు తెలియడం లేదు' -
పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సన్‌రైజర్స్‌లోకి కిషన్!
ఐపీఎల్ మెగా వేలానికి సమయం దగ్గర పడడంతో ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడిని దక్కించుకుంటుందో అన్న ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ క్రమంలో ఆటగాళ్లకు సంబంధించి రోజుకో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రానున్న మెగా వేలంలో శ్రేయస్ అయ్యర్‌ని పంజాబ్ కింగ్స్ కోనుగోలు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఆ జట్టు కెప్టెన్సీ భాధ్యతలు కూడా అప్పజెప్పాలని పంజాబ్ ఫ్రాంఛైజీ యోచిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ మెగా వేలం-2022 మెగా వేలంకు ముందు ఢిల్లీ క్యాపిటిల్స్ శ్రేయస్ అయ్యర్‌ని రీటైన్ చేసుకోలేదు. అతడిని కెప్టెన్‌గా నియమించుకోవాలని మూడు ప్రధాన జట్లు భావిస్తున్నాయి. కాబట్టి అతడు భారీ ధర పలకడం ఖాయమే. కాగా అతడిని దక్కించుకోవడానికి ఆర్సీబీ, పంజాబ్, కేకేఆర్ ముందు వరుసలో ఉన్నాయి. ఇది ఇలా ఉంటే.. ఇషాన్ కిషన్ కూడా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోపోయిన సంగతి తెలిసిందే. దీంతో రానున్న మెగా వేలంలో ఇషాన్‌ను దక్కించుకోవడానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్ మెగా వేలం ఫిబ్రవరిలో జరగనుంది. చదవండి: Under 19 WC 2022: విండీస్ ప్లేయర్ "సూపర్ మ్యాన్ క్యాచ్"కు సలాం కొడుతున్న నెటిజన్లు