ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ చేతన్ సకారియాకి కాసుల పంట పండింది. సకారియాను రూ.4.2 కోట్లకు ఢిల్లీ క్యాపిటిల్స్ కొనుగోలు చేసింది. కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన సకారియాను దక్కించుకోవడానికి ఆర్సీబీ, రాజస్తాన్, ఢిల్లీ పోటీ పడ్డాయి. చివరకి సకారియాను రూ.4.2 కోట్లకు ఢిల్లీ కైవసం చేసుకుంది. కాగా గత ఏడాది సీజన్‌లో కేవలం రూ.1.2 కోట్లకు సకారియాను రాజస్తాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
అయితే గత సీజన్‌లో సకారియా అద్భుతంగా రాణించాడు. 14 మ్యాచ్‌లు ఆడిన అతడు 14 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించడంతో ఈ యంగ్ బౌలర్‌కు టీమిండియా తరుపున ఆడే అవకాశం లభించింది. గత ఏడాది జాలైలో శ్రీలంకపై సకారియా అరంగట్రేం చేశాడు. ఇక రెండో రోజు వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ జాక్ పాట్ కొట్టాడు. గత సీజన్‌లో బేస్ ప్రైజ్ రూ.75 లక్షలకు అమ్ముడుపోయిన లివింగ్ స్టోన్, ఈసారి ఏకంగా రూ.11.50 కోట్లు దక్కించుకున్నాడు. లివింగ్‌స్టోన్‌ని రూ11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ జట్టు కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2022 Auction: ఏడాదిలో తలకిందులు.. అప్పుడు 9.25 కోట్లు... ఇప్పుడు కేవలం!
Comments
Please login to add a commentAdd a comment