
Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న చేతన్ సకారియా తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లో 3 ఓవర్లు వేసిన సకారియా.. 17 పరుగులు ఇచ్చి ఫించ్ వికెట్ పడగొట్టాడు. కాగా ఫించ్ వికెట్ సాధించిన సకారియా.. వెరైటీ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన సకారియా.. అద్భుతమైన ఇన్ స్వింగర్‌తో ఫించ్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో సకారియా.. ప్రఖ్యాత జపనీస్ యానిమేషన్ సిరీస్ "డ్రాగన్ బాల్ జెడ్" లోని గోకు స్టైల్లో సెలబ్రేషన్స్ జరపుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఐపీఎల్-2022 మెగా వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ సకారియాను రీటైన్ చేసుకోలేదు. దీంతో వేలంలో రూ. 4 కోట్లకు సకారియాను ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
చదవండి: IPL 2022: ఏదో ఒక రోజు 155 కి.మీ వేగంతో బౌలింగ్ చేస్తా: ఉమ్రాన్ మాలిక్
What a start🔥🔥🔥🔥 pic.twitter.com/nbnA7h7HAp
— abhishek sandikar (@ASandikar) April 28, 2022