ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ ఓటమి చెంది టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే తమ జట్టు ప్లేఆఫ్స్ చేరకపోవడంపై ఢిల్లీ స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఢిల్లీ ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోవడం తమకు సిగ్గుగా ఉందని మార్ష్ తెలిపాడు. "మేము ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు చేరుకోలేకపోవడం నాకు సిగ్గుగా అనిపించింది. హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మా జట్టు ఆటగాళ్లను చాలా బాగా చూసుకున్నాడు.
అతడు నాయకుడిగా, జట్టు ప్రధాన కోచ్‌గా జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. అతడి కోసమైనా మేము టైటిల్ సాధించాలని భావించాము. అదే విధంగా ఢిల్లీ జట్టుకు నేను చాలా ముఖ్యమైన ఆటగాడిగా పాంటింగ్ భావించాడు" అని మార్ష్ పేర్కొన్నాడు. ఇక గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు మార్ష్ దూరమయ్యాడు. అనంతరం జట్టులోకి వచ్చిన ఒక్క మ్యాచ్ తర్వాత కరోనా బారిన పడ్డాడు. దీంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే కరోనా నుంచి కోలుకున్నాక మార్ష్ ఆద్భుతంగా రాణించాడు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన మార్ష్ 251 పరుగులు చేశాడు.
చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment