Courtesy: IPL Twitter
ఐపీఎల్ సంగ్రామానికి మరి కొద్ది రోజుల్లో తెరలేవనుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్-2022 ప్రారంభం కానుంది. ఇది ఇలా ఉంటే.. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ చాలా మంది స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అనుసరించిన వ్యూహం సరిగా లేదని భారత మాజీ ఓపెనర్ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. ముఖ్యంగా వారి విదేశీ ఆటగాళ్లను ఎంచుకోవడంలో ఢిల్లీ విఫలమైందని అతడు పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2022లో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం ఏడుగురు విదేశీ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అయితే వీరిలో దక్షిణాఫ్రికా స్టార్ బౌలర్ గాయం ఈ ఏడాది సీజన్‌కు కారణంగా దూరం కాగా, ఆస్ట్రేలియా ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో వసీం జాఫర్ మాట్లాడుతూ.. "ఐపీఎల్-2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తప్పుడు వ్యూహాన్ని అనుసరించింది. వారు ఆటగాళ్లను అంతర్జాతీయ సిరీస్‌లను దృష్టిలో పెట్టుకుని కొనుగోలు చేయాల్సింది. వేలంలో గరిష్టంగా 8 మంది విదేశీ క్రికెటర్‌లను చేసుకోనే అవకాశం ఉన్నప్పుడు.. ఢిల్లీ ఏడుగురు విదేశీ ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంది’’ అని పేర్కొన్నాడు.
ఇక ఈ సీజన్‌లో ఢిల్లీ అనుసరించబోయే వ్యూహం గురించి మాట్లాడుతూ.. ‘‘మన్‌దీప్ సింగ్ లేదా యశ్ ధూల్ ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్‌లో సర్ఫరాజ్ ఖాన్‌కు బ్యాటింగ్‌కు వస్తాడు. అయితే శ్రేయాస్ అయ్యర్ స్ధానాన్ని అతడు భర్తీ చేయలేడు. ఇక కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను విడుదల చేశారు. ఇంతకు ముందు జట్టులో అమిత్ మిశ్రా ఉన్నాడు. ఇప్పుడు ప్రవీణ్ దూబే,లలిత్ యాదవ్ వంటి యువ స్పిన్నర్లు మాత్రమే ఉన్నారు. అయితే ధావన్, అయ్యర్, అశ్విన్ వంటి ఆటగాళ్లను వదిలి ఢిల్లీ తప్పు చేసింది" అని జాఫర్ పేర్కొన్నాడు.
చదవండి: BAN vs SA: ఒకవైపు ఐపీఎల్.. జట్టును ప్రకటించిన దక్షిణాఫ్రికా.. స్టార్ ఆటగాళ్లు లేకుండానే!
Comments
Please login to add a commentAdd a comment