
ఐపీఎల్ మెగావేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలిరోజు 10 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. టీమిండియా ఆల్‌రౌండర్ శార్ధూల్ ఠాకూర్ రూ. 10.75 కోట్లతో రికార్డు ధరకు అమ్ముడు కాగా.. ఆస్ట్రేలియన్ స్టార్ బ్యాట్స్‌మెన్ మిచెల్ మార్ష్(రూ. 6.50 కోట్లు), డేవిడ్ వార్నర్(రూ. 6.25 కోట్లు) అమ్ముడుపోయారు. మిగతావారిలో కేఎస్ భరత్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్‌లు ఉన్నారు.
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్‌లో భాగంగా రిషబ్ పంత్(రూ. 16 కోట్లు), అక్షర్ పటేల్ (రూ. 9 కోట్లు), పృథ్వీ షా (రూ. 7.5 కోట్లు), అన్‌రిచ్ నోర్ట్జే(రూ.6.5 కోట్లు) ను తమవద్దే ఉంచుకుంది. కాగా ఢిల్లీ క్యాపిటల్స్ పర్సులో రూ. 16.50 కోట్లు మిగిలి ఉన్నాయి. 13 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. విదేశీ ఆటగాళ్ల కోటాలో 4 స్థానాలు మిగిలి ఉన్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్:
శార్దుల్ ఠాకూర్ : రూ. 10 కోట్ల 75 లక్షలు
మిచెల్ మార్ష్ : రూ. 6 కోట్ల 50 లక్షలు
డేవిడ్ వార్నర్ : రూ. 6 కోట్ల 25 లక్షలు
కేఎస్ భరత్ : రూ. 2 కోట్లు
కుల్దీప్ యాదవ్ : రూ. 2 కోట్లు
ముస్తాఫిజుర్ రెహ్మాన్ : రూ. 2 కోట్లు
కమలేశ్ నాగర్‌కోటి : రూ. 1 కోటి 10 లక్షలు
సర్ఫరాజ్ : రూ. 20 లక్షలు
అశ్విన్ హెబర్ : రూ. 20 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment