Courtesy: IPL Twitter
ఐపీఎల్-2022లో భాగంగా సోమవారం (మే 16) పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయంలో ఆజట్టు పేసర్ శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు పడగొట్టి కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్‌లో ఠాకూర్ తన నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు సాధించాడు. ఒకే ఓవర్‌లో రాజపాక్స, శిఖర్ ధావన్‌ను ఔట్ చేసి ఠాకూర్ మ్యాచ్‌ను ఢిల్లీ వైపు మలుపు తిప్పాడు.
"లార్డ్ ఠాకూర్ అంటే ఇదే మరి. తన వేసిన మొదటి ఓవర్ చాలా క్లిష్టమైనది. ఎందుకంటే పవర్‌ప్లేలో అది అఖరి ఓవర్. అప్పటికే పంజాబ్ బ్యాటర్లు రిథమ్‌లో ఉన్నారు. అయినప్పటికీ శిఖర్ ధావన్, భానుక రాజపక్సను అతడు ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. చాలా సార్లు ఠాకూర్ బౌలింగ్‌లో ధావన్ తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఈ సారి కూడా ధావన్‌పై ఠాకూర్ పైచేయి సాధించాడు.
పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తున్న సమయంలో ఫాస్ట్ బౌలర్ రెండు వికెట్లు సాధించడం అంత సులభం కాదు. అప్పటికే అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్ వేయవలసి ఉంది. వారు వికెట్లు సాధిస్తారని నాకు తెలుసు. కానీ శార్దూల్ వికెట్లు తీస్తాడని నేను అస్సలు ఊహించ లేదు. అతడు రెండు దశల్లో బౌలింగ్ చేశాడు. అతడు తన నాలుగు ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు పడగొట్టాడు. అతడికి ఇవే ఐపీఎల్‌లో అత్యుత్తమ గణాంకాలు" అని ఆకాష్ చోప్రా పేర్కొన్నాడు.
చదవండి: బౌలర్ల పాలిట సింహ స్వప్నాల్లా మారిన బ్యాటర్లు.. ఐపీఎల్ 2022 పేరిట అరుదైన రికార్డు
Comments
Please login to add a commentAdd a comment