Courtesy: IPL Twitter
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బుధవారం రాజస్తాన్ రాయల్స్‌పై సూపర్ విక్టరీతో మెరిసింది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. మిచెల్ మార్ష్ 89 పరుగులతో మెరుపులు మెరిపించగా.. డేవిడ్ వార్నర్(52*) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.
ఇక మంచి ఫామ్‌లో ఉన్న పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్‌కు దూరమవడం కాస్త దెబ్బే అనుకోవచ్చు. అతని స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన కోన శ్రీకర్ భరత్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ సీజన్‌లో పృథ్వీ షా మే 1న లక్నో సూపర్ జెయింట్స్‌పై చివరి మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఆరోగ్య కారణాల రిత్యా ఆసుపత్రిలో చేరాడు. అప్పటినుంచి పృథ్వీ ఆరోగ్యంపై ఎటువంటి అప్‌డేట్ లేదు. మ్యాచ్ విజయం తర్వాత ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ పృథ్వీ షా ఆరోగ్యంపై క్లారిటి ఇచ్చాడు.
''పృథ్వీ షాను మేం చాలా మిస్సవుతున్నాం. అతను టైఫాయిడ్ లాంటి జ్వరంతో బాధపడుతున్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ప్రస్తుతం పృథ్వీ షా కోలుకుంటున్నాడు. సీజన్‌లో మిగతా మ్యాచ్‌లు ఆడుతాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ఇక రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించడం మాకు చాలా కీలకం. తొలుత బౌలింగ్ ఎంచుకొని మంచి పని చేశాం. పిచ్‌పై తేమ ఉండడంతో 140-160 పరుగులు మంచి స్కోర్. అందులో మేం ఫలితం సాధించాం. మిచెల్ మార్ష్, వార్నర్‌లు మంచి ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించారు. మేం కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం.'' అంటూ తెలిపాడు.
చదవండి: David Warner: వార్నర్ అరుదైన ఫీట్.. కోహ్లి, ధావన్‌లతో సమానంగా
Comments
Please login to add a commentAdd a comment