Courtesy: IPL Twitter
ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2022 సీజన్‌లో తమ ప్రయాణాన్ని పడుతూ లేస్తూ కొనసాగిస్తుంది. ఒక మ్యాచ్‌లో విజయం సాధించగానే తర్వాతి మ్యాచ్‌లో ఓడిపోవడం అలవాటుగా చేసుకుంది. ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఆరు పరాజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచి.. మిగతా జట్లు ఓడిపోతేనే ఢిల్లీకి ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయి.
ఈ నేపథ్యంలో ఆ జట్టు యువ ఆటగాడు.. పృథ్వీ షా లీగ్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పృథ్వీ షా జ్వరంతో బాధపడుతూ ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. పంత్ కూడా పృథ్వీ షాను మిస్సవుతున్నామని పేర్కొన్నాడు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ ఒక ప్రకటనలో తెలిపాడు.
''పృథ్వీ షా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడు. వైద్యులు రోజు పృథ్వీకి డయాగ్నసిస్ నిర్వహిస్తున్నారు. కొన్న వారాల నుంచి ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న పృథ్వీ దూరం కావడం మాకు ఇబ్బందిగా మారింది. అందునా ప్లేఆఫ్ చేరుకునే క్రమంలో ఒక డాషింగ్ ఆటగాడు లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది. ఆరంభంలోనే బౌలర్లకు ముచ్చెటమలు పట్టిస్తూ అలవోకగా బౌండరీలు బాది ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తెచ్చేవాడు. అతని సేవలు కోల్పోవడం మాకు పెద్ద నష్టం అని చెప్పొచ్చు'' అంటూ తెలిపాడు. ఇక ఈ సీజన్‌లో పృథ్వీ షా 9 మ్యాచ్‌ల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 259 పరుగులు చేశాడు. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ తన తర్వాతి మ్యాచ్ పంజాబ్ కింగ్స్‌తో మే 16న ఆడనుంది.
చదవండి: Rishabh Pant: 'పృథ్వీ షాను మిస్సవుతున్నాం.. కచ్చితంగా ప్లేఆఫ్ చేరుకుంటాం'
Comments
Please login to add a commentAdd a comment