IPL 2022: Australian Cricketers Late Start for IPL 2022 Season Confirmed - Sakshi
Sakshi News home page

IPL 2022: ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు బిగ్‌ షాక్‌.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం!

Published Tue, Feb 22 2022 6:20 PM | Last Updated on Tue, Feb 22 2022 6:59 PM

Australian cricketers late start for IPL 2022 season confirmed - Sakshi

ఐపీఎల్‌-2022లో  ప్రారంభ మ్యాచ్‌లకు ఆస్ట్రేలియా స్టార్‌ ఆటగాళ్లు దూరం కావడం ఖాయమైంది. పాకిస్తాన్‌లో ఆస్ట్రేలియా పర్యటన కారణంగా  డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టాయినీస్, కమిన్స్, హాజల్‌వుడ్‌ మిచెల్‌ స్టార్క్‌ వంటి ఆటగాళ్లు ఈ ఏడాది ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌లకు దూరం కానున్నారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టు మార్చి లో పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరిమిత ఓవర్ల సిరీస్‌తో పాటు, టెస్ట్‌ సిరీస్‌లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్టును మంగళవారం ప్రకటించింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ ప్రకటించిన జట్లలో వీరింత భాగమై ఉన్నారు.

పాకిస్తాన్‌లో ఆసీస్‌ పర్యటన మార్చి 4న ప్రారంభమై.. ఏప్రిల్‌ 5 ముగిస్తోంది. అనంతరం ఏప్రిల్ 6న ఆసీస్‌ ఆటగాళ్లు భారత్‌కు తిరిగిరానున్నారు. కాగా ఐపీఎల్‌-2022 మార్చి 27 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఐపీఎల్‌లో మొత్తం 13 మంది ఆసీస్‌ క్రికెటర్‌లు పాల్గోనబోతున్నారు. వీరిలో పాక్‌తో సిరీస్‌లకు ఎంపిక కాని డేనియల్ సామ్స్, రిలే మెరెడిత్, నాథన్ కౌల్టర్-నైల్, టిమ్ డేవిడ్‌ ఐపీఎల్‌ ఆరంభం నుంచి అందుబాటులో ఉండనున్నట్లు క్రికెట్‌ ఆస్ట్రేలియా పేర్కొంది. ఇక ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ కూడా ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లకు తన వివాహం కారణంగా దూరంగా ఉండనున్నాడు.

చదవండి: Pak Vs Aus ODIs: పాకిస్తాన్‌తో ఆస్ట్రేలియా సిరీస్‌.. వార్నర్‌, మాక్సీ సహా కీలక ఆటగాళ్లు దూరం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement