చెలరేగిన వార్నర్, మార్ష్.. పాకిస్తాన్‌పై గెలిచిన ఆస్ట్రేలియా | Australia won by 62 runs against Pakistan | Sakshi
Sakshi News home page

చెలరేగిన వార్నర్, మార్ష్.. పాకిస్తాన్‌పై గెలిచిన ఆస్ట్రేలియా

Published Sat, Oct 21 2023 1:19 AM | Last Updated on Sat, Oct 21 2023 5:11 AM

Australia won by 62 runs against Pakistan - Sakshi

బెంగళూరు: వరుస ఓటమిల నుంచి తేరుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పుంజుకుంది. వార్నర్, మార్ష్ ల మెరుపులతో పాటు స్టొయినిస్‌ సూపర్‌ స్పెల్, ఆడమ్‌ జంపా స్పిన్‌ ఆసీస్‌ను గెలిపించాయి. శుక్రవారం జరిగిన ప్రపంచకప్‌ పోరులో ఆ్రస్టేలియా 62 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీస్కోరు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డేవిడ్‌ వార్నర్‌ (124 బంతుల్లో 163; 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్‌ మార్ష్ (108 బంతుల్లో 121; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) శతక్కొట్టారు. షాహిన్‌ అఫ్రిదికి 5 వికెట్లు దక్కాయి. తర్వాత పాకిస్తాన్‌ 45.3 ఓవర్లలో 305 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్లు ఇమాముల్‌ హక్‌ (71 బంతుల్లో 70; 10 ఫోర్లు), అబ్దుల్లా షఫిక్‌ (61 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. జంపా 4, స్టొయినిస్‌ 2 వికెట్లు తీశారు.  

సిక్సర్ల హోరు 
వార్నర్‌ లాంటి డాషింగ్‌ ఓపెనర్‌కు 10, 105 స్కోర్ల వద్ద ఏకంగా రెండుసార్లు లైఫ్‌లు వస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో పాక్‌కు తెలిసొచ్చేలా చేశాడు. మరోవైపు మార్ష్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మైదానం సిక్సర్లతో హోరెత్తింది.

వార్నర్‌ 85 బంతుల్లో వన్డేల్లో 21 సెంచరీని పూర్తి చేసుకోగా, మార్ష్ 100 బంతుల్లో రెండో శతకం సాధించాడు. 259 స్కోరు వద్ద మార్ష్ ను షాహిన్‌ అవుట్‌ చేయడంతో పాక్‌ ఊపిరి పీల్చుకుంది. మ్యాక్స్‌వెల్‌ (0), స్మిత్‌ (7)లు నిరాశపరిచినా... వార్నర్‌ ధాటి కొనసాగింది. 325 స్కోరు వద్ద రవూఫ్‌ అతని జోరుకు బ్రేకులేయడంతో 38 పరుగుల స్వల్ప వ్యవధిలో ఆసీస్‌ 6 వికెట్లను కోల్పోయింది.
 
అప్పుడు... ఇప్పుడు... 
12 ఏళ్ల క్రితం భారత ఉపఖండంలో జరిగిన 2011 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై పల్లెకెలెలో లంక ఓపెనర్లు దిల్షాన్, తరంగ 282 పరుగులతో అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు భారత్‌లో రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని ఆసీస్‌ ఓపెనర్లు వార్నర్, మార్ష్ లు సాధించారు. తొలి వికెట్‌కు 259 పరుగులు జోడించారు. మొత్తం 13 వరల్డ్‌కప్‌ల చరిత్రలో ఓపెనర్లు శతక్కొట్టడం ఇది నాలుగోసారి మాత్రమే!  

పాక్‌ జోడీదీ అదే బాట 
పాకిస్తాన్‌తో పోల్చితే ఆ్రస్టేలియా బౌలింగ్‌ దళం పదునైంది. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌ అంతా నిప్పులు చెరిగే సమర్థులే! కానీ ఈ త్రయం పాక్‌ ఓపెనింగ్‌ జోడీని 21 ఓవర్లదాకా ప్రభావమే చూపలేకపోయింది. స్పిన్నర్లు జంపా, మ్యాక్స్‌వెల్‌లను బరిలోకి దించినా... షఫిక్‌–ఇమాముల్‌ జోడీ యథేచ్చగా తమ పరుగుల జోరు కొనసాగించడంతో వీరి ఇన్నింగ్స్‌ కూడా ఆసీస్‌ ఇన్నింగ్స్‌లా పరుగుల పట్టాలెక్కింది. షఫీక్‌ 52 బంతుల్లో, ఇమాముల్‌ 54 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు.

అయితే స్టొయినిస్‌కు బంతిని అప్పగించాక పరిస్థితి మారింది. 134 స్కోరు వద్ద ఓపెనింగ్‌ జోడీని స్టొయినిస్‌ తొలి బంతికే విడగొట్టాడు. తన వరుస ఓవర్లలో షఫిక్, ఇమాముల్‌లను పెవిలియన్‌ చేర్చడంతో ఆట రూటు మారింది. జంపా స్పిన్‌ తిరగడంతో కెపె్టన్‌ బాబర్‌ ఆజమ్‌ (18), రిజ్వాన్‌ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు), ఇఫ్తికార్‌ (20 బంతుల్లో 26; 3 సిక్సర్లు) ఎంతో సేపు నిలువలేదు. దీంతో పాక్‌ పరాజయం ఖాయమైంది. 

స్కోరు వివరాలు 
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) షాదాబ్‌ (సబ్‌) (బి) రవూఫ్‌ 163; మార్ష్ (సి) ఉసామ మీర్‌ (బి) షాహిన్‌ 121; మ్యాక్స్‌వెల్‌ (సి) బాబర్‌ (బి) షాహిన్‌ 0; స్మిత్‌ (సి అండ్‌ బి) ఉసామ మీర్‌ 7; స్టొయినిస్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) షాహిన్‌ 21; ఇంగ్లిస్‌ (సి) రిజ్వాన్‌ (బి) రవూఫ్‌ 13; లబుషేన్‌ (సి) షాదాబ్‌ (సబ్‌) (బి) రవూఫ్‌ 8; కమిన్స్‌ (నాటౌట్‌) 6; స్టార్క్‌ (సి) షకీల్‌ (బి) షాహిన్‌ 2; హాజల్‌వుడ్‌ (సి) రిజ్వాన్‌ (బి) షాహిన్‌ 0; జంపా (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 367. వికెట్ల పతనం: 1–259, 2–259, 3–284, 4–325, 5–339, 6–354, 7–360, 8–363, 9–363. బౌలింగ్‌: షాహిన్‌ అఫ్రిది 10–1–54–5, హసన్‌ అలీ 8–0–57–0, ఇఫ్తికార్‌ 8–0–37–0, రవూఫ్‌ 8–0–83–3, ఉసామ మీర్‌ 9–0–82–1, నవాజ్‌ 7–0–43–0. 

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: షఫీక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టొయినిస్‌ 64; ఇమాముల్‌ (సి) స్టార్క్‌ (బి) స్టొయినిస్‌ 70; బాబర్‌ (సి) కమిన్స్‌ (బి) జంపా 18; రిజ్వాన్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 46; షకీల్‌ (సి) స్టొయినిస్‌ (బి) కమిన్స్‌ 30; ఇఫ్తికార్‌ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 26; నవాజ్‌ (స్టంప్డ్‌) ఇంగ్లిస్‌ (బి) జంపా 14; ఉసామ మీర్‌ (సి) స్టార్క్‌ (బి) హాజల్‌వుడ్‌ 0; షాహిన్‌ అఫ్రిది (సి) లబుషేన్‌ (బి) కమిన్స్‌ 10; హసన్‌ అలీ (సి) 
ఇంగ్లిస్‌ (బి) స్టార్క్‌ 8; రవూఫ్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్‌) 305. వికెట్ల పతనం: 1–134, 2–154, 3–175, 4–232, 5–269, 6–274, 7–277, 8–287, 9–301, 10–305. బౌలింగ్‌: మిచెల్‌ స్టార్క్‌ 8–0–65–1, హాజల్‌వుడ్‌ 10–1–37–1, ప్యాట్‌ కమిన్స్‌ 7.3–0–62–2, ఆడమ్‌ జంపా 10–0–53–4, గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ 5–0–40–0, స్టొయినిస్‌ 5–0–40–2.  

ప్రపంచకప్‌లో నేడు
శ్రీలంక X నెదర్లాండ్స్‌  
వేదిక: లక్నో
ఉదయం గం. 10:30 నుంచి

ఇంగ్లండ్‌ X దక్షిణాఫ్రికా  
వేదిక: ముంబై
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement