Marsh
-
చెలరేగిన వార్నర్, మార్ష్.. పాకిస్తాన్‌పై గెలిచిన ఆస్ట్రేలియా
బెంగళూరు: వరుస ఓటమిల నుంచి తేరుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో పుంజుకుంది. వార్నర్, మార్ష్ ల మెరుపులతో పాటు స్టొయినిస్ సూపర్ స్పెల్, ఆడమ్ జంపా స్పిన్ ఆసీస్‌ను గెలిపించాయి. శుక్రవారం జరిగిన ప్రపంచకప్ పోరులో ఆ్రస్టేలియా 62 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించింది. తొలుత ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 367 పరుగుల భారీస్కోరు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డేవిడ్ వార్నర్ (124 బంతుల్లో 163; 14 ఫోర్లు, 9 సిక్సర్లు), మిచెల్ మార్ష్ (108 బంతుల్లో 121; 10 ఫోర్లు, 9 సిక్సర్లు) శతక్కొట్టారు. షాహిన్ అఫ్రిదికి 5 వికెట్లు దక్కాయి. తర్వాత పాకిస్తాన్ 45.3 ఓవర్లలో 305 పరుగుల వద్ద ఆలౌటై ఓడిపోయింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (71 బంతుల్లో 70; 10 ఫోర్లు), అబ్దుల్లా షఫిక్ (61 బంతుల్లో 64; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. జంపా 4, స్టొయినిస్ 2 వికెట్లు తీశారు. సిక్సర్ల హోరు వార్నర్ లాంటి డాషింగ్ ఓపెనర్‌కు 10, 105 స్కోర్ల వద్ద ఏకంగా రెండుసార్లు లైఫ్‌లు వస్తే ఎంత విధ్వంసం సృష్టిస్తాడో పాక్‌కు తెలిసొచ్చేలా చేశాడు. మరోవైపు మార్ష్ కూడా ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మైదానం సిక్సర్లతో హోరెత్తింది. వార్నర్ 85 బంతుల్లో వన్డేల్లో 21 సెంచరీని పూర్తి చేసుకోగా, మార్ష్ 100 బంతుల్లో రెండో శతకం సాధించాడు. 259 స్కోరు వద్ద మార్ష్ ను షాహిన్ అవుట్ చేయడంతో పాక్ ఊపిరి పీల్చుకుంది. మ్యాక్స్‌వెల్ (0), స్మిత్ (7)లు నిరాశపరిచినా... వార్నర్ ధాటి కొనసాగింది. 325 స్కోరు వద్ద రవూఫ్ అతని జోరుకు బ్రేకులేయడంతో 38 పరుగుల స్వల్ప వ్యవధిలో ఆసీస్ 6 వికెట్లను కోల్పోయింది. అప్పుడు... ఇప్పుడు... 12 ఏళ్ల క్రితం భారత ఉపఖండంలో జరిగిన 2011 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై పల్లెకెలెలో లంక ఓపెనర్లు దిల్షాన్, తరంగ 282 పరుగులతో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం నమోదు చేశారు. మళ్లీ ఇప్పుడు భారత్‌లో రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని ఆసీస్ ఓపెనర్లు వార్నర్, మార్ష్ లు సాధించారు. తొలి వికెట్‌కు 259 పరుగులు జోడించారు. మొత్తం 13 వరల్డ్‌కప్‌ల చరిత్రలో ఓపెనర్లు శతక్కొట్టడం ఇది నాలుగోసారి మాత్రమే! పాక్ జోడీదీ అదే బాట పాకిస్తాన్‌తో పోల్చితే ఆ్రస్టేలియా బౌలింగ్ దళం పదునైంది. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్ అంతా నిప్పులు చెరిగే సమర్థులే! కానీ ఈ త్రయం పాక్ ఓపెనింగ్ జోడీని 21 ఓవర్లదాకా ప్రభావమే చూపలేకపోయింది. స్పిన్నర్లు జంపా, మ్యాక్స్‌వెల్‌లను బరిలోకి దించినా... షఫిక్–ఇమాముల్ జోడీ యథేచ్చగా తమ పరుగుల జోరు కొనసాగించడంతో వీరి ఇన్నింగ్స్ కూడా ఆసీస్ ఇన్నింగ్స్‌లా పరుగుల పట్టాలెక్కింది. షఫీక్ 52 బంతుల్లో, ఇమాముల్ 54 బంతుల్లో ఫిఫ్టీలు సాధించారు. అయితే స్టొయినిస్‌కు బంతిని అప్పగించాక పరిస్థితి మారింది. 134 స్కోరు వద్ద ఓపెనింగ్ జోడీని స్టొయినిస్ తొలి బంతికే విడగొట్టాడు. తన వరుస ఓవర్లలో షఫిక్, ఇమాముల్లను పెవిలియన్ చేర్చడంతో ఆట రూటు మారింది. జంపా స్పిన్ తిరగడంతో కెపె్టన్ బాబర్ ఆజమ్ (18), రిజ్వాన్ (40 బంతుల్లో 46; 5 ఫోర్లు), ఇఫ్తికార్ (20 బంతుల్లో 26; 3 సిక్సర్లు) ఎంతో సేపు నిలువలేదు. దీంతో పాక్ పరాజయం ఖాయమైంది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) షాదాబ్ (సబ్) (బి) రవూఫ్ 163; మార్ష్ (సి) ఉసామ మీర్ (బి) షాహిన్ 121; మ్యాక్స్‌వెల్ (సి) బాబర్ (బి) షాహిన్ 0; స్మిత్ (సి అండ్ బి) ఉసామ మీర్ 7; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) షాహిన్ 21; ఇంగ్లిస్ (సి) రిజ్వాన్ (బి) రవూఫ్ 13; లబుషేన్ (సి) షాదాబ్ (సబ్) (బి) రవూఫ్ 8; కమిన్స్ (నాటౌట్) 6; స్టార్క్ (సి) షకీల్ (బి) షాహిన్ 2; హాజల్‌వుడ్ (సి) రిజ్వాన్ (బి) షాహిన్ 0; జంపా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 25; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 367. వికెట్ల పతనం: 1–259, 2–259, 3–284, 4–325, 5–339, 6–354, 7–360, 8–363, 9–363. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–1–54–5, హసన్ అలీ 8–0–57–0, ఇఫ్తికార్ 8–0–37–0, రవూఫ్ 8–0–83–3, ఉసామ మీర్ 9–0–82–1, నవాజ్ 7–0–43–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) స్టొయినిస్ 64; ఇమాముల్ (సి) స్టార్క్ (బి) స్టొయినిస్ 70; బాబర్ (సి) కమిన్స్ (బి) జంపా 18; రిజ్వాన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 46; షకీల్ (సి) స్టొయినిస్ (బి) కమిన్స్ 30; ఇఫ్తికార్ (ఎల్బీడబ్ల్యూ) (బి) జంపా 26; నవాజ్ (స్టంప్డ్) ఇంగ్లిస్ (బి) జంపా 14; ఉసామ మీర్ (సి) స్టార్క్ (బి) హాజల్‌వుడ్ 0; షాహిన్ అఫ్రిది (సి) లబుషేన్ (బి) కమిన్స్ 10; హసన్ అలీ (సి) ఇంగ్లిస్ (బి) స్టార్క్ 8; రవూఫ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 305. వికెట్ల పతనం: 1–134, 2–154, 3–175, 4–232, 5–269, 6–274, 7–277, 8–287, 9–301, 10–305. బౌలింగ్: మిచెల్ స్టార్క్ 8–0–65–1, హాజల్‌వుడ్ 10–1–37–1, ప్యాట్ కమిన్స్ 7.3–0–62–2, ఆడమ్ జంపా 10–0–53–4, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 5–0–40–0, స్టొయినిస్ 5–0–40–2. ప్రపంచకప్‌లో నేడు శ్రీలంక X నెదర్లాండ్స్ వేదిక: లక్నో ఉదయం గం. 10:30 నుంచి ఇంగ్లండ్ X దక్షిణాఫ్రికా వేదిక: ముంబై మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం -
IPL 2022: గెలిచి... నిలిచిన ఢిల్లీ
ముంబై: కీలకమైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్ 17 పరుగులతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్ టోర్నీలో ముందడుగు వేసింది. తొలుత ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. మార్ష్(48 బంతుల్లో 63; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, అర్ష్‌దీప్ సింగ్, లివింగ్‌స్టోన్ చెరో 3 వికెట్లు తీశారు. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులకే పరిమితమైంది. జితేశ్ శర్మ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శార్దుల్ ఠాకూర్ (4/36) పంజాబ్‌ను దెబ్బ తీయగా, అక్షర్, కుల్దీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వార్నర్ (0) నిరాశపరచగా... సర్ఫరాజ్ (16 బంతుల్లో 32; 5 ఫోర్లు, 1 సిక్స్) ఉన్నది కాసేపే అయినా ధనాధన్‌గా ఆడేశాడు. మిచెల్ మార్ష్ఆరంభంలో భారీ సిక్సర్లు బాదినా... తర్వాత వికెట్లు కూలడంతో బాధ్యతగా బ్యాటింగ్ చేశాడు. 40 బంతుల్లో (2 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తిచేసుకున్నాడు. మిగతా వారిలో లలిత్ యాదవ్ (24) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. కింగ్స్ విలవిల మొదట ఢిల్లీ పేస్‌కు తలవంచిన పంజాబ్ టాపార్డర్... తర్వాత స్పిన్ ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడింది. 3.4 ఓవర్ల వరకు 38 స్కోరుతో దూకుడుగా సాగిపోతున్న పంజాబ్‌కు తర్వాతి బంతి నుంచి కష్టాలెదురయ్యాయి. ధాటిగా ఆడిన బెయిర్‌స్టో (15 బంతుల్లో 28; 4 ఫోర్లు, 1 సిక్స్)ను నోర్జే పెవిలియన్ చేర్చాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (19), రాజపక్స (4)లను శార్దుల్ అవుట్ చేశాడు. ఆ తర్వాత స్పిన్నర్లు అక్షర్ , కుల్దీప్ తిప్పేయడంతో పంజాబ్ లక్ష్యానికి దూరమై ఓటమికి దగ్గరైంది. స్కోరు వివరాలు ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) చహర్ (బి) లివింగ్‌స్టోన్ 0; సర్ఫరాజ్ (సి) చహర్ (బి) అర్ష్‌దీప్ 32; మార్ష్(సి) రిషి ధావన్ (బి) రబడ 63; లలిత్ (సి) రాజపక్స (బి) అర్ష్‌దీప్ 24; పంత్ (స్టంప్డ్) జితేశ్ (బి) లివింగ్‌స్టోన్ 7; పావెల్ (సి) శిఖర్ (బి) లివింగ్‌స్టోన్ 2; అక్షర్ (నాటౌట్) 17; శార్దుల్ (సి) హర్‌ప్రీత్ (బి) అర్ష్‌దీప్ 3; కుల్దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 159. వికెట్ల పతనం: 1–0, 2–51, 3–98, 4–107, 5–112, 6–149,7–154. బౌలింగ్: లివింగ్‌స్టోన్ 4–0–27–3, రబడ 3–0–24 –1, హర్‌ప్రీత్ 3–0–29–0, రిషి «2–0–17–0, అర్ష్‌దీప్ 4–0–37–3, చహర్ 4–0–19–0. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్: బెయిర్‌స్టో (సి) అక్షర్ (బి) నోర్జే 28; శిఖర్ (సి) పంత్ (బి) శార్దుల్ 19; రాజపక్స (సి) నోర్జే (బి) శార్దుల్ 4; లివింగ్‌స్టోన్ (స్టంప్డ్) పంత్ (బి) కుల్దీప్ 3; మయాంక్ (బి) అక్షర్ 0; జితేశ్ (సి) వార్నర్ (బి) శార్దుల్ 44; హర్‌ప్రీత్ (బి) కుల్దీప్ 1; రిషి ధావన్ (బి) అక్షర్ 4; చహర్ (నాటౌట్) 25; రబడ (సి) పావెల్ (బి) శార్దుల్ 6; అర్ష్‌దీప్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1–38, 2–53, 3–54, 4–55, 5–61, 6–67, 7–82, 8–123, 9–131. బౌలింగ్: ఖలీల్ 4–0– 43–0, నోర్జే 4–0–29–1, లలిత్ 1–0–6–0, శార్దుల్ ఠాకూర్ 4–0–36–4, అక్షర్ పటేల్ 4–0–14–2, కుల్దీప్ యాదవ్ 3–0–14–2. ఐపీఎల్లో నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్ X ముంబై ఇండియన్స్ వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచిస్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం. -
"ఓ మై గాడ్".. క్రికెట్ చరిత్రలోనే అద్భుతమైన క్యాచ్..
మార్ష్కప్ ఫైనల్లో భాగంగా న్యూ సౌత్ వేల్స్‌తో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తలపడింది. ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో న్యూ సౌత్ వేల్స్‌ను ఓడించి వెస్ట్రన్ ఆస్ట్రేలియా మార్ష్ కప్‌ను కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా ఫీల్డర్ హిల్టన్ కార్ట్‌రైట్ అద్భుతమైన క్యాచ్‌తో మెరిశాడు. న్యూ సౌత్ వేల్స్ ఇన్నింగ్స్ 44 ఓవర్ వేసిన డిఆర్సీ షార్ట్ బౌలింగ్‌లో.. హెన్రిక్స్ లాంగ్ ఆన్ దిశగా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ ఖాయమని అంతా భావించారు. అయితే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కార్ట్‌రైట్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ అద్భుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. కార్ట్‌రైట్ తన స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. దీంతో మంచి ఊపు మీద ఉన్న హెన్రిక్స్ నిరాశతో పెవిలియన్‌కు చేరాడు. ఇక హెన్రిక్స్ ఔటయ్యక న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. కాగా ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్ట్రన్ ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 225 పరుగులు సాధించింది. వెస్ట్రన్ ఆస్ట్రేలియా బ్యాటర్లలో బెన్‌క్రాప్ట్(39), జో రిచర్డ్సన్(44) పరుగులతో రాణించారు. ఇక 226 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూ సౌత్ వేల్స్ 46.3 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌటైంది. న్యూ సౌత్ వేల్స్ బ్యాటర్లలో హెన్రిక్స్(43), డానియల్ సామ్స్(42) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. చదవండి: IPL 2022: రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ కోచ్‌గా లసిత్ మలింగ.. Catch of the summer?! Hilton goes horizontal! #MarshCup pic.twitter.com/uLQcYsXPnn — cricket.com.au (@cricketcomau) March 11, 2022 -
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ కన్నుమూత..
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ రాడ్ మార్ష్(74) కన్నుమూశారు. క్వీన్స్‌లాండ్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత గురువారం గుండెపోటుకు గురైన మార్ష్‌ను క్వీన్స్‌లాండ్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయినప్పటికీ అతని పరిస్థితి మెరుగుపడలేదు. ఇక ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఒక బలమైన జట్టుగా ఆవిర్భవించడంలో మార్ష్ కీలక పాత్ర పోషించాడు. 1970-80లలో ఆస్ట్రేలియా జట్టులో కీలకమైన ఆటగాడిగా మార్ష్ ఉన్నారు. అతడు జట్టులో తన వికెట్ కీపింగ్‌తో పాటు, తన బ్యాటింగ్‌తో కూడా జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. టెస్టుల్లో సెంచరీ సాధించిన తొలి ఆస్ట్రేలియన్ వికెట్ కీపర్‌గా మార్ష్ ఉన్నారు. అతను టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించారు.96 టెస్టులు,92 వన్డేల్లో ఆసీస్‌కు మార్ష్ ప్రాతినిధ్యం వహించాడు. 1970లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఆయన 1984లో క్రికెట్ నుంచి తప్పుకున్నారు. అతను వికెట్ కీపర్‌గా 355 ఔట్లు చేశారు. క్రికెట్ నుంచి రీటైర్ అయ్యాక మార్ష్ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో ఆస్ట్రేలియా క్రికెట్‌కు కూడా సేవలందించారు. అదే విధంగా 2014లో లెజెండరీ క్రికెటర్ ఆస్ట్రేలియా సెలెక్టర్ల ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఇక రాడ్ మార్ష్ మృతిపై పలువురు క్రికెటర్లు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నారు. చదవండి: India Vs Sri Lanka 1st Test: ఇండియా వర్సస్ శ్రీలంక తొలి టెస్ట్ అప్డేట్స్ -
ఆస్ట్రేలియా ‘ఎ’ 290/6
బెంగళూరు: భారత్ ‘ఎ’తో మొదలైన రెండో అనధికారిక 4 రోజుల టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది. మిచెల్ మార్‡్ష (86 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... హెడ్ (68; 10 ఫోర్లు), కుర్తీస్ ప్యాటర్సన్ (48; 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మార్‡్ష, నాసెర్ (44 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు. -
ఆస్ట్రేలియా... అదరహో
► రెండో టెస్టులో విండీస్‌పై ఘన విజయం ► 2-0తో సిరీస్ కైవసం ► బౌలింగ్‌లో రాణించిన మార్ష్, లియోన్ మెల్బోర్న్: ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా... వెస్టిండీస్‌తో నాలుగు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో 177 పరుగుల ఆధిక్యంతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను స్మిత్ బృందం ఒక టెస్టు మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. 460 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు మంగళవారం నాలుగో రోజు బరిలోకి దిగిన విండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 88.3 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హోల్డర్ (68), రామ్‌దిన్ (59), రాజేంద్ర చంద్రికా (37), బ్రాత్‌వైట్ (31)లు మినహా మిగతా వారు నిరాశపర్చారు. ఆతిథ్య బౌలర్ల ధాటికి కరీబియన్ జట్టు ఓ దశలో 150 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అయితే హోల్డర్, రామ్‌దిన్ ఆరో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. కానీ లోయర్ ఆర్డర్ నుంచి పెద్దగా సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు. విండీస్ 32 పరుగుల తేడాతో చివరి 5 వికెట్లను కోల్పోయింది. మిచెల్ మార్ష్ 4, లియోన్ 3 వికెట్లు తీశారు. అంతకుముందు ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఓవర్‌నైట్ స్కోరు 32 ఓవర్లలో 3 వికెట్లకు 179 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. హోల్డర్ 2 వికెట్లు తీశాడు. లియోన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టెస్టు జనవరి 3 నుంచి సిడ్నీలో జరుగుతుంది. -
ఆసీస్ 438/3
వోజెస్, మార్ష్ శతకాల మోత విండీస్‌తో తొలి టెస్టు హోబర్ట్: వెస్టిండీస్ పస లేని బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ పరుగుల వరద పారించారు. మిడిలార్డర్ ఆటగాళ్లు ఆడమ్ వోజెస్ (204 బంతుల్లో 174 బ్యాటింగ్; 19 ఫోర్లు), షాన్ మార్ష్ (205 బంతుల్లో 139 బ్యాటింగ్; 12 ఫోర్లు) ఇద్దరూ అజేయ సెంచరీలు చేయడంతో ఆసీస్ గురువారం తొలి రోజు ఆట ముగిసేసమయానికి 89 ఓవర్లలో మూడు వికెట్లకు 438 పరుగుల భారీ స్కోరు చేసింది. విండీస్‌పై ఆస్ట్రేలియా జట్టు తొలి రోజు సాధించిన అత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (61 బంతుల్లో 64; 11 ఫోర్లు) వేగంగా ఆడాడు. ప్రారంభంలో మెరుగ్గా బౌలింగ్ చేసిన విండీస్ 121 పరుగులకు మూడు వికెట్లను పడగొట్టింది. అయితే వోజెస్, మార్ష్ జోడి ప్రత్యర్థికి సవాల్ విసిరింది. దీంతో ఇప్పటికే నాలుగో వికెట్‌కు 317 పరుగుల అజేయ భాగస్వామ్యం ఏర్పడింది.