
బెంగళూరు: భారత్ ‘ఎ’తో మొదలైన రెండో అనధికారిక 4 రోజుల టెస్టులో ఆస్ట్రేలియా ‘ఎ’ భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ శనివారం ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 6 వికెట్లకు 290 పరుగులు చేసింది.
మిచెల్ మార్‡్ష (86 బ్యాటింగ్; 13 ఫోర్లు) సెంచరీ దిశగా సాగుతుండగా... హెడ్ (68; 10 ఫోర్లు), కుర్తీస్ ప్యాటర్సన్ (48; 8 ఫోర్లు) రాణించారు. భారత బౌలర్లలో షాబాజ్ నదీమ్, కుల్దీప్ యాదవ్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి. మార్‡్ష, నాసెర్ (44 బ్యాటింగ్; 6 ఫోర్లు) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment