ఆఫ్ స్పిన్నర్ మిన్ను మణి, లెగ్ స్పిన్నర్ ప్రియా మిశ్రా మాయాజాలానికి ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు బ్యాటర్లు నిలబడలేకపోయారు. భారత ‘ఎ’ మహిళల జట్టుతో గురువారం మొదలైన ఏకైక అనధికారిక టెస్టులో ఆ్రస్టేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 65.5 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ మిన్ను మణి 54 పరుగులిచ్చి 5 వికెట్లు... ప్రియా మిశ్రా 58 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.
మరో వికెట్ ఎడంచేతి వాటం స్పిన్నర్ మన్నత్ కశ్యప్ దక్కించుకుంది. ఆసీస్ ‘ఎ’ జట్టులో ఓపెనర్ జార్జియా వోల్ (71; 12 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మైట్లాన్ బ్రౌన్ (30; 2 ఫోర్లు), గ్రేస్ పార్సన్స్ (35; 3 ఫోర్లు) రాణించారు.
అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఆసీస్ కంటే ఘోరంగా 184 పరుగులకే చాపచుట్టేసింది. భారత ఇన్నింగ్స్‌లో శ్వేత సెహ్రావత్ (40; 3 ఫోర్లు), తేజల్ హసాబ్నిస్ (32; 2 ఫోర్లు) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కేట్ పీటర్సన్ ఐదు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బకొట్టింది. ప్రస్తుతం ఆసీస్-ఏ 28 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment