ఆరేసిన ముకేశ్‌ కుమార్‌.. 195 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా | Mukesh Kumar Snares 6 For 46 Against Australia A | Sakshi
Sakshi News home page

ఆరేసిన ముకేశ్‌ కుమార్‌.. 195 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా

Published Fri, Nov 1 2024 9:58 AM | Last Updated on Fri, Nov 1 2024 10:04 AM

Mukesh Kumar Snares 6 For 46 Against Australia A

భారత్‌-ఏ, ఆస్ట్రేలియా -ఏ మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్‌ సిరీస్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ మెక్‌కే వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్‌ డాగ్గెట్‌ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. 

జోర్డాన్‌ బకింగ్హమ్‌ రెండు, ఫెర్గస్‌ ఓనీల్‌, టాడ్‌ మర్ఫీ తలో వికెట్‌ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్‌ పడిక్కల్‌ (36), నవ్‌దీప్‌ సైనీ (23), సాయి సుదర్శన్‌ (21) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. అభిమన్యు ఈశ్వరన్‌ 7, రుతురాజ్‌ గైక్వాడ్‌ 0, బాబా ఇంద్రజిత్‌ 9, ఇషాన్‌ కిషన్‌ 4, నితీశ్‌ రెడ్డి 0, మానవ్‌ సుతార్‌ 1, ప్రసిద్ద్‌ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు.

అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఏ.. ముకేశ్‌ కుమార్‌ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో 195 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్‌ కృష్ణ మూడు, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఓ వికెట్‌ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. కూపర్‌ కన్నోలీ 37, వెబ్‌స్టర్‌ 33, టాడ్‌ మర్ఫీ 33, మార్కస్‌ హ్యారిస్‌ 17, ఫెర్గస్‌ ఓనీల్ 13, సామ్‌ కోన్‌స్టాస్‌ 0, బాన్‌క్రాఫ్ట్‌ 0, ఫిలిప్‌ 4, బ్రెండన్‌ డాగ్గెట్‌ 8 పరుగులు చేశారు.

88 పరుగులు వెనుకపడి సెకెండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్‌ రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్‌ 12, రుతురాజ్‌ గైక్వాడ్‌ 5 పరుగులు చేసి ఔట్‌ కాగా.. సాయి సుదర్శన్‌ (33), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు భారత్‌ ఇంకా 13 పరుగులు వెనుకపడి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement