Mukesh Kumar
-
ఆస్ట్రేలియాను వీడనున్న ముగ్గురు భారత ఆటగాళ్లు.. కారణమిదే?
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడతున్నాయి. తొలి రోజు వర్షం కారణంగా కేవలం 13 ఓవర్ల ఆట మాత్రమే సాధ్య పడగా.. రెండో రోజు మాత్రం వరుణుడు కరణించాడు. రెండో రోజు ఆట తొలి సెషన్లో భారత్ పై చేయి సాధించగా.. రెండో సెషన్లో ఆసీస్ తిరిగి పుంజుకుంది. 62 ఓవర్లకు ఆసీస్ 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. మరోసారి ట్రావిస్ హెడ్(71 నాటౌట్) సెంచరీ వైపు దూసకుపోతున్నాడు. కాగా ఓ వైపు ఈ మ్యాచ్ జరుగుతుండగా.. మరోవైపు భారత క్రికెట్ బోర్డు(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.ఆ ముగ్గురు రిలీజ్..?ఆసీస్‌తో సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు నుంచి ముగ్గురు పేసర్లను రిలీజ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ట్రావెలింగ్ రిజర్వ్‌లలో భాగమైన ముఖేష్ కుమార్, యశ్ దయాల్, నవదీప్ సైనీలు ఆసీస్ నుంచి స్వదేశానికి పయనం కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21 నుంచి మొదలుకానున్న విజయ్ హజారే ట్రోఫీలో ఈ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు భాగం కానున్నారు. కాగా తొలుత ముకేశ్ కుమార్, నవదీప్ సైనీ, ఖాలీల్ ఆహ్మద్‌లను మాత్రమే సెలక్టర్లు రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. అయితే నెట్స్‌లో ఖాలీల్ గాయపడటంతో అతడి స్ధానాన్ని యశ్దయాల్తో బీసీసీఐ భర్తీ చేసింది. అయితే ఇప్పుడు భారత ప్రధాన జట్టులో బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్, ప్రసిధ్ కృష్ణల రూపంలో ఐదు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులు బట్టి భారత్‌కు ట్రావెలింగ్ రిజర్వ్‌లతో పెద్దగా పనిలేదు. ఈ క్రమంలోనే ఈ పేస్ త్రయాన్ని జట్టు నుంచి విడుదల చేయాలని బీసీసీఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం. వీరి స్వదేశానికి వచ్చి విజయ్ హజారే ట్రోఫీకి సిద్దం కానున్నారు. ఈ టోర్నీలో దయాల్ ఉత్తరప్రదేశ్ తరపున ఆడనుండగా.. ముఖేష్, సైనీలు బెంగాల్, ఢిల్లీ జట్లకు ప్రాతినిథ్యం వహించనున్నారు. -
కోహ్లి మళ్లీ ఫెయిల్.. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో పంత్ క్లీన్‌బౌల్డ్!
ఆస్ట్రేలియా గడ్డపై సత్తా చాటేందుకు టీమిండియా సిద్ధమవుతోంది. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో కెప్టెన్ రోహిత్ శర్మ మినహా ఇప్పటికే ప్రధాన ఆటగాళ్లంతా ఆసీస్‌లో అడుగుపెట్టారు. ప్రతిష్టాత్మక టెస్టు సిరీస్ కోసం నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇక ఆసీస్‌తో సిరీస్‌కు సన్నాహకాల్లో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రత్యేకంగా ఇండోర్ ప్రాక్టీస్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇండియా-‘ఎ’ జట్టుతో భారత ఆటగాళ్లు మూడు రోజుల పాటు(శుక్రవారం- ఆదివారం) ఇంట్రా- స్క్వాడ్ మ్యాచ్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. పెర్త్‌లోని పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ స్టేడియం(WACA) ఇందుకు వేదిక. కేవలం పదిహేను పరుగులకేఅయితే, ఈ మ్యాచ్ వీక్షించేందుకు ప్రేక్షకులకు అనుమతి లేదని సమాచారం. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌లో శుక్రవారం నాటి తొలిరోజు ఆటలో భాగంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్‌ను కొనసాగించినట్లు సమాచారం. కేవలం పదిహేను పరుగులకే అతడు అవుట్ అయినట్లు తెలుస్తోంది. తనదైన శైలిలో చక్కగా ఆట మొదలుపెట్టి కవర్ డ్రైవ్‌లతో అలరించిన కోహ్లి.. తప్పుడు షాట్ సెలక్షన్‌తో వికెట్ పారేసుకున్నాడు. భారత పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్‌లో సెకండ్ స్లిప్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి కోహ్లి నిష్క్రమించాడు.పంత్ క్లీన్బౌల్డ్మరోవైపు.. రిషభ్ పంత్ సైతం తక్కువ స్కోరుకే వెనుదిరిగాడు. నితీశ్ రెడ్డి బౌలింగ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పంత్ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఇక ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ కూడా 16 పరుగులకే అవుటైనట్లు తెలుస్తోంది. ప్రముఖ జర్నలిస్టు ఒకరు పెర్త్ నుంచి ఈ మేరకు సోషల్ మీడియాలో అప్డేట్స్ షేర్ చేశారు.కోహ్లికి గాయం?ఇక వార్మప్ మ్యాచ్‌లో అవుటైన వెంటనే కోహ్లి, పంత్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేసేందుకు తిరిగి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే.. వార్మప్ మ్యాచ్‌కు ముందు కోహ్లి గాయపడినట్లు వార్తలు వచ్చాయి. స్కానింగ్ తర్వాత మళ్లీ అతడు మైదానంలో అడుగుపెట్టినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. మరోవైపు.. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ సైతం గాయం కారణంగా ఫీల్డ్‌ను వీడినట్లు సమాచారం.కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్ చేరాలంటే టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో రాణించడం తప్పనిసరి. ఐదు టెస్టుల్లో కనీసం నాలుగు గెలిస్తేనే టైటిల్ పోరుకు రోహిత్ సేన అర్హత సాధిస్తుంది. స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవంఅయితే, ఆస్ట్రేలియా పర్యటనకు ముందు స్వదేశంలో టీమిండియాకు న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. సొంతగడ్డపై తొలిసారిగా మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత జట్టు క్లీన్‌స్వీప్‌నకు గురైంది.ఈ సిరీస్‌లో కోహ్లి చేసిన పరుగులు 0, 70, 1, 17, 4, 1. ఇక నవంబరు 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో టీమిండియా సిరీస్ మొదలుకానుంది. ఇక టీమిండియా కంటే ముందు ఆసీస్‌లో అడుగుపెట్టిన ఇండియా-‘ఎ’ అనధికారిక టెస్టు సిరీస్‌లో 2-0తో వైట్‌వాష్ అయింది.ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌కు టీమిండియారోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ , ఆకాశ్ దీప్, ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్.చదవండి: భారత క్రికెట్లో సంచలనం.. ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు! 39 ఏళ్ల తర్వాత -
నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. 223 పరుగులకు ఆసీస్ ఆలౌట్
మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-ఎ జట్టుతో జరుగుతున్న రెండో అనాధికారిక టెస్టులో భారత్-ఎ జట్టు బౌలర్లు అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 223 పరుగులకు ఆలౌటైంది. 52/3 ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్ అదనంగా 171 పరుగులు చేసి తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దీంతో కంగారులకు మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బ్యాటర్లలో మార్కస్ హ్యారీస్(74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కోరీ రోకిసియోలి(35),పీర్సన్(30) పరుగులతో రాణించారు. ఇక భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ 4 వికెట్లు పడగొట్టగా, ముఖేష్ కుమార్ మూడు, ఖాలీల్ ఆహ్మద్ రెండు వికెట్లు సాధించారు.ధ్రువ్ జురెల్ ఒంటరి పోరాటం..అంతకుముందు భారత్-ఎ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్(80) మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో నీసర్ 4 వికెట్లు పడగొట్టగా, వెబ్‌స్టెర్ మూడు వికెట్లు సాధించాడు.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్.. -
ఆరేసిన ముకేశ్ కుమార్.. 195 పరుగులకు ఆలౌటైన ఆస్ట్రేలియా
భారత్-ఏ, ఆస్ట్రేలియా -ఏ మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ మెక్కే వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (36), నవ్‌దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు.అనంతరం బరిలోకి దిగిన ఆస్ట్రేలియా-ఏ.. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగడంతో 195 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్‌స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్స్టాస్ 0, బాన్‌క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.88 పరుగులు వెనుకపడి సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. అభిమన్యు ఈశ్వరన్ 12, రుతురాజ్ గైక్వాడ్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. సాయి సుదర్శన్ (33), దేవ్‌దత్ పడిక్కల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ ఇంకా 13 పరుగులు వెనుకపడి ఉంది. -
Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌తో గురువారం మొదలైన అనధికారిక టెస్టు తొలి రోజు ఆటలోనే రుతురాజ్ సేనకు గట్టి షాక్ తగిలింది. కంగారూ బౌలర్ల విజృంభణ నేపథ్యంలో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.బ్యాటర్లు విఫలంఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(7), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) సహా బాబా ఇంద్రజిత్(9), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4), నితీశ్ కుమార్ రెడ్డి(0), టెయిలెండర్లు మానవ్ సుతార్(1), ప్రసిద్ కృష్ణ(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(21)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్(36), టెయిలెండర్ నవదీప్ సైనీ(23) ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ వంద పరుగులు దాటగలిగింది. 47.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో సత్తా చాటగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ తలా ఒక వికెట్ పడగొట్టారు. Buckingham's got two! Watch #AUSAvINDA live: https://t.co/XcQLyyTDJ5 pic.twitter.com/RccWM8CX5R— cricket.com.au (@cricketcomau) October 31, 2024 ఆసీస్‌కూ ఆదిలోనే షాక్.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆదిలోనే షాకిచ్చాడు. తన అద్భుత ఆట తీరుతో ‘జూనియర్ రికీ పాంటింగ్’గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కన్‌స్టాస్(Sam Konstas)ను డకౌట్ చేశాడు. Mukesh gets Konstas in the first over! #AUSAvINDA pic.twitter.com/8E61yX0zTM— cricket.com.au (@cricketcomau) October 31, 2024మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న స్యామ్ ముకేశ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.టీమిండియాతో టెస్టుకు ఆసీస్ ఓపెనర్ల పోటీలో కాగా 19 ఏళ్ల స్యామ్ ఇప్పటి వరకు ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి రెండు శతకాలు బాదడం సహా సగటు 45.70గా నమోదు చేశాడు. భారత్-ఎ జట్టుతో మ్యాచ్‌లో గనుక రాణిస్తే తదుపరి టీమిండియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ముకేశ్ రూపంలో స్యామ్‌కు గట్టి షాక్ తగిలింది.పాతుకుపోయిన కెప్టెన్ఇదిలా ఉంటే.. ప్రసిద్ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలుత కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను డకౌట్ చేసిన ప్రసిద్.. తర్వాత ఆసీస్-ఎ మరో ఓపెనర్ మార్కస్ హ్యారిస్(17) వికెట్ పడగొట్టాడు. ఇలా టాపార్డర్‌ను భారత బౌలర్లు కుదేలు చేసినా.. మిడిలార్డర్లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ క్రీజులో పాతుకుపోయి ఇబ్బంది పెట్టాడు.అతడికి తోడుగా బ్యూ వెబ్‌స్టర్(33) రాణించాడు. అయితే, ముకేశ్ కుమార్ ఈ జోడీని విడదీయగా.. నాథన్‌కు జతైన కూపర్ కానొలీ సైతం పట్టుదలగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ 39 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సరికి నాథన్ 29, కూపర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా- ‘ఎ’ వర్సెస్ భారత్- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు(డే-1)👉వేదిక: గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎరీనా, మెక్కే👉టాస్: ఆస్ట్రేలియా-ఎ.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 107👉ఆసీస్ స్కోరు: 99/4 (39).. తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు భారత్ కంటే ఎనిమిది పరుగుల వెనుకంజతుదిజట్లుఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డోగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.భారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.చదవండి: IPL 2025: షాకింగ్.. అతడి కోసం జడ్డూను వదులుకున్న సీఎస్కే! -
IND vs BAN: బుమ్రా, షమీ దూరం! ఆ ఇద్దరికీ లక్కీ ఛాన్స్?
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం రెస్ట్‌లో ఉంది. అనంతరం సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. అయితే బంగ్లాతో టెస్టు సిరీస్‌కు బారత జట్టు ఎంపిక బీసీసీఐ సెలక్షన్ కమిటీకి పెద్ద తలనొప్పిగా మారింది.ముఖ్యంగా పేస్ బౌలర్లను ఎంపిక చేయడంలో భారత సెలక్టర్లు మల్లుగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సిరీస్‌కు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాల దృష్ట్యా దూరంగా ఉండనున్నాడు. మరోవైపు ప్రీమియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమీ ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఈ సిరీస్‌కు కూడా దూరం కానున్నాడు. ఈ క్రమంలో బంగ్లాతో టెస్టుల్లో భారత పేస్ ఎటాక్‌ను హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ లీడ్ చేయనున్నాడు. అయితే సిరాజ్‌తో కలిసి ఎవరు బంతిని పంచుకుంటారన్నది ప్రస్తుతం ప్రశ్నార్ధకంగా మారింది. బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్‌కు బంగ్లాతో సిరీస్ సెలక్టర్లు ఎంపిక చేసే అవకాశముంది. చివరగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా భారత జట్టులో ముఖేష్ భాగంగా ఉన్నాడు. ఇప్పటివరకు మూడు టెస్టులు ఆడిన అతడు 7 వికెట్లు పడగొట్టి పర్వాలేదన్పించాడు.ఆకాష్ దీప్‌కు ఛాన్స్...?అదే విధంగా బంగ్లాతో టెస్టు సిరీస్‌కు మరో బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్‌కు కూడా ఛాన్స్ దక్కే సూచనలు కన్పిస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో జార్ఖండ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టుతో అరంగేట్రం చేసిన ఆకాష్.. తన తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. మూడు వికెట్లు పడగొట్టి తన అగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత మ్యాచ్‌కు బుమ్రా తిరిగి రావడంతో దీప్ జట్టులో చోటు కోల్పోయాడు. కానీ తన అద్భుత బౌలింగ్‌తో సెలక్టర్ల దృష్టిని మాత్రం ఆకాష్ ఆకర్షించాడు. ఇప్పుడు బుమ్రా పూర్తిగా సిరీస్‌కు దూరం కానుండడంతో ఆకాష్‌కు మరోసారి చోటు దక్కే అవకాశముంది.అర్ష్‌దీప్ అరంగేట్రం?మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ టెస్టుల్లో అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. అతడికి వైట్‌బాల్ ఫార్మాట్లో కూడా భారత సెలక్టర్లు భావిస్తున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. -
రాణించిన శాంసన్, ముకేశ్.. ఐదో టీ20లోనూ టీమిండియాదే విజయం
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన ఐదో టీ20లో టీమిండియా 42 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన జింబాబ్వే 18.3 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. సంజూ శాంసన్ (45 బంతుల్లో 58; ఫోర్, 4 సిక్సర్ల, రెండు క్యాచ్‌లు), ముకేశ్ కుమార్ (3.3-0-22-4) అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్నందించారు. ఈ గెలుపుతో భారత్.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో జింబాబ్వే తొలి మ్యాచ్‌లో గెలవగా.. భారత్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో జయభేరి మోగించింది.బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్టాస్ ఓడి జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్.. ఆదిలోనే (5 ఓవర్లలో 40/3) వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ శాంసన్ బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి టీమిండియా గౌరవప్రదమైన స్కోర్ సాధించడానికి దోహదపడ్డాడు. ఆఖర్లో శివమ్ దూబే (12 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ 150 పరుగుల మార్కును దాటింది. భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 12, శుభ్‌మన్ గిల్ 13, అభిషేక్ శర్మ 14, రియాన్ పరాగ్ 22 పరుగులు చేసి ఔట్ కాగా.. రింకూ సింగ్ (11), వాషింగ్టన్ సుందర్ (1) అజేయంగా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబాని 2, సికందర్ రజా, రిచర్డ్ నగరవ, బ్రాండన్ మవుటా తలో వికెట్ పడగొట్టారు.విజృంభించిన ముకేశ్168 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే.. ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేకపోయింది. తొలి ఓవర్లోనే వికెట్ కోల్పోయిన ఆ జట్టు క్రమ అంతరాల్లో వికెట్లు కోల్పోయి ఓటమిపాలైంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో డియాన్ మైర్స్ (34) టాప్ స్కోరర్ కాగా.. మరుమణి (27), బ్రియాన్ బెన్నెట్ (10), , ఫరక్ అక్రమ్ (27) మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. భారత బౌలర్లలో ముకేశ్‌తో పాటు శివమ్ దూబే (4-0-25-2), తుషార్ దేశ్‌పాండే (3-0-26-1), వాషింగ్టన్ సుందర్ (2-0-7-1), అభిషేక్ శర్మ (3-0-20-1) వికెట్లు పడగొట్టారు. -
సీఈవో గుప్పెట్లో చట్టం
చిలకలపూడి (మచిలీపట్నం): రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని అన్నారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అధికారి సీలు లేకున్నా చెల్లుతుందని సీఈఓ జారీ చేసిన సర్క్యులర్ చట్ట విరుద్ధమన్నారు. సీలు, హోదా(డిజిగ్నేషన్) లేకపోయినా ఫర్వాలేదని, స్పెసిమెన్ సిగ్నేచర్ అనుమానం వస్తే జిల్లా ఎన్నికల అధికారి సమక్షంలో ధ్రువీకరిస్తే సరిపోతుందని చెప్పారని, ఈ లెక్కన ప్రతి జిల్లా నుంచి వెయ్యికి పైగా స్పెసిమెన్ సిగ్నేచర్లను ధృవీకరించుకోవడం సాధ్యమేనా అని ప్రశి్నంచారు.13 ఏ, 13 బి పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారని, దానికి గెజిటెడ్ ఆఫీసర్ సరి్టఫికెట్ ఇస్తారని, ఫారం 12 ఏ అనేది ఎక్కడ నుండి వచి్చందని ప్రశి్నంచారు. ఎంతో బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న సీఈవో ఎవరికి మేలు చేకూర్చాలని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఓకే చెప్పిందని, దేశంలో ఒకలా.. రాష్ట్రంలో మరోలా నిబంధన ఎలా అమలు చేస్తారని ప్రశి్నంచారు. చివరికి కోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేస్తే ఆ మెమోను సీఈఓ వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారన్నారు.ఆయన తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లు దీనిద్వారా స్పష్టమైందని, ఎవరి కోసం ఆ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారని నిలదీశారు. చంద్రబాబు బీజేపీతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఫలించవని చెప్పారు. టీడీపీ ఎన్డీఏతో కలిసి చట్టాలను చుట్టాలుగా మార్చుకుందని, ప్రజలు దీనిని గమనించాలన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం అంగీకారంపైనా పోరాటం చేస్తామని, చివరకు న్యాయమే గెలుస్తుందనే నమ్మకం తమకుందని వెల్లడించారు. న్యాయ వ్యవస్థతో సమానంగా బాధ్యతగా మెలగాల్సిన హోదాలో, ఎన్నికల సంఘంలో ప్రమాణం చేసి, ఇలాంటి సొంత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఒక పార్టీ వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోందన్నారు.రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వేధింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీ తప్పులను ఎత్తి చూపిస్తున్నప్పటికీ పట్టించుకోని సీఈవో.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వార్తలు వస్తే వెంటనే స్పందించి తమ పార్టీ నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని అన్నారు. టీడీపీ, బీజేపీ నేతలపై కేసులు పెట్టొద్దని కలెక్టర్లు, ఆర్వోలను బెదిరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులపై సాధ్యమైనంత వరకు కేసులు ఎక్కువ పెట్టాలని ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. -
ఎలక్షన్ కమిషన్ నిబంధనలపై పేర్ని నాని రియాక్షన్
-
సీల్ లేదని పోస్టల్ బ్యాలెట్ తిరస్కరించొద్దు
సాక్షి, అమరావతి: డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ ఆఫీసర్ స్టాంప్ (సీల్) లేదన్న ఏకైక కారణంతో పోస్టల్ బ్యాలెట్లను తిరస్కరించొద్దని ఎన్నికల సంఘం స్పష్టంచేసింది. జూన్ 4న రాష్ట్రంలో జరిగే ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ విషయంలో అనుసరించాల్సిన నిబంధనలను స్పష్టంచేస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీచేశారు.పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ల వద్ద ఎన్నికల సంఘం ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్లు కొంతమంది సీల్ వేయకుండా కేవలం సంతకాలు మాత్రమే చేశారని, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తమ ఓట్లను తిరస్కరించకుండా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి పలు విజ్ఞాపనలు వచ్చాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకున్న మీనా జూలై 19, 2023లో కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన ఆదేశాలను ఉటంకిస్తూ తాజాగా ఉత్తర్వులను జారీచేశారు. దీని ప్రకారం.. ⇒ డిక్లరేషన్ ఫారం మీద అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం, పేరు, హోదా తప్పనిసరిగా ఉండాలని, ఇవి ఉండి స్టాంప్ లేకపోయినా వాటిని పరిగణనలోకి తీసుకోవచ్చు. ⇒ ఒకవేళ అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం మీద అనుమానమొస్తే ఫెసిలిటేషన్ సెంటర్ వద్ద రిటర్నింగ్ ఆఫీసర్లు ఏర్పాటుచేసిన అటెస్టింగ్ ఆఫీసర్ల వివరాలతో సరిపోల్చి నిర్ణయం తీసుకోవాలి. ⇒ అదే విధంగా.. పోస్టల్ బ్యాలెట్ పేపర్ వెనుక రిటర్నింగ్ ఆఫీసరుగానీ లేదా ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్‌ఛార్జి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ⇒ బ్యాలెట్ పేపర్ వెనుక సంతకం విషయంలో ఏమైనా సందేహాలొస్తే సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్ ఫాయిల్‌ను పరిశీలించి అది నిజమైన బ్యాలెట్ అవునా కాదా అని నిర్థారించుకోవాలి. ఒకవేళ సందేహం ఉంటే వాటిని తిరస్కరించాలి. ⇒ అలాగే, ఓటరు కవర్–బీ మీద సంతకంలేదన్న కారణంతో కూడా ఓటును తిరస్కరించకూడదు. డిక్లరేషన్ ఫాం–13ఏ ప్రకారం ఓటరును గుర్తించవచ్చు. ఇవికాక.. బ్యాలెట్ పేపర్ ఉండే ఇన్నర్ కవర్ ఫారం–13బీనీ తెరవకుండానే ఈ సమయాల్లో ఓటును తిరస్కరించవచ్చు.. ⇒ కవర్–బీని తెరవగానే, ఓటరు డిక్లరేషన్ ఫారం లేకపోతే, డిక్లరేషన్ ఫారంపై గెజిటెడ్ లేదా అటెస్టింగ్ ఆఫీసర్ సంతకం లేకపోయినా, ఫారం–13ఏ, ఫారం–13బీలో బ్యాలెట్ సీరియల్ నెంబర్లు వేర్వేరుగా ఉంటే బ్యాలెట్ పేపర్ తెరవకుండానే తిరస్కరించొచ్చు. ఈ విధానం అంతా పూర్తయి బ్యాలెట్ పేపరు తెరిచిన తర్వాత ఈ దిగువ పేర్కొన్న సందర్భాల్లో కూడా ఓటును తిరస్కరించొచ్చు. ⇒ ఎవరికి ఓటు వేయకపోతే.. ఒకరి కంటే ఎక్కువ మందికి ఓటువేసినా.. అనుమానా స్పద బ్యాలెట్ పేపరుగా గుర్తించినా.. బ్యాలెట్ పేపరు చిరిగిపోయినా.. అది నిజమైన బ్యాలెట్ అని నిర్థారించడానికి అవకాశంలేని సమయంలో.. రిటర్నింగ్ ఆఫీసరు ఇచ్చిన కవర్–బీ లేకపోతే.. ఓటరు ఎవరో గుర్తించే విధంగా ఏమైనా గుర్తులు, లేక రాతలున్న సందర్భాల్లో తిరస్కరిస్తారు. ఈ విషయాలను రాజకీయ పారీ్టలు, కౌంటింగ్ ఏజెంట్లకు అవగాహన కలి్పంచేలా రిటర్నింగు అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా మీనా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
కన్నప్పలో అడుగుపెట్టిన ప్రభాస్.. ఫోటో వైరల్
మంచువిష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తోన్న చిత్రం కన్నప్ప. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. తాజాగా కన్నప్ప ప్రాజెక్ట్‌లోకి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అడుగుపెట్టేశారు. ఈమేరకు మంచు విష్ణు అధికారికంగా ప్రకటించేశారు.ఈ చిత్రంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించబోతున్నట్లు చాలా రోజుల నుంచి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ, తాజాగా విష్ణు అధికారికంగా ప్రకటించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ మూవీలో అతడు నందీశ్వరుడి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం కోసం ప్రభాస్ కేవలం మూడు రోజుల సమయం మాత్రమే కేటాయించినట్లు సమాచారం ఉంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తి అయిపోయింది. దాదాపు షూటింగ్ కార్యక్రమం పూర్తి దశలో ఉన్న కన్నప్ప ఇదే ఏడాది విడుదల కానుంది.మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఈ కన్నప్పను మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శివుని భక్తుడైన భక్త కన్నప్ప అచంచలమైన భక్తిని, విశ్వాసాన్ని చూపించబోతున్నారు. "కన్నప్ప"లో ప్రఖ్యాత హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ, యాక్షన్ డైరెక్టర్ కెచా ఖంపక్డీతో సహా ఆకట్టుకునే అద్భుతమైన టీం పని చేస్తోంది. ఆకర్షణీయమైన విజువల్స్, అద్భుతమైన కథ, కథనాలతో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. View this post on Instagram A post shared by Vishnu Manchu (@vishnumanchu) -
అవుటా? నాటౌటా?.. సంజూకు షాకిచ్చిన బీసీసీఐ
రాజస్తాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ సందర్భంగా సంజూ వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి.. అతడికి జరిమానా విధించింది. అసలేం జరిగిందంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ఢిల్లీతో మంగళవారం తలపడింది. టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. పంత్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దంచికొట్టిన ఢిల్లీ ఓపెనర్లుఓపెనర్లు జేక్ ఫ్రేజర్-మెగర్క్(20 బంతుల్లో 50), అభిషేక్ పోరెల్(36 బంతుల్లో 65), ఆరో నంబర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (20 బంతుల్లో 41) అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.ఫలితంగా ఢిల్లీ జట్టు..నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 221 పరుగులు సాధించింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ ఆదిలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోవడంతో వన్‌డౌన్ బ్యాటర్ సంజూ శాంసన్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు.అవుటా? నాటౌటా?మొత్తంగా 46 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 86 పరుగులు చేసి జట్టును గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో సంజూ అవుటైన తీరు వివాదానికి దారితీసింది.రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో పదహారో ఓవర్లో ఢిల్లీ పేసర్ ముకేశ్ కమార్ బౌలింగ్‌కు వచ్చాడు. అతడి బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించిన సంజూ.. బంతిని గాల్లోకి లేపగా బౌండరీ లైన్ వద్ద షాయీ హోప్ క్యాచ్ పట్టగా ఫీల్డ్ అంపైర్ అవుటిచ్చాడు.చిర్రెత్తిపోయిన సంజూ.. అంపైర్‌తో వాగ్వాదంఅయితే, ఆ సమయంలో షాయీ హోప్ బౌండరీ లైన్ తాకినట్టుగా కనిపించింది. రివ్యూ వెళ్లగా.. థర్డ్ అంపైర్ కూడా సంజూ అవుటైనట్లు ప్రకటించాడు. అదే సమయంలో ఢిల్లీ డగౌట్ నుంచి ఆ జట్టు యజమాని పార్థ్ జిందాల్ సైతం అవుట్ అంటూ అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ క్రమంలో చిర్రెత్తిపోయిన సంజూ శాంసన్ అంపైర్లతో వాదనకు దిగాడు. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా చర్యల కింద బీసీసీఐ అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం మేర కోత విధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రాజస్తాన్ రాయల్స్ మీద 20 పరుగుల తేడాతో గెలిచింది. ప్లే ఆఫ్స్ రేసులో తామూ ఉన్నామంటూ దూసుకువచ్చింది.చదవండి: యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే: ప్రీతి జింటాGame of margins! 😮A splendid catch that raises the 𝙃𝙊𝙋𝙀 for the Delhi Capitals 🙌Sanju Samson departs after an excellent 86(46) 👏Watch the match LIVE on @StarSportsIndia and @JioCinema 💻📱#TATAIPL | #DCvRR pic.twitter.com/rhLhfBmyEZ— IndianPremierLeague (@IPL) May 7, 2024 -
ముఖేష్ కుమార్ మీనాకు వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
-
పిచ్చి పట్టిందా? కుల్దీప్ ఆగ్రహం.. పంత్ రియాక్షన్ ఇదే
ఐపీఎల్-2024లో భాగంగా అహ్మదాబాద్‌లో అద్భుత ప్రదర్శనతో దుమ్ములేపారు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు. ఆది నుంచే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ ఏ దశలోనూ కోలుకోకుండా చేశారు. ఢిల్లీ వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ శుబ్‌మన్ గిల్ వికెట్ తీసి టైటాన్స్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని మొదలుపెట్టగా.. ముకేశ్ కుమార్ వృద్ధిమాన్ సాహా వికెట్ పడగొట్టాడు. ఇక సుమిత్ కుమార్ అద్భుత రీతిలో సాయి సుదర్శన్(12)ను రనౌట్ చేయగా.. ఇషాంత్ మరోసారి మ్యాజిక్ చేసి డేవిడ్ మిల్లర్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత రంగంలోకి దిగిన ట్రిస్టన్ స్టబ్స్ అభినవ్ మనోహర్, షారుఖ్ ఖాన్ వికెట్లు తీసి టైటాన్స్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. రషీద్ అవుట్ కావడంతో.. తానేమీ తక్కువ కాదన్నట్లు అక్షర్ పటేల్ రాహుల్ తెవాటియా(10) రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. ఖలీల్ అహ్మద్ మోహిత్ శర్మను అవుట్ చేశాడు. ఈ క్రమంలో క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్ గాడిన పడేసే ప్రయత్నం చేసిన రషీద్ ఖాన్(31)ను పెవిలియన్‌కు పంపిన ముకేశ్ కుమార్ .. నూర్ అహ్మద్ వికెట్ కూడా తీసి కథ ముగించాడు. ఫలితంగా సొంతమైదానంలో 89 పరుగులకే కుప్పకూలింది గుజరాత్ టైటాన్స్. ఇక లక్ష్య ఛేదనలో ధనాధన్ ధోరణి అవలంభించిన ఢిల్లీ నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లాంఛనం పూర్తి చేసింది. A clinical bowling performance in Ahmedabad powered @DelhiCapitals to their third win of the season 👌 Watch the recap of the #GTvDC clash 🎥#TATAIPL pic.twitter.com/ukxCq7MOpS — IndianPremierLeague (@IPL) April 18, 2024 అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన ఢిల్లీ పొరపాట్లకు తావు లేకుండా గెలిచిన తీరు.. అందులోనూ ముఖ్యంగా కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా రిషభ్ పంత్ రాణించడం అభిమానులను ఖుషీ చేసింది. అదే విధంగా అతడు ఈ మ్యాచ్‌లో కూల్‌గా డీల్ చేసిన విధానం కూడా ముచ్చటగొలిపింది. పిచ్చి పట్టిందా అంటూ కుల్దీప్ ఆగ్రహం ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఢిల్లీ ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఎనిమిదో ఓవర్ బౌల్ చేశాడు. అతడి బౌలింగ్‌లో ఐదో బంతికి రాహుల్ తెవాటియా షాట్ ఆడబోయి విఫలమయ్యాడు. కానీ, అప్పటికే మరో ఎండ్‌లో ఉన్న అభినవ్ మనోహర్ తెవాటియా పరుగు తీస్తాడేమోనని క్రీజు వీడాడు. ఇంతలో బంతిని అందుకున్న ఫీల్డర్ ముకేశ్ కుమార్‌ను వికెట్లకు గిరాటేయాల్సిందిగా పంత్ ఆదేశించాడు. ముకేశ్ కూడా నాన్ స్ట్రైకర్ ఎండ్‌వైపు గురిపెట్టాడు. అయితే, ప్రమాదాన్ని పసిగట్టిన తెవాటియా మనోహర్‌ను వెంటనే వెనక్కి వెళ్లాలని సూచించగా.. అతడు సరైన సమయంలో క్రీజులో చేరాడు. Angry 💢 kullu 😭😭 pic.twitter.com/y7NQy1NQD3 — RITIKA RO 45 (@RITIKAro45) April 17, 2024 మరోవైపు.. ముకేశ్ విసిరిన బంతి ఓవర్ త్రో అయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుల్దీప్ యాదవ్.. ముకేశ్ కుమార్‌ను ‘నీకేమైనా పిచ్చి పట్టిందా’ అంటూ ఫైర్ అయ్యాడు. ఇంతలో పంత్ జోక్యం చేసుకుని ‘కోపం వద్దు భయ్యా’ అంటూ కుల్దీప్ను హత్తుకుని మరీ సముదాయించాడు. ఇంతలో ముకేశ్ సైతం చిరునవ్వులు చిందిస్తూ కుల్దీప్ కోపాన్ని లైట్ తీసుకున్నట్లుగా చెప్పకనే చెప్పాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. చదవండి: Shubman Gill: ఒక్కరైనా డబుల్ హ్యాట్రిక్ తీయాల్సింది.. ఓటమికి కారణం అదే! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7522010156.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ముఖేష్ కుమార్ సూపర్ డెలివరీ.. జైశ్వాల్ షాక్! వీడియో వైరల్
ఐపీఎల్-2024లో రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ ఈవెంట్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఢిల్లీ పేసర్ ముఖేష్ కుమార్ అద్భుతమైన బంతితో జైశ్వాల్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 2 ఓవర్ బౌలింగ్ చేసేందుకు డీసీ కెప్టెన్ రిషబ్ పంత్.. ముఖేష్ కుమార్‌ను ఎటాక్‌లోకి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఆ ఓవర్లో రెండో బంతిని జైశ్వాల్ ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి రెండు బంతులకు ఎటువంటి పరుగులు రాలేదు. అయితే ఐదో బంతిని అద్భుతమైన ఫుల్-లెంగ్త్ డెలివరీగా ముఖేష్ సంధించాడు. ఈ క్రమంలో జైశ్వాల్ ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి మిస్స్ అయ్యి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో ఒక్కసారిగా ముఖేష్ బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. CASTLED! Early success for Mukesh Kumar & @DelhiCapitals 👏👏#RR lose Yashasvi Jaiswal Head to @JioCinema and @StarSportsIndia to watch the match LIVE#TATAIPL | #RRvDC pic.twitter.com/sJIAua6ehl — IndianPremierLeague (@IPL) March 28, 2024 -
కన్నప్ప నా మనసుకు ఎంతో దగ్గరైంది
‘‘కన్నప్ప’ కథ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. కామిక్ పుస్తకం కూడా సినిమాలానే ఉంటుంది. మన చరిత్ర, మన మూలాలను తెలుసుకునేలా చేయడంలో ఇది గొప్ప ్ర΄ారంభం అని నేను భావించాను. ఇది నేను డబ్బు కోసం చేస్తున్న పని కాదు.. ఈ కథ నా మనసుకు ఎంతో దగ్గరైంది. కన్నప్ప భక్తి భావాన్ని ప్రపంచమంతా తెలుసుకోవాలనుకుంటున్నాను’’ అని హీరో విష్ణు మంచు అన్నారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా రూ΄÷ందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో మోహన్‌బాబు, ప్రభాస్, మోహన్ లాల్, శరత్ కుమార్ కీలక ΄ాత్రల్లో నటిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్ టైన్మెంట్స్పై మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. కాగా మార్చి 19న మోహన్‌బాబు పుట్టినరోజు, మోహన్‌బాబు యూనివర్సిటీ 32వ వార్షిక దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నటులు మోహన్ లాల్ గౌరవ ముఖ్య అతిథిగా, ముఖేష్ రిషి గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకల్లో ‘కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1’ని ఆవిష్కరించిన విష్ణు మంచు మాట్లాడుతూ–‘‘ఈ పుస్తకం భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. నేను చదివిన అత్యంత ఉత్తేజకరమైన కథను ప్రపంచానికి తెలియజేయాలనేది నా కల. నేటితరం యువత ఈ కథను, చరిత్రను తెలుసుకోవాలి’’ అన్నారు. -
టీడీపీ, జనసేనకు షాకిచ్చిన ఎన్నికల కమిషన్
-
ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ కీలక ఆదేశాలు
-
ఏపీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం
-
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్.. టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ..?
రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగబోయే నాలుగో టెస్ట్‌లో టీమిండియా తరఫున కొత్త బౌలర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడన్న ప్రచారం ఊపందుకుంది. సిరాజ్‌కు జతగా బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ తుది జట్టులో ఉంటాడని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ, బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ముకేశ్ కుమార్ కంటే ఆకాశ్‌దీపే బెటర్ అని భారత క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. ఐపీఎల్, దేశవాలీ క్రికెట్లో ఆకాశ్ దీప్ మెరుగైన ప్రదర్శన చేయడమే అభిమానుల ఛాయిస్‌కు కారణంగా తెలుస్తుంది. ఆకాశ్ దీప్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున, దేశవాలీ క్రికెట్లో బెంగాల్ తరఫున అద్భుతంగా రాణించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశ్‌దీప్‌కు అదిరిపోయే రికార్డు ఉంది. ఈ ఫార్మాట్లో ఆకాశ్ ఆడిన 30 మ్యాచ్‌ల్లోనే 100కు పైగా వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత రంజీ సీజన్లోనూ ఆకాశ్ అదరగొట్టాడు. ఇటీవల బీహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఆకాశ్ 10 వికెట్ల ప్రదర్శనతో విజృంభించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్శించాడు. దీనికి ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌లోనూ ఆకాశ్ సత్తా చాటాడు. ఆ సిరీస్‌లో ఆకాశ్ 16.75 సగటున 11 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలకు తోడు ముకేశ్‌తో పోలిస్తే ఆకాశ్ వేగవంతమైన బౌలర్ కావడంతో అతనికే అవకాశం ఇవ్వాలని టీమిండియా మేనేజ్మెంట్ సైతం భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ముకేశ్ కుమార్ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేక నాలుగో టెస్ట్ రేసులో వెనుకపడ్డాడు. ముకేశ్ విశాఖ టెస్ట్‌లో కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టడంతో మేనేజ్మెంట్కు సెకెండ్ ఛాయిస్‌గా మారాడు. పై పేర్కొన్న అంశాలను పరిగణలోకి తీసుకుంటే ఆకాశ్ దీప్ టెస్ట్ అరంగేట్రం చేయడం దాదాపుగా ఖయమనే అనిపిస్తుంది. ఆకాశ్ టీమిండియాకు ఎంపిక కావడం ఇది తొలిసారి కాదు. తాజా దక్షిణాఫ్రికా పర్యటనలో అతను భారత జట్టుకు ఎంపికయ్యాడు. అయితే ఆ సిరీస్‌లో అతనికి తుది జట్టులో ఆడే అవకాశం లభించలేదు. కాగా, ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్లు విరాట్ కోహ్లి, మొహమ్మద్ షమీ లేకపోయినా టీమిండియా అద్భుతంగా రాణిస్తూ ముందుకెళ్తుంది. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ గెలుపొందగా.. విశాఖలో జరిగిన రెండో టెస్ట్, రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్ట్‌ల్లో టీమిండియా విజయాలు సాధించింది. రాంచీ వేదికగా నాలుగో టెస్ట్ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభంకానుండగా.. ఐదో టెస్ట్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఆ మ్యాచ్ మార్చి 7 నుంచి ప్రారంభమవుతుంది. -
Ind vs Eng: బుమ్రాను రిలీజ్ చేసిన బీసీసీఐ.. అతడికి గ్రీన్ సిగ్నల్!
Ind vs Eng Test Series 2024- 4th debutant in 4th match?: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా ఇప్పటికే ఇద్దరు యువ క్రికెటర్లు టీమిండియా తరఫున అరంగేట్రం చేశారు. మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్, ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో రజత్‌కు జహీర్ ఖాన్, రాజ్‌కోట్ మ్యాచ్‌లో సర్ఫరాజ్‌కు అనిల్ కుంబ్లే, జురెల్‌కు దినేశ్ కార్తిక్ టీమిండియా క్యాప్‌లు అందించారు. తాజాగా నాలుగో టెస్టు సందర్భంగా మరో ఆటగాడి అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నాలుగో టెస్టులో.. ‘నాలుగో ఆటగాడి’ అరంగేట్రం? బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్‌నకు తుదిజట్టులో చోటు ఇచ్చేందుకు మేనేజ్మెంట్ సుముఖంగా ఉన్నట్లు సమాచారం. కాగా ఇంగ్లండ్‌తో తొలి మూడు టెస్టుల్లో అదరగొట్టిన టీమిండియా పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫాస్ట్‌బౌలర్‌కు పనిభారం తగ్గించే దృష్ట్యా నాలుగో టెస్టు జట్టు నుంచి అతడిని రిలీజ్ చేస్తున్నట్లు బోర్డు తెలిపింది. అదే విధంగా.. అతడి స్థానంలో ముకేశ్ కుమార్‌ను మళ్లీ జట్టులోకి తీసుకున్నట్లు వెల్లడించింది. అతడి వైపే మొగ్గు అయితే, తుదిజట్టులో మాత్రం ముకేశ్‌ను కాకుండా ఆకాశ్ దీప్‌ను ఆడించాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాల సమాచారం. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం ఈ ఇద్దరు బెంగాల్ పేసర్లలో ఆకాశ్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. బుమ్రా గైర్హాజరీలో మహ్మద్ సిరాజ్ ప్రధాన పేసర్‌గా వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా ఆకాశ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. కాగా ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన ముకేశ్ కుమార్ ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. తండ్రి ప్రోత్సాహం కరువైనా ఇక దేశవాళీ క్రికెట్లో సత్తా చాటిన రైటార్మ్ పేసర్ ఆకాశ్ దీప్.. ఇటీవల ఇంగ్లండ్ లయన్స్(ఇంగ్లండ్-ఏ)తో ముగిసిన అనధికారిక టెస్టు సిరీస్‌లో అదరగొట్టాడు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుని మొత్తంగా 13 వికెట్లు పడగొట్టాడు. కాగా బిహార్‌లోని దెహ్రీలో 1996లో జన్మించిన ఆకాశ్ దీప్ క్రికెటర్‌గా ఎదిగేందుకు బెంగాల్‌కు మకాం మార్చాడు. తండ్రి నుంచి ప్రోత్సాహం కరువైనప్పటికీ అంచెలంచెలుగా ఎదిగి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్నాడు. బెంగాల్ తరఫున 2019లో అరంగేట్రం చేసిన అతడు.. 30 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో కలిపి 104 వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత జట్టు(అప్డేటెడ్): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మమ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్. చదవండి: SRH: చిక్కుల్లో సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ.. ఆమె ఆత్మహత్య కేసులో.. -
టీమిండియాలో తుస్సుమన్పించాడు.. అక్కడ మాత్రం చెలరేగిపోయాడు
ఇంగ్లండ్‌తో మూడో టెస్టుకు ముందు టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్‌ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రంజీ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లిన ముఖేష్ కుమార్.. బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చేరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా 6 వికెట్లు పడగొట్టి బీహార్ పతనాన్ని శాసించాడు. ముఖేష్ ఓవరాల్‌గా రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 10 వికెట్లతో సత్తాచాటాడు. అయితే ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో మాత్రం ముఖేష్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్టుకు తుది జట్టులోకి వచ్చిన ముఖేష్.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టి దారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ క్రమంలోనే రాజ్‌కోట్ టెస్టుకు ముందు అతడిని బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బీహార్‌ను ఇన్నింగ్స్ 204 పరుగులతో తేడాతో బెంగాల్ చిత్తు చేసింది. 316 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన బీహార్.. ముఖేష్, జైశ్వాల్ దాటికి కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ముఖేష్‌తో పాటు సూరజ్ సింధు జైస్వాల్ 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో బెంగాల్ 411 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బెంగాల్ బ్యాటర్లలో అభిమన్యు ఈశ్వరన్(200 నాటౌట్) డబుల్ సెంచరీతో చెలరేగాడు. చదవండి: IPL 2024: చెన్నై స్టార్ బౌలర్ తలకు గాయం.. రక్తంతోనే ఆస్పత్రికి! వీడియో వైరల్ -
ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
సాక్షి, అమరావతి : రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది. అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియాకు వివరిస్తారని ముఖే‹Ù కుమార్ మీనా అన్నారు. సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని.. విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నోవాటెల్ కాన్ఫరెన్స్ హాల్‌ను పరిశీలించారు. -
అస్సలు ఊహించలేదు.. వాళ్లిద్దరి సహకారం వల్లే ఇలా: సిరాజ్
Ind vs SA 2nd Test- Siraj Comments: కేప్‌టౌన్ టెస్టులో తొలి రోజే ‘సిక్సర్’తో సంచలనం సృష్టించాడు టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, యువ పేసర్ ముకేశ్ కుమార్‌తో కలిసి ప్రొటిస్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించి.. టెస్టుల్లో తొలిసారి తన అత్యుత్తమ గణాంకాలు(6/15) నమోదు చేశాడు. కీలక వికెట్లు పడగొట్టిన సిరాజ్ మొత్తంగా తొమ్మిది ఓవర్ల బౌలింగ్‌లో కేవలం పదిహేను పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు కూల్చాడు. ఓపెనర్లు ఐడెన్ మార్క్రమ్(2), కెప్టెన్ డీన్ ఎల్గర్(4), టోనీ డీ జోర్జీ(2) రూపంలో బిగ్ వికెట్లు దక్కించుకున్న సిరాజ్ మియా.. డేవిడ్ బెడింగ్హాం(12), కైలీ వెరెనె(15), మార్కో జాన్సెన్(0)ల వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్(3), నండ్రీ బర్గర్(4)లను పెవిలియన్‌కు పంపగా.. ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3), కగిసో రబడ(5) వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో టీమిండియా పేసర్ల దెబ్బకు 55 పరుగులకే ఆలౌట్ అయింది ఆతిథ్య సౌతాఫ్రికా. ఆధిక్యంలో రోహిత్ సేన ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన 153 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా మళ్లీ బ్యాటింగ్‌కు దిగగా.. ఆట ముగిసే సరికి 17 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. టీమిండియా కంటే ఇంకా 36 పరుగులు వెనుకబడి ఉంది. అస్సలు ఊహించలేదు ఈ నేపథ్యంలో బుధవారం నాటి ఆట ముగిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన మహ్మద్ సిరాజ్‌కు.. ‘‘ఒకేరోజు రెండుసార్లు బౌలింగ్ చేయాల్సి వస్తుందని ఊహించారా?’’ అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు బదులిస్తూ.. ‘‘ఇలా జరగుతుందని మీరైనా ఊహించారా? లేదు కదా.. మేము కూడా అంతే. క్రికెట్లో ఇవన్నీ సహజమే. ఒకేరోజు మంచి, చెత్త ఇన్నింగ్స్ చూశారు’’ అని సిరాజ్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా తన అత్యుత్తమ ప్రదర్శనలో సీనియర్ బుమ్రా, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌కు కూడా భాగం ఉందని సిరాజ్ తెలిపాడు. వాళ్లిద్దరి సహకారం వల్లే సాధ్యమైంది ‘‘ఓవైపు సీనియర్ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ ఉంటే.. మరోవైపు వికెట్ కీపర్ సరైన లెంగ్త్ గురించి సలహాలు ఇస్తూ ఉంటే.. బౌలర్ పని మరింత సులువు అవుతుంది. మా మధ్య చక్కటి సమన్వయం ఉంది. మన బౌలింగ్‌లో బ్యాటర్ 4-5 బౌండరీలు బాదినపుడు ఏ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాలన్న విషయంపై సీనియర్ల సలహాలు కచ్చితంగా పనిచేస్తాయి’’ అని బుమ్రా, రాహుల్‌లపై 29 ఏళ్ల సిరాజ్ ప్రశంసలు కురిపించాడు. ఇక రెండో రోజు ఏం జరుగుతుందో ఊహించలేమన్న ఈ రైటార్మ్ పేసర్.. వీలైనంత తక్కువ స్కోరుకు సౌతాఫ్రికాను కట్టడి చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నాడు. ఇప్పటికీ టీమిండియా ఆధిక్యంలోనే ఉంది కాబట్టి రెండో రోజు సానుకూల ఫలితం రాబట్టగలమనే నమ్మకం ఉందని సిరాజ్ ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశాడు. ఏదేమైనా తొలిరోజే న్యూల్యాండ్స్ పిచ్ నుంచి ఇంత సహకారం లభిస్తుందని అనుకోలేదని, 55 పరుగులకే ప్రత్యర్థిని ఆలౌట్ చేసే అవకాశం వస్తుందని ఊహించలేదన్నాడు. చదవండి: IND vs SA: బాబు అక్కడ ఉన్నది కింగ్.. కోహ్లీతోనే ఆటలా! ఇచ్చిపడేశాడుగా W W W W W W 🙌🏻 Wreaking 🔥 ft. Mohammed Siuuuraajjj! Watch all his 6️⃣ scalps 👆🏻 Tune in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/t7bT3pCRLl — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
అన్‌స్టాపబుల్ సిరాజ్: అద్భుత ప్రదర్శన.. టెస్టుల్లో ఇదే తొలిసారి
South Africa vs India, 2nd Test: కేప్‌టౌన్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ దుమ్ములేపాడు. ఆరంభంలోనే ప్రొటిస్ ఓపెనర్లను పెవిలియన్‌కు పంపి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. తొలుత ఐడెన్ మార్క్రమ్(2)ను అవుట్ చేసిన ఈ హైదరాబాదీ స్పీడ్‌స్టర్.. అనంతరం కెప్టెన్ డీన్ ఎల్గర్ రూపంలో బిగ్ వికెట్ పడగొట్టాడు. కీలక వికెట్ కూల్చి.. పతనానికి నాంది పలికి గంటకు 134 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి అద్భుత రీతిలో ఎల్గర్‌ను బౌల్డ్ చేశాడు. అవుట్‌సైడ్ ఆఫ్ దిశగా సిరాజ్ సంధించిన బంతిని తప్పుగా అంచనా వేసిన ఎల్గర్(4) షాట్ ఆడేందుకు విఫలయత్నం చేసి వికెట్ పారేసుకున్నాడు. తాను అవుటైన తీరును నమ్మలేక నిరాశగా మైదానాన్ని వీడాడు. కాగా గత మ్యాచ్‌లో అద్భుత సెంచరీతో రాణించిన డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు భారీ విజయం అందించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే, ఈ మ్యాచ్‌లో తెంబా బవుమా స్థానంలో.. అది కూడా తన కెరీర్లో ఆడుతున్న ఆఖరి టెస్టులో కెప్టెన్‌గా బరిలోకి దిగిన అతడిని సిరాజ్ ఇలా కోలుకోలేని దెబ్బకొట్టాడు. Knocked ‘em overrrr! _ ‘ | | /#MohammedSiraj has every reason to celebrate, as he cleverly sets up #DeanElgar and gets the big fish! 💥 Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/EGX6XxZsSu — Star Sports (@StarSportsIndia) January 3, 2024 సిరాజ్ దెబ్బకు టాపార్డర్ కకావికలం దీంతో ఆరంభంలోనే సౌతాఫ్రికా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా ట్రిస్టన్ స్టబ్స్‌ను 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ చేయగా.. టోనీ డీ జోర్జీ(2) రూపంలో సిరాజ్ మళ్లీ తన వికెట్ల ఖాతా తిరిగి తెరిచాడు. ఈ రైటార్మ్ పేసర్ దెబ్బకు సౌతాఫ్రికా టాపార్డర్ మొత్తం కలిపి కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక జోర్జీ వికెట్ తీసుకున్న తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిన సిరాజ్.. 15.2 ఓవర్ వద్ద డేవిడ్ బెడింగ్హాం(12), అదే ఓవర్లో ఐదో బంతికి మార్కో జాన్సెన్(0) వికెట్లు కూడా పడగొట్టాడు. తద్వారా కేప్‌టౌన్ టెస్టులో ఐదు వికెట్ హాల్ నమోదు చేశాడు. టెస్టుల్లో తొలి 6 వికెట్ హాల్ అంతటితో సిరాజ్ విధ్వంసం ఆగిపోలేదు. 17.5 ఓవర్ వద్ద వెరెనె(15) రూపంలో ఆరో వికెట్ దక్కించుకున్నాడు ఈ ఫాస్ట్‌బౌలర్. తద్వారా టెస్టుల్లో టీమిండియా తరఫున తన మొదటి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఇప్పటికే ఆసియా కప్-2023 ఫైనల్ సందర్భంగా శ్రీలంకతో మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసి వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. 55 పరుగులకే కుప్పకూలిన సౌతాఫ్రికా ఇక సిరాజ్ తర్వాత వికెట్లు పడగొట్టే బాధ్యత తీసుకున్న ముకేశ్ కుమార్ కేశవ్ మహరాజ్(3)ను అవుట్ చేయగా.. బుమ్రా.. నండ్రీ బర్గర్(4)ను పెవిలియన్‌కు పంపాడు. ఇక 23.2 ఓవర్ వద్ద కగిసో రబడ(5)ను పెవిలియన్‌కు పంపి ముకేశ్ కుమార్ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇలా భారత పేసర్ల ధాటికి సౌతాఫ్రికా 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆరు వికెట్లతో చెలరేగిన సిరాజ్‌పై సహచర ఆటగాళ్లతో పాటు అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చదవండి: T20 WC 2024: రోహిత్, కోహ్లి విషయంలో బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అగార్కర్ కీలక నిర్ణయం! Pacy wickets with bounce on offer! Pitches in #SouthAfrica pose a different challenge, but former #TeamIndia batting coach #SanjayBangar delivers a masterclass on how best to deal with this test. Tune-in to #SAvIND 2nd Test LIVE NOW | Star Sports Network#Cricket pic.twitter.com/FYPOC19Kfn — Star Sports (@StarSportsIndia) January 3, 2024 -
సౌతాఫ్రికాతో రెండో టెస్టు: మార్పులు సూచించిన ఇర్ఫాన్ పఠాన్
South Africa vs India, 2nd Test: సౌతాఫ్రికాతో రెండో టెస్టు నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్థానాన్ని ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో భర్తీ చేయాలని సూచించాడు. జడ్డూ గనుక ఫిట్‌గా ఉంటే కేప్‌టౌన్ మ్యాచ్‌లో అతడిని తప్పక ఆడించాలని మేనేజ్మెంట్కు విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా యువ పేసర్ ప్రసిద్ కృష్ణ విషయంలో పునరాలోచన చేయాలని పఠాన్ సూచించాడు. కాగా సెంచూరియన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో టీమిండియా దారుణ పరాజయం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ డే టెస్టులో ఆతిథ్య సౌతాఫ్రికా చేతిలో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో సిరీస్‌ను డ్రా చేసుకోవాలంటే రెండో మ్యాచ్‌లో తప్పక గెలవాల్సిన స్థితిలో నిలిచింది. ఒకవేళ ఈ మ్యాచ్‌లోనూ గనుక ఓడితే.. మరోసారి సఫారీ గడ్డపై టీమిండియాకు భంగపాటు తప్పదు. అందుకే.. గత మ్యాచ్ తాలుకు తప్పిదాలు పునరావృతం కాకుండా.. లోపాలు సరిచేసుకుని బరిలోకి దిగేందుకు రోహిత్ సేన సిద్ధమవుతోంది. జడ్డూ వస్తే ప్రయోజనకరంగా ఉంటుంది ఈ నేపథ్యంలో జట్టు కూర్పు గురించి భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్నెస్ సాధిస్తే అతడిని కచ్చితంగా తుదిజట్టులోకి తీసుకోవాలి. గత మ్యాచ్‌లో అశ్విన్ బాగానే బౌలింగ్ చేశాడు. కానీ.. బ్యాటింగ్ ఆర్డర్లో ఏడో స్థానంలో రాణించగల జడేజా సేవలను ఇండియా కోల్పోయింది. కాబట్టి అతడు జట్టులోకి వస్తే ఉపయోగకరంగా ఉంటుంది. ఇక బౌలింగ్ దళం విషయంలో రోహిత్ శర్మ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగితే బాగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా మార్పు చేయాలనుకుంటే ప్రసిద్ కృష్ణ స్థానంలో ముకేశ్ కుమార్‌ను తీసుకురావాల్సి ఉంటుంది. ప్రసిద్ కృష్ణను ఆడిస్తే.. అయితే, నెట్స్‌లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్ బాగానే అనిపిస్తే.. అతడి విషయంలో ధీమా ఉంటే రెండో టెస్టులోనూ ఆడించవచ్చు’’ అని ఇర్ఫాన్ పఠాన్ ఇండియా టుడేతో పేర్కొన్నాడు. కాగా టీమిండియా- సౌతాఫ్రికా మధ్య బుధవారం నుంచి కేప్‌టౌన్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. ఇదిలా ఉంటే.. సెంచూరియన్ టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన ప్రసిద్ కృష్ణ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఇరవై ఓవర్ల బౌలింగ్‌లో మొత్తంగా 93 పరుగులు ఇచ్చి కేవలం ఒక వికెట్ తీయగలిగాడు. చదవండి: IND vs SA: సౌతాఫ్రికాతో రెండో టెస్టు.. టీమిండియాను భయపెడుతున్న రికార్డులు! -
సౌతాఫ్రికాతో రెండో టెస్ట్.. ఆ ఇద్దరిపై వేటు..?
కేప్‌టౌన్ వేదికగా జనవరి 3 నుంచి సౌతాఫ్రికాతో జరుగబోయే రెండో టెస్ట్‌లో టీమిండియా పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. తొలి టెస్ట్‌లో దారుణంగా విఫలమైన ప్రసిద్ద్ కృష్ణ (1/93), శార్దూల్ ఠాకూర్ (1/101) స్థానంలో ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ తుది జట్టులోకి ఎంట్రీ ఇవ్వడం దాదాపుగా ఖరారైంది. ప్రసిద్ద్ (0,0), శార్దూల్ (24, 2) తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో పాటు బ్యాటింగ్‌లో నామమాత్రంగా కూడా ప్రభావం చూపలేకపోయారు. దీంతో మేనేజ్మెంట్ ఈ ఇద్దరిని తప్పించి ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్లకు అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్ ఇప్పటికే నెట్స్‌లో సాధన చేయడం కూడా మొదలుపెట్టారు. రెండో టెస్ట్ కోసం టీమిండియా ఆదివారం కేప్‌టౌన్‌కు బయల్దేరనుంది. రేపటి నుంచి భారత్ అక్కడే ప్రాక్టీస్ చేయనుంది. సిరీస్ కాపాడుకోవాలంటే రెండో టెస్ట్ తప్పక గెలవాల్సి ఉండటంతో టీమిండియా ఈ మ్యాచ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. వ్యక్తిగతంగానూ ఈ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లకు చాలా కీలకంగా మారింది. టీమిండియా రెండో టెస్ట్‌లో ఎలాగైనా గెలిచి కొత్త సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలకాలని పట్టుదలగా ఉంది. కాగా, మొహమ్మద్ షమీ గైర్హాజరీలో ఆవేశ్ ఖాన్ భారత జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా-ఏతో జరిగిన అనధికారిక టెస్ట్‌లో ఆవేశ్ ఖాన్ ఐదు వికెట్లతో సత్తా చాటాడు. ఈ ప్రదర్శన కారణంగానే ఆవేశ్ ఖాన్ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇదిలా ఉంటే, సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 32 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో 131 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (101) అద్భుతమైన సెంచరీతో పోరాడి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించగా.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి (76) ఒక్కడే ఒంటరిపారాటం చేశాడు. టీమిండియాను తొలి ఇన్నింగ్స్‌లో రబాడ (5/59), నండ్రే బర్గర్ (3/50).. సెకెండ్ ఇన్నింగ్స్‌లో బర్గర్ (4/33), జన్సెన్ (3/36) కుప్పకూల్చారు. సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఓపెనర్ డీన్ ఎల్గర్ (185) భారీ శతకంతో కదంతొక్కడంతో పాటు బెడింగ్హమ్ (56), మార్కో జన్సెన్ (84 నాటౌట్) అర్ధసెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 408 పరుగులకు ఆలౌటైంది. ఈ స్కోర్‌ను భారత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కూడా అధిగమించలేక ఇన్నింగ్స్ తేడాతో ఓడింది. భారత బౌలర్లలో బుమ్రా 4 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సిరాజ్ 2, శార్దూల్ ఠాకూర్, ప్రసిద్ద్ కృష్ణ, అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్ కోసం భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, అవేష్ ఖాన్ -
Ind vs SA: సౌతాఫ్రికాతో మ్యాచ్‌లకు టీమిండియా పేసర్ దూరం?
India Tour Of South Africa 2023: టీమిండియా పేసర్ దీపక్ చహర్ సౌతాఫ్రికా పర్యటనలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తండ్రి అనారోగ్య కారణాల దృష్ట్యా అతడు దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండకపోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. కాగా గాయాల బెడదతో చాలా కాలం పాటు ఆటకు దూరమైన రైటార్మ్ పేసర్ దీపక్ చహర్.. స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. కంగారూ జట్టుతో నాలుగో మ్యాచ్‌కు యువ పేసర్ ముకేశ్ కుమార్ గైర్హాజరు కావడంతో అతడి స్థానంలో దీపక్ ఎంట్రీ ఇచ్చాడు. రాయ్‌పూర్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఐదో టీ20లో కూడా దీపక్ చహర్ ఆడతాడని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఆఖరి టీ20కి దూరమయ్యాడని తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించాడు. తండ్రికి బ్రెయిన్‌స్ట్రోక్ తాజాగా ఈ విషయం గురించి దీపక్ చహర్ స్పందించాడు. తన తండ్రి లోకేంద్ర సింగ్ శనివారం(డిసెంబరు 2) బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురయ్యారని.. అందుకే హుటాహుటిన అలీఘర్కు బయల్దేరినట్లు తెలిపాడు. ‘‘సరైన సమయానికి మా నాన్నను ఆస్పత్రికి తీసుకురాగలిగాం. లేదంటే పరిస్థితి విషమించేది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆస్ట్రేలియాతో ఆఖరి టీ20లో ఎందుకు ఆడలేదని చాలా మంది నన్ను అడుగుతున్నారు. అన్నింటికంటే మా నాన్నే నాకు ముఖ్యం. ఈరోజు క్రికెటర్‌గా నేను ఇక్కడ ఉన్నానంటే అందుకు ఆయనే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనను వదిలి నేను ఎక్కడికీ వెళ్లలేను. మా నాన్న అనారోగ్యం పాలైనప్పటి నుంచి ఆయనతోనే ఉన్నాను. ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను ప్రస్తుతం ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాబట్టి సౌతాఫ్రికాకు పయనమవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ సర్, సెలక్టర్లతో మాట్లాడాను. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నాను’’ అని దీపక్ చహర్ వెల్లడించాడు. అయితే, డిసెంబరు 10 నుంచే దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో దీపక్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో వన్డే, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీ20 జట్టుకు దీపక్ చహర్ ఎంపికైన విషయం తెలిసిందే. వివాహ వేడుకకు వెళ్లి కాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన 31 ఏళ్ల దీపక్ చహర్ తండ్రి లోకేంద్రసింగ్ భారత వైమానిక దళ మాజీ ఉద్యోగి అని సమాచారం. ఆయన బీపీ, షుగర్ పేషంట్. అలీఘర్‌లో ఓ వివాహ వేడకకు హాజరైన సందర్భంగా పక్షవాతానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు దైనిక్ జాగరణ్ వివరాలు వెల్లడించింది. చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్.. సెలక్టర్లకు స్ట్రాంగ్ మెసేజ్! -
టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ పెళ్లి ఫొటోలు
-
పెళ్లి చేసుకున్న టీమిండియా యువ పేసర్.. అమ్మాయి ఎవరంటే?
టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ ఓ ఇంటివాడయ్యాడు. బీహార్‌కు చెందిన తన చిన్ననాటి స్నేహితురాలు దివ్య సింగ్‌ను ముఖేష్ వివాహమాడాడు. వీరిద్దరి పెళ్లి గోరఖ్‌పూర్‌లో ఓ హోటల్లో మంగళవారం ఘనంగా జరిగింది. వీరి వివాహనికి పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. డిసెంబర్ 4న గోరఖ్‌పూర్‌లో ముఖేష్-దివ్య వివాహ రిసెప్షన్ జరగనుంది. ఈ క్రమంలోనే మంగళవారం గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20కు ముఖేష్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని మూడో టీ20 ఆరంభానికి ముందు బీసీసీఐ వెల్లడించింది. ముఖేష్ తిరిగి మళ్లీ శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు జట్టుతో కలవనున్నాడు. తొలి రెండు టీ20ల్లో ముఖేష్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శరన కనబరిచాడు. కాగా ముఖేష్ కుమార్ ఏడాదిలోనే టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలోనూ అరేంగ్రం చేయడం గమనార్హం. ఈ ఏడాది జూలైలో వెస్టిండీస్ పర్యటనలో వన్డే, టెస్టు, టీ20 ఫార్మాట్లలో భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ముఖేష్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్-2022 వేలంలో అతడిని రూ. 5 కోట్లకు ఢిల్లీ కొనుగోలు చేసింది. -
IND vs AUS: భారత జట్టులో కీలక మార్పు! స్టార్ బౌలర్ ఎంట్రీ
గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టీ20కు టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ దూరమయ్యాడు. తన పెళ్లి కారణంగా మూడో టీ20కు ముందు ముఖేష్‌ను జట్టు నుంచి బీసీసీఐ రిలీజ్ చేసింది. ఇక అతడి స్ధానాన్ని మరో యువ ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ బీసీసీఐ భర్తీ చేసింది. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్ వేదికగా మంగళవారం వెల్లడించింది. అయితే రాయ్‌పూర్ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు ముందు అతడు జట్టుతో కలవనున్నాడు. ముఖేష్ జట్టులోకి వచ్చినప్పటికీ చాహర్ కూడా జట్టులో కొనసాగనున్నాడు. "గౌహతిలో ఆస్ట్రేలియాతో జరిగే మూడో టీ20కి ముందు టీమిండియా నుంచి తనను విడుదల చేయాలని ఫాస్ట్ బౌలర్ ముఖేష్ కుమార్ బీసీసీఐని అభ్యర్థించాడు. ముఖేష్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. దీంతో అతడికి సెలవు మంజూరు చేయబడింది. అతడి స్ధానంలో దీపక్ చాహర్ జట్టుతో చేరాడు. ముఖేష్ తిరిగి రాయ్‌పూర్‌లో జరిగే 4వ టీ20కి ముందు జట్టులో చేరనున్నాడని" బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా దీపక్ చాహర్ చివరగా గతేడాది దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌లో టీమిండియా తరపున ఆడాడు. చదవండి: సచిన్ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! తొందరపడి ముందే ఎందుకు Update: Fast bowler Mukesh Kumar made a request to BCCI to be released from India’s squad ahead of the third T20I against Australia in Guwahati. Mukesh is getting married and has been granted leave for the duration of his wedding festivities. He will join the squad ahead of the… — BCCI (@BCCI) November 28, 2023 -
సిరాజ్, ప్రసిద్ద్ కాదు.. అతడే జూనియర్ మహ్మద్ షమీ: అశ్విన్
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా యువ పేసర్ ముఖేష్ కుమార్ తన బౌలింగ్ స్కిల్‌తో అందరని అకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముఖేష్ వికెట్లు పడగొట్టకపోయినప్పటికీ.. తన బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ముఖ్యంగా ఆఖరి ఓవర్ వేసిన ముఖేష్ కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి ఆసీస్ జోరుకు కళ్లెం వేశాడు. చివర్ ఓవర్లో అతడు బౌన్సర్లు, యార్కర్లు వేసి ఆసీస్ బ్యాటర్లను సైలెంట్‌గా వుంచాడు. ఓవరాల్‌గా తన 4 ఓవర్ల కోటాలో ముఖేష్ 29 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఇక తిరునవంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో కూడా సత్తాచాటాలని ముఖేష్ కుమార్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో ముఖేష్ కుమార్‌పై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ముఖేష్‌కు మహ షమీ లాంటి బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయని అశ్విన్ కొనియాడాడు. "నేను మొదట్లో మహ్మద్ సిరాజ్ జూనియర్ షమీ అవుతాడని అనుకున్నాను. కానీ ఇప్పుడు యువ పేసర్ ముఖేష్ కుమార్‌ను చూస్తే జూనియర్ షమీ అవుతాడని అన్పిస్తుంది. షమీ అని అందరూ ముద్దుగా 'లాలా' అని పిలుస్తారు. నేను మాత్రం షమీని లాలెట్టన్ అని పిలుస్తాను. ఎందుకంటే నాకెంతో ఇష్టమైన నటుడి మోహన్ లాల్ ముద్దుపేరు లాలెట్టన్. ముఖేష్.. షమీ బౌలింగ్ యాక్షన్‌ను పోలి ఉన్నాడు. అతడితో పాటు సమానమైన ఎత్తును కూడా కలిగి ఉన్నాడు. అతడితో అద్భుతంగా యార్కర్లు బౌలింగ్ చేయగలడు. బంతిపై మంచి కంట్రోల్, అద్భుతమైన బ్యాక్-స్పిన్ కలిగి ఉన్నాడు. వెస్టిండీస్‌లో జరిగిన సిరీస్‌లో అతడు బాగా బౌలింగ్ చేశాడు. బార్బడోస్‌లో జరిగిన ప్రాక్టీస్ గేమ్‌లో అత్యుత్తమంగా రాణించాడని" తన యూట్యూబ్ ఛానల్లో అశ్విన్ పేర్కొన్నాడు. చదవండి: మంచి మనసు.. ఓ వ్యక్తి ప్రాణం కాపాడిన మహ్మద్ షమీ! వీడియో వైరల్ -
కన్నప్పలో ఎంట్రీ
సీనియర్ నటులు మంచు మోహన్‌బాబు, శరత్‌కుమార్ ‘కన్నప్ప’ మూవీ సెట్స్‌లో ఎంట్రీ ఇచ్చారు. మంచు విష్ణు కలలప్రాజెక్ట్గా రూపొందుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై నటుడు, నిర్మాత మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం న్యూజిల్యాండ్‌లో జరుగుతోంది. హీరో ప్రభాస్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ ఈ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. తాజాగా నటుడు మంచు మోహన్‌బాబు, శరత్ కుమార్ ‘కన్నప్ప’లో భాగమైనట్లు ప్రకటించి, వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోని విడుదల చేశారు. ‘‘శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్ర చుట్టూ ఈ చిత్రకథ తిరుగుతుంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
'నిన్నెవరు వెళ్లమన్నారు.. వెనక్కి వచ్చేయ్'.. రూల్స్ ఒప్పుకోవు
వెస్టిండీస్‌తో తొలి టి20లో టీమిండియా నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. విండీస్ విధించిన 150 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో టీమిండియా టాపార్డర్, మిడిలార్డర్ విఫలమవడంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 145 పరుగులకే పరిమితమైంది. తిలక్ వర్మ 39, సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు ఉన్నంతవరకు మ్యాచ్ టీమిండియావైపే ఉన్నప్పటికి.. స్వల్ప వ్యవధిలో వీరిద్దరు ఔట్ కావడం.. ఆ తర్వాత పాండ్యా(19 పరుగులు) వెనుదిరగడంతో టీమిండియా ఓటమి దాదాపు ఖరారైపోయింది. సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లు ఉన్నప్పటికి రాణించడంలో విఫలమయ్యారు. ఇక భారత ఇన్నింగ్స్ చివర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. యజ్వేంద్ర చహల్ బ్యాటింగ్ ఆర్డర్‌పై చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. వాస్తవానికి 10వ నెంబర్లో ముకేశ్ కుమార్.. చహల్ చివరి స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. కుల్దీప్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగిన సమయంలో టీమిండియా విజయానికి ఐదు బంతుల్లో 10 పరుగులు కావాలి. ముకేశ్ పొడగరి కాబట్టి విండీస్ బౌలర్లను ఎదుర్కొని ఆడే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని పదో నెంబర్లో బ్యాటింగ్‌కు పంపాలని భావించింది. కానీ సమన్వయ లోపంతో చహల్ అప్పటికే 10వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చేశాడు. క్రీజులోకి వచ్చేసిన చహల్ స్ట్రైకింగ్ తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యాలు డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చి చహల్‌ను వెనక్కి రావాలని పిలుపునిచ్చారు. దీంతో చహల్ మళ్లీ పెవిలియన్ వైపు వెళ్లడానికి సిద్దమయ్యాడు. కానీ నిబంధనల ప్రకారం మ్యాచ్‌లో ఒక బ్యాటర్ మైదానంలో అడుగుపెట్టిన తర్వాత మళ్లీ తిరిగి వెళ్లడానికి ఆస్కారం ఉండదు. ఈ విషయం పాండ్యా, ద్రవిడ్‌లకు లేటుగా తెలియడంతో ఏం చేయలేకపోయారు. కెప్టెన్ పిలుపుతో ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చిన చహల్‌ను అంపైర్ వెనక్కి పిలవడంతో మళ్లీ బ్యాటింగ్‌కు రావాల్సి వచ్చింది. ఈ సమయంలో ముకేశ్ కుమార్ బౌండరీ లైన్ వద్ద బ్యాటింగ్‌కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తానికి చహల్ చర్య మనకు నవ్వు తెప్పిస్తే.. మేనేజ్మెంట్ను మాత్రం గందరగోళానికి గురి చేసింది. ఇక చివరి ఐదు బంతుల్లో ఆరు పరుగులు మాత్రమే చేసిన టీమిండియా నాలుగు పరుగుల తేడాతో మ్యాచ్‌ను విండీస్‌కు అప్పగించింది. Yuzvendra Chahal walked out at No.10, but the Indian team wanted Mukesh Kumar. Chahal walked off and entered again as he took the field already#Yuzvendrachahal😂😂#INDvWI pic.twitter.com/8rWxh30ahh — Md Nayab 786 🇮🇳 (@mdNayabsk45) August 3, 2023 చదవండి: ధోని రనౌట్‌తో పోలుస్తున్నారు.. శాంసన్ కెరీర్ ముగిసినట్లా! -
టీమిండియా బౌలర్ అరుదైన ఘనత.. రెండో భారత క్రికెటర్‌గా
టీమిండియా పేసర్ ముఖేష్ కుమార్ అరుదైన ఘనత సాధించాడు. ఒకే టూర్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా ముఖేష్ కుమార్ రికార్డులకెక్కాడు. ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20కు తుది జట్టులో చోటు దక్కించుకున్న ముఖేష్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరిట లిఖించకున్నాడు. అంతకుముందు ముఖేష్ ఇదే పర్యటనలో విండీస్‌పై టెస్టు, వన్డే డెబ్యూ చేశాడు. కాగా ఈ ఘనత సాధించిన జాబితాలో ముఖేష్ కంటే ముందు టీమిండియా పేసర్ నట్రాజన్ ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు ఫార్మాట్లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కాగా విండీస్‌తో జరిగిన తొలి టీ20లో ముఖేష్ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్ 24 పరుగులిచ్చి వికెట్లు ఏమీ పడగొట్టలేదు. అంతకుముందు విండీస్‌తో సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మాత్రం ముఖేష్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మూడు కీలక వికెట్లు పడగొట్టి భారత విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక తొలి టీ20 విషయానికి వస్తే.. విండీస్ చేతిలో 4 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో హార్దిక్‌సేన చతికిలపడింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగల్గింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ(39) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. విండీస్ బౌలరల్లో మెకాయ్, హోల్డర్, షెపర్డ్ తలా రెండు వికెట్లు సాధించగా, అకేల్ హోసేన్ ఒక్క వికెట్ పడగొట్టాడు .అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. కెప్టెన్ పావెల్(48), పూరన్(41) పరుగులతో రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. చదవండి: అస్సలు నేను ఊహించలేదు.. కొన్ని తప్పులు చేశాం! అతడొక సంచలనం: హార్దిక్ పాండ్యా -
'అమ్మ.. నీ ప్రార్థనలు ఫలించాయి; చల్లగా ఉండు బిడ్డా'
వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తరపున ముకేశ్ కుమార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. కాగా కిర్క్ మెకెంజీ రూపంలో ముకేశ్ కుమార్ తొలి అంతర్జాతీయ వికెట్ సాధించాడు. 32 పరుగులు చేసిన మెకెంజీ ముకేశ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు.కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఇదిలా ఉంటే టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ముకేశ్‌కుమార్ ఈ విషయాన్ని తన తల్లికి ఫోన్‌కాల్‌లో తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యాడు. ''హలో అమ్మా.. నీ ప్రార్థనలకు ఈరోజు సమాధానం దొరికింది. ఎట్టకేలకు దేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం వచ్చిందంటూ తల్లితో పేర్కొన్నాడు. ముకేశ్ తల్లి స్పందిస్తూ.. సంతోషంగా ఉండు.. కెరీర్లో ఎదిగే ప్రయత్నం చెయ్యు.. నా దీవెనలు ఎప్పుడు నీ వెంట ఉంటాయి'' అంటూ పేర్కొంది. దీనికి సంబంధించిన వీడియోనూ బీసీసీఐ వీడియో రూపంలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. 2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. 2018-19 రంజీ సీజన్లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు. No Dream Too Small! 🫡 Mukesh Kumar's phone call to his mother after his Test debut is all heart ❤️#TeamIndia | #WIvIND pic.twitter.com/Sns4SDZmi2 — BCCI (@BCCI) July 21, 2023 Mukesh Kumar's maiden Test wicket! A moment for him to savour. A video for you to savour. #INDvWIonFanCode #WIvIND pic.twitter.com/fpCQSf1LsF — FanCode (@FanCode) July 22, 2023 చదవండి: #HarmanpreetKaur: 'డేర్ అండ్ డాషింగ్' హర్మన్‌ప్రీత్.. కుండ బద్దలయ్యేలా! -
తొలి అంతర్జాతీయ వికెట్ సాధించిన ముఖేష్ కుమార్..
ట్రినిడాడ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టుకు వర్షం అంతరాయం కలిగించింది. 86/1 ఓవర్ నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభంచిన విండీస్ 117 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. 32 పరుగులు చేసిన మెకెంజీ.. ముఖేష్ కుమార్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ముఖేష్ కుమార్‌కు ఇదే తొలి అంతర్జాతీయ వికెట్ కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌తోనే అతడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. ఇక విండీస్ రెండో వికెట్ కోల్పోయిన వెంటనే వర్షం మొదలు కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి విండీస్ రెండు వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ క్రెగ్ బ్రాత్‌వైట్ 49 పరుగులతో ఉన్నాడు. ఇక అంతకుముందు భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. భారత బ్యాటర్లలో కోహ్లి(121) అద్బుతమైన సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ రోహిత్ శర్మ(80), జడేజా(61) పరుగులతో రాణించారు. విండీస్ బౌలర్లలో రోచ్, వారికిన్ తలా మూడు వికెట్లు సాధించగా.. హోల్డర్ రెండు, గాబ్రియల్ ఒక్క వికెట్ పడగొట్టాడు. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. టీమిండియాకు గుడ్ న్యూస్! పంత్ రీ ఎంట్రీ -
పోలీస్ అవ్వాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఇలా!
టీమిండియా తరపున ఆడాలన్న బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ కల ఎట్టకేలకు నేరవేరింది. ట్రినిడాడ్ వేదికగా వెండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టుతో ముఖేష్ కుమార్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున అంతర్జాతీయ అరేగంట్రం చేసిన 395వగా ఆటగాడిగా ముఖేష్ కుమార్ నిలిచాడు. కాగా దాదాపు ఏడాది నుంచి భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. ప్లేయింగ్ ఎలెవన్‌లో మాత్రం ముఖేష్ కుమార్‌కు చోటు దక్కడం లేదు. అయితే రెండో టెస్టుకు గాయం కారణంగా పేసర్ శార్ధూల్ ఠాకూర్ దూరం కావడంతో.. ముఖేష్ ఎంట్రీకి మార్గం సుగమమైంది. ఈ క్రమంలో ముఖేష్ కుమార్‌కు గురుంచి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ ముఖేష్ కుమార్? 28 ఏళ్ల ముఖేష్ కుమార్ 1998లో బీహార్‌లోని గోపాల్‌గంజ్‌లో జన్మించాడు. అతడి తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. అయితే ముఖేష్ మొదటి నుంచి మిలిటరీ, పోలీస్ ఉద్యోగాల్లో చేరి దేశానికి సేవచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలో 2012లో నిర్వహించిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, బీహార్ పోలీస్ ఉద్యోగాల వ్రాత పరీక్షలను ముఖేష్ క్లియర్ చేశాడు. కానీ పోషకాహార లోపం బోన్ ఎడిమ, మోకాళ్ల నొప్పుల కారణంగా ఫిట్నెస్ పరీక్షల్లో మాత్రం అతడు నెగ్గలేకపోయాడు. ఈ సమయంలో అతడి తండ్రి సూచన మేరకు ముఖేష్ కుమార్ క్రికెట్ వైపు అడుగులు వేశాడు. తన సొంత రాష్ట్రం బిహార్‌లో అవకాశాలు తక్కువగా ఉండటంతో వెస్ట్‌బెంగాల్‌కు తన మకాం మార్చాడు. అక్కడకు వెళ్లాక కోల్‌కతాలోని బని నికేతన్ స్పోర్ట్స్ క్లబ్లో బీరేంద్ర సింగ్ ఆధ్వర్యంలో శిక్షణ పొందాడు. ఆ తర్వాత బెంగాల్ డివిజన్ లీగ్ క్రికెట్లో తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అనంతరం 2014లో సౌరవ్ గంగూలీ విజన్ 2020 పోగ్రాంకు షార్ట్‌లిస్ట్ చేసిన జాబితాలో ముఖేష్ కుమార్‌కు చోటు దక్కింది. దీంతో బెంగాల్ రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు నిర్వహించిన ట్రయల్స్‌లో ముఖేష్ కుమార్ పాల్గొనున్నాడు. ఇదే అతడికి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. అయితే ఇదే సమయంలో అతడికి ఫిట్నెస్ ఒక ప్రధాన సమస్యగా వెంటాడింది. కానీ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) సహకారంతో అతడు తన ఫిట్నెస్ లెవల్స్‌ను పెంచుకున్నాడు. ఆ తర్వాత 2015లో బెంగాల్ తరపున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లోకి ముఖేష్ అడుగుపెట్టాడు. కానీ ఎక్కువ కాలం తన సంతోషాన్ని ముఖేష్ నిలుపుకోలేకపోయాడు. పేలవ ప్రదర్శన, ఫిట్నెస్ కారణంగా రెగ్యూలర్‌గా అతడికి జట్టులో చోటు దక్కేది కాదు. కానీ 2018-19 రంజీ సీజన్లో తన సత్తా ఎంటో క్రికెట్ ప్రపంచానికి ముఖేష్ తెలియజేశాడు. ఆ సీజన్లో కర్ణాటకతో జరిగిన సెమీఫైనల్లో 6 వికెట్లు పడగొట్టి.. బెంగాల్‌ను ఫైనల్‌కు చేర్చాడు. ఆ తర్వాత ముఖేష్ తన కెరీర్లో వెనక్కి తిరిగి చూడలేదు. తన ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 39 మ్యాచ్‌లు ఆడిన అతడు 149 వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు నుంచి పిలుపు దేశీవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తుండడంతో అతడికి దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత సెలక్టర్లు తొలిసారి పిలుపునిచ్చారు. కానీ అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రాలేదు. అనంతరం శ్రీలంకతో సిరీస్‌కు ఎంపికైనప్పటికీ తుది జట్టులో మాత్రం చోటుదక్కలేదు. ఈ క్రమంలో ఐపీఎల్లో మాత్రం అతడికి అదృష్టం వరించింది. ఐపీఎల్-2023 మినీ వేలంలో రూ. 20 లక్షల బేస్ ప్రైజ్‌తో వచ్చిన అతడిని ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. ఈ ఏడాది సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన అతడు కేవలం 7 వికెట్లు మాత్రమే సాధించాడు. అనంతరం డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా కూడా ఎంపికయ్యాడు. -
వెస్టిండీస్‌తో రెండో టెస్టు.. ముఖేష్ కుమార్ అరంగేట్రం! తుది జట్లు ఇవే
ట్రినిడాడ్ వేదికగా భారత్-వెస్టిండీస్ మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి టెస్టులో విండీస్ రెండు మార్పులతో బరిలోకి దిగింది. యువ బ్యాటర్ కిర్క్ మెకెంజీ డెబ్యూ చేయగా.. పేసర్ షానన్ గాబ్రియెల్ తుది జట్టులోకి వచ్చాడు. మరోవైపు టీమిండియా ఒకే ఒక మార్పుతో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు శార్ధూల్ ఠాకూర్ గాయం కారణంగా దూరమయ్యాడు. అతడి స్ధానంలో బెంగాల్ పేసర్ ముఖేష్ కుమార్ టెస్టుల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తుది జట్లు వెస్టిండీస్: క్రెయిగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), టాగెనరైన్ చంద్రపాల్, కిర్క్ మెకెంజీ, జెర్మైన్ బ్లాక్‌వుడ్, అలిక్ అథానాజ్, జాషువా డా సిల్వా (వికెట్ కీపర్), జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కెమర్ రోచ్, జోమెల్ వారికన్, షానన్ గాబ్రియెల్ భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయదేవ్ ఉనద్కత్, ముఖేష్ కుమార్, మహ్మద్ సిరాజ్ చదవండి: Tilak Varma: స్కూల్లో అకౌంట్ సెక్షన్లో పనిచేశా! తిలక్ వల్లే ఇలా! ఇప్పుడు తను మారిపోయాడు! ఆశ్చర్యపోయా.. -
విండీస్‌తో తొలి టెస్ట్.. ముగ్గురు టీమిండియా ఆటగాళ్ల అరంగేట్రం..!
విండీస్‌లో భారత పర్యటన జులై 12న మొదలయ్యే తొలి టెస్ట్ నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. డొమినికా వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌ను దూరదర్శన్ ఛానల్‌తో పాటు జియో సినిమా ఫ్యాన్ కోడ్ యాప్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ తర్వాత దాదాపు నెల పాటు విరామం తీసుకున్న టీమిండియా.. విండీస్‌తో టెస్ట్ సిరీస్ ద్వారా తిరిగి బరిలోకి దిగనుంది. డబ్ల్యూటీసీ 20223-25 సైకిల్లో భారత్‌కు ఇది తొలి మ్యాచ్ కావడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యువకులు, అనుభవజ్ఞులు జట్టులో ఉండటంతో భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఈ విషయంపై పలు ప్రముఖ క్రికెట్ వెబ్సైట్లు కథనాలను ప్రసారం చేస్తున్నాయి. విండీస్‌తో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తమ అంచనాలను వెల్లడిస్తున్నాయి. వెబ్సైట్లలో కథనాల విషయాన్ని పక్కన పెడితే.. బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు విండీస్‌తో తొలి టెస్ట్ ద్వారా ముగ్గురు టీమిండియా ఆటగాళ్లు టెస్ట్ అరంగేట్రం చేయనున్నారని తెలుస్తోంది. యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్, ముకేశ్ కుమార్ తొలిసారి భారత టెస్ట్ జెర్సీల్లో కనిపించనున్నారని సమాచారం. ఈ ముగ్గురు తుది జట్టులో ఉండటం ఖాయమని.. ఆంధ్ర ఆటగాడు కేఎస్ భరత్, రుతరాజ్ గైక్వాడ్, అక్షర్ పటేల్, ఉనద్కత్, నవ్‌దీప్ సైనీలకు మొండిచెయ్యి తప్పదని తెలుస్తోంది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగుతారని, యశస్వి జైస్వాల్.. పుజారా స్థానంలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వస్తాడని సమాచారం. ఆతర్వాత విరాట్ కోహ్లి, అజింక్య రహానే బరిలోకి దిగుతారని, ఇషాన్ కిషన్ ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాడని తెలుస్తోంది. ఆల్‌రౌండర్ల కోటాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్లు తుది జట్టులో ఉంటారని, స్పెషలిస్ట్ పేసర్‌గా మహ్మద్ సిరాజ్‌తో పాటు ముకేశ్ కుమార్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడని సమాచారం. -
విండీస్ పర్యటనకు జట్ల ఎంపిక పూర్తి.. నలుగురు మాత్రం వెరీ వెరీ స్పెషల్
త్వరలో ప్రారంభంకానున్న వెస్టిండీస్ పర్యటనకు భారత జట్ల ఎంపిక పూర్తయ్యింది. విండీస్ పర్యటనలో భారత్ మూడు ఫార్మాట్ల సిరీస్‌లు ఆడనుంది. ఈ మూడు సిరీస్‌ల కోసం భారత సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించారు. అయితే ఈ పర్యటన నిమిత్తం ఎంపిక చేసిన ఆటగాళ్లలో సెలెక్టర్లు నలుగురికి పెద్ద పీట వేశారు. వారు తమకు వెరీ వెరీ స్పెషల్ అన్నట్లుగా వ్యవహరించారు. రోహిత్, కోహ్లిల కంటే వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. హిట్‌మ్యాన్, రన్ మెషీన్లను టీ20 జట్టులోకి తీసుకోని సెలెక్టర్లు.. మూడు ఫార్మాట్ల జట్లలో ఆ నలుగరుని ఎంపిక చేసి, వన్డే వరల్డ్‌కప్ కోసం వారిని సిద్దం చేస్తున్నామన్న సంకేతాలిచ్చారు. ఆ నలుగురు ఎవరంటే.. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, ముకేశ్ కుమార్. ఈ నలుగరు క్రికెటర్లు టెస్ట్, వన్డే, టీ20 జట్లకు ఎంపికయ్యారు. సెలెక్టర్లు వీరికి ఇచ్చిన ప్రాధాన్యతను బట్టి చూస్తే మూడు ఫార్మాట్ల తుది జట్టలో వీరు ఉండటం ఖాయమని తెలుస్తుంది. గిల్ సూపర్ ఫామ్ దృష్ట్యా ఎలాగూ తుది జట్టులో ఉంటాడు. టీమిండియాకు రెగ్యులర్ వికెట్‌కీపర్ లేనందున ఇషాన్ కిషన్ కూడా లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఒకవేళ సంజూ శాంసన్‌ను కూడా తుది జట్టులోకి తీసుకోవాలని భావిస్తే, ఇషాన్ బ్యాటర్‌గానైనా కొనసాగే అవకాశం ఉంది. టెస్ట్‌ల్లో జడేజాకు అవకాశం ఇచ్చినా.. వన్డే, టీ20ల్లో అక్షర్ పటేల్ స్థానానికి ఢోకా ఉండదు. ఇక ఈ నలుగురిలో మోస్ట్ లక్కీ ఎవరంటే ముకేశ్ కుమారేనని చెప్పాలి. షమీ గైర్హాజరీలో స్పెషలిస్ట్ రైట్ ఆర్మ్ పేసర్ కోటాలో ముకేశ్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ నలుగురు విండీస్ పర్యటన పరిమిత ఓవర్ల సిరీస్‌లలో రాణిస్తే, వరల్డ్‌కప్ బెర్త్ దక్కించుకోవడం ఖాయం. విండీస్‌తో టెస్టులకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కెఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ఆర్ అశ్విన్, ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, నవదీప్ సైనీ. వన్డే సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఆర్ జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, చహల్, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్. టీ20 సిరీస్‌కు భారత జట్టు: ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (కెప్టెన్), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్. విండీస్ పర్యటన వివరాలు.. జులై 12-16- తొలి టెస్ట్, డొమినికా జులై 20-24- రెండో టెస్ట్, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ జులై 27- తొలి వన్డే, బ్రిడ్జ్‌టౌన్ జులై 29- రెండో వన్డే, బ్రిడ్జ్‌టౌన్ ఆగస్ట్ 1- మూడో వన్డే, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 4- తొలి టీ20, పోర్ట్ ఆఫ్ స్పెయిన్ ఆగస్ట్ 6- రెండో టీ20, గయానా ఆగస్ట్ 8- మూడో టీ20, గయానా ఆగస్ట్ 12- నాలుగో టీ20, ఫ్లోరిడా ఆగస్ట్ 13- ఐదో టీ20, ఫ్లోరిడా -
టీమిండియా భవిష్యత్తు స్పీడ్ గన్ అతడే..!
టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. భారత టెస్ట్ జట్టు భవిష్యత్తు స్టార్ పేసర్లుగా ముగ్గురు పేర్లను ప్రకటించాడు. ముకేశ్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్‌లు మున్ముందు టీమిండియా టెస్ట్ బౌలర్లు స్థిరపడతారని అభిప్రాయపడ్డాడు. ఈ ముగ్గురిని సాన పడితే టీమిండియా తరఫున అద్భుతాలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. వీరిలో ముకేశ్ కుమార్‌పై మరింత ఫోకస్ పెడితే ప్రపంచంలోకెళ్లా మేటి బౌలర్‌గా అవతరిస్తాడని జోస్యం చెప్పాడు. ముకేశ్ కుమార్‌కు సరైన గైడెన్స్ ఇస్తే అతను ఏం చేయగలడో గమనించానని చెప్పిన ఇషాంత్.. తన ఢిల్లీ క్యాపటిల్స్ సహచర బౌలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. ముకేశ్ లాంటి అతి సాధారణ వ్యక్తిని తాను చూడలేదని, అతనిని ఫలానా డెలివరీ వేయమని అడిగితే, ఖచ్చితంగా అది వేయగల సమర్ధత అతని దగ్గరుందని అన్నాడు. ఒత్తిడిలో సైతం ముకేశ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తాడని, అలాంటి సమయాల్లో అతను బంతిని నియంత్రణలో ఉంచుకోగలడని తెలిపాడు. ఉమ్రాన్, అర్షదీప్‌ల విషయానికొస్తే.. వీరిని కొద్దిగా సానబడితే చాలా కాలం పాటు టీమిండియాకు సేవలందించగలరని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా ఈ ముగ్గురిని టెస్ట్ క్రికెట్ కోసం ప్రిపేర్ చేస్తే భారత పేస్ దళానికి మరో ఐదారేళ్ల పాటు ఢోకా ఉండదని అన్నాడు. ఈ విషయాలన్నిటినీ ఇషాంత్ రణ్వీర్ అలహాబాదియా యూట్యూబ్ పోడ్కాస్ట్లో విశ్లేషించాడు. ఇదిలా ఉంటే, త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్, వన్డే జట్లలో ముకేశ్ కుమార్, ఉమ్రాన్ మాలిక్‌లకు చోటు దక్కించుకున్నారు. ఉమ్రాన్ కేవలం వన్డే జట్టుకు ఎంపిక కాగా.. ముకేశ్ కుమార్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నాడు. సెలెక్టర్లు మహ్మద్ షమీకి రెస్ట్ ఇచ్చి మరీ ముకేశ్ కుమార్‌కు అవకాశం ఇచ్చారు. విండీస్ పర్యటనలో మహ్మద్ సిరాజ్ ఆధ్వర్యంలో జయదేవ్ ఉనద్కత్, శార్దూల్ ఠాకూర్, నవ్‌దీప్ సైనీలతో కూడిన టెస్ట్ జట్టులో ముకేశ్ సభ్యుడిగా ఉన్నాడు. -
నాన్న సంతోషించి ఉంటారు.. మెదడులో రక్తస్రావంతో! గంగూలీ సర్, రణదేవ్ సర్ వల్లే..
‘‘నా కల నెరవేరింది. టీమిండియా తరఫున టెస్టులు ఆడాలన్న ఆశయం దిశగా అడుగులు పడ్డాయి. నా ఈ ఎదుగుదల చూసి నాన్న తప్పకుండా సంతోషించి ఉంటారు. నేను ఈ స్థాయికి చేరుకున్నాననంటే అందుకు అమ్మానాన్న, నా స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహమే కారణం. వాళ్ల మద్దతునే నేను అనుకున్నది సాధించగలిగాను’’ అని బెంగాల్ పేసర్ ముకేశ్ కుమార్ భావోద్వేగానికి లోనయ్యాడు. పోషకాహార లోపంతో కాగా బిహార్‌కు చెందిన ముకేశ్ కుమార్ పేద కుటుంబంలో జన్మించాడు. అతడి తండ్రి టాక్సీ డ్రైవర్‌గా పనిచేసేవాడు. ఈ క్రమంలో తండ్రితో పాటు 2012లో బెంగాల్‌కు చేరుకున్న ముకేశ్.. క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్నాడు. కానీ పోషకాహార లోపం బోన్ ఎడిమ, మోకాళ్ల నొప్పులతో ఇబ్బందులు పడటం అతడి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేశాయి. ఈ క్రమంలో బెంగాల్ మాజీ స్పీడ్‌స్టర్ రణదేవ బోస్ పరిచయం ముకేశ్ జీవితాన్ని మలుపు తిప్పింది. అతడి ప్రోత్సాహంతో అంచెలంచెలుగా ఎదిగి బెంగాల్ తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడటం మొదలుపెట్టాడు. ఏకంగా 5.5 కోట్ల రూపాయలు ఫస్ట్‌క్లాస్ మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న ముకేశ్ కుమార్ కోసం ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఈ క్రమంలో ఐపీఎల్-2023 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా 5.5 కోట్ల రూపాయాలకు అతడిని కొనుగోలు చేసింది. దీంతో.. అంతకు ముందు 20 లక్షల కనీస ధరతో సీఎస్కే తరఫున ఆడిన అతడి పంట పండినట్లయింది. ఇక దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ సందర్భంగా తొలిసారి భారత జట్టుకు ఎంపికైన ముకేశ్‌కు తుదిజట్టులో ఆడే అవకాశం మాత్రం రాలేదు. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్- 2023కి స్టాండ్ బైగా ఎంపికైన అతడు.. వెస్టిండీస్‌తో టీమిండియా టెస్టు, వన్డే సిరీస్ నేపథ్యంలో తాజాగా మరోసారి సెలక్టర్ల పిలుపు అందుకున్నాడు. ఈ విషయంపై స్పందించిన ముకేశ్ హర్షం వ్యక్తం చేశాడు. స్వర్గస్తుడైన తన తండ్రిని తలచుకుని ఎమోషనల్ అయ్యాడు. అదే విధంగా తన గురువు రణదేవ్ పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ తనకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకున్నాడు. గంగూలీ సర్, రణదేవ్ సర్ వల్లే ‘‘సౌరవ్ గంగూలీ సర్, జాయ్దీప్ ముఖర్జీ సర్.. నా గురువు రణదేవ్ బోస్ సర్.. అందించిన సహాయసహకారాలు మరువలేనివి. వాళ్ల మద్దతే లేకుంటే నేను ఇక్కడిదాకా వచ్చే వాడినే కాదు. ముఖ్యంగా రణదేవ్ బోస్ సర్ రెడ్ బాల్ క్రికెట్లో నాకు మార్గదర్శనం చేసి నన్ను సరైన దారిలో నడిపించారు’’ అని ముకేశ్ కుమార్ చెప్పుకొచ్చాడు. ‘‘ఎక్కడ మొదలుపెట్టాను.. ఎక్కడిదాకా వచ్చాను. నా జీవితం పరిపూర్ణమైనట్లు అనిపిస్తోంది’’ అని ఎగ్జైట్ అయ్యాడు. కాగా ముకేశ్ కుమార్ తండ్రి 2019లో మరణించాడు. మెదడులో రక్తస్రావం కావడంతో శాశ్వతనిద్రలోకి వెళ్లిపోయాడు. విండీస్‌తో రెండు టెస్టులకు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ. చదవండి: లెజండరీ ఓపెనర్ దిల్షాన్.. డీకే మాదిరే! ఉపుల్ తరంగతో భార్య ‘బంధం’.. అతడినే పెళ్లాడి! -
విండీస్ టూర్ తో ఎంట్రీ ఇవ్వబోతున్న ప్లేయర్లెవరు? జైశ్వాల్‌తో సహా
లండన్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓటమిపాలైన భారత జట్టు.. ఇప్పుడు మరో విదేశీ పర్యటనకు సిద్దమైంది. నెలరోజుల విశ్రాంతి తర్వాత టీమిండియా విండీస్ టూర్‌కు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా భాగంగా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. జూలై 12న డొమినికా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో టీమిండియా టూర్ ప్రారంభంకానుంది. ఇక ఈ విండీస్ పర్యటనలో పలువురు యువ క్రికెటర్లు భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసే ఛాన్స్ ఛాన్స్ ఉంది. టీమిండియా తరపున ఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లపై ఓ లూక్కేద్దం. యశస్వీ జైశ్వాల్ 21 ఏళ్ల యశస్వీ జైశ్వాల్ కరేబియన్ టూర్లో భారత తరపున టెస్టు, టీ20ల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. జైశ్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో జైశ్వాల్ దుమ్మురేపాడు. ఐపీఎల్-2023లో ఓవరాల్‌గా 14 మ్యా్చ్లు ఆడిన ఈ యువ ఓపెనర్.. 625 పరుగులు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్‌గా జైశ్వాల్ చరిత్ర సృష్టించాడు. ముఖేష్ కుమార్ బెంగాల్‌కు చెందిన ఈ ఎక్స్‌ప్రెస్ పేసర్ టీమిండియా తరపున టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. గత కొన్ని టెస్టు సిరీస్‌లకు భారత జట్టుకు ముఖేష్ ఎంపికవతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే ఛాన్స్ మాత్రం లభించలేదు. అదే విధంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా రిజర్వ్ బౌలర్‌గా ముఖేష్ ఎంపికయ్యాడు. అద్బుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్న ముఖేష్ కుమార్ కచ్చితంగా విండీస్ సిరీస్‌తో తన అంతర్జాతీయ కెరీర్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. రింకూ సింగ్.. రింకూ సింగ్.. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ ఫినిషర్లలో ఒకడిగా పేరొందాడు. ఐపీఎల్-2023లో రింకూ సింగ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది కేకేఆర్‌కు సంచలన విజయాన్ని అందించిన రింకూ.. ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. రింకూ విండీస్ పర్యటనలో టీ20ల్లో భారత తరపున అరంగేట్రం చేసే ఛాన్స్ ఉంది. సర్ఫరాజ్ ఖాన్ ముంబైకు చెందిన సర్ఫరాజ్ ఖాన్ దేశీవాళీ క్రికెట్లో అద్బుతమైన ప్రదర్శరన కనబరుస్తున్నాడు. అయినప్పటకీ భారత సెలక్టర్లు అతడిని పట్టించుకోవడవవలేదని గత కొంత కాలంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో విండీస్‌తో టెస్టు సిరీస్‌కు సర్ఫరాజ్ సెలక్టర్లు పిలుపునిచ్చే అవకాశం ఉంది. చదవండి: రోహిత్ వద్దు.. వారిద్దరిలో ఒకరని టీమిండియా కెప్టెన్ చేయండి: మాజీ సెలక్టర్ -
రిటైర్ అవ్వాల్సిన వ్యక్తిని కాను... కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా
న్యూఢిల్లీ: ఇప్పుడే పదవీవిరమణ చేయాల్సిన వ్యక్తిని కాదని, మరో కొత్త ఇన్నింగ్స్ మొదలెడతా అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ముఖేశ్‌కుమార్ రసిక్‌భాయ్(ఎంఆర్) షా సోమవారం వ్యాఖ్యానించారు. భారత సర్వోన్నత న్యాయస్థానంలో నాలుగో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఎంఆర్ షా సోమవారం పదవీవిరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు బార్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ షా ప్రసంగించారు. ‘ రిటైర్ అవ్వాల్సిన వ్యక్తినికాదు. జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా. కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు సరిపడ ధైర్య, స్థైర్య, ఆయుఃఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. రాజ్‌కపూర్ సినిమాలో పాటలోని పదాలు నాకు గుర్తొస్తున్నాయి. రేపు నేను ఆటలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ వినీలాకాశంలో సదా తారనై ఉంటా. పుట్టుక ఇక్కడే. మరణమూ ఇక్కడే’ అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. ‘లాయర్లకు నాదో విన్నపం. అస్తమానం కేసులపై వాయిదాలు కోరకండి. వాదనలకు సిద్ధమై రండి. యువ లాయర్లకు నాదో సలహా బార్ రూమ్‌లోనో, క్యాంటీన్లో కాలక్షేపాలొద్దు. కోర్టు హాల్లో వాదనలు విని అనుభవం గడించండి’ అని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ‘ ధైర్యం, పోరాట స్ఫూర్తి చూస్తే ఆయనను టైగర్ షా అనాల్సిందే. తర్కంతో ఆలోచించే జ్ఞాని. టెక్నాలజీని త్వరగా ఆకళింపుచేసుకుంటారు. కొలీజియం నిర్ణయాలు తీసకునేటపుడు అద్భుతమైన సలహాలిచ్చారు. నేను అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు మొదలైన స్నేహం ఆనాటి నుంచీ కొనసాగింది. ఎవరి ఇళ్లల్లో వాళ్లం ఉన్నాసరే ఫోన్‌చేస్తే చాలు ఆయన ఎప్పుడూ కీలకమైన అంశాలపై చర్చిస్తుండేవారు. కోవిడ్ సంక్షోభకాలంలోనూ విధులు నిర్వర్తించాం’ అని అన్నారు. 2018 నవంబర్ రెండో తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా షా నియమితులయ్యారు. సోమవారం ఆయన రిటైర్‌అవడంతో సుప్రీంకోర్టులో సీజేతో కలిపి మొత్తం జడ్జీల సంఖ్య 32కు పడిపోయింది. ఆదివారం మరో జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి రిటైర్‌కావడం తెల్సిందే. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో జడ్జీల గరిష్ట సంఖ్య 34. జస్టిస్ ఎంఆర్ షా న్యాయ ప్రస్థానం 1982లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా మొదలైంది. 2004 మార్చిలో గుజరాత్ హైకోర్టులో అదనపు న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆ తర్వాతి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 ఆగస్ట్‌లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది నవంబర్‌లో పదోన్నతితో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చారు. -
రుత్‌రాజ్ గైక్వాడ్‌కు బంపరాఫర్.. డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో!
ఐపీఎల్-2023లో అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా యువ ఓపెనర్ రుత్‌రాజ్ గైక్వాడ్ బంపరాఫర్ తగిలింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్ జట్టులో స్టాండ్‌బై ప్లేయర్‌గా రుత్‌రాజ్ గైక్వాడ్‌ను భారత సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడితో పాటు పేసర్ ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్‌కు స్టాండ్‌బై జాబితాలో చోటు దక్కింది. అదే విధంగా గాయం కారణంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు దూరమైన కేఎల్ రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఈ మేరకు సోమవారం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. కాగా డబ్ల్యూటీసీ తుదిపోరులో లండన్ వేదకగా జూన్ 7-11 వరకు టీమిండియా- ఆస్ట్రేలియా తలపడనున్న సంగతి తెలిసిందే. సూపర్ ఫామ్‌లో రుతు ఇక రుత్‌రాజ్ గైక్వాడ్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్లో సీఎస్కే ప్రాతినిధ్యం వహిస్తున్న రుత్‌రాజ్ దుమ్మురేపుతున్నాడు. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన అతడు 384 పరుగులు సాధించాడు. ఆరెంజ్ క్యాప్ రేసులో ఏడో స్థానంలో ఉన్నాడు. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు స్టాండ్‌బైగా ఉన్న రుత్‌రాజ్.. ప్రధాన జట్టులో ఏ ఆటగాడైనా దూరమైతే అతడి స్థానాన్ని భర్తీ చేయనున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ఇక బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో టెస్టు అరంగేట్రం చేసిన సూర్యకుమార్ యాదవ్ తీవ్ర నిరాశ పరిచాడు. ఈ క్రమంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అతడి స్థానంలో వెటరన్ ఆటగాడు అజింక్యా రహానేను సెలక్టర్లు ఎంపికచేశారు. అయితే సూర్య తన ఫామ్‌ను తిరిగి పొందడంతో స్టాండ్‌బై ప్లేయర్‌గా సెలక్టర్లు ఎంపికచేశారు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్న సూర్యకుమార్ పర్వాలేదనపిస్తున్నాడు. ముఖేష్ కుమార్ బిహర్‌కు చెందిన పేసర్ ముఖేష్ కుమార్ గత కొన్ని సిరీస్‌లకు భారత జట్టుకు ఎంపిక అవుతున్నప్పటికీ.. అరంగేట్రం చేసే అవకాశం మాత్రం రావటం లేదు. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన పేసర్లు ఉమేశ్ యాదవ్, శార్ధూల్ ఠాకూర్ ప్రస్తుతం గాయాలతో బాధపడుతున్నారు. ఐపీఎల్-2023లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వీరిద్దరూ మోకాలి గాయంతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరూ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అందుబాటుపై సందిగ్ధం నెలకొంది. ఈ నేపధ్యంలోనే ముఖేష్ కుమార్‌ను స్టాండ్‌బై ప్లేయర్‌గా సెలక్టర్లు ఎంపికచేశారు. చదవండి: #WTC Final: రాహుల్ స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్.. బీసీసీఐ ప్రకటన -
IPL 2023: సన్‌రైజర్స్‌ను ఓడించి, ఢిల్లీని గెలిపించింది అతనే..!
ఐపీఎల్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నిన్న (ఏప్రిల్ 24) మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసుకుని, 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో (34 బంతుల్లో 34, 4-0-21-2) రాణించినందుకు గాను జట్టు వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అక్షర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించినప్పటికీ, ఢిల్లీని గెలిపించింది మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ముకేశ్ కుమారేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఒత్తిడిలో చివరి ఓవర్ బౌల్ చేసిన ముకేశ్ అద్భుతమైన యార్కర్ బంతులను సంధించి, సన్‌రైజర్స్‌ను గెలవనీయకుండా చేశాడని అంటున్నారు. ఆఖరి ఓవర్లో కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని (13 పరుగులు) ముకేశ్ అద్భుతంగా డిఫెండ్ చేశాడని (5 పరుగులు మాత్రమే ఇచ్చాడు), ఢిల్లీపై ఫీల్డింగ్ పెనాల్టీ (30 యార్డ్స్ సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లకు మాత్రమే అనుమతి) అమల్లో ఉన్నా ఎంతో పరిణితితో బౌలింగ్ చేశాడని ముకేశ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుత సీజన్లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన 29 ఏళ్ల ముకేశ్ (బిహార్) ఎంతో అనుభవం ఉన్న బౌలర్లా ఆఖరి ఓవర్లో పరిస్థితులను హ్యాండిల్ చేశాడని, ఐపీఎల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అక్షర్ పటేలే అయినా తమ హీరో మాత్రం ముకేశేనని ఢిల్లీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సైతం ముకేశే తమను గెలిపించాడని, ఒత్తిడిలో అతడు పరిస్థితులను హ్యాండిల్ చేసిన తీరు అమోఘమని ప్రశంసల వర్షం కురిపించింది. ఈ సీజన్లో లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ముకేశ్.. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు పడగొట్టాడు. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్ (21), మిచెల్ మార్ష్ (25), మనీశ్‌పాండే (34), అక్షర్ పటేల్ (34) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2, నటరాజన్ ఓ వికెట్ పడగొట్టారు. కష్టసాధ్యంకాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్.. ఇషాంత్ శర్మ (1/18), నోర్జే (2/33), ముకేశ్ (0/27), అక్షర్ (2/21), కుల్దీప్ (1/22) ధాటికి చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.మయాంక్ అగర్వాల్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
రఫ్ఫాడించిన టీమిండియా పేసర్.. రాణించిన మయాంక్ అగర్వాల్
Ranji Trophy 2022-23 1st Quarter Final: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఇవాళ (జనవరి 31) ప్రారంభమైన మొదటి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగాల్-జార్ఖండ్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ సిరీస్‌లో టీమిండియా సభ్యుడిగా ఉన్న ముకేశ్ కుమార్ (3/61), ఆకాశ్‌దీప్ (4/46), ఇషాన్ పోరెల్ (1/29), ఆకాశ్ ఘాతక్ (1/28) బంతితో చెలరేగడంతో జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 173 పరుగులకు ఆలౌటైంది. కుమార్ సూరజ్ (89) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. పంకజ్ కిషోర్ కుమార్ (21), షాబజ్ నదీమ్ (10), ఆశిష్ కుమార్ (12) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం బెంగాల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉండగా.. వెలుతురులేమి కారణంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముగించారు. ఇవాళే వివిధ వేదికలపై మరో మూడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు కూడా మొదలయ్యాయి. బెంగళూరులోని చిన్నిస్వామి స్టేడియం వేదికగా కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో ఉత్తరఖండ్ తొలి ఇన్నింగ్స్‌లో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన కర్ణాటక.. మురళీధర వెంకటేశ్ (5/36), విధ్వత్ కావేరప్ప (2/17), కృష్ణప్ప గౌతమ్ (2/22), విజయ్‌కుమార్ విశఖ్ (1/25) చెలరేగడంతో ఉత్తరాఖండ్‌ను తక్కువ స్కోర్‌కే పరిమితం చేసింది. ఉత్తరాఖండ్ ఇన్నింగ్స్‌లో అవ్నీష్ సుధ (17), కునాల్ చండీలా (31), ఆదిత్య తారే (14), అఖిల్ రావత్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్ణాటక.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 123 పరుగులు చేసింది. రవికుమార్ సమర్థ్ (54), కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (65) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటక 7 పరుగుల ఆధిక్యంలో ఉంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో సౌరాష్ట్ర-పంజాబ్ జట్లు.. ఇండోర్ వేదికగా జరుగుతున్న నాలుగో క్వార్టర్ ఫైనల్లో ఆంధ్ర-మధ్యప్రదేశ్ జట్లు తలపడుతున్నాయి. నాలుగు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో విజేతలు ఫిబ్రవరి 8-12 వరకు జరిగే రెండు సెమీఫైనల్‌లలో అమీతుమీ తేల్చుకుంటాయి. సెమీస్‌లో విజేతలు ఫిబ్రవరి 16-20 వరకే జరిగే అంతిమ సమరంలో ఎదురెదురుపడతాయి. -
న్యూజిలాండ్‌తో మూడో టీ20.. టీమిండియాలో మూడు మార్పులు..?
IND VS NZ 3rd T20: ఫిబ్రవరి 1న అహ్మదాబాద్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగనున్న నిర్ణయాత్మక మూడో టీ20లో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో దాదాపు ఒకే జట్టుతో (చహల్ మినహాయించి) బరిలోకి దిగిన భారత్.. మూడో టీ20 కోసం మూడు మార్పులు చేయనుందని సమాచారం. రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్లతో పాటు బౌలింగ్ విభాగంలో మరో కీలక మార్పు చేయాలన్నది జట్టు యాజమాన్యం యోచనగా తెలుస్తోంది. శుభ్‌మన్, ఇషాన్‌ల స్థానాల్లో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మ.. అలాగే చహల్ లేదా కుల్దీప్ స్థానాల్లో ముకేశ్ కుమార్‌కు అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం తొలుత బ్యాటింగ్‌కు, ఆతర్వాత పేసర్లకు సహకరించే అస్కారం ఉండటంతో స్పిన్నర్ స్థానంలో అదనపు పేసర్‌కు అవకాశం ఇవ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. ముకేశ్ కుమార్‌కు ఈ సిరీస్‌లో ఒక్క అవకాశం కూడా రాకపోవడంతో మూడో టీ20లో తప్పక ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. అలాగే గిల్, ఇషాన్‌లు వరుసగా లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోని నేపథ్యంలో పృథ్వీ షా, వికెట్‌కీపర్ జితేశ్ శర్మలకు ఒక్క అవకాశం ఇవ్వాలన్నది టీమ్ ప్లాన్‌గా తెలుస్తోంది. మరోవైపు, సిరీస్ డిసైడర్ మ్యాచ్ కావడంతో మేనేజ్మెంట్ పెద్దగా ప్రయోగాలు చేసేందుకు మొగ్గు చూపకపోవచ్చన్న టాక్ కూడా నడుస్తోంది. ఏదిఏమైనప్పటికీ తుది జట్టులో ఎవరెవరు ఉంటారో తేలాలంటే మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే, మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు చెరో మ్యాచ్ గెలిచి (తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో మ్యాచ్‌లో భారత్ గెలిచాయి) సిరీస్‌లో సమవుజ్జీలుగా ఉన్న విషయం తెలిసిందే. అంతకుముందు జరిగిన వన్డే సిరీస్‌ను రోహిత్ సేన 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. వన్డేల్లో డబుల్ సెంచరీ, ఓ సెంచరీతో హిట్ అయిన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌లో మాత్రం ఫట్ అయ్యాడు. -
న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలో రెండు మార్పులు..? అర్షదీప్‌తో పాటు..!
లక్నో వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ (జనవరి 29) జరుగనున్న రెండో టీ20 మ్యాచ్ టీమిండియాకు అత్యంత కీలకంగా మారింది. తొలి టీ20లో పర్యాటక జట్టు చేతిలో ఎదురైన పరాభవం నేపథ్యంలో సిరీస్‌పై ఆశలు సజీవంగా నిలవాలంటే టీమిండియా నేటి మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇందుకోసం టీమ్ మేనేజ్మెంట్ తుది జట్టులో పలు మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాంచీ మ్యాచ్‌లో ఆఖరి ఓవర్లో ధారాళంగా పరుగులు సమర్పించుకుని జట్టు ఓటమికి పరోక్ష కారణమైన అర్షదీప్‌పై వేటు దాదాపుగా ఖరారైంది. అతని స్థానంలో బీహార్ పేసర్ ముకేశ్ కుమార్ అరంగేట్రం చేయడం లంఛనమేనని తెలుస్తోంది. ఇకపోతే, నేటి మ్యాచ్‌లో టీమిండియాలో మరో మార్పు కూడా జరిగే అవకాశం ఉందని సమాచారం. రాహుల్ త్రిపాఠి స్థానంలో యువ ఆటగాడు పృథ్వీ షాను ఆడించాలన్నది కోచ్ ద్రవిడ్ ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే గిల్‌తో పాటు ఎవరు ఓపెనింగ్ చేస్తారన్నది ప్రశ్నార్ధకంగా మారుతుంది. లెఫ్ అండ్ రైట్ కాంబినేషన్‌ను పరిగణలోకి తీసుకుంటే ఇషాన్ కిషన్.. లేకుంటే పృథ్వీ షా గిల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తారు. ఈ రెండు మార్పులు మినహా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టే యధాతథంగా బరిలోకి దిగే అవకాశం ఉంది. బెంచ్‌పై ఆప్షన్స్ లేకపోవడం, అలాగే తొలి మ్యాచ్‌లో అందరూ తమతమ పాత్రలకు కొద్దో గొప్పో న్యాయం చేయడంతో తుది జట్టులో ఇంతకుమించి మార్పులకు ఆస్కారం ఉండకపోవచ్చు. రెండో టీ20కి భారత తుది జట్టు (అంచనా).. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావీ, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్ -
శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్, గిల్‌కు నో ఛాన్స్! పేసర్ ఎంట్రీ
పుణే వేదికగా గురువారం శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో 16 పరుగుల తేడాతో టీమిండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు టీ20ల సిరీస్ 1-1తో సమమైంది. ఇక సిరీస్ డిసైడ్ చేసే మూడో టీ20లో శనివారం రాజ్‌కోట్ వేదికగా భారత్, శ్రీలంక జట్లు తలపడేందుకు సిద్దమయ్యాయి. అయితే కీలకమైన మూడో టీ20లో పలు మార్పులతో టీమిండియా బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో దారుణంగా విఫలమైన అర్ష్‌దీప్ సింగ్ స్థానంలో పేసర్ ముఖేష్ కుమార్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. అదే విధంగా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన యువ ఓపెనర్ శుబ్మాన్ గిల్ స్థానంలో రుత్‌రాజ్ గైక్వాడ్.. స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకురావాలని టీమిండియా మేనేజెమెంట్ భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు అరంగేట్ర మ్యాచ్‌లో విఫలమైన రాహుల్ త్రిపాఠిని మూడో టీ20లో కూడా కొనసాగించే అవకాశం ఉంది. భారత తుది జట్టు(అంచనా): ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), రుతురాజ్ గైక్వాడ్, సూర్యకుమార్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం మావి, ముఖేష్ కుమార్, ఉమ్రాన్ మాలిక్ చదవండి: Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్.. ఇప్పుడు హార్దిక్ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్ రిప్లై -
IPL 2023: అన్క్యాప్డ్ ప్లేయర్‌కు రూ.5.5 కోట్లు.. ఎవరీ ముఖేష్ కుమార్?
ఐపీఎల్ మినీ వేలంలో కొందరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు కాసుల వర్షం కురిపించింది. శివమ్ మావి, ముఖేష్ కుమార్ లాంటి ఆటగాళ్లకు జాక్‌పాట్ తగిలిందనే చెప్పొచ్చు. శివమ్ మావి పేరు ఐపీఎల్లో పాపులర్ అయినప్పటికి.. ముఖేష్ కుమార్ మాత్రం గత సీజన్ నుంచే వెలుగులోకి వచ్చాడు. గతేడాది సీఎస్కే తరపున ఆడిన ముఖేష్ కుమార్ రూ.20 లక్షల కనీస ధరతో బరిలోకి దిగాడు. అతని కోసం వేలంలో సీఎస్కే, ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌లు పోటీపడ్డాయి. అయితే చివరకు ముఖేష్ కుమార్‌ను రూ. 5.50 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకుంది. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ కోసం ఇంత వెచ్చించడం ఆసక్తి కలిగించింది. అందుకే ముఖేష్ కుమార్ గురించి కొన్ని విషయాలు ఎవరీ ముఖేష్ కుమార్? ► 28 ఏళ్ల ముఖేష్ కుమార్ కోల్‌కతాలో జన్మించాడు. ► అతడు దేశీవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ► ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముఖేష్ 2015లో హర్యానా పై అరంగేట్రం చేశాడు. ► అదే విధంగా టీ20 క్రికెట్లో 2016లో గుజరాత్ డెబ్యూ చేశాడు. ► లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ► ఇక టీ20 క్రికెట్లో ముఖేష్ 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు. ► ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు. ► స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ముఖేష్ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ► అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్.. బెంగాల్ జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. చదవండి: జాక్‌పాట్ కొట్టాడు.. అత్యధిక మొత్తం అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా -
Test: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. విజృంభించిన బౌలర్లు ఈ క్రమంలో పేసర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కదం తొక్కిన బ్యాటర్లు ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్ పుజారా 52, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ 77, జయంత్ యాదవ్ 83, సౌరభ్ కుమార్ 55, నవదీప్ సైనీ 50(నాటౌట్) సైతం అర్ధ శతకాలతో రాణించారు. మెరిసిన సౌరభ్ ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్ ముకేశ్ కుమార్ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సౌరభ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. సమిష్టి కృషితో విజయభేరి ఉమేశ్ యాదవ్ రెండు, నవదీప్ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్- ఎ వర్సెస్ బంగ్లాదేశ్- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు: భారత్-ఎ: 562/9 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- ఎ: 252 & 187 చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో.. IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు -
Ind A Vs Ban A: 6 వికెట్లతో చెలరేగిన ముకేశ్.. బంగ్లా స్కోరెంతంటే!
Bangladesh A vs India A, 2nd unofficial Test - సిల్హెట్: బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ అదరగొట్టాడు. మంగళవారం మొదలైన రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లతో (6/40) చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కాగా ముకేశ్ కెరీర్లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. ఇక ఇతర భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 3, యశస్వి జైశ్వాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం భారత- ‘ఎ’ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కాక్స్ బజార్లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా! IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే? -
టీమిండియాలో చోటు.. ఎవరీ ముఖేష్ కుమార్?
స్వదేశంలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. కాగా ఈ జట్టులో ముఖేష్ కుమార్, రజత్ పాటిదార్ వంటి కొత్త ముఖాలకు చోటు దక్కింది. దేశీవాళీ టోర్నీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబరచడంతో వీరిద్దరినీ సెలక్టర్లు ప్రోటీస్‌తో సిరీస్‌కు అవకాశం ఇచ్చారు.ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఎంపికయ్యాడు. అదే విధంగా ధావన్‌కు డిప్యూటీగా శ్రేయస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. కాగా ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు రోహిత్ సారథ్యంలోని భారత సీనియర్ జట్టు వెళ్లనుండడంతో.. ఈ సిరీస్‌కు ద్వితీయ శ్రేణి జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక తొలి సారి భారత జట్టులో చోటు సంపాదించుకున్న పేసర్ ముఖేష్ కుమార్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఎవరీ ముఖేష్ కుమార్? ►28 ఏళ్ల ముఖేష్ కుమార్ కోల్‌కతాలో జన్మించాడు. ►అతడు దేశీవాళీ క్రికెట్లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ► ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ముఖేష్ 2015లో హర్యానా పై అరంగేట్రం చేశాడు. ►అదే విధంగా టీ20 క్రికెట్లో 2016లో గుజరాత్ డెబ్యూ చేశాడు. ►లిస్ట్-ఏ కెరీర్లో ఇప్పటివరకు 18 మ్యాచ్‌లు ఆడిన ముఖేష్.. 5.17 ఏకానమి రేటుతో 17 వికెట్లు పడగొట్టాడు. ► ఇక టీ20 క్రికెట్లో ముఖేష్ 17 మ్యాచ్‌ల్లో 19 వికెట్లు సాధించాడు. ►ఇక తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటి వరకు 30 మ్యాచ్‌లు ఆడిన అతడు 109 వికెట్లు పడగొట్టాడు. ►స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరిగిన నాలుగు రోజుల మ్యాచ్ సిరీస్‌లో ముఖేష్ 9 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ►అదే విధంగా 2021-22 రంజీ ట్రోఫీ సీజన్లో 20 వికెట్లు పడగొట్టిన ముఖేష్.. బెంగాల్ జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. ► ముఖేష్ ప్రస్తుతం ఇరానీ కప్-2022లో రెస్ట్ ఆఫ్ ఇండియా తరపున ఆడుతున్నాడు. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్.. భారత జట్టు ప్రకటన! కెప్టెన్‌గా ధావన్ -
చెలరేగిన ముకేశ్, ఉమ్రాన్, కుల్దీప్ సేన్.. 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్
Irani Cup 2022 - Saurashtra vs Rest of India: ఇరానీ కప్-2022 టోర్నీలో భాగంగా సౌరాష్ట్ర- రెస్టాఫ్ ఇండియా మధ్య టెస్టు మ్యాచ్ ఆరంభమైంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో గల సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా శనివారం ఆట మొదలైంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రెస్టాఫ్ ఇండియాకు బౌలర్లు శుభారంభం అందించారు. కుప్పకూలిన టాపార్డర్ రెస్టాఫ్ ఇండియా బౌలర్ల ధాటికి సౌరాష్ట్ర టాపార్డర్ కకావికలమైంది. 0,4,0,1,2.. ఇలా బ్యాటింగ్ ఆర్డర్ పతనం సాగింది. ఛతేశ్వర్ పుజారా(1) సహా మిగిలిన బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితయ్యారు. ఇక ఆరో స్థానంలో వచ్చిన అర్పిత్ వసవాడ 22 పరుగులు, తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ధర్మేంద్ర సిన్హ్ జడేజా 28 పరుగులతో రాణించారు. 98 పరుగులకే ఆలౌట్ ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 24.5 ఓవర్లలో 98 పరుగులకే సౌరాష్ట్ర ఆలౌట్ అయింది. రెస్టాఫ్ ఇండియా బౌలర్లలో ముకేశ్ కుమార్ 10 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక కుల్దీప్ సేన్ మూడు, ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా రంజీ ట్రోఫీ 2019- 20 విజేత సౌరాష్ట్రతో పోరులో వివిధ రంజీ జట్లకు చెందిన ఆటగాళ్లతో కూడిన రెస్టాఫ్ ఇండియాకు తెలుగు క్రికెటర్ హనుమ విహారి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇక సౌరాష్ట్ర జట్టుకు సారథి జయదేవ్ ఉనద్కట్. చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్ ఖాన్ దొరికేశాడు: పాక్ మాజీ క్రికెటర్ T20 WC 2022: ఆస్ట్రేలియాకు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్! ICYMI! Watch how Mukesh Kumar set the ball rolling for Rest of India 🎥 🔽 #IraniCup | #SAUvROI | @mastercardindia https://t.co/GLg0dQvfNj — BCCI Domestic (@BCCIdomestic) October 1, 2022 -
మూడు వికెట్లతో చేలరేగిన ముకేశ్ కుమార్.. న్యూజిలాండ్ స్కోర్: 156/5
బెంగళూరు: భారత్ ‘ఎ’తో గురువారం ప్రారంభమైన తొలి అనధికారిక టెస్టులో న్యూజిలాండ్ ‘ఎ’ తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. జో కార్టర్ (73 బ్యాటింగ్) అర్ధ సెంచరీ సాధించాడు. భారత్ ‘ఎ’ బౌలర్లలో పేసర్ ముకేశ్ కుమార్ 34 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా...యశ్ దయాళ్, అర్జాన్ చెరో వికెట్ తీశారు. ప్రతికూల వాతావరణం కారణంగా మొదటి రోజు 61 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: శ్రీలంక సంచలన విజయం -
మూడు చేపల కథ ట్రైలర్ చూశారా?
"సమంత" ఫేమ్ ముఖేష్ కుమార్ దర్శకత్వం వహించిన రెండో చిత్రం "మూడు చేపల కథ" విడుదలకు రెడీ అవుతోంది. రియలిస్టిక్ డాక్యుమెంటరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను బుధవారం రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు ముఖేష్ కుమార్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా, కదిరిలో జరిగిన కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా "మూడు చేపల కథ" రూపొందించాం. అందరినీ అమితంగా ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు. చదవండి: జబర్దస్త్ ప్రవీణ్ ఇంట విషాదం మాజీ భార్యల నడుమ స్టార్ డైరెక్టర్, వాళ్లే నా పిల్లర్స్ అంటూ పోస్ట్.. -
నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను
మన ఆటగాళ్లకు కాంస్యం దక్కిన క్షణం చూసిన నాకు ఆనందంతో కన్నీళ్లు ఆగలేదు. ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. మా వల్ల సాధ్యం కానిది ఈతరం ఆటగాళ్లు సాధించడం గర్వంగా అనిపిస్తోంది. జర్మనీతో మ్యాచ్‌లో మన జట్టులో కొన్ని లోపాలు కనిపించినా చివరకు మెడల్ గెలవగలిగాం. ఎప్పటిలాగే చివరి క్షణాల్లో గోల్ ఇచ్చేస్తారేమోనని భయపడ్డాను. ఆ ఉత్కంఠను అధిగమించి మ్యాచ్‌ను నిలబెట్టుకోగలిగారు. నేను ఆడిన రోజుల్లో ఒలింపిక్స్‌కు ముందు యూరోప్ దేశాలకు వెళ్లి 100 శాతం శ్రమించి గెలిచి రావడం, అసలు ఒలింపిక్స్‌కు వచ్చేసరికి విఫలం కావడం జరిగాయి. మిగతా జట్లు ఒలింపిక్స్‌లోనే తమ అత్యుత్తమ ప్రదర్శన కోసం సన్నద్ధమయ్యేవి. దీనిని కూడా గుర్తించలేని స్థితిలో మా ఆట సాగింది. ఇప్పుడు అంతా మారిపోయింది. విదేశీ కోచ్‌లు బాధ్యతలు తీసుకున్న తర్వాత జట్టును యూరోపియన్ శైలికి అనుగుణంగా మనోళ్ల ఆటను తీర్చిదిద్దారు. గత 6–7 ఏళ్లుగా ఇది సాగుతుండగా ఫలితం ఇప్పుడు కనిపించింది. కొత్త తరహా షాట్లు వచ్చి అంతా ‘పవర్‌గేమ్’గా మారిపోయింది. మేం ఆడిన రోజులతో పోలిస్తే సబ్స్టిట్యూట్ల సంఖ్య విషయంలో పరిమితి లేకపోవడంతో ఎక్కువ మందిని రొటేట్ చేస్తూ అందరినీ మ్యాచ్ ఆసాంతం తాజాగా ఉంచే అవకాశం కలిగింది. దాంతో ఆటలో వేగం పెరిగింది. ఇలా కాలానుగుణంగా వచ్చిన మార్పులను భారత జట్టు సమర్థంగా అమలు చేయగలగడమే మళ్లీ పతకం గెలుచుకోవడానికి కారణమైంది. –‘సాక్షి’తో ముకేశ్ కుమార్ (ట్రిపుల్ ఒలింపియన్–1992, 1996, 2000) భారత హాకీకి ఇదో పునర్జన్మలాంటిది. ఈ పతకం సాధించి భవిష్యత్తులో ఎవరైనా హాకీ ఆడేందుకు కావాల్సిన ప్రేరణను అందించగలిగాం. ఆఖరి పెనాల్టీ కార్నర్‌కి ముందే ఒకటే మాట అనుకున్నాను. 21 ఏళ్లుగా హాకీ కోసం కష్టపడ్డాను. ఇప్పుడు ఈ పెనాల్టీని ఆపలేకపోతే అదంతా వృథా అనిపించింది. ఆపి చూపించాను. –పీఆర్ శ్రీజేశ్, గోల్ కీపర్ యావద్భారత దేశం ఈ పతకం కోసం ఎదురు చూస్తోందని నాకు బాగా తెలుసు. ఈ విజయంలో నేనూ ఒక పాత్ర పోషించడం గొప్పగా అనిపిస్తోంది. జట్టు సభ్యులంతా ఎన్నో త్యాగాలు చేసి కష్టపడ్డారు. కరోనా బారిన పడి కూడా అంతే పట్టుదలగా సాధన చేశారు. మ్యాచ్ పూర్తిగా ముగిసే వరకు అంతా అయిపోయినట్లు కాదు. ఈ మ్యాచ్‌లో జట్టు వెనుకబడి కూడా తమ అత్యుత్తమ ఆటను ప్రదర్శించింది. –గ్రాహం రీడ్, చీఫ్ కోచ్ అద్భుతంగా అనిపిస్తోంది. మాకు పతకం గెలిచే అర్హత ఉందని భావించాం. 15 నెలలుగా దీని కోసం ఎంతో కష్టపడ్డాం. మ్యాచ్‌లో వెనకబడ్డా మేం నిరాశ చెందలేదు. చివరి వరకు పోరాడాం. చివరి ఆరు సెకన్లలో పెనాల్టీని ఆపేందుకు మా ప్రాణాలు అడ్డువేయాలన్నట్లుగా అనిపించింది –మన్‌ప్రీత్ సింగ్, కెప్టెన్ ప్రతీ భారతీయుడి హృదయంలో హాకీకి ప్రత్యేక స్థానం ఉంది. హాకీ ప్రేమికులకు, క్రీడాభిమానులకు ఆగస్టు 5, 2021 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. –నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి భారత జట్టు 41 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించింది. 1–3తో వెనుకబడి కూడా ఎంతో పట్టుదల కనబరుస్తూ 5–4తో గెలవడం నిజంగా అద్భుతం. కాంస్యం గెలిచి జట్టుకు నా అభినందనలు. –వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 41 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో పతకం గెలవడం మనందరం సంబరాలు చేసుకోవాల్సిన ఘట్టం. జట్టుకు నా అభినందనలు. ఈ విజయంతో హాకీ పునర్వైభవం తిరిగి వస్తుందని ఆశిస్తున్నా. కె. చంద్రశేఖర రావు, తెలంగాణ ముఖ్యమంత్రి 1983, 2007, 2011లను మరచిపోండి. భారత హాకీ జట్టు సాధించిన ఈ పతకం ఏ ప్రపంచ కప్‌కంటే కూడా ఎక్కువే. –గౌతం గంభీర్, మాజీ క్రికెటర్ -
గత మూడేళ్ళుగా మన ఆటతీరు మెరుగైంది: ముకేశ్ కుమార్
-
హెచ్‌పీసీఎల్ లాభం 157 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) నికర లాభం 157 శాతం ఎగిసింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 2,253 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో ఇది రూ. 877 కోట్లు. రిఫైనరీల సామర్థ్యాన్ని గణనీయంగా వినియోగించుకోవడం, పరిశ్రమతో పోలిస్తే మరింత మెరుగైన పనితీరు కనపర్చడం వల్ల కరోనా వైరస్‌పరమైన సవాళ్లు ఉన్నప్పటికీ సానుకూల ఫలితాలు సాధించగలిగినట్లు హెచ్‌పీసీఎల్ సీఎండీ ముకేశ్ కుమార్ సురానా తెలిపారు. క్యూ1లో అమ్మకాలు రూ. 45,945 కోట్లకు క్షీణించినప్పటికీ నికర లాభాలు పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు రూ. 74,596 కోట్లు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్‌లో పెట్రోలియం ఉత్పత్తుల అమ్మకాలు భారీగా పడిపోయాయని, అయితే క్రమంగా ఆంక్షల సడలింపుతో మళ్లీ పుంజుకుంటున్నాయని సురానా చెప్పారు. -
మళ్లీ కోర్టుకెక్కిన నిర్భయ దోషి
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం కేసు దోషి ముఖేష్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కారు. క్షమాభిక్ష కోరుతూ తాను పెట్టుకుని దరఖాస్తును రాష్ట్రపతి తిరస్కరించడాన్ని ముఖేష్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆర్టికల్32 కింద క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణపై న్యాయ విచారణ చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరినట్లు ముఖేష్ తరఫు న్యాయవాది వృందా గ్రోవర్ తెలిపారు. 2012 నాటి నిర్భయ అత్యాచారం కేసులో ముఖేష్‌తోపాటు మరో ముగ్గురికి సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించగా.. వచ్చే నెల ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటలకు శిక్షను అమలు చేయనున్న విషయం తెలిసిందే. అయితే ఈ లోపుగా దోషుల్లో ఒకరైన ముఖేష్ రాష్ట్రపతి జనవరి 17న తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్‌పై కోర్టుకెక్కారు. తీర్పును సవరించాల్సిందిగా ముఖేష్, అక్షయ్ కుమార్‌లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇప్పటికే తిరస్కరించగా, పవన్ గుప్తా, వినÄŒæ శర్మలు సవరణ పిటిషన్లు దాఖలు చేయాల్సి ఉంది. తీహార్ జైలు అధికారులు తమకు అవసరమైన దస్తావేజులు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారని, దీనివల్ల తాము క్షమాభిక్ష, సవరణ పిటిషన్లు దాఖలు చేయలేకపోతున్నామని ఆరోపిస్తూ దోషులు దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు ఒకటి శనివారం కొట్టివేసింది. -
పరారీలో ముఖేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై హైదరాబాద్ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైంది. దీంతో రెండు వారాల క్రితం ముఖేష్‌పై కేసు నమోదు చేశాం. మూడు రోజులుగా ముఖేష్ పరారీలో ఉన్నారు.. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నాం. ముఖేష్‌తో పాటు అతని తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశామ’ని తెలిపారు. కాగా, కెరీర్లో 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 80 గోల్స్ చేశాడు. -
టైటిల్ రేసులో ముకేశ్ కుమార్
గోల్కొండ: ప్రతిష్టాత్మక గోల్కొండ మాస్టర్స్ గోల్ఫ్ టోర్నమెంట్ రసవత్తరంగా జరుగుతోంది. తెలంగాణ పర్యాటక శాఖ, పీజీటీఐ సంయుక్తంగా నిర్వహిస్తోన్న ఈ టోర్నీలో రోజురోజుకీ ఆధిక్యం చేతులు మారుతోంది. శనివారం హైదరాబాద్ గోల్ఫ్ కోర్ట్‌లో జరిగిన మూడో రౌండ్లో వెటరన్ ప్లేయర్ ముకేశ్ కుమార్ విజేతగా నిలిచాడు. 71 ప్రయత్నాలకు గానూ ముకేశ్ 3 అండర్ 68 స్కోరుతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. దీంతో ఓవరాల్‌గా 12 పాయింట్లతో టైటిల్ బరిలో అందరి కన్నా ముందున్నాడు. తన కెరీర్లో 120 టైటిళ్ళు సాధించిన ముకేశ్ కుమార్ (52) గోల్కొండ మాస్టర్ టోర్నీలో పోటీపడుతున్న వారిలో అత్యధిక వయస్సు గలవాడు. గతేడాది ఇదే టోర్నీలో ముకేశ్ టాప్–3లో నిలిచాడు. నేడు జరిగే చివరి రౌండ్‌తో చాంపియన్ ఎవరనేది తెలుస్తుంది. మరోవైపు రెండో రౌండ్లో సూపర్ షోతో విజేతగా నిలిచిన అంగద్ చీమా మూడోరౌండ్లో తడబడ్డాడు. అతను నిర్ణీత 71 షాట్లకు బదులుగా 74 ప్రయత్నాల్లో పోటీని పూర్తి చేసి ఓవరాల్ పాయింట్లలో వెనుకబడ్డాడు. ప్రస్తుతం 10 పాయింట్లతో మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా నాలుగోస్థానంలో ఉన్నాడు. తంగరాజ(శ్రీలంక), అహ్మదాబాద్ గోల్ఫర్ ఉదయన్ మానే మూడో రౌండ్‌ను వరుసగా 68, 69ప్రయత్నాల్లో ముగించి ఓవరాల్‌గా 11 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు. తొలి రౌండ్ విజేత ధర్మ 8 పాయింట్లతో ప్రస్తుతం 11వ స్థానంలో ఉన్నాడు. -
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!
-
తలకిందులుగా చెట్లు ఎక్కేస్తాడు..!
న్యూఢిల్లీ: పక్క కొమ్మలు లేకుండా నిటారుగా ఉన్న చెట్టును ఎక్కడం అందరికీ సాధ్యంకాదు. సాధన ఉంటేనే సాధ్యం. అలాంటిది హరియాణాకు చెందిన 32 ఏళ్ల ముఖేష్ కుమార్ నేరుగా కాకుండా తలకిందులుగా చెట్లు ఎక్కుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన అసాధారణ ప్రతిభతో గిన్నిస్ బుక్‌లో రికార్డు నెలకొల్పడంతో పాటు కుటుంబం కోసం కొంత డబ్బు సంపాదించాలని ఆశిస్తున్నట్టు ముఖేష్ చెప్పాడు. ప్రస్తుతం అతను భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల వయసు నుంచి ముఖేష్ తలకిందులుగా చెట్లు ఎక్కడం ప్రారంభించాడు. అందరూ నిటారుగా చెట్లు ఎక్కుతారని, తలకిందులుగా ఎందుకు ఎక్కరాదన్న ఆలోచన వచ్చిందని, దీంతో వినూత్న పద్ధతిలో ప్రాక్టీస్ చేశానని చెప్పాడు. పలుమార్లు గాయపడినా, తన అలవాటును మార్చుకోలేదని తెలిపాడు. మొదట్లో తలకిందులుగా రెండు లేదా మూడు అడుగులు మాత్రమే చెట్లు ఎక్కగలిగేవాడినని, సాధన చేసి పొడవాటి చెట్లను ఎక్కడం నేర్చుకున్నానని చెప్పాడు. ఎప్పుడూ పొడవాటి చెట్లను ఎక్కేందుకు ఆసక్తి చూపుతానని, అంతేగాక తక్కువ సమయంలో ఎక్కేందుకు సాధన చేస్తున్నానని ముఖేష్ తెలిపాడు. చెట్లను ఎక్కేటపుడు కంటే వేగంగా కిందకు దిగుతానని చెప్పాడు. 50 అడుగుల ఎత్తున్న చెట్లను ముఖేష్ ఐదు నిమిషాల్లోపే ఎక్కేస్తాడు. -
గొర్రెల పెంపకానికి సంపూర్ణ సహకారం
– ఎన్సీడీసీ చీఫ్ ముఖేశ్ కుమార్ – రాష్ట్ర పర్యటన అనంతరం జిల్లాకు నిధులు కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో గొర్రెల పెంపకాన్ని మరింత అభివద్ధి చేసేందుకు అన్నివిధాల సహకరిస్తామని జాతీయ సహకార అభివద్ధి సంస్థ(ఎన్సీడీసీ) చీఫ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని రీజినల్ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్‌తో కలసి మంగళవారం కర్నూలు వచ్చిన ఆయన పంచలింగాల, గొందిపర్ల, ఈ. తాండ్రపాడులోని గొర్రెల పెంపకందారులతో చర్చించారు. ఇప్పటి వరకు గొర్రెల పెంపకంలో ఎలా రాణిస్తున్నారు.. ఎన్సీడీసీ ద్వారా రుణాలు ఇస్తే ఏ విధంగా వినియోగించుకుంటారనే విషయాపై ఆరా తీశారు. రుణాలు తీసుకోవాలంటే ఆస్తులు తనఖా పెట్టాల్సింటుందని తెలిపారు. అనంతరం అమరావతి హోటల్లో జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార సంఘం చైర్మన్ వై. నాగేశ్వరరావు యాదవ్, డైరెక్టర్లతో సమావేశమయ్యారు. కురువ, గొల్ల సామాజిక వర్గాల ప్రధాన వత్తి గొర్రెల పెంపకమేనని, తగిన చేయూతనిస్తే రాణిస్తారని ఈ సందర్భంగా చైర్మన్ వారికి వివరించారు. ఎన్సీడీసీ నిధులతో గొర్రెల పెంపకందారులను ఆదుకోవడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను వివరించారు. దీనిపై ముఖేశ్ కుమార్ మాట్లాడుతూ జాతీయ సహకార అభివద్ధి సంస్థ గొర్రెల పెంపకంలాంటి వత్తులను ప్రోత్సహిస్తుందని, తగిన కార్యాచరణ ప్రణాళికలు సమర్పిస్తే జిల్లాకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటన ముగించిన తర్వాత ప్రతిపాధించిన మేరకు నిధులు విడుదల చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా గొర్రెల అభివద్ధి విభాగం సహాయ సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ డాక్టర్ సుంకన్న, జిల్లా గొర్రెల పెంపకం దారుల సహకార సంఘం డైరెక్టర్లు పాల్గొన్నారు. -
జవాను ప్రాణాలు కాపాడిన మహిళ
సిమ్లా: వీధి కుక్కల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ 50 అడుగుల నీటి గుంటలో పడిపోయిన జవానును ఓ సాధారణ గృహిణి రక్షించింది. తోటి జవానులు అతను మరణించాడని భావించి వెళ్లిపోయినా.. కొన ఊపిరితో వున్న అతనికి ప్రాణం పోసింది. గత నెల 20న అస్సాం రైఫిల్స్ కు చెందిన జవానులు సిమ్లాకు దగ్గరలోని జుతోగ్ కాంట్ క్యాంప్ లో శిక్షణ పొందేందుకు వచ్చారు. శిక్షణలో ఉన్న సమయంలో కొన్ని వీధి కుక్కలు జవానులను వెంబడించాయి.. దీంతో వాటి నుంచి తప్పించుకునేందుకు జవానులందరూ పరుగులు పెట్టారు. వారిలో ముకేశ్ కుమార్ అనే జవాను అదుపుతప్పి పక్కనే ఉన్న గుంటలో పడిపోయాడు. గుంటలో పడిన సమయంలో అతని తల రాయికి తగలడంతో సృహ కోల్పోయాడు. ముకేశ్ లో ఎలాంటి కదలికలు లేకపోవడంతో మిగిలిన జవానులు సాయం కోసం అరిచారు. ఆ శబ్దాలు విన్న వీణా శర్మ(42) హుటాహుటిని అక్కడికి చేరుకుని అతనికి శ్వాస అందించారు.. గుంటలో నుంచి అతన్ని బయటకు తీయడానికి ఆమెకు సాధ్యం కాలేదు. వెంటనే తన తండ్రి రమేశ్ శర్మ(72)ను పిలిచిన ఆమె అతన్ని బయటకు తీశారు. జవానుల్లో ఎవరికీ డ్రైవింగ్ రాకపోవడంతో రమేశ్ సొంతగా బండిని నడుపుకుంటూ ముకేశ్ ను ఆసుపత్రిలో చేర్పించారు. -
కపిల్, గావస్కర్ చూసేవాళ్లు
మొహమ్మద్ షాహిద్ మరణం హాకీ ప్రపంచానికి తీరని లోటు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నా... కోలుకుంటున్నారని తెలిసి సంతోషించాం. అంతలోనే ఈ అనూహ్య వార్త. 80వ దశకంలో ఆయనకు సాటి మరెవరూ లేరు. ఆయనకున్న స్కిల్స్ ఇంకెవరికీ రాలేదు. హాకీ స్టిక్కు ఏదో అయస్కాంతం ఉన్నట్లు బంతిని కంట్రోల్ చేసేవారు. మైదానంలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకూ బంతిని పూర్తి నియంత్రణతో తీసుకెళ్లేవారు. షాహిద్ ఆడుతున్నారంటే ప్రత్యర్థులు చాలా అప్రమత్తంగా ఉండేవారు. ప్రత్యర్థుల్లో ఏకంగా ఐదుగురు ఒక్క షాహిద్‌ని నియంత్రించడానికి ఆయన చుట్టూ ఉండేవారు. అయినా వాళ్లను తప్పించి మరీ సహచరులకు పాస్‌లు ఇచ్చేవారు. అంతటి స్కిల్ మరెవరికీ లేదు. ప్రతి మ్యాచ్‌లో షార్ట్కార్నర్ ఆయనే తీసుకునేవారు. భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వేగమే ఆయన ఆయుధం. మైదానంలోనే కాదు, బయట ఆయన నడుస్తుంటే పక్కనవాళ్లు పరుగెత్తాల్సి వచ్చేది. మాట కూడా అంతే స్పీడ్‌తో ఉంటుంది. 1988 సియోల్ ఒలింపిక్స్ తర్వాత ఆయన రిటైర్ అయ్యారు. నేను 1989లో భారత సీనియర్ జట్టుకు ఎంపికయ్యాక తొలిసారి హాలెండ్‌లో టోర్నీకి వెళ్లాను. వేరే మ్యాచ్ చూడటానికి వెళ్లి స్టాండ్స్‌లో కూర్చుంటే... ఓ ప్రేక్షకుడు ‘షాహిద్ ఎక్కడున్నారు’ అని అడిగారు. ఆయన రిటైర్ అయ్యారని చెప్పాను. ‘షాహిద్ లేకుండా ఎలా గెలుస్తారు’ అని ఆ ప్రేక్షకుడు అడిగాడు. ఆయన ఆడుతుంటే విదేశాల్లో కూడా అభిమానులు భారీ సంఖ్యలో వచ్చేవారు. బంతి ఆయన స్టిక్ దగ్గర ఉందంటే స్టేడియం హోరెత్తేది. ఆయనను చూడటం అదృష్టం. భారత దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సునీల్ గావస్కర్‌లాంటి స్టార్ క్రికెటర్స్ కూడా షాహిద్ ఆటను చూడటానికి వచ్చేవారు. ఈ రోజుల్లో క్రీడాకారులకు సినిమా వాళ్ల నుంచి ఎంత ఫాలోయింగ్ ఉందో... ఆ రోజుల్లోనే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉండేది. ధనరాజ్ పిళ్లైని, నన్ను షాహిద్ బాగా ఇష్టపడేవారు. ఏ సందర్భంలో మేం కనిపించినా కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పేవారు. ఏడేళ్ల క్రితం ఝాన్సీలో జరిగిన ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆయనతో కలిసి ఆడాను. హాకీని వదిలిన రెండున్నర దశాబ్దాల తర్వాత కూడా ఆయన స్కిల్స్ అలాగే ఉన్నాయి. అయితే అంత గొప్ప స్కిల్‌ను తర్వాతి తరాలకు అందించలేకపోవడం మన దురదృష్టం. బనారస్‌లోనే ఉండిపోవడం వల్ల ఆయనకు రావలసినంత గుర్తింపు రాలేదు. భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్)లో లేదా ఏదైనా అకాడమీలోకి ఆయనను తీసుకుని కుర్రాళ్లకు ఆ మెళకువలు నేర్పించి ఉంటే బాగుండేది. రైల్వేలో స్పోర్ట్స్ ఆఫీసర్‌గానే ఆయన కెరీర్ ముగిసిపోయింది. ఏమైనా భారత హాకీ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ముకేశ్ కుమార్ (రచయిత భారత హాకీ మాజీ కెప్టెన్, ట్రిపుల్ ఒలింపియన్) -
ముఖేష్‌కుమార్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
హైదరాబాద్: ప్రముఖ హాకీ క్రీడాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత ముఖేష్‌కుమార్‌పై హైదరాబాద్ బేగంపేట్ పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. సీఎం కప్ అడ్‌హక్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఆయన తమను హాకీ ఆడేందుకు అనుమతించకపోవడమే కాకుండా కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ యశ్వంత్, నాగరాజు, వినయ్, మరికొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 18 నుంచి 26 ఏళ్ల వారు మాత్రమే హాకీ ఆడాలని నిబంధన విధించారని, అయితే హాకీ ఆడేందుకు ఎలాంటి వయోపరిమితి లేదని, ఇదే విషయంపై తాము ముఖేష్‌కుమార్‌ను నిలదీసి అడిగినందుకు కులం పేరుతో దూషించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కబీ కభీ మేరే దిల్ మే...
సందర్భం: నేడు ముఖేష్ కుమార్ జయంతి సంవత్సరం సరిగ్గా గుర్తు లేదుగానీ, నా మిత్రుడు మోతీలాల్, ముఖేష్‌ను నాకు పరిచయం చేస్తూ ‘‘ఈ కుర్రాడిని నీకు అప్పగిస్తున్నాను. మంచి పాటగాడు. నువ్వు తీర్చిదిద్దితే వృద్ధిలోకి వస్తాడు’’ అని చెప్పాడు. సంగీతంలో తర్ఫీదు పొందని గొంతు అతనిది. అయినప్పటికీ చక్కగా ఉంది. కొన్ని నెలల తరువాత ఒక సినిమాలో ‘భాయి బంజారే’ అనే పాట పాడడానికి అవకాశం ఇచ్చాను. శాస్త్రీయత, బెంగాలీ శైలి మిళితమైన నా పాటలు ముఖేష్‌కు పూర్తిగా కొత్త. ఈ కారణం వల్లే పాడడానికి ఇబ్బంది పడి ఉంటాడు. మరో వైపు నిర్మాత మెహబూబ్ ఖాన్ ‘‘పాట త్వరగా పూర్తి చేయండి’’ అని ఒత్తిడి తెస్తున్నాడు. అతని కోసం ఆ పాటను నేను పాడక తప్పలేదు. పాట రికార్డింగ్ తరువాత ముఖేష్ అన్నాడు ‘‘దాదా!...ఈ పాట మీరు తప్ప ఎవరూ పాడలేరు. మీ పాట పాడే అదృష్టం నాకు ఉందో లేదో’’ అని. ఆ క్షణంలో అతడిని చూస్తే.... అకస్మాత్తుగా తన చేతుల్లో నుంచి ఆడుకుంటున్న బొమ్మను కోల్పోయి దీనంగా చూస్తున్న పసిపిల్లాడు గుర్తుకు వచ్చాడు. బాధగా అనిపించింది. ప్రతిభ ఎన్ని రోజులని దాగుతుంది? కాలక్రమంలో నా పాటలే కాదు...ఎందరో సంగీత దర్శకుల దగ్గర పాడాడు. ‘రాజ్‌కపూర్‌కు ముఖేష్ గొంతు అయితేనే సరిపోతుంది’ అనిపించుకున్నాడు. సైగల్ స్థాయిలో భావోద్వేగాలు ప్రతిఫలించే పాటలెన్నో పాడాడు. తాను నడిచొచ్చిన దారిలో సహాయపడిన వ్యక్తులను గుర్తు పెట్టుకోవడం... ముఖేష్‌లో ఉన్న గొప్ప లక్షణం. ‘‘ఈయన లేకపోతే ముఖేష్ అనే వాడు లేడు’’ అని ఢిల్లీలోని చాందినీ చౌక్ ప్రాంతంలో ఒక పెద్దమనిషికి నన్ను పరిచయం చేసినా, మోతీలాల్ అనారోగ్యం కారణంగా ఆగిపోయిన అతని సొంత చిత్రం ‘ఛోటీ ఛోటీ బాతే’కు సంబంధించిన నిర్మాణ బాధ్యతల్ని తలకెత్తుకున్నా... తాను అభిమానించే వ్యక్తుల కోసం తపించే నైజం ఆయనకే సొంతం. 1923 జూలై 22వ తేదీన ఢిల్లీలో పుట్టిన ముకేష్ కుమార్.. అమెరికాలోని డెట్రాయిట్లో ఉండగా 1976 ఆగస్టు 27న మరణించారు. చనిపోయే వరకు ఆయన గళం సుస్వరాలను పలికిస్తూనే ఉంది. - ప్రముఖ సంగీత దర్శకుడు అనిల్ బిస్వాస్ జ్ఞాపకాలలో నుంచి... -
హౌసింగ్స్కీమ్పై స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో చేపట్టిన హౌసింగ్స్కీమ్ ప్రయోజనాల గురించి లబ్ధిదారులకు తెలిసేలా స్పెషల్‌డ్రైవ్ నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ హైదరాబాద్ కలెక్టర్ ముఖేశ్‌కుమార్ మీనా, సంబంధిత విభాగాల సీనియర్ అధికారులకు సూచించారు. శనివారం తన చాంబర్లో హౌసింగ్ స్కీమ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. హౌసింగ్స్కీమ్కు లబ్ధిదారులు చెల్లించాల్సిన కంట్రిబ్యూషన్ చెల్లించకపోవడం., రుణాలిచ్చేందుకు బ్యాంకర్లు ముందుకు రాకపోవడం తదితర ఇబ్బందులున్నాయని అధికారులు తెలిపారు. అందుకు స్పందిస్తూ కమిషనర్ బ్యాంకర్ల జాబితా..రుణాల వివరాలతో నివేదిక రూపొందించాలని అన్నారు. అవసరమైతే ఆయా బ్యాంకర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు తగిన అవగాహన కల్పిస్తే ముందుకొస్తారంటూ ఆస్తిపన్ను వసూళ్లకు ఇటీవల నిర్వహించిన ఎర్లీబర్డ్ పథకాన్ని ప్రస్తావించారు. సమావేశంలో ఆయా విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
క్వార్టర్‌ఫైనల్స్‌లో సాక్షి టీవీ
సాక్షి, హైదరాబాద్: స్పోర్ట్స్ కోచింగ్ ఫౌండేషన్, ఎలక్ట్రానిక్ మీడియా స్పోర్ట్స్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న పృథ్విరాజ్ మెమోరియల్ మీడియా 6 ఎ సైడ్ క్రికెట్ టోర్నీలో సాక్షి టీవీ జట్టు క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. మంగళవారం జరిగిన ప్రి క్వార్టర్స్ మ్యాచ్‌లో సాక్షి టీవీ 4 వికెట్ల తేడాతో 6 టీవీపై గెలిచింది. సీతారామ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టివీ 9, టీవీ 1, టీవీ 5, టి న్యూస్, మీడియా క్లబ్ జట్లు కూడా క్వార్టర్ ఫైనల్స్‌కు చేరాయి. టోర్నీని కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ పి.ఎన్.రావు ప్రారంభించారు. ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. -
ఫిజియోథెరపీతో ఆటగాళ్లకెంతో మేలు: ముకేశ్
తార్నాక, న్యూస్‌లైన్: క్రీడాకారుల ఫిట్నెస్ పెం చేందుకు ఫిజియోథెరపీ చేసే మేలు అంతాఇంతా కాదని భారత మాజీ హాకీ ఆటగాడు, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్ అన్నారు. ఆంధ్ర మహిళా సభ దుర్గాబాయి దేశ్‌ముఖ్ ఫిజియోథెరపీ కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం తార్నాకలోని ఐఐసీటీ ఆడిటోరియంలో జాతీయస్థాయి ఫిజియోథెరపీ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముకేశ్ మాట్లాడుతూ... ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కే కాకుండా ఫిజియోథెరపీ అవసరం అందరికీ ఉందన్నారు. ప్రస్తుత జీవనశైలిలో దీని ప్రాముఖ్యం పెరిగిందని చెప్పారు. ఫిజియోథెరపీ వైద్యంపై ప్రజలలో మరింత అవగాహన కల్పించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. సదస్సు నిర్వాహకులు మాట్లాడుతూ చాలా మందిలో ఫిజియోథెరపీ అంటే కేవలం మసాజ్ అనే భావన ఉందన్నారు. ఈ విధమైన దృక్పథం తగదన్నారు. అన్ని కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ నిపుణుల అవసరం ఉందన్నారు. విద్యార్థులు దీన్ని ఓ ప్రొఫెషనల్ కోర్సుగా అభ్యసిస్తే ఉజ్వలమైన భవిష్యత్ ఉందని పలువురు చెప్పుకొచ్చారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో ఫిజియోథెరపీలో వస్తున్న నూతన పద్ధతులపై చర్చిస్తామని వివరించారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 400 మందికి పైగా విద్యార్థులతో పాటు పలువురు పరిశోధకులు, నిపుణులు హాజరయ్యారు. ఇందులో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షురాలు కె.లక్షి, డాక్టర్ రత్నాకర్, కళాశాల ప్రిన్సిపాల్ మాధవి శ్రీవిద్య, డాక్టర్ వైఎస్‌ఎన్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు. -
15 రోజుల్లో.. పాస్‌పోర్టు
కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లో పాస్‌పోర్టు అందేట్లు చర్యలు తీసుకోనున్నట్ల్లు జాతీయ పాస్‌పోర్టు అధికారి ముక్తేశ్‌కుమార్ పర్దేశి తెలిపారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మినీ పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. దరఖాస్తుల పరిశీలనకు పోలీసు యంత్రాంగం పదిహేను రోజుల సమయం తీసుకొనేదని, పాస్‌పోర్టు అందుకొనేసరికి నెల రోజుల సమయం పట్టేదన్నారు. దరఖాస్తుల పరిశీలన ఏడు రోజుల్లోనే ముగిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారని, అలా అయితే పదిహేను రోజుల్లోనే దరఖాస్తుదారుడి ఇంటికి పాస్‌పోర్టు చేరవేస్తామన్నారు. మరో రెండు నెలల్లో కరీంనగర్ పాస్‌పోర్టు కేంద్రం ద్వారా పూర్తిస్థాయిలో సేవలందిస్తామన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే పదిహేను రోజులకోసారి స్లాట్ (దరఖాస్తుదారుడికి టైం) ఇస్తామన్నారు. స్లాట్‌కు అనుగుణంగా కార్యాలయానికి వ స్తే సర్టిఫికెట్ల పరిశీలన, ఫొటోలు, థంబ్ఇంప్రెషన్ తదితర ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరిక మేరకు ఏడు రోజులకోసారి క్యాంప్ నిర్వహించే అవకాశాన్ని రాష్ట్ర అధికారులు పరిశీలిస్తారన్నారు. పాస్‌పోర్టు సేవలు ఇటీవల కాలంలో పురోగతి చెందాయన్నారు. తెలుగు భాషలో వెబ్సైట్, టోల్‌ఫ్రీనెంబర్ రూపొందిస్తున్నామని, దరఖాస్తుదారులు తెలుగులోనే సమాచారం తెలుసుకోవచ్చన్నారు. దేశంలో 77 కేంద్రాలు, 10కి పైగా మినీ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్రం నుంచి పాస్‌పోర్టు కోసం ఎనిమిది లక్షల దరఖాస్తులు వస్తున్నాయని, ఈ సంవత్సరం అది తొమ్మిది లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్‌లో 3, నిజామాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలలో ఒక్కో పాస్‌పోర్టు కేంద్రాలున్నాయన్నారు. రెండు నెలల్లో పూర్తిస్థాయిలో సేవలు : పొన్నం రెండు నెలల్లో జిల్లాలో పూర్తిస్థాయిలో పాస్‌పోర్టు కేంద్రం సేవలందిస్తుందని ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2011లో అప్పటి మంత్రి ఎస్ఎం.కృష్ణ హామీ ఇస్తే, అప్పటినుంచి ఇప్పటివరకు ఎన్నో అనుమానాల నడుమ పాస్‌పోర్టు కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. కంప్యూటీకరణకు మరో రెండు నెలల సమయం పడుతుందని, అప్పటివరకు క్యాంప్‌లు నిర్వహిస్తారన్నారు. పదిహేనురోజులకోసారి కాకుండా ప్రతి శనివారం క్యాంప్‌లు నిర్వహించాలని అధికారులను కోరారు. దేశంలో మినీపాస్పోర్టు కేంద్రాలకు ఎన్నో ప్రతిపాదనలు వ చ్చినా రెండు మాత్రమే ఆచరణకు నోచుకున్నాయని, అందులో మిజోరాంలో ఒకటి కాగా, మరొకటి కరీంనగర్లో ఏర్పాటు చేయడం గర్వకారణమన్నారు. కరీంనగర్ తిరుపతి రైలు, కరీంనగర్‌కు బస్‌డిపో, పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు తన రాజకీయ జీవితానికి తృప్తినిచ్చిన ప్రత్యేక అంశాలన్నారు. వీటితో పాటు కేంద్రీయ విద్యాలయం, బీడీ కార్మికులకు ఆసుపత్రి, నర్సింగ్‌కళాశాల ఏర్పాటు కూడా అందులో భాగమేనన్నారు. ఓ వైపు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూనే, ప్రజల చిరకాలవాంఛ అయిన తెలంగాణ సాధన కోసం పోరాటం చేస్తున్నానన్నారు. కేంద్ర మంత్రివర్గ ఆమోదంతో మరో మైలురాయి దాటామని, పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తమకు ప్రధాని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్ మాట్లాడుతూ ఇంటి పేరులో అక్షరాలు తారుమారైనా సర్దుబాటు చేయాలని అధికారులను కోరారు. ఆరెపల్లి అనే ఇంటిపేరులో చివరన ఇంగ్లిష్ అక్షరాలు ఒకసారి వై అని మరోసారి ఐ అని రాస్తుంటారని, ఇలాంటి వాటికి మినహాయింపునివ్వాలన్నారు. పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటుకు కృషి చేసిన పొన్నం ప్రభాకర్‌కు జిల్లా ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు. రీజినల్ పాస్‌పోర్టు అధికారి శ్రీకర్‌రెడ్డి మాట్లాడుతూ కరీంనగర్లో ఏర్పాటు చేసిన కేంద్రం హైదరాబాద్ కార్యాలయ నియంత్రణలో కొనసాగుతుందన్నారు. ప్రతి సంవత్సరం 15 శాతం పాస్‌పోర్టు డిమాండ్ పెరుగుతుందన్నారు. కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య మాట్లాడుతూ జిల్లా నుంచి ఏటా 30 వేల మంది విదేశాలకు వెళుతున్నారన్నారు. ఇలాంటి వారికి కరీంనగర్లో పాస్‌పోర్టు కేంద్రం ఏర్పాటు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం మంచి సంప్రదాయమన్నారు. ఉపాధి వేటలో గల్ఫ్‌కు వెళ్లడం జిల్లాలో అలవాటేనన్నారు. విదేశాలకు వెళ్లడానికి దళారులను ఆశ్రయించొద్దన్నారు. ఎస్పీ శివకుమార్ మాట్లాడుతూ ఆన్లైన్ ప్రక్రియ చేయడానికి రూ.10 లక్షలు తమకు మంజూరు చేస్తే, ఏడు రోజుల్లోనే దరఖాస్తు పరిశీలనను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 రోజుల్లో పరిశీలన పూర్తి చేస్తున్న జిల్లా మనదేనన్నారు. పాస్‌పోర్టు తీసుకున్నాక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వేములవాడ దేవస్థానం చైర్మన్ బొమ్మ వెంకటేశ్వర్, డీసీసీబీ చైర్మన్ కొండూరు రవీందర్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, రాష్ట్ర మత్స పారిశ్రామిక సంస్థచైర్మన్ చేతి ధర్మయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పనకంటి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు కోడూరి సత్యనారాయణగౌడ్, రేగులపాటి పాపారావు, నగరపాలకసంస్థ కమిషనర్ రమేశ్, జిల్లా పాస్‌పోర్టు అధికారులు అశ్విని, జైన్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఏనుగు మనోహర్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ జుబేర్, మాజీ మేయర్ డి.శంకర్ పాల్గొన్నారు. -
జగతి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై తీర్పు రిజర్వ్
సాక్షి, న్యూఢిల్లీ: జగతి పబ్లికేషన్స్‌కు చెందిన రూ.34.65 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీలు) అటాచ్మెంట్ కేసును ఢిల్లీలోని పీఎంఎల్ఏ న్యాయ ప్రాధికార సంస్థ మంగళవారం విచారించింది. అథారిటీ చైర్మన్ కె.రామమూర్తి, సభ్యుడు ముఖేశ్‌కుమార్ ఎదుట జగతి తరఫు న్యాయవాది రవి గుప్తా, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) న్యాయవాది విపుల్‌కుమార్ తుది విడత వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణ పూర్తయిందన్న అథారిటీ.. ఇరుపక్షాలు లిఖితపూర్వకంగా వాదనలు సమర్పించడానికి వారంపాటు గడువునిస్తూ తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత రవిగుప్తా వాదిస్తూ.. జగతి పబ్లికేషన్స్ ఆస్తుల అటాచ్మెంట్ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) వాదన పూర్తిగా అసంబద్ధం, లొసుగులమయమని పేర్కొన్నారు. ‘‘మెరిట్ ఆధారంగా ఈడీ పెట్టిన కేసును అంగీకరించినప్పటికీ అటాచ్‌మెంట్‌పై వారు తీసుకున్న చర్య పీఎంఎల్ఏ సెక్షన్ 5(1)(బీ) ప్రకారం నిలవదు’’ అని నివేదించారు. అనంతరం ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. హైకోర్టు ఆదేశాలు, సీబీఐ చార్జిషీట్, ఐటీ నివేదికల్లోని విషయాలతోపాటు దర్యాప్తులో వెల్లడైన అంశాలంటూ గతంలో ఏకరువుపెట్టిన విషయాలనే పునరుద్ఘాటించారు. జగతిలో పెట్టుబడులు పెట్టిన ముగ్గురు వ్యాపారవేత్తలు.. టి.ఆర్.కణ్ణన్, మాధవ్ రామచంద్ర, ఎ.కె.దండమూడి నుంచి తీసుకున్న స్టేట్మెంట్లలోని అంశాలను ప్రస్తావించారు. -
రూ.7464 కోట్ల విలువైన ప్రభుత్వ భూముల గుర్తింపు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా హైదరాబాద్ జిల్లాలో 363 చోట్ల 412 ఎకరాలు గుర్తించామని, దీని విలువ రూ.7,464 కోట్లు ఉంటుందని కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు సందర్భంగా జిల్లాలో పరిస్థితిని కలెక్టర్ మీనా వివరించారు. మరో రూ.455 కోట్ల విలువైన స్థలాల విషయంలో న్యాయపరమైన వివాదం ఉందని చెప్పారు. న్యాయపరమైన వివాదాలు ఉన్న స్థలాల విషయంలో కోర్టుల్లో పటిష్టంగా వాదించి, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు సాధించేందుకు ఇద్దరు ముగ్గురు మంచి న్యాయవాదులను నియమించుకునేందుకు అనుమతించాలని కోరారు. షేక్‌పేట మండలంలో 25 స్థలాలపై న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని, ఈ స్థలాల విలువ వేల కోట్లు ఉంటుందని వివరించారు. ‘ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలను తొలగించి నెగ్గాలంటే అది ప్రభుత్వ భూమి అనడానికి అవసరమైన సాక్ష్యాధారాలతో పాటు కోర్టుల్లో సరిగా వాదించే న్యాయవాదులు అవసరమే. ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదు. ఆక్రమితదారులెవరూ భూములను వదులుకోవడానికి సిద్ధపడరు. వాటిని కైవసం చేసుకునేందుకు సుప్రీంకోర్టు వరకైనా వెళ్లడానికి సిద్ధపడతారు. అందువల్ల మీ జిల్లాల్లోని న్యాయ వివాదాల్లో ప్రభుత్వం తరఫున వాదించడానికి మీ దృష్టిలో ఎవరైనా మంచి న్యాయవాదులు ఉంటే మాకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం నుంచి అనుమతి ఇప్పిస్తాం..’ అని రాష్ట్ర భూ పరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు గాను ప్రహరీల నిర్మాణం, ఫెన్సింగ్ కోసం ఎంత డబ్బు వెచ్చించడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైతే ఎక్కడో ఒకచోట కొంత భూమిని విక్రయించి వచ్చే డబ్బును ఇందుకు వినియోగిస్తామని చెప్పారు.