ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు వస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ బృందం
సాక్షి, అమరావతి : రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు అనూప్‌చంద్ర పాండే, అరుణ్ గోయల్‌తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు.
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్‌ఎస్‌ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది.
అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్‌తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియాకు వివరిస్తారని ముఖే‹Ù కుమార్ మీనా అన్నారు.
సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి..
ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని.. విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నోవాటెల్ కాన్ఫరెన్స్ హాల్‌ను
పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment