
ఆరు వికెట్లతో చెలరేగిన ముకేశ్ కుమార్ (PC: BCCI)
ముకేశ్‌కు ఆరు వికెట్లు.. బంగ్లా తొలి ఇన్నింగ్స్‌లో ఇలా..
Bangladesh A vs India A, 2nd unofficial Test - సిల్హెట్: బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ పేస్ బౌలర్ ముకేశ్ కుమార్ అదరగొట్టాడు. మంగళవారం మొదలైన రెండో మ్యాచ్‌లో ఆరు వికెట్లతో (6/40) చెలరేగాడు. ఫలితంగా బంగ్లాదేశ్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 80.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. కాగా ముకేశ్ కెరీర్‌లో ఇవే అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం.
ఇక ఇతర భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్, జయంత్ యాదవ్‌లకు రెండు వికెట్ల చొప్పున లభించాయి. ఆతిథ్య బంగ్లా జట్టులో షాహదత్ హుస్సేన్ (80; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), జకీర్ అలీ (62; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకాలతో రాణించారు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ 4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 11 పరుగులు చేసింది.
కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 3, యశస్వి జైశ్వాల్ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. కాగా రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం భారత- ‘ఎ’ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా కాక్స్ బజార్‌లో జరిగిన మొదటి టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే.
చదవండి: FIFA WC Pre- Quarterfinals: స్పెయిన్‌కు షాక్.. మొరాకో సంచలనం! బోనో వల్లే ఇదంతా!
IND Vs BAN: బంగ్లాదేశ్‌తో రెండో వన్డే.. రాహుల్ త్రిపాఠి అరంగేట్రం! తుది జట్టు ఇదే?