బంగ్లాదేశ్‌తో అనధికారిక టెస్టు డ్రా (PC: BCCI)
India A tour of Bangladesh, 2022 - Bangladesh A vs India A, 1st unofficial Test: భారత-‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పరాజయం నుంచి తప్పించుకుంది. ఓపెనర్ బ్యాటర్ జకీర్ హసన్, వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పర్యాటక జట్టు చేతిలో ఓటమి నుంచి బంగ్లాను కాపాడారు. వీరిద్దరి ప్రదర్శన కారణంగా కాక్స్ బజార్ వేదికగా జరిగిన నాలుగు రోజుల మొదటి టెస్టు డ్రాగా ముగిసింది.
కాగా రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నవంబరు 29న ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు.
ఆకట్టుకున్న బౌలర్లు
ఈ నేపథ్యంలో భారత బౌలర్లు సౌరభ్ కుమార్ 4, నవదీప్ సైనీ 3 వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ 2, అతిత్ షేత్ ఒక వికెట్ తీశారు. దీంతో ఆతిథ్య బంగ్లా-ఎ జట్టు 112 పరుగులకే కుప్పకూలి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది.
సెంచరీలతో మెరిసినా
ఈ క్రమంలో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(145), అభిమన్యు ఈశ్వరన్(142) అద్బుత సెంచరీలతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 132 ఓవర్ల వద్ద 5 వికెట్ల నష్టానికి భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది.
ఆ ఒక్కడు పట్టుదలగా నిలబడి
ఆ తర్వాత బంగ్లా ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్‌ను 21 పరుగులకే సౌరభ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ జకీర్ హసన్ పట్టుదలగా నిలబడి 402 బంతులు ఎదుర్కొని 172 పరుగులు చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాంటో 187 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన బంగ్లా జట్టు 341 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. జకీర్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
భారత్-ఎ వర్సెస్ బంగ్లాదేశ్-ఎ తొలి టెస్టు స్కోర్లు:
భారత్- 465/5 డిక్లేర్డ్
బంగ్లాదేశ్- 112 & 341/9
చదవండి: IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన
IND Vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిటన్ దాస్
Comments
Please login to add a commentAdd a comment