Unofficial Test
-
Aus A vs Ind A: రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్.. జురెల్ ఒక్కడే!.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ బ్యాటర్ల వైఫల్యం కొనసాగుతోంది. ఇప్పటికే తొలి టెస్టులో ఓడిన రుతురాజ్ సేన.. రెండో మ్యాచ్‌లోనూ శుభారంభం అందుకోలేకపోయింది. ఆట మొదటి రోజే స్వల్ప స్కోరుకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్ల ధాటికి తాళలేక తొలి ఇన్నింగ్స్‌లో 161 పరుగులకే కుప్పకూలింది.తొలి టెస్టులో ఓటమికాగా ఆసీస్-‘ఎ’- భారత్-‘ఎ’- జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగా మెకే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సహా ప్రధాన ఆటగాళ్లంతా విఫలం కావడంతో ఈ మేర పరాభవం తప్పలేదు.అదొక్కటే సానుకూలాంశంఇక ఈ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో సాయి సుదర్శన్ సెంచరీ చేయడం ఒక్కటే సానుకూలాంశం. ఈ క్రమంలో ఓటమిభారంతో గురువారం రెండో టెస్టు మొదలుపెట్టిన భారత జట్టు.. మరోసారి విఫలమైంది. రుతు, అభిమన్యు, కేఎల్ రాహుల్ ఫెయిల్మెల్బోర్న్ వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది భారత్. అయితే, ఆసీస్ పేసర్ల ధాటికి టాపార్డర్ కకావికలమైంది. ఓపెనర్లలో అభిమన్యు ఈశ్వరన్ డకౌట్ కాగా.. కేఎల్ రాహుల్ కేవలం నాలుగు పరుగులకే వెనుదిరిగాడు. పెవిలియన్‌కు గత మ్యాచ్‌లో శతకం బాదిన వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఈసారి సున్నాకే అవుట్‌కాగా.. కెప్టెన్ రుతురాజ్(4) మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ఈ క్రమంలో మిడిలార్డర్లో దేవ్‌దత్ పడిక్కల్(26) కాసేపు పోరాడగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో పట్టుదలగా నిలబడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 186 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 80 పరుగులు సాధించాడు.నితీశ్ రెడ్డి మరోసారిమిగతా వాళ్లలో ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి(16) మరోసారి నిరాశపరచగా.. మరో ఆల్‌రౌండర్ తనుష్ కొటియాన్(0), టెయిలెండర్లు ఖలీల్ అహ్మద్(1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. ప్రసిద్ కృష్ణ 14 పరుగులు చేయగా.. ముకేశ్ కుమార్ 5 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.చెలరేగిన నాసెర్ఆసీస్ బౌలర్లలో పేసర్ మైకేల్ నాసెర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టాడు. స్కాట్ బోలాండ్ కేఎల్ రాహుల్ రూపంలో కీలక వికెట్ దక్కించుకోగా.. స్పిన్నర్ కోరే రోచిసియెలి, కెప్టెన్ నాథన్ మెక్స్వినే(జురెల్ వికెట్) తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ(బీజీటీ)కి ముందు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్‌లను ముందుగానే బీసీసీఐ అక్కడికి పంపించింది. వీరిలో జురెల్ హిట్ కాగా.. రాహుల్ మరోసారి విఫలమయ్యాడు. ఇక బీజీటీ ఆడే టీమిండియాలో చోటు దక్కించుకున్న నితీశ్ రెడ్డి, అభిమన్యు ఈశ్వరన్ తీవ్రంగా నిరాశపరుస్తున్నారు. చదవండి: WI Vs ENG: కెప్టెన్‌తో గొడవ.. మ్యాచ్ మధ్యలోనే వెళ్లిపోయిన విండీస్ స్టార్ ప్లేయర్! వీడియో -
Aus A vs Ind A: ముకేశ్ దెబ్బకు.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్.. కానీ
ఆస్ట్రేలియా పర్యటనలో భారత్-‘ఎ’ జట్టుకు శుభారంభం లభించలేదు. ఆసీస్‌తో గురువారం మొదలైన అనధికారిక టెస్టు తొలి రోజు ఆటలోనే రుతురాజ్ సేనకు గట్టి షాక్ తగిలింది. కంగారూ బౌలర్ల విజృంభణ నేపథ్యంలో భారత బ్యాటర్లు పెవిలియన్‌కు వరుస కట్టారు.బ్యాటర్లు విఫలంఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్(7), కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(0) సహా బాబా ఇంద్రజిత్(9), వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4), నితీశ్ కుమార్ రెడ్డి(0), టెయిలెండర్లు మానవ్ సుతార్(1), ప్రసిద్ కృష్ణ(0) పూర్తిగా విఫలమయ్యారు.ఇక వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్(21)తో పాటు దేవ్‌దత్ పడిక్కల్(36), టెయిలెండర్ నవదీప్ సైనీ(23) ఓ మోస్తరుగా రాణించడంతో భారత్ వంద పరుగులు దాటగలిగింది. 47.4 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో సత్తా చాటగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ తలా ఒక వికెట్ పడగొట్టారు. Buckingham's got two! Watch #AUSAvINDA live: https://t.co/XcQLyyTDJ5 pic.twitter.com/RccWM8CX5R— cricket.com.au (@cricketcomau) October 31, 2024 ఆసీస్‌కూ ఆదిలోనే షాక్.. ‘జూనియర్ రికీ పాంటింగ్’ డకౌట్ఈ క్రమంలో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా-ఎ జట్టుకు భారత పేసర్ ముకేశ్ కుమార్ ఆదిలోనే షాకిచ్చాడు. తన అద్భుత ఆట తీరుతో ‘జూనియర్ రికీ పాంటింగ్’గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కన్‌స్టాస్(Sam Konstas)ను డకౌట్ చేశాడు. Mukesh gets Konstas in the first over! #AUSAvINDA pic.twitter.com/8E61yX0zTM— cricket.com.au (@cricketcomau) October 31, 2024మొత్తంగా మూడు బంతులు ఎదుర్కొన్న స్యామ్ ముకేశ్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చాడు. పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు.టీమిండియాతో టెస్టుకు ఆసీస్ ఓపెనర్ల పోటీలో కాగా 19 ఏళ్ల స్యామ్ ఇప్పటి వరకు ఆరు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి రెండు శతకాలు బాదడం సహా సగటు 45.70గా నమోదు చేశాడు. భారత్-ఎ జట్టుతో మ్యాచ్‌లో గనుక రాణిస్తే తదుపరి టీమిండియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో అతడు ఆస్ట్రేలియా ఓపెనర్‌గా బరిలో దిగే ఛాన్స్ లేకపోలేదు. అయితే, తొలి ఇన్నింగ్స్‌లో మాత్రం ముకేశ్ రూపంలో స్యామ్‌కు గట్టి షాక్ తగిలింది.పాతుకుపోయిన కెప్టెన్ఇదిలా ఉంటే.. ప్రసిద్ కృష్ణ సైతం అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. తొలుత కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌ను డకౌట్ చేసిన ప్రసిద్.. తర్వాత ఆసీస్-ఎ మరో ఓపెనర్ మార్కస్ హ్యారిస్(17) వికెట్ పడగొట్టాడు. ఇలా టాపార్డర్‌ను భారత బౌలర్లు కుదేలు చేసినా.. మిడిలార్డర్లో వచ్చిన కెప్టెన్ నాథన్ మెక్‌స్వీనీ క్రీజులో పాతుకుపోయి ఇబ్బంది పెట్టాడు.అతడికి తోడుగా బ్యూ వెబ్‌స్టర్(33) రాణించాడు. అయితే, ముకేశ్ కుమార్ ఈ జోడీని విడదీయగా.. నాథన్‌కు జతైన కూపర్ కానొలీ సైతం పట్టుదలగా నిలబడ్డాడు. ఈ క్రమంలో తొలి రోజు ఆట పూర్తయ్యే సరికి ఆసీస్ 39 ఓవర్ల ఆటలో నాలుగు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసి.. పటిష్ట స్థితిలో నిలిచింది. గురువారం ఆట ముగిసే సరికి నాథన్ 29, కూపర్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఆస్ట్రేలియా- ‘ఎ’ వర్సెస్ భారత్- ‘ఎ’ అనధికారిక తొలి టెస్టు(డే-1)👉వేదిక: గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఎరీనా, మెక్కే👉టాస్: ఆస్ట్రేలియా-ఎ.. తొలుత బౌలింగ్👉భారత్ స్కోరు: 107👉ఆసీస్ స్కోరు: 99/4 (39).. తొలి ఇన్నింగ్స్‌లో తొలిరోజు భారత్ కంటే ఎనిమిది పరుగుల వెనుకంజతుదిజట్లుఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డోగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.భారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.చదవండి: IPL 2025: షాకింగ్.. అతడి కోసం జడ్డూను వదులుకున్న సీఎస్కే! -
Aus A vs Ind A: రుతు, నితీశ్ డకౌట్.. అభిమన్యు, ఇషాన్ విఫలం
ఆస్ట్రేలియా-‘ఎ’తో అనధికారిక తొలి టెస్టులో భారత-‘ఎ’ జట్టు ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరిచారు. రంజీల్లో పరుగుల వరద పారించిన ఓపెనింగ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ 7 పరుగులకే పెవిలియన్ చేరగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు.వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్(35 బంతుల్లో 21), నాలుగో నంబర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్(77 బంతుల్లో 36) ఫర్వాలేదనిపించగా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన వాళ్లలో పేసర్ నవదీప్ సైనీ(23) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగాడు.బాబా అపరాజిత్(9)తో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్(4) విఫలం కాగా.. నితీశ్ కుమార్ రెడ్డి డకౌట్ అయ్యాడు. మానవ్ సుతార్ (1), ప్రసిద్ కృష్ణ(0) కూడా చేతులెత్తేశారు. ఆఖర్లో వచ్చిన ముకేశ్ కుమార్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇలా ఆసీస్ బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 47.4 ఓవర్లలో 107 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ బ్రెండన్ డాగెట్ ఆరు వికెట్లతో చెలరేగగా.. మరో పేసర్ ఫెర్గూస్ ఒ నీల్, స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఒక వికెట్ పడగొట్టాడు. మూకుమ్మడిగా విఫలంకాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత తుది జట్టులో స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా భారత యువ ఆటగాళ్లు అనధికారిక టెస్టులపై దృష్టి పెట్టారు. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో సత్తా చాటి టీమ్ మేనేజ్మెంట్ను ఇంప్రెస్ చేయాలని పట్టుదలగా ఉన్నారు. ఈ క్రమంలో ఆసీస్-ఎతో గురువారం నుంచి భారత్-ఎ తొలి అనధికారిక టెస్టు మొదలైంది. అయితే, తొలి ఇన్నింగ్స్‌లోనే అందరూ మూకుమ్మడిగా విఫలం కావడం గమనార్హం. ముఖ్యంగా సీనియర్ టీమ్‌కు ఎంపికైన అభిమన్యు ఈశ్వరన్, నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో నిరాశపరచగా.. ప్రసిద్ కృష్ణ వికెట్లు తీస్తేనే సెలక్టర్ల దృష్టిని ఆకర్షించగలడు.దేశవాళీల్లో సత్తా చాటి... 11 ఏళ్ల ఫస్ట్ క్లాస్ కెరీర్లో ఈశ్వరన్ భారీగా పరుగులు సాధించినా దురదృష్టవశాత్తూ ఇప్పటి వరకు జాతీయ జట్టుకు ఆడే అవకాశం రాలేదు. 99 మ్యాచ్‌లలో అతను 7638 పరుగులు సాధించగా, ఇందులో 27 సెంచరీలు ఉన్నాయి. ఇక ఆసీస్-ఎతో జరుగుతున్న తాజా మ్యాచ్ అతడికి 100వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ .ఇంతటి అపార అనుభవం ఉన్న ఈశ్వరన్ పేరు పెర్త్‌లో జరిగే తొలి టెస్టు కోసం ఇప్పటికే పరిశీలనలో ఉంది. వ్యక్తిగత కారణాలతో కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు దూరం అయ్యే అవకాశం ఉండటంతో రెగ్యులర్ ఓపెనర్‌గా ఈశ్వరన్కే తొలి ప్రాధాన్యత ఉంది. గాయాల నుంచి కోలుకునిఇక గాయం నుంచి కోలుకొని పునరాగమనం చేసిన తర్వాత దులీప్ ట్రోఫీ, ఇరానీ, రంజీలలో పేసర్ ప్రసిధ్ కృష్ణ ఆడాడు. వీటిలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా... అతని బౌలింగ్ శైలికి ఆసీస్ పిచ్‌లు సరిగ్గా సరిపోతాయి. ఇదే కారణంతో అతను సీనియర్ టీమ్‌లోకి ఎంపికయ్యాడు. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు తన ఫామ్‌ను అందుకోవడంతో పాటు ఫిట్నెస్ నిరూపించుకునేందుకు కూడా ప్రసిద్‌కు ఇది సరైన వేదిక కానుంది. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్తోఆంధ్ర క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పరిస్థితి వీరితో పోలిస్తే భిన్నం. ఐపీఎల్లో మెరుపు బ్యాటింగ్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్‌పై టి20లో చెలరేగిన నితీశ్ ఫస్ట్ క్లాస్ రికార్డు అద్భుతంగా ఏమీ లేదు. ఇటీవల దులీప్ ట్రోఫీలో కూడా ఐదు ఇన్నింగ్స్‌లలో రెండు సార్లు డకౌట్ అయిన అతను... 48 ఓవర్లు బౌలింగ్ చేసి రెండే వికెట్లు తీశాడు.అయినా సరే శార్దుల్ ఠాకూర్‌లాంటి ఆల్‌రౌండర్‌ను కాదని నితీశ్‌ను సెలక్టర్ల టెస్టు టీమ్‌కు ఎంపిక చేశారు. గత ఏడాది రంజీ సీజన్లో 25 వికెట్లు తీసిన నితీశ్ ప్రదర్శన కూడా ఒక కారణం కాగా... వికెట్‌కు ఇరు వైపులా బంతిని చక్కగా స్వింగ్ చేసే అతని నైపుణ్యం ఆసీస్ పిచ్‌లపై పనికొస్తుందని వారు భావించారు. ఈ నేపథ్యంలో తానేంటో నిరూపించుకోవాల్సిన బాధ్యత నితీశ్పైనే ఉంది. టెస్టు క్రికెటర్లు కూడా... భారత్ తరఫున ఇంకా టెస్టులు ఆడని రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో భారత ‘ఎ’ జట్టు బరిలోకి దిగింది. ఇప్పటికే భారత్‌కు ఆడిన ఇషాన్ కిషన్, నవదీప్ సైనీ, దేవదత్ పడిక్కల్, ముకేశ్ కుమార్లాంటి ప్లేయర్లు మరోసారి ఎరుపు బంతితో తమ ఆటను నిరూపించుకోవాల్సి ఉంది.ఆసీస్ క్రికెటర్లకూ పరీక్షఇక రంజీ, దులీప్ ట్రోఫీలో రాణించి ఈ టీమ్‌కు ఎంపికైన బాబా ఇంద్రజిత్, రికీ భుయ్, ఖలీల్, తనుశ్ కొటియాన్, సాయిసుదర్శన్ రాణించడం వారి భవిష్యత్తుకు కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టులో కూడా పలువురు టెస్టు క్రికెటర్లు ఉన్నారు. మైకేల్ నెసర్, మార్కస్ హారిస్, స్కాట్ బోలండ్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, టాడ్ మర్ఫీ ఆసీస్ ప్రధాన జట్టులోకి పునరాగమనం చేసే ప్రయత్నంలో తమ అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకుంటున్నారు.ఇక పరిమిత ఓవర్ల పోటీల్లో సత్తా చాటిన జోష్ ఫిలిప్ కూడా ఇక్కడ రాణించి టెస్టు అరంగేట్రాన్ని ఆశిస్తున్నాడు. అందరికంటే ఎక్కువగా న్యూసౌత్‌వేల్స్‌కు చెందిన 19 ఏళ్ల ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్‌పై ఆస్ట్రేలియా సెలక్టర్లు ఎక్కువగా దృష్టి పెట్టారు.‘జూనియర్ రికీ పాంటింగ్’గా అందరూ పిలుస్తున్న ఈ బ్యాటర్ 6 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో 2 సెంచరీలు సహా 45.70 సగటుతో పరుగులు సాధించాడు. ఇక్కడ బాగా ఆడితే భారత్‌తో టెస్టుకు అతడు కొత్త ఓపెనర్‌గా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ‘ఎ’ జట్ల పోరు కూడా ఆసక్తికరంగా సాగడం ఖాయం. చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్Waking up early just to see Ruturaj score a golden duck. Bro not doing justice to his fans now pic.twitter.com/KDfzJmXXZ2— Div🦁 (@div_yumm) October 31, 2024 -
Ind vs Aus: తొలి టెస్టులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND U-19 Vs AUS U-19 Test Series: వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో అండర్-19 అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. చెన్నై వేదికగా తొలి టెస్టులో యువ రెండు వికెట్ల తేడాతో గెలిచింది. తద్వారా సొంతగడ్డపై జరుగుతున్న రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలో నిలిచింది.కాగా ఓవర్‌నైట్ స్కోరు 110/4తో బుధవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆ్రస్టేలియా అండర్–19 జట్టు 67.4 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌటైంది. రిలీ కింగ్సెల్ (48; 7 ఫోర్లు, ఒక సిక్స్) ఆసీస్ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్ కాగా... ఎయిడెన్ ఓ కానర్ (38 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) వేగంగా ఆడాడు. ఇక యువ భారత బౌలర్లలో లెగ్‌స్పిన్నర్ మహమ్మద్ ఇనాన్ ఆరు వికెట్లతో చెలరేగాడు.మరోవైపు.. కెప్టెన్ సొహమ్ పట్వర్ధన్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యువభారత్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. 61.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసి జయభేరి మోగించింది.అయితే, తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో వైభవ్ సూర్యవంశీ (1) విఫలం కాగా.. నిత్య పాండ్యా (86 బంతుల్లో 51; 3 ఫోర్లు), నిఖిల్ కుమార్ (71 బంతుల్లో 55 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో అదరగొట్టారు. ఛేజింగ్‌లో ఒత్తిడి పెరిగిపోతున్న సమయంలో భారీ షాట్లతో విరుచుకుపడి జట్టును గెలిపించిన నిఖిల్ కుమార్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో ఎయిడెన్ ఓ కానర్ నాలుగు, విశ్వ రామ్‌కుమార్ మూడు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి రెండో అనధికారిక టెస్టు మొదలు కానుంది. చదవండి: ఇంగ్లండ్ బజ్‌బాల్‌ను టీమిండియా కాపీ కొట్టింది: వాన్ -
ఆవేశ్ ఖాన్‌కు 5 వికెట్లు: తిలక్, అక్షర్ అర్ధ శతకాలు! టాప్ స్కోరర్ అతడే
South Africa A vs India A, 2nd unofficial Test: సౌతాఫ్రికా-‘ఏ’ జట్టుతో అనధికారిక రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్లు తిలక్ వర్మ, అక్షర్ పటేల్ అర్ధ శతకాలతో రాణించారు. యూపీకి చెందిన యువ వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురేల్ సైతం హాఫ్ సెంచరీతో మెరిశాడు. కాగా ప్రొటిస్ యువ జట్టుతో రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్ ఆడేందుకు భారత్-ఏ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లింది. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియగా.. బెనోనీలో బాక్సింగ్ డే మొదలుకావాల్సిన రెండో టెస్టు వర్షం కారణంగా ఒకరోజు ఆలస్యంగా ఆరంభమైంది. టాస్ పడకుండానే తొలి రోజు ముగిసిపోగా.. రెండో రోజు ఆట సందర్భంగా టాస్ గెలిచిన భారత్-ఏ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఆవేశ్ ఖాన్‌కు ఐదు వికెట్లు ఆతిథ్య సౌతాఫ్రికా-ఏ జట్టును 263 పరుగులకు పరిమితం చేసింది. ప్రొటిస్ ఇన్నింగ్స్‌లో టెయిలెండర్ షెపో మొరేకీ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత పేసర్లలో ఆవేశ్ ఖాన్ అత్యధికంగా ఐదు వికెట్లతో చెలరేగగా.. నవదీప్ సైనీ ఒక వికెట్ పడగొట్టాడు. స్పిన్ ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ రెండు, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో చివరిదైన నాలుగో రోజు ఆటలో భాగంగా.. శుక్రవారం బ్యాటింగ్ కొనసాగించిన భారత్-ఏ.. 95.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. దీంతో ఫలితం తేలకుండానే ఈ మ్యాచ్ కూడా ముగిసిపోయింది. అక్షర్ ధనాధన్ హాఫ్ సెంచరీ ఇక భారత్ ఇన్నింగ్స్‌లో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ 169 బంతులు ఎదుర్కొని 50 పరుగులు సాధించగా.. అక్షర్ పటేల్ 61 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసి అజేయంగా నిలిచాడు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ 69 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాపార్డర్‌లో ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 18, సాయి సుదర్శన్ 30, వన్‌డౌన్‌లో దిగిన రజత్ పాటిదార్ 33 పరుగులు సాధించారు. మిగతా వాళ్లలో సర్ఫరాజ్ ఖాన్ 34, వాషింగ్టన్ సుందర్(9- నాటౌట్) రన్స్ చేశారు. రోహిత్ సేనతో చేరిన భరత్ కాగా ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో భారత్-ఏ జట్టు సౌతాఫ్రికాకు వెళ్లింది. అతడి కెప్టెన్సీలో తొలి టెస్టు డ్రా చేసుకుంది. అయితే, భరత్ టీమిండియాతో చేరే క్రమంలో ‘ఏ’ జట్టుకు దూరం కాగా.. అభిమన్యు ఈశ్వరన్ అతడి స్థానంలో రెండో టెస్టులో జట్టును ముందుండి నడిపించాడు. ఇక అనధికారిక టెస్టుల్లో మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటే సాగుతాయన్న విషయం తెలిసిందే. -
లంకేయులను గడగడలాడిస్తున్న సఫారీ స్పిన్నర్.. ఏకంగా 18 వికెట్లు
సౌతాఫ్రికా-ఏ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్) శ్రీలంక-ఏ జట్టును వారి స్వదేశంలో గడగడలాడిస్తున్నాడు. రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా నిన్న (జూన్ 19) మొదలైన రెండో టెస్ట్‌లో ముత్తుసామి మరోసారి 5 వికెట్లు సాధించి, లంకేయులను ముప్పుతిప్పలు పెట్టాడు. ఈ సిరీస్‌లో ముత్తుసామి 5 అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి. తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి.. ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా ముత్తుసామి 3 ఇన్నింగ్స్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు. ముత్తుసామి ధాటికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగులకు ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్‌లో తొమ్మిదో నంబర్లో బ్యాటింగ్‌కు వచ్చిన మిలన్ రత్నాయకే (53) టాప్ స్కోరర్‌గా నిలువగా.. నిషాన్ మధుష్క (33), లసిత్ క్రూస్పుల్లే (27), భానుక (32), పసిందు సూరియబండార (41), లహిరు ఉదార (33), ఆర్ మెండిస్ (44) ఓ మోస్తరు స్కోర్లు సాధించారు. సఫారీ బౌలర్లలో ముత్తుసామితో (26.1-4-101-6) పాటు సిపామ్లా (2), విలియమ్స్ (1), స్వేన్పోయల్ (1) వికెట్లు సాధించారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. 4 ఓవర్లలో వికెట్ నష్టానికి 7 పరుగులు చేసి, ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సఫారీ కెప్టెన్ టోనీ డి జోర్జి (0)ని ఇన్నింగ్స్ తొలి బంతికే విశ్వ ఫెర్నాండో ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. మాథ్యూ బ్రీట్జ్కీ (2), ట్రిస్టన్ స్టబ్స్ (5) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ 160 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుమందు జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా-ఏ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
లంకేయులను వారి స్వదేశంలో ముప్పుతిప్పలు పెట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్
మూడు వన్డేలు, రెండు టెస్ట్‌ల అనధికారిక సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా ఏ జట్టు శ్రీలంకలో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో తొలుత జరిగిన వన్డే సిరీస్‌ను సౌతాఫ్రికా 2-1 తేడాతో కైవసం చేసుకోగా.. నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో శ్రీలంక-ఏ విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆ తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగులకే కుప్పకూలింది. అనంతరం శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో 151 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 185 పరుగులకే చాపచుట్టేసి, 160 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లంకేయులకు ముప్పుతిప్పలు పెట్టిన సెనురన్ ముత్తుసామి.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక భారీ తేడాతో విజయం సాధించినప్పటికీ.. సఫారీ స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి అందరి దృష్టిని ఆకర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి, రెండో ఇన్నింగ్స్‌లో సైతం అదే రేంజ్లో రెచ్చిపోయి 5 వికెట్లు పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 వికెట్లు పడగొట్టిన ముత్తుసామి లంక బ్యాటర్లకు వారి స్వదేశంలో ముచ్చెమటలు పట్టించాడు. ముత్తుసామికి సహచర బౌలర్ల నుంచి సహకారం లభించకపోవడంతో లంక బ్యాటర్లు పైచేయి సాధించారు. బౌన్సీ పిచ్‌లు అధికంగా ఉండే సౌతాఫ్రికా లాంటి దేశం నుంచి వచ్చిన స్పిన్ బౌలర్ పరాయి గడ్డపై, అందులో ఉపఖండపు పిచ్‌లపై ఈ స్థాయిలో రెచ్చిపోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకే ముత్తుసామిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తన జట్టు ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నా, ముత్తుసామిని అందరూ ప్రశంసిస్తున్నారు. మున్ముందు ముత్తుసామి సౌతాఫ్రికా జాతీయ జట్టులో కీలకంగా మారతాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, 29 ఏళ్ల ముత్తుసామి సౌతాఫ్రికా తరఫున ఇదివరకే అరంగేట్రం చేసి, 2 వికెట్లు పడగొట్టాడు. -
Test: బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన భారత్.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారీ విజయం
India A tour of Bangladesh, 2022- Bangladesh A vs India A, 2nd unofficial Test: బంగ్లాదేశ్- ఎ జట్టుతో రెండో అనధికారిక టెస్టులో భారత- ఎ జట్టు ఘన విజయం సాధించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలోని టీమిండియా ఇన్నింగ్స్ మీద 123 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టుపై గెలుపొందింది. సిల్హెట్ వేదికగా మంగళవారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. విజృంభించిన బౌలర్లు ఈ క్రమంలో పేసర్ ముకేశ్ కుమార్ ఆరు వికెట్లతో చెలరేగగా.. జయంత్ యాదవ్, ఉమేశ్ యాదవ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ మేరకు భారత బౌలర్ల విజృంభణ నేపథ్యంలో బంగ్లా- ఎ జట్టు 252 పరుగులకు ఆలౌట్ అయి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. కదం తొక్కిన బ్యాటర్లు ఇక భారత ఇన్నింగ్స్‌లో ఓపెనర్ యశస్వి జైశ్వాల్ నిరాశపరిచినా(12).. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 248 బంతులు ఎదుర్కొని 157 పరుగులు సాధించాడు. అభిమన్యు కెప్టెన్ ఇన్నింగ్స్‌కు తోడు మిగతా వాళ్లలో ఛతేశ్వర్ పుజారా 52, వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ 77, జయంత్ యాదవ్ 83, సౌరభ్ కుమార్ 55, నవదీప్ సైనీ 50(నాటౌట్) సైతం అర్ధ శతకాలతో రాణించారు. మెరిసిన సౌరభ్ ఈ నేపథ్యంలో 147.1 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 562 పరుగుల భారీ స్కోరు చేసిన అభిమన్యు సేన.. తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో భారత ఫాస్ట్‌బౌలర్ ముకేశ్ కుమార్ బంగ్లాను దెబ్బకొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో స్పిన్నర్ సౌరభ్ కుమార్ 6 వికెట్లతో చెలరేగాడు. సమిష్టి కృషితో విజయభేరి ఉమేశ్ యాదవ్ రెండు, నవదీప్ సైనీ 2 వికెట్లు కూల్చారు. దీంతో.. నాలుగో రోజు ఆటలో భాగంగా శుక్రవారం నాటి రెండో సెషన్లోనే 8 వికెట్లు కోల్పోయిన ఆతిథ్య బంగ్లా జట్టు కథ ముగిసింది. ఇన్నింగ్స్ మీద 123 పరుగుల భారీ తేడాతో భారత- ఎ జట్టు జయభేరి మోగించింది. కాగా రెండు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు డ్రా కాగా.. రెండో టెస్టులో సమిష్టి కృషితో గెలుపొందిన భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. భారత్- ఎ వర్సెస్ బంగ్లాదేశ్- ఎ రెండో అనధికారిక టెస్టు స్కోర్లు: భారత్-ఎ: 562/9 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- ఎ: 252 & 187 చదవండి: Ind Vs Ban: మరీ బంగ్లా చేతిలో ఓడిపోతుందని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం?! తిరిగి రాగానే రోహిత్‌తో.. IND Vs AUS: 12 ఏళ్ల తర్వాత.. ఎగిరి గంతేస్తున్న అభిమానులు -
యశస్వి, అభిమన్యు సెంచరీలు వృథా.. బంగ్లాతో తొలి టెస్టు డ్రా
India A tour of Bangladesh, 2022 - Bangladesh A vs India A, 1st unofficial Test: భారత-‘ఎ’ జట్టుతో తొలి టెస్టులో బంగ్లాదేశ్ పరాజయం నుంచి తప్పించుకుంది. ఓపెనర్ బ్యాటర్ జకీర్ హసన్, వన్‌డౌన్ బ్యాటర్ నజ్ముల్ హొసేన్ షాంటో పర్యాటక జట్టు చేతిలో ఓటమి నుంచి బంగ్లాను కాపాడారు. వీరిద్దరి ప్రదర్శన కారణంగా కాక్స్ బజార్ వేదికగా జరిగిన నాలుగు రోజుల మొదటి టెస్టు డ్రాగా ముగిసింది. కాగా రెండు అనధికారిక టెస్టులు ఆడే నిమిత్తం బంగ్లాదేశ్‌కు వెళ్లింది. ఈ క్రమంలో నవంబరు 29న ఆరంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆకట్టుకున్న బౌలర్లు ఈ నేపథ్యంలో భారత బౌలర్లు సౌరభ్ కుమార్ 4, నవదీప్ సైనీ 3 వికెట్లతో చెలరేగగా.. ముకేశ్ కుమార్ 2, అతిత్ షేత్ ఒక వికెట్ తీశారు. దీంతో ఆతిథ్య బంగ్లా-ఎ జట్టు 112 పరుగులకే కుప్పకూలి తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. సెంచరీలతో మెరిసినా ఈ క్రమంలో భారత ఓపెనర్లు యశస్వి జైశ్వాల్(145), అభిమన్యు ఈశ్వరన్(142) అద్బుత సెంచరీలతో రాణించగా.. వికెట్ కీపర్ బ్యాటర్ ఉపేంద్ర యాదవ్ 71 పరుగులతో అజేయంగా నిలిచాడు. దీంతో 132 ఓవర్ల వద్ద 5 వికెట్ల నష్టానికి భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఆ ఒక్కడు పట్టుదలగా నిలబడి ఆ తర్వాత బంగ్లా ఓపెనర్ మహ్మదుల్ హసన్ జాయ్‌ను 21 పరుగులకే సౌరభ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు. అయితే, మరో ఓపెనర్ జకీర్ హసన్ పట్టుదలగా నిలబడి 402 బంతులు ఎదుర్కొని 172 పరుగులు చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాంటో 187 బంతుల్లో 77 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు నష్టపోయిన బంగ్లా జట్టు 341 పరుగులు చేయగలిగింది. ఈ నేపథ్యంలో మ్యాచ్ డ్రాగా ముగిసిపోయింది. జకీర్ హసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. భారత్-ఎ వర్సెస్ బంగ్లాదేశ్-ఎ తొలి టెస్టు స్కోర్లు: భారత్- 465/5 డిక్లేర్డ్ బంగ్లాదేశ్- 112 & 341/9 చదవండి: IND Vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్ బౌలర్.. బీసీసీఐ ప్రకటన IND Vs BAN: టీమిండియాతో వన్డే సిరీస్.. బంగ్లాదేశ్ కెప్టెన్‌గా లిటన్ దాస్ -
మెరిసిన సామ్సన్, శార్దుల్
తిరువనంతపురం: దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన చివరి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 36 పరుగుల తేడాతో గెలిచింది. ఐదు వన్డేల సిరీస్‌ను 4–1తో కైవసం చేసుకుంది. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సంజూ సామ్సన్ మెరుపులు... బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్ (3/9) విజృంభణ భారత విజయంలో ముఖ్యపాత్ర పోషించాయి. తొలుత భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ (36 బంతుల్లో 51; 5ఫోర్లు, 2 సిక్స్‌లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సంజూ సామ్సన్ (48 బంతుల్లో 91; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 135 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ హెండ్రిక్స్ ( 59; 10 ఫోర్లు) రాణించాడు. -
భారత్ ‘ఎ’ను గెలిపించిన ఇషాన్
తిరువనంతపురం: కీలక దశలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన భారత ‘ఎ’ జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ కెప్టెన్ మనీశ్ పాండే ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 21 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. జార్జి లిండే (25 బంతుల్లో 52 నాటౌట్; ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించాడు. కెప్టెన్ బవుమా (33 బంతుల్లో 40; 6 ఫోర్లు), క్లాసెన్ (27 బంతుల్లో 31; 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అధిగమించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడటంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ‘ఎ’ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్‌కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కృనాల్ పాండ్యా (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝళిపించారు. ఇషాన్ కిషన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లోని మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
శ్రీకర్ భరత్ సెంచరీ
హుబ్లి: వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (117: 156 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత సెంచరీతో ఆదుకోవడంతో శ్రీలంక ‘ఎ’తో రెండో అనధికార టెస్ట్‌లో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ ఎదురైంది. తొలి అనధికార టెస్ట్‌లో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈక్రమంలో అన్మోల్ప్రీత్ సింగ్(65), సిద్ధేశ్ లాడ్(32) మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం అన్మోల్కు జతకలిసిన శ్రీకర్ భరత్ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. అన్మోల్ అవుటయ్యాక లోయరార్డర్‌తో కలసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తిచేసుకొని ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. లంక బౌలర్లలో లాహిరు కుమార, సందకన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక శుక్రవారం ఆట ముగిసే సమయానికి 87 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం క్రీజులో డిక్వెల్లా(27), ప్రియమల్ పెరీరా(7) ఉన్నారు. భారత్ బౌలర్లలో సందీప్ వారియర్, శివం దూబే చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
భారత్ ‘ఎ’ ఎదురీత
ఆసీస్ ‘ఎ’తో అనధికారిక టెస్టు బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న నాలుగు రోజుల అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ జట్టు ఎదురీదుతోంది. ఓపెనర్ అఖిల్ (188 బంతుల్లో 82 బ్యాటింగ్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో శనివారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్సలో 60 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోరుు 158 పరుగులు చేసింది. అఖిల్‌తో పాటు సంజూ శామ్సన్ (34 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇన్నింగ్స పరాజయం నుంచి తప్పించుకోవాలంటే భారత్ 108 పరుగులు చేయాల్సివుం డగా... చేతిలో ఆరు వికెట్లున్నారుు. అంతకుముందు 319/5 ఓవర్‌నైట్ స్కోరుతో ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా ‘ఎ’ తొలి ఇన్నింగ్సలో 124.1 ఓవర్లలో 435 పరుగుల వద్ద ఆలౌటైంది. కార్ట్‌రైట్ (117; 15 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ పూర్తి చేసుకోగా, వైట్మన్ (51) అర్ధసెంచరీ చేశాడు. -
భారీ ఆధిక్యంలో భారత్ ‘ఎ’
- ఆసీస్ ‘ఎ’ 268 ఆలౌట్ - ఓజాకు ఐదు వికెట్లు చెన్నై: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న అనధికార టెస్టులో భారత్ ‘ఎ’ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. అభినవ్ ముకుంద్ (40), కెప్టెన్ పుజారా (42) నిలకడగా ఆడటంతో శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. కరుణ్ నాయర్ (4 బ్యాటింగ్), శ్రేయస్ అయ్యర్ (4 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. లోకేశ్ రాహుల్ (29) విఫలమయ్యాడు. ముకుంద్, పుజారా రెండో వికెట్‌కు 71 పరుగులు జోడించారు. ప్రస్తుతం టీమిండియా ఓవరాల్‌గా 154 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 185/4 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 33 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. హ్యాండ్స్కాంబ్ (91) సెంచరీ చేజార్చుకున్నాడు. స్టోనిస్ (77) మెరుగ్గా ఆడారు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 154 పరుగులు జోడించారు. అయితే లోయర్ ఆర్డర్ పూర్తిగా నిరాశపర్చడంతో ఆసీస్ 35 పరుగుల తేడాతో చివరి ఆరు వికెట్లు చేజార్చుకుంది. హైదరాబాద్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా 5, మిశ్రా 3 వికెట్లు తీశారు.