హుబ్లి: వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (117: 156 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత సెంచరీతో ఆదుకోవడంతో శ్రీలంక ‘ఎ’తో రెండో అనధికార టెస్ట్‌లో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ ఎదురైంది. తొలి అనధికార టెస్ట్‌లో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈక్రమంలో అన్మోల్‌ప్రీత్ సింగ్(65), సిద్ధేశ్ లాడ్(32) మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించి ఆదుకున్నారు.
అనంతరం అన్మోల్‌కు జతకలిసిన శ్రీకర్ భరత్ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. అన్మోల్ అవుటయ్యాక లోయరార్డర్‌తో కలసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తిచేసుకొని ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. లంక బౌలర్లలో లాహిరు కుమార, సందకన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక శుక్రవారం ఆట ముగిసే సమయానికి 87 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం క్రీజులో డిక్వెల్లా(27), ప్రియమల్ పెరీరా(7) ఉన్నారు. భారత్ బౌలర్లలో సందీప్ వారియర్, శివం దూబే చెరో 2 వికెట్లు పడగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment