India A cricket team
-
ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు?
ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత్-ఎ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్లో భాగంగా ఆసీస్-ఎ జట్టుతో భారత్ రెండు అనాధికారిక టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆక్టోబర్ 31 నుంచి ప్రారంభం కానుంది.ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముంది. ఇప్పటికే ఆస్ట్రేలియాకు పంపే జట్టును సెలక్టర్లు ఖారారు చేసినట్లు తెలుస్తోంది. ఈ పర్యటన భారత్-ఎ జట్టుకు స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సారథ్యం వహించనున్నట్లు సమాచారం. రుతురాజ్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో తను ఏంటో నిరూపించుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మహారాష్ట్రకు గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడికి భారత-ఎ జట్టు పగ్గాలు అప్పగించనున్నట్లు వినికిడి.కిషన్‌కు చోటు?అదేవిధంగా ఆసీస్ టూర్‌కు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత సీనియర్ జట్టులో చోటు కోల్పోయిన కిషన్.. ప్రస్తుతం రంజీల్లో జార్ఖండ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ టోర్నీలో కిషన్ పర్వాలేదన్పిస్తున్నాడు. అంతకముందు దులీప్ ట్రోఫీలో కూడా ఇషాన్ సత్తాచాటాడు. ఈ క్రమంలో అతడిని ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు సమాచారం. ఇక ఆస్ట్రేలియాకు వెళ్లే జట్టులో ఆంధ్రా ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి, స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రికీ భుయ్ కూడా చోటు సంపాదించుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆసీస్ టూర్‌కు భారత్- ఎ జట్టు(అంచనా)రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, దేవదత్ పడిక్కల్,సాయి సుదర్శన్, బి ఇంద్రజిత్, అభిషేక్ పోరెల్, ఇషాన్ కిషన్, ముఖేష్ కుమార్, రికీ భుయ్, నితీష్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవ్‌దీప్ సైనీ, ఖాలీల్ అహ్మద్, తనుష్ కోటియన్, యశ్ దయాళ్చదవండి: ‘కాస్తైనా సిగ్గుండాలి నీకు!: మండిపడ్డ టీమిండియా ఫ్యాన్స్ -
BCCI: ఇంగ్లండ్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు ప్రకటన.. కెప్టెన్ అతడే!
BCCI- India ‘A’ squad: ఇంగ్లండ్‌తో టీమిండియా టెస్టు సిరీస్‌కు ముందు.. వామప్ మ్యాచ్‌ల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి భారత్-‘ఏ’ జట్టును ప్రకటించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడేందుకు 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు తెలిపింది. మెన్స్ సెలక్షన్ కమిటీ సెలక్ట్ చేసిన ఈ టీమ్‌కు బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని పేర్కొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను బీసీసీఐ శనివారం వెల్లడించింది. ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-‘ఏ’ జట్టు మొత్తం రెండు వామప్ మ్యాచ్‌లు ఆడుతుందని తెలిపింది. అదే విధంగా... జనవరి 12- 20 మధ్య ఈ మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే. అంతకంటే ముందు.. ఇంగ్లండ్ లయన్స్ భారత్-‘ఏ’ జట్టుతో ఈ మేరకు వామప్ మ్యాచ్‌లు ఆడనుంది. ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత్-‘ఏ’ జట్టు అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, ప్రదోష్ రంజన్ పాల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, పుల్కిత్ నారంగ్, నవదీప్ సైనీ, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), ఆకాశ్ దీప్. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇండియా-‘ఏ’ జట్టు వామప్ మ్యాచ్‌ల షెడ్యూల్ 1. జనవరి 12-13: నరేంద్ర మోదీ స్టేడియం గ్రౌండ్- బి, అహ్మదాబాద్(రెండు రోజుల మ్యాచ్) 2. జనవరి 17-20: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్(నాలుగు రోజుల మ్యాచ్). చదవండి: T20 WC 2024: అద్భుతమైన ఫీల్డర్లు.. కోహ్లి, రోహిత్‌లను ఆడించాలి: టీమిండియా దిగ్గజం -
IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..!
India A Squad Announced For South Africa Tour: ఐపీఎల్-2021లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా(డీసీ), దేవ్‌దత్ పడిక్కల్(ఆర్సీబీ), ఉమ్రాన్ మాలిక్(ఎస్ఆర్హెచ్)లకు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోయినా దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత్-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశం లభించింది. ఈ నెల 23 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్‌ల (నాలుగు రోజుల మ్యాచ్‌లు) సిరీస్ కోసం 14 మంది సభ్యుల భారత-ఏ జట్టును బీసీసీఐ ఇవాళ(నవంబర్ 9) ప్రకటించింది. రోహిత్ శర్మ సారధ్యంలోని టీమిండియాతో పాటే ఈ జట్టును కూడా బీసీసీఐ ఇవాళే ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ప్రియాంక్ పంచల్‌ను ఎంపిక చేసిన భారత క్రికెట్ బోర్డు.. సీనియర్లు రాహుల్ చాహర్, నవ్‌దీప్ సైనీలకు చోటు కల్పించింది. ఐపీఎల్ స్టార్లతో పాటు జట్టు సభ్యులంతా ఈ సిరీస్‌లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. భారత్-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్ నవంబర్ 23-26 వరకు, రెండో మ్యాచ్ నవంబర్ 29-డిసెంబర్ 2 వరకు, మూడో మ్యాచ్ డిసెంబర్ 6-9 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్-2021 సెకెండ్ లెగ్‌లో పృథ్వీ షా, దేవ్‌దత్ పడిక్కల్, ఉమ్రాన్ మాలిక్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. పృథ్వీ షా దాదాపు ప్రతి మ్యాచ్‌లో రాణించగా, పడిక్కల్ సూపర్ శతకంతో, ఉమ్రాన్ మాలిక్ ఫాస్టెస్ట్ బంతులతో అదరగొట్టారు. భారత-ఏ జట్టు: ప్రియాంక్ పంచల్(కెప్టెన్), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్, దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, బాబా అపరాజిత్, ఉపేంద్ర యాదవ్(వికెట్‌కీపర్), కృష్ణప్ప గౌతమ్, రాహుల్ చాహర్, సౌరభ్ కుమార్, నవ్‌దీప్ సైనీ, ఉమ్రాన్ మాలిక్, ఇషాన్ పోరెల్, అర్జాన్ నగవస్వల్లా చదవండి: బ్రేకింగ్: రోహిత్ కెప్టెన్‌గా టీమిండియా ఎంపిక.. జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్ -
భారత్ ‘ఎ’ను గెలిపించిన ఇషాన్
తిరువనంతపురం: కీలక దశలో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన భారత ‘ఎ’ జట్టు యువ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 55; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టు ఆశలపై నీళ్లు చల్లాడు. శనివారం జరిగిన రెండో అనధికారిక వన్డేలో ఇషాన్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ ‘ఎ’ రెండు వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా 21 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ‘ఎ’ కెప్టెన్ మనీశ్ పాండే ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా ‘ఎ’ 21 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులు చేసింది. జార్జి లిండే (25 బంతుల్లో 52 నాటౌట్; ఫోర్, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో మెరిపించాడు. కెప్టెన్ బవుమా (33 బంతుల్లో 40; 6 ఫోర్లు), క్లాసెన్ (27 బంతుల్లో 31; 3 సిక్స్‌లు) కూడా ధాటిగా ఆడారు. భారత్ ‘ఎ’ బౌలర్లలో దీపక్ చహర్, ఖలీల్ అహ్మద్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. అనంతరం 163 పరుగుల లక్ష్యాన్ని భారత్ ‘ఎ’ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి అధిగమించింది. క్రీజులోకి వచ్చిన ప్రతి బ్యాట్స్‌మెన్ దూకుడుగా ఆడటంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ ‘ఎ’ లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్ కిషన్‌కు జతగా అన్మోల్ప్రీత్ సింగ్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కృనాల్ పాండ్యా (15 బంతుల్లో 23 నాటౌట్; ఫోర్, సిక్స్) కూడా బ్యాట్ ఝళిపించారు. ఇషాన్ కిషన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. సిరీస్‌లోని మూడో వన్డే సోమవారం జరుగుతుంది. -
శ్రీకర్ భరత్ సెంచరీ
హుబ్లి: వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ (117: 156 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్) సమయోచిత సెంచరీతో ఆదుకోవడంతో శ్రీలంక ‘ఎ’తో రెండో అనధికార టెస్ట్‌లో భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులకు ఆలౌట్ అయ్యింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ ఎదురైంది. తొలి అనధికార టెస్ట్‌లో వరుసగా సెంచరీ, డబుల్ సెంచరీ బాదిన ఓపెనర్లు ప్రియాంక్ పాంచల్, అభిమన్యు ఈశ్వరన్ డకౌట్‌గా వెనుదిరిగారు. ఈక్రమంలో అన్మోల్ప్రీత్ సింగ్(65), సిద్ధేశ్ లాడ్(32) మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం అన్మోల్కు జతకలిసిన శ్రీకర్ భరత్ నాలుగో వికెట్‌కు 91 పరుగులు జోడించాడు. అన్మోల్ అవుటయ్యాక లోయరార్డర్‌తో కలసి జట్టు స్కోరును ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో సెంచరీ పూర్తిచేసుకొని ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. లంక బౌలర్లలో లాహిరు కుమార, సందకన్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీలంక శుక్రవారం ఆట ముగిసే సమయానికి 87 పరుగులకు 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకుంది. ప్రస్తుతం క్రీజులో డిక్వెల్లా(27), ప్రియమల్ పెరీరా(7) ఉన్నారు. భారత్ బౌలర్లలో సందీప్ వారియర్, శివం దూబే చెరో 2 వికెట్లు పడగొట్టారు. -
పుజారా ట్రిపుల్ సెంచరీ
సౌరాష్ట్ర బ్యాట్స్‌మన్ చటేశ్వర్ పుజారా కెరీర్లో రెండో ఫస్ట్‌క్లాస్ ట్రిపుల్ సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్-ఎతో మూడో అనధికారిక టెస్టులో భారత్-ఎకు సారథ్యం వహిస్తున్న పుజారా (306 నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్‌తో విజృంభించాడు. పది గంటలపాటు క్రీజులో నిలిచి మొత్తం ౩౩ ఫోర్లు బాదాడు. గతంలో కర్ణాటకతో పుజారా (352) ట్రిపుల్ సెంచరీ బాదాడు. తాజా సిరీస్‌లో మ్యాచ్ మూడో రోజు శుక్రవారం భారత్ 546/9 వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో పుజారా సేన 296 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. అనంతరం విండీస్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్‌లో 268 పరుగులకు ఆలౌటైంది.