IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్‌ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..! | India A Squad Announced For South Africa Tour | Sakshi
Sakshi News home page

IND Vs NZ: ఆ ముగ్గురు ఐపీఎల్‌ స్టార్లకు టీమిండియాలో చోటు దక్కలేదు.. అయినా..!

Published Tue, Nov 9 2021 9:18 PM | Last Updated on Wed, Nov 10 2021 8:17 AM

India A Squad Announced For South Africa Tour - Sakshi

India A Squad Announced For South Africa Tour: ఐపీఎల్‌-2021లో మెరుపులు మెరిపించిన పృథ్వీ షా(డీసీ), దేవ్‌దత్‌ పడిక్కల్‌(ఆర్సీబీ),  ఉమ్రాన్‌ మాలిక్‌(ఎస్‌ఆర్‌హెచ్‌)లకు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో చోటు దక్కకపోయినా దక్షిణాఫ్రికాలో పర్యటించనున్న భారత్‌-ఏ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సువర్ణావకాశం లభించింది. 

ఈ నెల 23 నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న 3 మ్యాచ్‌ల (నాలుగు రోజుల మ్యాచ్‌లు) సిరీస్‌ కోసం 14 మంది సభ్యుల భారత-ఏ జట్టును బీసీసీఐ ఇవాళ(నవంబర్‌ 9) ప్రకటించింది. రోహిత్‌ శర్మ సారధ్యంలోని టీమిండియాతో పాటే ఈ జట్టును కూడా బీసీసీఐ ఇవాళే ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా ప్రియాంక్‌ పంచల్‌ను ఎంపిక చేసిన భారత క్రికెట్‌ బోర్డు.. సీనియర్లు రాహుల్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైనీలకు చోటు కల్పించింది. 

ఐపీఎల్‌ స్టార్లతో పాటు జట్టు సభ్యులంతా ఈ సిరీస్‌లో రాణించి టీమిండియాలో చోటు దక్కించుకోవాలని ఆశిస్తున్నారు. భారత్‌-ఏ, దక్షిణాఫ్రికా జట్ల మధ్య తొలి మ్యాచ్‌ నవంబర్‌ 23-26 వరకు, రెండో మ్యాచ్‌ నవంబర్‌ 29-డిసెంబర్‌ 2 వరకు, మూడో మ్యాచ్‌ డిసెంబర్‌ 6-9 వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌-2021 సెకెండ్‌ లెగ్‌లో పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌లు ఆకాశమే హద్దుగా చెలరేగిన సంగతి తెలిసిందే. పృథ్వీ షా దాదాపు ప్రతి మ్యాచ్‌లో రాణించగా, పడిక్కల్‌ సూపర్‌ శతకంతో, ఉమ్రాన్‌ మాలిక్‌ ఫాస్టెస్ట్‌ బంతులతో అదరగొట్టారు. 

భారత-ఏ జట్టు: ప్రియాంక్‌ పంచల్‌(కెప్టెన్‌), పృథ్వీ షా, అభిమన్యు ఈశ్వరన్‌, దేవ్‌దత్‌ పడిక్కల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌, బాబా అపరాజిత్‌, ఉపేంద్ర యాదవ్‌(వికెట్‌కీపర్‌), కృష్ణప్ప గౌతమ్‌, రాహుల్‌ చాహర్‌, సౌరభ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనీ, ఉమ్రాన్‌ మాలిక్‌, ఇషాన్‌ పోరెల్‌, అర్జాన్‌ నగవస్వల్లా

చదవండి: బ్రేకింగ్‌: రోహిత్‌ కెప్టెన్‌గా టీమిండియా ఎంపిక.. జట్టులోకి వెంకటేశ్‌ అయ్యర్‌, రుతురాజ్
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement