కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటుదక్కింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్ధానాన్ని పడిక్కల్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు దూరమయ్యాడు.
అతడు ప్రస్తుతం తన గాయం నుంచి 90 శాతం మాత్రమే కోలుకున్నాడు. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు తిరిగి నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు రాహుల్ స్ధానంలో దేవదత్ పడిక్కల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని" బీసీసీఐ పేర్కొంది.
పడిక్కల్ సెంచరీలు మోత..
ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్‍లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‍తో జరిగిన మ్యాచ్‍లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్(193).. అనంతరం గోవాతో మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్ జోరు ఆగలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్‌దత్(105) మెరిశాడు.
అదేవిధంగా తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు.
ఓవరాల్‌గా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. కాగా పడిక్కల్ ఇప్పటికే భారత జట్టు తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంతో జరిగిన టీ20 సిరీస్‌తో పడిక్కల్ డెబ్యూ చేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పడిక్కల్‌కు పిలుపురావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే?
🚨 NEWS 🚨: KL Rahul ruled out of third #INDvENG Test, Devdutt Padikkal named replacement. #TeamIndia | @IDFCFIRSTBank
— BCCI (@BCCI) February 12, 2024
Details 🔽https://t.co/ko8Ubvk9uU
Comments
Please login to add a commentAdd a comment