Devdutt Padikkal
-
పాపం డేవిడ్ వార్నర్.. ఒక్కరు కూడా ఆసక్తి చూపలేదు..!
నిన్న (నవంబర్ 24) ప్రారంభమైన ఐపీఎల్ 2025 మెగా వేలంలో మొత్తం 92 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో 72 మంది అమ్ముడుపోగా.. 20 మంది అన్ సోల్డ్‌గా మిగిలారు. అమ్ముడుపోయిన ఆటగాళ్లలో 24 మంది విదేశీ ఆటగాళ్లు కాగా.. మిగతా వారు భారత ఆటగాళ్లు. పాపం వార్నర్నిన్న జరిగిన మెగా వేలంలో ఆసీస్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్‌పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వార్నర్ 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరును నమోదు చేసుకున్నాడు. తొలి రోజు వేలంలో వార్నర్‌తో పాటు దేవ్‌దత్ పడిక్కల్, జానీ బెయిర్‌స్టో లాంటి పేరు కలిగిన ఆటగాళ్లు కూడా అమ్ముడుపోలేదు. వీరిద్దరు కూడా 2 కోట్ల బేస్ ప్రైజ్ విభాగంలో తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఐపీఎల్ తొలి రోజు వేలంలో అమ్ముడుపోని ఆటగాళ్లు వీరే..!దేవ్‌దత్ పడిక్కల్ (బేస్ ధర 2 కోట్లు)డేవిడ్ వార్నర్ (2 కోట్లు)జానీ బెయిర్‌స్టో (2 కోట్లు)వకార్ సలామ్ఖిల్ (ఆఫ్ఘనిస్తాన్, 75 లక్షలు)పియుశ్ చావ్లా (50 లక్షలు)కార్తీక్ త్యాగి (40 లక్షలు)యశ్ ధుల్ (30 లక్షలు)అన్మోల్ప్రీత్ సింగ్ (30 లక్షలు)ఉత్కర్శ్ సింగ్ (30 లక్షలు)లవ్నిత్ సిసోడియా (30 లక్షలు)ఉపేంద్ర సింగ్ యాదవ్ (30 లక్షలు)శ్రేయస్ గోపాల్ (30 లక్షలు)కాగా, తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి 467.85 కోట్లు ఖర్చు చేశాయి. తొలి రోజు వేలంలో రిషబ్ పంత్‌కు అత్యధిక ధర లభించింది. లక్నో సూపర్ జెయింట్స్ పంత్‌ను రూ. 27 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది భారీ ధర.నిన్నటి వేలంలో రెండో భారీ మొత్తం శ్రేయస్ అయ్యర్‌కు లభించింది. శ్రేయస్‌ను పంజాబ్ రూ. 26.75 కోట్లకు సొంతం చేసుకుంది. మూడో అత్యధిక ధర వెంకటేశ్ అయ్యర్‌కు లభించింది. వెంకటేశ్ అయ్యర్‌ను కేకేఆర్ రూ. 23.75 కోట్లకు సొంతం చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చహల్‌లను పంజాబ్ చెరి రూ. 18 కోట్లు ఇచ్చి దక్కించుకుంది. అంతా ఊహించనట్లుగా కేఎల్ రాహుల్‌కు భారీ ధర దక్కలేదు. రాహుల్‌ను ఢిల్లీ కేవలం రూ. 14 కోట్లకే సొంతం చేసుకుంది. -
గిల్ స్థానంలో అతడిని ఆడించండి.. ఓపెనర్‌గా కేఎల్ బెస్ట్: భారత మాజీ క్రికెటర్
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ శుక్రవారం మొదలుకానుంది. ఇందుకోసం ఇప్పటికే కంగారూ దేశానికి చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది.అయితే, ఈ ఐదు మ్యాచ్‌ల కీలక టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా ప్రధాన ఆటగాళ్ల గాయపడటం మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గాయాల వల్ల శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ తొలి టెస్టుకు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు దూరంగా ఉండగా.. గిల్ కూడా అందుబాటులో ఉండకపోవచ్చని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.శుబ్‌మన్ గిల్ స్థానంలో..ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శుబ్‌మన్ గిల్ స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అంతేకాదు తుదిజట్టులోనూ అతడిని ఆడించాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు. అదే విధంగా.. యశస్వి జైస్వాల్‌కు జోడీగా కేఎల్ రాహుల్‌ను పంపితే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.కేరళకు చెందిన దేవ్‌దత్ పడిక్కల్ ఈ ఏడాది మార్చిలో ఇంగ్లండ్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన ఐదో టెస్టులో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన పడిక్కల్.. 103 బంతులు ఎదుర్కొని 65 పరుగులు సాధించాడు. అయితే, ఆ తర్వాత ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మళ్లీ జట్టులో స్థానం దక్కలేదు.ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూఅయితే, ఇటీవల ఆస్ట్రేలియా-‘ఎ’ జట్టుతో జరిగిన రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్టు సిరీస్‌లో దేవ్‌దత్ పడిక్కల్ భారత్-‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగాడు. నాలుగు ఇన్నింగ్స్‌లో వరుసగా 36, 88, 26, 1 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్‌క్లాస్ కెరీర్లోనూ 24 ఏళ్ల పడిక్కల్‌కు మంచి రికార్డే ఉంది.ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా!ఇప్పటి వరకు 40 మ్యాచ్‌లలో కలిపి 2677 పరుగులు సాధించాడు. ఇందులో ఆరు సెంచరీలు, 17 అర్ధ శతకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పడిక్కల్ గురించి వసీం జాఫర్ ప్రస్తావిస్తూ... ‘‘టీమిండియా తరఫున అతడు ఇంతకుముందు టెస్టు క్రికెట్ ఆడాడు. పరుగులు కూడా రాబట్టాడు.అంతేకాదు.. అతడు ఎడమచేతి వాటం బ్యాటర్ కూడా! కాబట్టి ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో మూడో స్థానంలో పడిక్కల్‌ను ఆడిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. అదే విధంగా.. ధ్రువ్ జురెల్‌ను కూడా మిడిలార్డర్లో ఆడించాలని వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. పెర్త్ టెస్టులో జైస్వాల్‌కు తోడుగా కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా పంపాలని ఈ సందర్భంగా ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు.ఓపెనర్‌గా రాహుల్ బెస్ట్కాగా టీమిండియా తరఫున ఓపెనర్‌గా ఇప్పటి వరకు 49 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్ ఖాతాలో 2551 పరుగులు ఉన్నాయి. ఇందులో ఏడు శతకాలు, 12 హాఫ్ సెంచరీలు. ఇక ఓవరాల్‌గా కేఎల్ రాహుల్ 53 టెస్టుల్లో 2981 రన్స్ సాధించాడు. మరోవైపు.. ధ్రువ్ జురెల్ ఇటీవల ఆసీస్-‘ఎ’తో అనధికారిక టెస్టుల్లో 93, 80, 68 రన్స్ చేశాడు. ఇక టీమిండియా తరఫున నాలుగు ఇన్నింగ్స్‌లో కలిపి జురెల్ 190 పరుగులు సాధించాడు.చదవండి: Hardik Pandya: అన్న సారథ్యంలో తమ్ముడు -
Aus A vs Ind A: శతక్కొట్టిన సాయి సుదర్శన్.. ఆసీస్ టార్గెట్?
Australia A vs India A, 1st unofficial Test Day 3: ఆస్ట్రేలియా ‘ఎ’తో మొదటి అనధికారిక టెస్టులో భారత్- ‘ఎ’ మెరుగైన స్థితిలో నిలిచింది. మెక్కే వేదికగా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలిన రుతురాజ్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం పట్టుదలగా నిలబడింది. సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ కారణంగా 312 పరుగులు చేయగలిగింది.సాయి సుదర్శన్ 200 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో శతకం సాధించగా.. దేవ్‌దత్ పడిక్కల్ సూపర్ హాఫ్ సెంచరీతో దుమ్ములేపాడు. 199 బంతులు ఎదుర్కొని 8 ఫోర్ల సాయంతో 88 పరుగులు రాబట్టాడు. వీరితో పాటు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (32) రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.💯 for Sai Sudharsan Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSvIND pic.twitter.com/xIWxfavDFh— cricket.com.au (@cricketcomau) November 2, 2024ఆసీస్ టార్గెట్?ఇక శనివారం నాటి మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో 312 పరుగులు చేసిన భారత్-ఎ ఓవరాల్‌గా 224 పరుగుల ఆధిక్యం సాధించింది. తద్వారా ఆసీస్‌కు 225 పరుగుల లక్ష్యాన్ని విధించింది. ఈ క్రమంలో టీ సమయానికి ఆసీస్ జట్టు 21 ఓవర్లు ఆడి ఒక వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. తన బ్యాటింగ్ తీరుతో జూనియర్ రికీ పాంటింగ్‌గా పేరొందిన ఓపెనర్ స్యామ్ కొన్‌స్టాస్(16) మరోసారి విఫలమయ్యాడు. మార్కస్ హ్యారిస్ 29, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.First runs for Australia A from Sam Konstas 👀Stream the India A match live and free globally: https://t.co/XcQLyyTDJ5#AUSAvINDA pic.twitter.com/an2oO9LPH9— cricket.com.au (@cricketcomau) November 2, 2024తొలి ఇన్నింగ్స్‌లో మూకుమ్మడిగా విఫలంకాగా శుక్రవారం నాటి రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్ 64 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. గురువారం మొదటి రోజు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ 47.4 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. దేవ్‌దత్ పడిక్కల్ (36; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, ఆసీస్ ‘ఎ’ బౌలర్ బ్రెండన్ డగెట్ 6 వికెట్లు తీశాడు.అనంతరం తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ‘ఎ’ 62.4 ఓవర్లలో 195 పరుగుల వద్ద ఆలౌటైంది. ముకేశ్ కుమార్ (6/46), ప్రసిధ్ కృష్ణ (3/59) ఆసీస్‌ను 136/7 స్కోరు వద్ద కట్టడి చేసినప్పటికీ మర్ఫీ (33), ఓనీల్ (13) ఎనిమిదో వికెట్‌కు 41 పరుగులు జోడించడంతో ఆతిథ్య జట్టు 88 పరుగుల ఆధిక్యం సంపాదించింది. శుక్రవారం రెండో రోజు ఆటలో భారత్ రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టగానే ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (5), అభిమన్యు ఈశ్వరన్ (12) వికెట్లను కోల్పోయింది. ఆ దశలో సుదర్శన్, పడిక్కల్ జట్టును ఒడ్డున పడేసే ఆట ఆడారు. ఇద్దరు కలిసి అబేధ్యమైన మూడో వికెట్‌కు 178 పరుగులు జోడించారు. తుదిజట్లుభారత్- ఎరుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, దేవ్‌దత్ పడిక్కల్, బాబా ఇంద్రజిత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, మానవ్ సుతార్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, ముకేశ్ కుమార్.ఆస్ట్రేలియా-ఎస్యామ్ కన్‌స్టాస్, మార్కస్ హ్యారిస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, నాథన్ మెక్‌స్వీనీ (కెప్టెన్), బ్యూ వెబ్‌స్టర్, కూపర్ కానొలీ, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), ఫెర్గూస్ ఓ నీల్, టాడ్ మర్ఫీ, బ్రెండన్ డగెట్, జోర్డాన్ బకింగ్‌హామ్.చదవండి: Ind vs Pak: భారత బ్యాటర్ల విధ్వంసం.. అయినా పాక్ చేతిలో తప్పని ఓటమి -
IND A vs AUS A: సెంచరీకి చేరువగా సాయి సుదర్శన్
ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులకే ఆలౌటైన భారత్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 208/2గా ఉంది. సాయి సుదర్శన్ (96), దేవ్‌దత్ పడిక్కల్ (80) క్రీజ్‌లో ఉన్నారు. అభిమన్యు ఈశ్వరన్ (12), రుతురాజ్ గైక్వాడ్ (5) ఔటయ్యారు. రుతురాజ్ వికెట్ ఫెర్గస్ ఓ నీల్‌కు దక్కగా.. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు. ప్రస్తుతం భారత్ 120 ఆధిక్యంలో కొనసాగుతుంది.అంతకుముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌటైంది. ముకేశ్ కుమార్ ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ మూడు, నితీశ్ కుమార్ రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మెక్‌స్వీని (39) టాప్ స్కోరర్‌గా నిలువగా.. కూపర్ కన్నోలీ 37, వెబ్‌స్టర్ 33, టాడ్ మర్ఫీ 33, మార్కస్ హ్యారిస్ 17, ఫెర్గస్ ఓనీల్ 13, సామ్ కోన్స్టాస్ 0, బాన్‌క్రాఫ్ట్ 0, ఫిలిప్ 4, బ్రెండన్ డాగ్గెట్ 8 పరుగులు చేశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 107 పరుగులకు ఆలౌటైంది. బ్రెండన్ డాగ్గెట్ ఆరు వికెట్లు తీసి టీమిండియా పతనాన్ని శాశించాడు. జోర్డాన్ బకింగ్హమ్ రెండు, ఫెర్గస్ ఓనీల్, టాడ్ మర్ఫీ తలో వికెట్ పడగొట్టారు. భారత ఇన్నింగ్స్‌లో దేవ్‌దత్ పడిక్కల్ (36), నవ్‌దీప్ సైనీ (23), సాయి సుదర్శన్ (21) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అభిమన్యు ఈశ్వరన్ 7, రుతురాజ్ గైక్వాడ్ 0, బాబా ఇంద్రజిత్ 9, ఇషాన్ కిషన్ 4, నితీశ్ రెడ్డి 0, మానవ్ సుతార్ 1, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. కాగా, రెండు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత-ఏ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది. -
పడిక్కల్ పోరాటం
సాక్షి అనంతపురం: ఓపెనర్లు ప్రథమ్ సింగ్ (82 బంతుల్లో 59 బ్యాటింగ్), కెపె్టన్ మయాంక్ అగర్వాల్ (87 బంతుల్లో 56; 8 ఫోర్లు) అర్ధ శతకాలు బాదడంతో భారత్ ‘డి’తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ‘ఎ’ 28.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 115 పరుగులు చేసింది. ఆరంభం నుంచి సాధికారికంగా ఆడిన ఈ జంట తొలి వికెట్‌కు 115 పరుగులు జోడించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగియడానికి ముందు భారత్ ‘డి’ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్‌లో మయాంక్ ఔటయ్యాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 288/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ ‘ఎ’ మరో రెండు పరుగులు జోడించి 290 వద్ద ఆలౌటైంది. షమ్స్ ములానీ (187 బంతుల్లో 89; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) క్రితం రోజు స్కోరుకు ఒక పరుగు మాత్రమే జత చేయగలిగాడు. భారత్ ‘డి’ బౌలర్లలో హర్షిత్ రాణా 4... విద్వత్ కావేరప్ప, అర్‡్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ ‘డి’ 52.1 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (124 బంతుల్లో 92; 15 ఫోర్లు) ఒంటరి పోరాటం చేశాడు. భారత్ ‘ఎ’ జట్టు బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అఖీబ్ ఖాన్ చెరో మూడు వికెట్లు తీశారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్ ‘ఎ’... రెండో ఇన్నింగ్స్ స్కోరుతో కలుపుకొని ఓవరాల్‌గా 222 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 9 వికెట్లు ఉన్న భారత్ ‘ఎ’ మూడో రోజు మరెన్ని పరుగులు జోడిస్తుందో చూడాలి. పడిక్కల్ ఒక్కడే... భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్‌లో మిడిలార్డర్ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ ఒక్కడే ఆకట్టుకున్నాడు. కెపె్టన్ శ్రేయస్ అయ్యర్ (0) డకౌట్ కాగా.. వికెట్ కీపర్ సంజూ సామ్సన్ (5), అథర్వ (4), యశ్ దూబే (14), రికీ భుయ్ (23), సారాంశ్ జైన్ (8), విఫలమయ్యారు. ఒక ఎండ్‌లో పడిక్కల్ క్రీజులో పాతుకుపోగా... మరో ఎండ్ నుంచి అతడికి సహకారం అందించేవారే కరువయ్యారు. సహచరులతో ఒక్కొక్కరుగా వెనుదిరుగుతున్నా... పడిక్కల్ మాత్రం జోరు తగ్గించలేదు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. సామ్సన్ మరోసారి అంచనాలు అందుకోలేకపోగా... మెరుగైన ఆరంభం దక్కించుకున్న ఆంధ్ర ఆటగాడు రికీ భుయ్... ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. చివర్లో హర్షిత్ రాణా (29 బంతుల్లో 31; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో భారత్ ‘డి’183 పరుగులు చేయగలిగింది.స్కోరు వివరాలు భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్: 288 ఆలౌట్; భారత్ ‘డి’ తొలి ఇన్నింగ్స్: అథర్వ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 4; యశ్ దూబే (సి) కుశాగ్ర (బి) అఖీబ్ 14; శ్రేయస్ (సి) అఖీబ్ (బి) ఖలీల్ 0; పడిక్కల్ (సి) కుశాగ్ర (బి) ప్రసిధ్ కృష్ణ 92; సంజూ సామ్సన్ (సి) ప్రసిధ్ కృష్ణ (బి) అఖీబ్ 5; రికీ భుయ్ (ఎల్బీడబ్ల్యూ) ఖలీల్ 23; సారాంశ్ (ఎల్బీ) తనుశ్ 8; సౌరభ్ (సి) శాశ్వత్ (బి) అఖీబ్ 1; హర్షిత్ రాణా (బి) ములానీ 31; అర్‡్షదీప్ (రనౌట్) 0; విద్వత్ కావేరప్ప (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: (52.1 ఓవర్లలో ఆలౌట్) 183. వికెట్ల పతనం: 1–4, 2–6, 3–44, 4–52, 5–96, 6–122, 7–141, 8–154, 9–170, 10–183. బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 8–0–39–3; ప్రసిధ్ కృష్ణ 11–4–30–1; అఖీబ్ ఖాన్ 12–2–41–3; తనుశ్ కొటియాన్ 12–5–22–1; షమ్స్ ములానీ 9.1–1–50–1. భారత్ ‘ఎ’ రెండో ఇన్నింగ్స్: ప్రథమ్ సింగ్ (బ్యాటింగ్) 59; మయాంక్ అగర్వాల్ (సి అండ్ బి) శ్రేయస్ అయ్యర్ 56; మొత్తం: (28.1 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 115. వికెట్ల పతనం: 1–115, బౌలింగ్: హర్షిత్ రాణా 3–0–12–0; విద్వత్ కావేరప్ప 3–0–18–0; సౌరభ్ కుమార్ 11–1–46–0; అర్‡్షదీప్ సింగ్ 4–0–21–0; సారాంశ్ జైన్ 7–1–18–0; శ్రేయస్ అయ్యర్ 0.1–0–0–1. -
టీమిండియా నయా సంచలనాలు...
India vs England Test Series 2024: ఒకరు ధనాధన్ ఇన్నింగ్స్‌తో దంచికొడితే.. మరొకరు నిలకడగా ఆడుతూ ‘హీరో’ అయ్యారు.. ఇంకొకరు వికెట్లు పడగొడుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తే.. ఆఖరిగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తన ఎంపిక సరైందే అని నిరూపించుకున్న ఆటగాడు మరొకరు. అవును... మీరు ఊహించిన పేర్లు నిజమే.. టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సందర్భంగా తళుక్కున మెరిసిన భారత నయా క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, ఆకాశ్ దీప్, దేవ్‌దత్ పడిక్కల్ గురించే ఈ పరిచయ వాక్యాలు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో తాజా సిరీస్ సందర్భంగా రెండో టెస్టులో మధ్యప్రదేశ్ రజత్ పాటిదార్(టెస్టుల్లో), మూడో టెస్టులో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, ఉత్తరప్రదేశ్ వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, నాలుగో టెస్టులో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్.. ఐదో టెస్టులో దేవ్‌దత్ పడిక్కల్ టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. వీరిలో 30 ఏళ్ల రజత్ పాటిదార్ మినహా మిగతా నలుగురు సత్తా చాటి.. టీమిండియాకు దొరికిన ఆణిముత్యాలంటూ కితాబులు అందుకున్నారు. మరి ఈ సిరీస్‌లో వీరి ప్రదర్శన ఎలా ఉందో గమనిద్దాం! సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan).. సంచలనం రంజీల్లో పరుగుల వరద పారించి.. త్రిశతక వీరుడిగా పేరొందిన ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాజ్‌కోట్ టెస్టు ద్వారా అరంగేట్రం చేశాడు. తండ్రి నౌషద్ ఖాన్, భార్య రొమానా జహూర్ సమక్షంలో.. స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు. తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు అర్ధ శతకం(62) సాధించాడు. 48 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న సర్ఫరాజ్ ఖాన్.. దురదృష్టవశాత్తూ రనౌట్ అయ్యాడు. అయితే, అదే మ్యాచ్‌లో మరోసారి అర్ధ శతకం(68)తో అజేయంగా నిలిచి సత్తా చాటాడు. తదుపరి మ్యాచ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన(14,0) సర్ఫరాజ్ ఖాన్ ఐదో టెస్టులో మరోసారి ఫిఫ్టీ(56)అదరగొట్టాడు. ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో కలిపి 200 పరుగులు సాధించాడు. ఇందులో 24 ఫోర్లు, 5 సిక్సర్లు ఉండటం విశేషం. 𝙎𝙖𝙧𝙛𝙖𝙧𝙖𝙯 - Apna time a̶y̶e̶g̶a̶ aa gaya! 🗣️ He brings up a 48-balls half century on Test debut 💪🔥#INDvENG #BazBowled #JioCinemaSports #TeamIndia #IDFCFirstBankTestSeries pic.twitter.com/kyJYhVkGFv — JioCinema (@JioCinema) February 15, 2024 ధ్రువ్ జురెల్(Dhruv Jurel).. మెరుపులు రాజ్‌కోట్ టెస్టు సందర్భంగా అరంగేట్రం చేసిన మరో ఆటగాడు ధ్రువ్ జురెల్. ఈ మ్యాచ్‌లో వికెట్ కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకోవడంతో పాటు.. 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అయితే, రాంచిలో జరిగిన నాలుగో టెస్టులో మాత్రం జురెల్ విశ్వరూపం ప్రదర్శించాడు ఈ 23 ఏళ్ల బ్యాటర్. టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన వేళ మొదటి ఇన్నింగ్స్‌లో అత్యంత విలువైన 90 పరుగులు సాధించాడు. అంతేకాదు.. రెండో ఇన్నింగ్స్‌లో 39 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. A fantastic victory in Ranchi for #TeamIndia 😎 India clinch the series 3⃣-1⃣ with the final Test to be played in Dharamsala 👏👏 Scorecard ▶️ https://t.co/FUbQ3MhXfH#INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/5I7rENrl5d — BCCI (@BCCI) February 26, 2024 మరో టెస్టు మిగిలి ఉండగానే టీమిండియా సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఆఖరిదైన ఐదో టెస్టులో మాత్రం 15 పరుగులకే పరిమితమైనా.. వికెట్ కీపర్‌గా తన వంతు బాధ్యతను నెరవేర్చాడు. ఆకాశ్ దీప్(Akash Deep).. ఆకాశమే హద్దుగా రాంచిలో జరిగిన నాలుగో టెస్టు ద్వారా బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. 27 ఏళ్ల వయసులో హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్ చేతుల మీదుగా క్యాప్ అందుకున్నాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే.. అదీ ఒకే ఓవర్లో.. ఇంగ్లండ్ స్టార్లు బెన్ డకెట్, ఒలీ పోప్ రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు. ఆ తర్వాత జాక్ క్రాలేను కూడా అవుట్ చేసి ఇంగ్లండ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. తద్వారా జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. Drama on debut for Akash Deep! 🤯😓 A wicket denied by the dreaded No-ball hooter🚨#IDFCFirstBankTestSeries #BazBowled #INDvENG #JioCinemaSports pic.twitter.com/uQ3jVnTQgW — JioCinema (@JioCinema) February 23, 2024 The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 దేవ్‌దత్ పడిక్కల్(Devdutt Padikkal).. జోరుగా హుషారుగా ధర్మశాలలో జరిగిన ఐదో టెస్టు ద్వారా ఎంట్రీ ఇచ్చాడు కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్. కేరళలో జన్మించిన 23 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. అరంగేట్రంలో 65 పరుగులతో దుమ్ములేపాడు. ఇక వీరికంటే ముందే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన యశస్వి జైస్వాల్.. ఈ సిరీస్‌లో వరుస డబుల్ సెంచరీలతో విరుచుకుపడ్డ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సిరీస్‌లో మొత్తంగా తొమ్మిది ఇన్నింగ్స్‌లో కలిపి 712 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన యశస్వి.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఓపెనర్‌గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. ఉపఖండ పిచ్‌లపై తాము సైతం అంటూ.. ఈ టీమిండియా యువ సంచలనాలతో పాటు ఈ సిరీస్ సందర్భంగా అరంగేట్రం చేసిన ఇంగ్లండ్ స్పిన్నర్లు టామ్ హార్లే, షోయబ్ బషీర్ కూడా తమదైన ముద్ర వేయగలిగారు. షోయబ్ బషీర్ ఆడిన మూడు టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీయగా.. టామ్ హార్లే 22 వికెట్లతో సత్తా చాటాడు. -
అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్టిన పడిక్కల్
టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్.. తన కెరీర్లో మొదటి హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో మ్యాచ్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన పడిక్కల్.. సిక్సర్ సాయంతో అర్దసెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 103 బంతులు ఎదుర్కొన్న అతను.. 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 65 పరుగులు చేసి షోయబ్ బషీర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. The Moment Devdutt Padikkal completed his Maiden Test Fifty with a SIX. - Devdutt, The future! ⭐ pic.twitter.com/btIMOnG5Eq — CricketMAN2 (@ImTanujSingh) March 8, 2024 పడిక్కల్‌కు ఇది మొదటి టెస్ట్ మ్యాచే అయినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు ఇండియన్ బ్యాటింగ్ ఆర్డర్‌లోని టాప్ ఐదుగురు బ్యాటర్లు 50 పరుగుల మార్కును తాకారు. భారత్‌కు సంబంధించి టెస్ట్ క్రికెట్లో ఇలా జరగడం ఇది నాలుగో సారి. గతంలో ఆసీస్, న్యూజిలాండ్, శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ల్లో భారత టపార్డర్లోని ఐదుగురు ఆటగాళ్లు హాఫ్ సెంచరీ మార్కును దాటారు. ఈ ఇన్నింగ్స్‌లో యశస్వి (57), రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110), సర్ఫరాజ్ ఖాన్ (56) ఔట్ కాగా.. రవీంద్ర జడేజా (14), దృవ్ జురెల్ (15) క్రీజ్‌లో ఉన్నారు. 100 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్కోర్ 426/5గా ఉంది. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ 3 వికెట్లు పడగొట్టగా.. ఆండర్సన్, స్టోక్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. అంతకుముందు ఇంగ్లండ్.. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు కుప్పకూలింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) మినహా ఎవ్వరూ రాణించలేదు. డకెట్ 27, పోప్ 11, రూట్ 26, బెయిర్‌స్టో 29, స్టోక్స్ 0, ఫోక్స్ 24, హార్ట్లీ 6, వుడ్ 0, ఆండర్సన్ 0 పరుగులు చేసి ఔటయ్యారు. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను భారత్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. -
Ind vs Eng: ముగిసిన తొలి రోజు ఆట.. టీమిండియాదే ఆధిపత్యం
India vs England 5th Test Day 1 updates: టీమిండియాతో ధర్మశాల వేదికగా గురువారం మొదలైన టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. భారత స్పిన్నర్ల దెబ్బకు 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయింది. ఈ క్రమంలో భారత్ బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 30 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ అర్ధ శతకం(52)తో ఆకట్టుకుని.. వన్‌డౌన్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్(26)తో కలిసి క్రీజులో ఉన్నాడు. ఇక మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 57 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా ఐదో టెస్టులో టీమిండియా తొలిరోజు 10 వికెట్లు తీయడంతో పాటు.. 135 పరుగులు చేసి ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. View this post on Instagram A post shared by JioCinema (@officialjiocinema) 24.2: రోహిత్ శర్మ అర్ధ శతకం బషీర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న హిట్‌మ్యాన్ తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా యశస్వి జైస్వాల్(57) రూపంలో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. షోయబ్ బషీర్ బౌలింగ్‌లో జైస్వాల్ స్టంపౌట్‌గా వెనుదిరిగాడు. శుబ్‌మన్ గిల్ క్రీజులోకి వచ్చాడు. భారత్ స్కోరు: 104-1(21) 1000 పరుగుల వీరుడు 14.3: టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న యశస్వి జైస్వాల్. 16 ఇన్నింగ్స్‌లోనే అరుదైన మైలురాయిని చేరుకుని.. ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా రికార్డు. 13 ఓవర్ల ముగిసే సరికి భారత్ స్కోరు: 57/0 రోహిత్ 30, జైస్వాల్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. 11.4: హాఫ్ సెంచరీ కొట్టిన టీమిండియా 10 ఓవర్లలో టీమిండియా స్కోరు: 47/0 జైస్వాల్ 25, రోహిత్ 22 పరుగులతో క్రీజులో ఉన్నారు. 5 ఓవర్లలో టీమిండియా స్కోరు: 18-0 ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 4, రోహిత్ శర్మ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. 218 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్ ఐదో టెస్ట్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/72), అశ్విన్ (4/51), జడేజా (1/17) ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను కుప్పకూల్చారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (79) ఒక్కడే అర్దసెంచరీతో రాణించాడు. అశ్విన్ ఖాతాలో మూడో వికెట్ 218 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది. అశ్విన్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్ (24) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఎనిమిదో వికెట్ డౌన్ 49.4: అశ్విన్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి మార్క్ వుడ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. షోయబ్ బషీర్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 183-8(50) ఏడో వికెట్ డౌన్ 49.2: వందో టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్‌కు ఇంగ్లండ్ టెయిలెండర్ టామ్ హార్లే రూపంలో ధర్మశాల మ్యాచ్‌లో తొలి వికెట్ దక్కింది. మార్క్ వుడ్ క్రీజులోకి వచ్చాడు. ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ కుల్దీప్ బౌలింగ్‌లో స్టోక్స్ ఎల్బీడబ్ల్యూ. స్టోక్స్ రూపంలో ఇంగ్లండ్ ఆరో వికెట్ కోల్పోగా.. కుల్దీప్ యాదవ్‌కు ఐదో వికెట్ దక్కింది. టామ్హర్లే క్రీజులోకి వచ్చాడు. ►ఇంగ్లండ్ జో రూట్ రూపంలో ఐదో వికెట్ కోల్పోయింది. 26 పరుగులు చేసిన రూట్.. జడేజా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. నాలుగో వికెట్ డౌన్.. 175 పరుగుల వద్ద ఇంగ్లండ్ నాలుగో వికెట్ కోల్పోయింది. 29 పరుగులు చేసిన జానీ బెయిర్ స్టో.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కెప్టెన్ బెన్ స్టోక్స్ వచ్చాడు. మూడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్ 37.2: టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి తన మాయాజాలం ప్రదర్శించాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టి ప్రమాదకరంగా మారిన ఇంగ్లండ్ ఓపెనర్ జాక్ క్రాలే(79)ను అద్భుత రీతిలో బౌల్డ్ చేశాడు. ఫలితంగా మూడో వికెట్‌నూ తనఖాతాలోనే వేసుకున్నాడు. వందో టెస్టు ఆడుతున్న జానీ బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 143-3(38) రెండో వికెట్ డౌన్.. 100 పరుగుల వద్ద ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన ఓలీ పోప్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. లంచ్ విరామానికి ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. క్రీజులో జాక్ క్రాలే(61) పరుగులతో ఉన్నాడు. తొలి వికెట్ డౌన్.. 64 పరుగుల వద్ద ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. 27 పరుగులు చేసిన బెన్ డకెట్.. కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి ఓలీ పోప్ వచ్చాడు. 14.2: హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న ఇంగ్లండ్.. స్కోరు: 51/0. డకెట్ 21, క్రాలే 29 పరుగులతో ఆడుతున్నారు. 12 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లండ్ స్కోరు: 43/0 నిలకడగా ఆడుతున్న ఇంగ్లండ్.. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే(11), డక్కెట్(8) నిలకడగా ఆడుతున్నారు. 7 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ స్కోర్: 20/0 4 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోర్: 9/0 4 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. క్రీజులో డక్కెట్, జాక్ క్రాలే(7) ఉన్నారు. ధర్మశాల వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదో టెస్టు ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రజిత్ పాటిదార్ స్ధానంలో పడిక్కల్‌కు చోటు దక్కింది. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్ దీప్ ప్లేస్‌లో బుమ్రా తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ సైతం ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ రాబిన్సన్ స్ధానంలో మార్క్ వుడ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కింది. ఇక భారత స్పిన్ లెజండ్ రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్లో 100వ టెస్టు మ్యాచ్ ఆడుతున్నాడు. మరోవైపు ఇంగ్లండ్ వికెట్ కీపర్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో సైతం తన వందో టెస్టులో బరిలోకి దిగాడు. తుది జట్లు: భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభమన్ గిల్, దేవదత్ పడిక్కల్, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్ -
Ind vs Eng: తిరిగి వెళ్లమన్న సెలక్టర్లు.. పాటిదార్‌పై వేటు?
'Go back and play Ranji...': BCCI wants To: ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టెస్టులో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ సందర్భంగా నలుగురు యువ ఆటగాళ్లు అరంగేట్రం చేయగా.. మరో ఆటగాడికీ ఛాన్స్ ఇచ్చేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టుతో చేరనున్నట్లు తెలుస్తోంది. కాగా స్వదేశంలో స్టోక్స్ బృందంతో టెస్టు సిరీస్‌ను రోహిత్ సేన ఇప్పటికే 3-1తో కైవసం చేసుకుంది. హైదరాబాద్‌లో ఆరంభ మ్యాచ్‌లో ఓడినా.. విశాఖపట్నం, రాజ్‌కోట్, రాంచిలలో హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి సొంతగడ్డపై ఈ మేరకు ఆధిపత్యాన్ని చాటుకుంది. ఇక విశాఖ టెస్టులో మధ్యప్రదేశ్ ఆటగాడు రజత్ పాటిదార్.. రాజ్‌కోట్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్.. రాంచిలో బెంగాల్ పేసర్ ఆకాశ్ దీప్ టీమిండియా క్యాపులు అందుకున్నారు. వీరిలో రజత్ పాటిదార్‌కు వరుసగా మూడుసార్లు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో అతడు చేసిన పరుగులు 32,9,5,0,17,0. ఫలితంగా రజత్ పాటిదార్ వైఫల్యాలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఫామ్‌లో లేని ఆటగాడిని జట్టులో కొనసాగించడం ఏమిటనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఐదో టెస్టు నుంచి పాటిదార్‌ను తప్పించాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. రంజీ ట్రోఫీ 2023-24లో విదర్భతో మధ్యప్రదేశ్ సెమీ ఫైనల్లో ఆడాల్సిందిగా బీసీసీఐ తొలుత ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ గురించి స్పష్టత రాకపోవడంతో పాటిదార్ విషయంలో నిర్ణయం మార్చుకున్నట్లు సమాచారం. అయితే, రాహుల్ రాకపోయినా పాటిదార్‌ను తుదిజట్టు నుంచి తప్పించి.. అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను ఆడించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అదనపు బ్యాటర్‌గా అతడిని జట్టుతోనే కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా కర్ణాటక బ్యాటర్ తాజా రంజీ సీజన్లో వరుస శతకాలతో ఆకట్టుకున్నాడు. భారత్-ఏ తరఫున కూడా రాణించాడు. చదవండి: Rohit Sharma: ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా? -
IND VS ENG 4th Test: పాటిదారా.. పడిక్కలా..?
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య రాంచీ వేదికగా రేపటి నుంచి ప్రారంభంకాబోయే నాలుగో టెస్ట్‌కు సర్వం సిద్ధమైంది. ఇంగ్లండ్ ఓ అడుగు ముందుకేసి ఇదివరకే తుది జట్టును కూడా ప్రకటించింది. తుది జట్టు విషయంలో టీమిండియానే ఎటూ తేల్చుకోలేకపోతుంది. మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకున్నప్పటికీ పూర్తి ఫిట్నెస్ సాధించలేకపోవడంతో నాలుగో టెస్ట్‌కు అర్హత కోల్పోయాడు. రాహుల్‌కు ప్రత్యామ్నాయంగా రెండు, మూడు టెస్ట్‌లు ఆడిన రజత్ పాటిదార్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో ఈ ఒక్క స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకోలేకపోతుంది. పాటిదార్‌కు మరో అవకాశం ఇవ్వాలా లేక దేవ్‌దత్ పడిక్కల్‌కు అరంగేట్రం చేసే ఛాన్స్ ఇవ్వాలా అని మేనేజ్మెంట్ జట్టు పీక్కుంటుంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ నోరు విప్పాడు. పాటిదార్ మంచి ప్లేయర్ అని, ఒకటి రెండు వైఫల్యాలకే ఏ ఆటగాడి నైపుణ్యాన్ని శంకించకూడదని పరోక్షంగా పాటిదార్‌ను వెనకేసుకొచ్చాడు. రాథోడ్‌కు పాటిదార్‌పై సదుద్దేశమే ఉన్నప్పటికీ టీమిండియా అభిమానులు మాత్రం దేవ్‌దత్ పడిక్కల్‌కు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్ ఇటీవలికాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్నాడని, పాటిదార్‌తో పోలిస్తే పడిక్కల్ చాలా బెటర్ అని వారభిప్రాయపడుతున్నారు. మరి నాలుగో స్థానంపై టీమిండియా మేనేజ్మెంట్ ఏ నిర్ణయం తీసుకుంటుందో మరి కొన్ని గంటలు వేచి చూస్తే కాని తెలీదు. మరోవైపు బుమ్రాకు ప్రత్యామ్నాయంగా ఆకాశ్‌దీప్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తుంది. రేపటి మ్యాచ్‌లో ఆకాశ్ అరంగేట్రం చేయడం ఖాయమని అంతా అనుకుంటున్నారు. నాలుగో టెస్ట్‌కు భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్/దేవ్‌దత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్, దృవ్ జురెల్, రవీంద్ర జడేజా, అశ్విన్, కుల్దీప్, సిరాజ్, ఆకాశ్‌దీప్ -
నాలుగో టెస్టు.. భారత తుది జట్టు ఇదే! సెంచరీల వీరుడి అరంగేట్రం?
రాంఛీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ నుంచి భారత జట్టు రాంఛీకి పయనమైంది. అక్కడకి చేరుకున్న రోహిత్ సేన బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్లో పాల్గోనుంది. అయితే నాలుగో టెస్టులో టీమిండియా పలుమార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా ఔట్.. ముఖేష్ ఇన్ రాంఛీ టెస్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు జట్టు మేనెజ్మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుమ్రా స్ధానంలో స్పీడ్ స్టార్ ముఖేష్ కుమార్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం. మరోవైపు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ పేరును కూడా మేనెజ్మెంట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు ఆకాష్ దీప్‌ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆకాష్‌కు దేశీవాళీ క్రికెట్లో ఘనమైన రికార్డుంది. రాహుల్ రీ ఎంట్రీ.. పాటిదార్‌పై వేటు ఇక ఇంగ్లండ్‌తో గత రెండు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు పూర్తి ఫిట్నెస్ సాధించాడు. అతడు రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. రాహుల్ జట్టులోకి వస్తే మిడిలార్డర్ బ్యాటర్ బెంచ్‌కే పరిమితవ్వాల్సిందే. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు. జైశ్వాల్ రెస్ట్..పడిక్కల్ ఎంట్రీ మరోవైపు రాంఛీ టెస్టుకు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. వెన్ను నొప్పితో బాధపడుతున్న జైశ్వాల్ నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. పడిక్కల్ సెంచరీల మోత.. రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో పడిక్కల్ సెంచరీల మోత మోగించాడు. పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్(193).. అనంతరం గోవాతో మ్యాచ్‌లోనూ సెంచరీతో దుమ్ము లేపాడు. అక్కడతో కూడా పడిక్కల్ జోరు ఆగలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్‌దత్(105) మెరిశాడు. అదేవిధంగా ఆఖరిగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. భారత తుది జట్టు(అంచనా) రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), పడిక్కల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్ -
సెంచరీల మోత మోగించాడు.. టీమిండియాలో చోటు కొట్టేశాడు
కర్ణాటక ఆటగాడు దేవదత్ పడిక్కల్‌కు తొలిసారి భారత టెస్టు జట్టులో చోటుదక్కింది. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరగనున్న మూడో టెస్టుకు దూరమైన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్ధానాన్ని పడిక్కల్‌తో సెలక్టర్లు భర్తీ చేశారు. ఈ మెరకు బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది. "ఫిట్నెస్ సమస్యతో బాధపడుతున్న కేఎల్ రాహుల్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడు ప్రస్తుతం తన గాయం నుంచి 90 శాతం మాత్రమే కోలుకున్నాడు. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. రాహుల్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో కోలుకుంటున్నాడు. అతడు తిరిగి నాలుగో టెస్టుకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో మూడో టెస్టుకు రాహుల్ స్ధానంలో దేవదత్ పడిక్కల్‌ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసిందని" బీసీసీఐ పేర్కొంది. పడిక్కల్ సెంచరీలు మోత.. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్లో కర్ణాటక తరపున పడిక్కల్ అదరగొడుతున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్(193).. అనంతరం గోవాతో మ్యాచ్‌లోనూ సెంచరీతో దుమ్మురేపాడు. అక్కడతో కూడా పడిక్కల్ జోరు ఆగలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్‌దత్(105) మెరిశాడు. అదేవిధంగా తాజాగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు. కాగా పడిక్కల్ ఇప్పటికే భారత జట్టు తరపున టీ20ల్లో అరంగేట్రం చేశాడు. 2021లో శ్రీలంతో జరిగిన టీ20 సిరీస్‌తో పడిక్కల్ డెబ్యూ చేశాడు. అయితే మళ్లీ మూడేళ్ల తర్వాత భారత జట్టు నుంచి పడిక్కల్‌కు పిలుపురావడం గమనార్హం. ఇక ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: బంగ్లాదేశ్‌కు కొత్త కెప్టెన్ వచ్చేశాడు.. ఎవరంటే? 🚨 NEWS 🚨: KL Rahul ruled out of third #INDvENG Test, Devdutt Padikkal named replacement. #TeamIndia | @IDFCFIRSTBank Details 🔽https://t.co/ko8Ubvk9uU — BCCI (@BCCI) February 12, 2024 -
రాహుల్ అవుట్
రాజ్‌కోట్: భారత సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మూడో టెస్టుకూ దూరమయ్యాడు. గాయంతో అతన్ని రెండో టెస్టు నుంచి తప్పించి... ఇటీవలే మూడో టెస్టుకు ఎంపిక చేశారు. ఫిట్నెస్ సంతరించుకుంటేనే తుది జట్టుకు ఆడతాడని సెలక్షన్ సమయంలోనే స్పష్టం చేశారు. తాజాగా అతను పూర్తిగా కోలుకునేందుకు మరికొంత సమయం పట్టనుండటంతో మూడో టెస్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో కర్ణాటక ఎడంచేతి వాటం బ్యాటర్ దేవదత్ పడిక్కల్‌ను ఎంపిక చేశారు. ‘రాహుల్ వందశాతం ఫిట్నెస్తో ఉంటేనే తుది జట్టుకు పరిగణిస్తామని ఇదివరకే చెప్పాం. అతను 90 శాతం కోలుకున్నట్లు తెలియడంతో రాజ్‌కోట్ టెస్టుకూ పక్కన బెట్టాం. అతని పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది’ అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాస శిబిరంలో ఉన్న రాహుల్ నాలుగో టెస్టుకల్లా కోలుకుంటాడని ఆశాభావంతో ఉన్నట్లు ఆయన చెప్పారు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది. రాజ్‌కోట్‌కు ఇంగ్లండ్ స్వల్ప విరామం కోసం అబుదాబి వెళ్లిన ఇంగ్లండ్ క్రికెట్ జట్టు సోమవారం తిరిగి భారత్ చేరుకుంది. వారంపాటు అక్కడ సేదతీరిన పర్యాటక జట్టు మూడో టెస్టు కోసం రాజ్‌కోట్ వేదికకు వచి్చంది. మంగళవారం సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) గ్రౌండ్లో ఇంగ్లండ్ ఆటగాళ్లు నెట్ ప్రాక్టీస్ చేస్తారని స్థానిక వర్గాలు తెలిపాయి. స్పిన్నర్ జాక్ లీచ్ మోకాలి గాయంతో మిగతా టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. అతను అబుదాబి నుంచే స్వదేశానికి పయనమయ్యాడు. స్పిన్ త్రయం హార్ట్లీ, రేహాన్ అహ్మద్, బషీర్‌లతో పాటు పార్ట్‌టైమ్ స్పిన్ పాత్ర పోషించే జో రూట్ అందుబాటులో ఉండటంతో లీచ్ స్థానంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఇంకెవరినీ ఎంపిక చేయలేదు. నిజానికి అతను తొలిటెస్టు మాత్రమే ఆడాడు. లీచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 2 వికెట్లే తీశాడు. తర్వాతి రెండో టెస్టుకు దూరమయ్యాడు. -
సెంచరీల మోత మోగిస్తున్న పడిక్కల్.. 8 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు
కర్ణాటక యువ బ్యాటర్, లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్.. ప్రస్తుత రంజీ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన అతను.. తాజాగా మరో సెంచరీ బాదాడు. తమిళనాడుతో జరుగుతున్న మ్యాచ్‌లో పడిక్కల్ అజేయమైన సెంచరీతో (151; 12 ఫోర్లు, సిక్స్) ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్ తొలి మ్యాచ్‌లో పంజాబ్‌పై శతక్కొట్టిన పడిక్కల్.. గోవాతో జరిగిన మ్యాచ్‌లో మరో సెంచరీ బాదాడు. తాజా సెంచరీతో ఈ ఏడాది ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పడిక్కల్ చేసిన సెంచరీల సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఏడాది అతను ఆడిన 8 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు చేయడం విశేషం. సీజన్ మధ్యలో ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇతను ఇండియా-ఏ తరఫున సెంచరీ చేశాడు. ఓవరాల్‌గా పడిక్కల్ ఫస్ట్‌క్లాస్ కెరీర్లో ఇది ఆరో సెంచరీ. ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఇతను.. 42కు పైగా సగటుతో ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీల సాయంతో 2100కు పైగా పరుగులు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. 82కు పైగా సగటున మూడు సెంచరీల సాయంతో 450కు పైగా పరుగులు చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 288 పరుగులు (తొలి ఇన్నింగ్స్‌లో) చేసింది. రవికుమార్ సమర్థ్ 57, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 20, నికిన్ జోస్ 13, మనీశ్ పాండే 1, కిషన్ బెదరే 2 పరుగులు చేసి ఔట్ కాగా.. పడిక్కల్‌కు జతగా హార్దిక్ రాజ్ (35) క్రీజ్‌లో ఉన్నాడు. తమిళనాడు బౌలర్లలో సాయికిషోర్ 3, అజిత్ రామ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక ఇవాళే మొదలైన పలు రంజీ మ్యాచ్‌ల్లో టీమిండియా ఆటగాళ్లు చతేశ్వర్ పుజారా (సౌరాష్ట్ర, 110), పృథ్వీ షా (ముంబై, 159), తిలక్ వర్మ (101) సెంచరీలతో కదంతొక్కారు. వీరితో పాటు మనన్ వోహ్రా (134), హిమాన్షు మంత్రి (111), అంకిత్ కుమార్ (హర్యానా, 109), భుపేన్ లాల్వాని (102), సచిన్ బేబీ (110), వైభవ్ భట్ (101), తన్మయ్ అగర్వాల్ (164) లాంటి లోకల్ ప్లేయర్స్ కూడా వేర్వేరు మ్యాచ్‌ల్లో శతక్కొట్టారు. -
INDA Vs ENGA: 5 వికెట్లతో చెలరేగిన భారత స్పిన్నర్.. ఇంగ్లండ్ చిత్తు
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు నమోదు చేసింది. భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు. Dear Sarfraz khan You deserves much better ball knowledge management, But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4 — Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. నిరాశ పరిచిన తిలక్, రింకూ రింకూ సింగ్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది. ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్‌ను సమర్థించిన రవిశాస్త్రి -
సెంచరీలతో విరుచుకుపడిన పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్
అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా-ఏ ఆటగాళ్లు దేవ్‌దత్ పడిక్కల్ (105), సర్ఫరాజ్ ఖాన్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. నిన్న (జనవరి 24) ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల ధాటికి లయన్స్ తొలి ఇన్నింగ్స్‌లో 152 పరుగులకే కుప్పకూలింది. పేసర్ ఆకాశ్‌దీప్ సింగ్ 4 వికెట్లతో లయన్స్ పతనాన్ని శాశించగా.. వాషింగ్టన్ సుందర్, యశ్ దయాల్ చెరో 2 వికెట్లు, అర్షదీప్ సింగ్, సౌరభ్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు. లయన్స్ ఇన్నింగ్స్‌లో ఒలివర్ ప్రైస్ (48), బ్రైడన్ కార్స్ (31), టామ్ లేవ్స్ (15), జెన్నింగ్స్ (11) మత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్-ఏ జట్టు రెండో రోజు రెండో సెషన్ సమయానికి (73 ఓవర్లు) 4 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పడిక్కల్ 118 బంతుల్లోనే 17 ఫోర్ల సాయంతో శతకాన్ని పూర్తి చేయగా.. ఆతర్వాత సర్ఫరాజ్ ఖాన్ 89 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో శతక్కొట్టి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. తిలక్ వర్మ (6), రింకూ సింగ్ (0) నిరాశపరిచారు. సర్ఫరాజ్ ఖాన్‌తో పాటు వాషింగ్టన్ సుందర్ (35) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం భారత్-ఏ 161 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. కాగా, ఇంగ్లండ్ లయన్స్ జట్టు మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. -
శతక్కొట్టిన పడిక్కల్, మనీశ్ పాండే.. కర్ణాటక భారీ స్కోర్
రంజీ ట్రోఫీ 2024 సీజన్లో పరుగుల వరద పారుతుంది. దాదాపు ప్రతి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగిపోతున్నారు. పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కర్ణాటక ఆటగాళ్లు సైతం రెచ్చిపోయారు. దేవ్‌దత్ పడిక్కల్, మనీశ్ పాండే శతకాల మోత మోగించారు. పడిక్కల్ 216 బంతుల్లో 24 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 193 పరుగుల భారీ శతకం బాదగా.. మనీశ్ పాండే సైతం మెరుపు శతకంతో (165 బంతుల్లో 118; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడ్డాడు. వీరిద్దరికి తోడు శ్రీనివాస్ శరత్ (76) కూడా రాణించడంతో కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 514 పరుగులు (8 వికెట్ల నష్టానికి) చేసి, ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మయాంక్ అగర్వాల్ డకౌట్ కాగా.. ఓపెనర్ ఆర్ సమర్థ్ 38, నికిన్ జోస్ 8, శుభంగ్ హేగ్డే 27, విజయ్ కుమార్ వైశాఖ్ 19, రోహిత్ కుమార్ 22 నాటౌట్, విధ్వత్ కవేరప్ప 4 నాటౌట్ పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. ప్రేరిత్ దత్, నమన్ ధిర్ తలో 2 వికెట్లు, సిదార్థ్ కౌల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ సైతం పరుగుల వరద పారిస్తుంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (85), ప్రభసిమ్రన్ సింగ్ (83) శతకాల దిశగా సాగుతున్నారు. మూడో రోజు టీ విరామం సమయానికి పంజాబ్ స్కోర్ 169/0గా ఉంది. -
టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టును వదలని వర్షం! ఎట్టకేలకు..
South Africa A vs India A, 1st unofficial Test: భారత్ ‘ఎ’- దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్ల మధ్య జరగాల్సిన తొలి అనధికారిక టెస్టుకూ వర్షం అడ్డుపడింది. ఎడతెరిపిలేని వాన కారణంగా సోమవారం నాటి తొలి రోజు ఆట రద్దయింది. కాగా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకున్న విషయం తెలిసిందే. సఫారీ గడ్డపై మూడు టీ20, మూడు వన్డే, రెండు టెస్టులు ఆడేందుకు భారత ప్రధాన జట్టు అక్కడ అడుగుపెట్టింది. ఈ క్రమంలో డిసెంబరు 10 నాటి తొలి టీ20 వర్షం కారణంగా టాస్ పడకుండానే రద్దైపోయింది. ఇదిలా ఉంటే.. టీమిండియాతో పాటు భారత- ‘ఎ’ జట్టు కూడా సౌతాఫ్రికా టూర్‌కి వెళ్లింది. ఇందులో భాగంగా.. ఆంధ్ర క్రికెటర్, టీమిండియా వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ సారథ్యంలో మూడు అనధికారిక టెస్టులు ఆడనుంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టెస్టు మ్యాచ్‌లలో మొదటిది డిసెంబరు 11న బ్లూమ్ఫౌంటేన్ వేదికగా మొదలైంది. తొలి టెస్టులో టాస్ గెలిచిన భారత-ఎ జట్టు కెప్టెన్ శ్రీకర్ భరత్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో భారత్- సౌతాఫ్రికా జట్లు మైదానంలో దిగేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వరుణ దేవుడు స్వాగతం పలికాడు. ఈ క్రమంలో వర్షం ఎంతసేపటికీ తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను రద్దు చేశారు. ఇక మంగళవారం నాటి రెండో రోజు ఆటకైనా వర్షం అడ్డుపడకుంటే బాగుండునని ఆటగాళ్లతో సహా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆశించినట్లుగానే వాన జాడ లేకపోవడంతో మధ్యాహ్నం 1.30 నిమిషాలకు రెండో రోజు ఆట మొదలైంది. మరోవైపు.. ఈరోజే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలోని టీమిండియా పోర్ట్ ఎలిజబెత్ వేదికగా రెండో టీ20 ఆడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్‌కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. సౌతాఫ్రికా-ఎ జట్టుతో భారత- ఎ జట్టు తొలి అనధికారిక టెస్టు.. తుది జట్లు ఇవే భారత్: సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్ (కెప్టెన్, వికెట్ కీపర్), ప్రదోష్ పాల్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, శార్దూల్ ఠాకూర్, సౌరభ్ కుమార్, తుషార్ దేశ్‌పాండే, ప్రసిధ్ కృష్ణ, విద్వత్ కావేరప్ప. సౌతాఫ్రికా: కామెరాన్ షెక్లెటన్, యాసీన్ వల్లి, రూబిన్ హెర్మన్, జీన్ డుప్లెసిస్, బ్రైస్ పార్సన్స్ (కెప్టెన్), కానర్ ఎస్టెర్హుయిసెన్ (వికెట్ కీపర్), ఇవాన్ జోన్స్, ఎథాన్ బాష్, కర్ట్లిన్ మానికమ్, సియా ప్లాట్జీ, ఒడిరిల్ మోడిమోకోనే. -
ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్న పడిక్కల్.. మరో సెంచరీ
విజయ్ హాజరే ట్రోఫీ 2023లో కర్ణాటక ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), మూడు మెరుపు హాఫ్ సెంచరీలు (71 నాటౌట్, 70 నాటౌట్, 93 నాటౌట్) సాధించిన అతను.. తాజాగా మరో శతకంతో విరుచుకుపడ్డాడు. చండీఘడ్‌తో ఇవాళ (డిసెంబర్ 1) జరుగుతున్న మ్యాచ్‌లో 103 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 9 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 114 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన ఈ కర్ణాటక బ్యాటర్.. 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 434 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2024కు సంబంధించి ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ నుంచి లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడింగ్ అయిన పడిక్కల్.. తన లిస్ట్-ఏ కెరీర్లో 29 ఇన్నింగ్స్‌లు ఆడి 5 శతకాలు, 11 హాఫ్ సెంచరీలు సాధించి విజయవంతమైన దేశవాలీ బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మ్యాచ్ విషయానికొస్తే.. చండీఘడ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో పడిక్కల్‌తో పాటు నికిన్ జోస్ (96), మనీశ్ పాండే (53 నాటౌట్) రాణించారు. మయాంక్ అగర్వాల్ (19) మరో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడిన కర్ణాటక అన్నింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతుంది. -
మరో విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడిన పడిక్కల్
విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ప్లేయర్, కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే సెంచరీ (117), రెండు మెరుపు హాఫ్ సెంచరీలు (71 నాటౌట్, 70) చేసిన అతను.. తాజాగా బీహార్‌తో జరిగిన మ్యాచ్‌లో మరోసారి చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో 57 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో అజేయమైన 93 పరుగులు చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 320 బంతులు ఎదుర్కొన్న పడిక్కల్.. 80.04 సగటుతో 351 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. బీహార్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. పడిక్కల్‌తో పాటు నికిన్ జోస్ (69) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో కర్ణాటక 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీహార్.. సకీబుల్ గనీ అజేయ సెంచరీతో (113 నాటౌట్) కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 217 పరుగులు చేసింది. బీహార్ ఇన్నింగ్స్‌లో గనీ మినహా అందరూ విఫలమయ్యారు. ముగ్గురు డకౌట్లు, ఇద్దరు సింగిల్ డిజిట్ స్కోర్లకు పరిమితం కాగా.. షర్మన్ నిగ్రోద్ (21), అమన్ (33 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. కర్ణాటక బౌలర్లలో సుచిత్ 3 వికెట్లు పడగొట్టగా.. విధ్వత్ కావేరప్ప, విజయ్‌కుమార్ వైశాక్, సమర్థ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక.. పడిక్కల్, నికిన్ జోస్ రాణించడంతో 33.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో రవికుమార్ సమర్థ్ 4, కెప్టెన్ మయాంక్ అగార్వల్ 28, మనీశ్ పాండే 17 పరుగులు చేశారు. బీహార్ బౌలర్లలో వీర్ ప్రతాప్ సింగ్, రఘువేంద్ర ప్రతాప్ సింగ్, అశుతోష్ అమన్ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో కర్ణాటక పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి (4 మ్యాచ్‌ల్లో 4 విజయాలు) ఎగబాకింది. -
భీకర ఫామ్‌లో పడిక్కల్.. మెరుపు ఇన్నింగ్స్‌లతో విజృంభణ
విజయ్ హజారే ట్రోఫీ 2023లో కర్ణాటక బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. ఈ దేశవాలీ వన్డే టోర్నీలో అతను మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడుతున్నాడు. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్.. సెంచరీ, రెండు హాఫ్ సెంచరీల సాయంతో 258 పరుగులు చేశాడు. తాజాగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో పడిక్కల్ 69 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేసి తన జట్టును గెలిపించాడు. దీనికి ముందు ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెరుపు సెంచరీ (13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 117) చేసిన అతను.. దానికి ముందు జమ్మూ కశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ మెరుపు హాఫ్ సెంచరీతో (35 బంతుల్లో 71 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరిశాడు. కాగా, ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కర్ణాటక 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. విధ్వత్ కావేరప్ప (3/25), కౌశిక్ (3/19), విజయ్‌కుమార్ వైశాఖ్ (2/27), కృష్ణప్ప గౌతమ్ (2/32) ధాటికి 36.3 ఓవర్లలో 143 పరుగులకు కుప్పకూలింది. ఢిల్లీ ఇన్నింగ్స్‌లో అయూశ్ బదోని (100) ఒక్కడే మూడొంతుల స్కోర్ చేయడం విశేషం. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన కర్ణాటక.. పడిక్కల్ (70) రాణించడంతో 27.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. తొలి మ్యాచ్‌లో సెంచరీతో అలరించిన మయాంక్ అగర్వాల్ (12) ఈ మ్యాచ్‌లో తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యాడు. మనీశ్ పాండే (28 నాటౌట్).. శరత్ (7 నాటౌట్) సహకారంతో కర్ణాటకను విజయతీరాలకు చేర్చాడు. ఢిల్లీ బౌలర్లలో హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, సుయాశ్ శర్మ, లలిత్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు. -
మయాంక్ మెరుపు శతకం.. పడిక్కల్ ఊచకోత.. ఆరేసిన చహల్
దేశవాలీ 50 ఓవర్ల టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ 2023లో టీమిండియా ఆటగాడు మయాంక్ అగర్వాల్ (కర్ణాటక) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జమ్మూ కశ్మీర్‌తో ఇవాళ (నవంబర్ 23) జరుగుతున్న మ్యాచ్‌లో భారీ శతకంతో విరుచుకుపడ్డాడు. 132 బంతుల్లో 11 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో 157 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న కర్ణాటక నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 402 పరుగుల భారీ స్కోర్ చేసింది. కర్ణాటక ఇన్నింగ్స్‌లో మయాంక్‌తో పాటు రవి కుమార్ సమర్థ్ కూడా సెంచరీతో కదం తొక్కాడు. సమర్థ్ 120 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్, సమర్థ్ సెంచరీలతో చెలరేగడం విశేషం. పడిక్కల్ ఊచకోత.. సమర్థ్ ఔటైన అనంతరం ఇన్నింగ్స్ 39వ ఓవర్లో బరిలోకి దిగిన దేవ్‌దత్ పడిక్కల్ జమ్మూ కశ్మీర్ బౌలర్లను ఊచకోత కోశాడు. పడిక్కల్ వచ్చిన బంతిని వచ్చినట్లు బాది 35 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పడిక్కల్‌కు జతగా మనీశ్ పాండే కూడా బ్యాట్ ఝులిపించాడు. మనీశ్ 14 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్ సాయంతో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జమ్మూ బౌలర్లలో రసిక్ సలామ్, సాహిల్ లోత్రా తలో వికెట్ పడగొట్టారు. శతక్కొట్టిన దీపక్ హుడా.. ఆరేసిన చహల్ 2023 సీజన్ విజయ్ హజారే ట్రోఫీ ఇవాల్టి నుంచే మొదలైంది. ఈ రోజు వివిధ వేదికలపై మొత్తం 18 మ్యాచ్‌లు జరుగుతున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఆటగాడు, రాజస్థాన్ కెప్టెన్ దీపక్ హుడా (114) సెంచరీతో మెరిశాడు. ఇదే మ్యాచ్‌లో దీపక్ చాహర్ (66 నాటౌట్) అర్ధ సెంచరీతో రాణించాడు. ఉత్తరాఖండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా స్పిన్నర్, హర్యానా బౌలర్ యుజ్వేంద్ర చహల్ 6 వికెట్లతో ఇరగదీశాడు. -
IPL 2024: రాజస్తాన్ రాయల్స్ కీలక ప్రకటన.. అతడిని వదిలేసి..
IPL 2024- Avesh Khan: ఐపీఎల్-2024 వేలానికి ముందు రాజస్తాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది. టాపార్డర్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌ను వదిలేసి.. అతడి స్థానంలో టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆవేశ్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. మరో ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో డైరెక్ట్ స్వాప్ పద్ధతిలో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. లక్నోకు చెందిన ఆవేశ్‌ను తాము తీసుకుని.. బదులుగా పడిక్కల్‌ను ఆ ఫ్రాంఛైజీకి ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాజస్తాన్ రాయల్స్ బుధవారం ప్రకటన విడుదల చేసింది. లక్నో 10 కోట్లకు కొంటే.. రాజస్తాన్ కూడా కాగా ఐపీఎల్-2022 మెగా వేలంలో లక్నో ఫ్రాంఛైజీ రూ. 10 కోట్లు వెచ్చించి ఆవేశ్ ఖాన్‌ను కొనుగోలు చేసింది. ఈ క్రమంలో లక్నో తరఫున 22 మ్యాచ్‌లు ఆడిన ఈ రైటార్మ్ పేసర్ 26 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు అదే ధరకు రాజస్తాన్ రాయల్స్‌కు ట్రేడ్ అయ్యాడు. పడిక్కల్‌కు అంతమొత్తం ఇవ్వనున్న లక్నో మరోవైపు.. గతంలో.. రాజస్తాన్ పడిక్కల్‌ను 7.75 కోట్ల రూపాయలకు కొనుగోలు చేయగా.. లక్నో అంత మొత్తం అతడికి చెల్లించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇక ఐపీఎల్లో ఇప్పటి వరకు మొత్తంగా 57 మ్యాచ్‌లు ఆడిన దేవ్‌దత్ పడిక్కల్.. 1521 పరుగులు చేశాడు. ఈ లెఫ్టాండర్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ శతకం, తొమ్మిది అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక రాజస్తాన్ తరఫున పడిక్కల్ 28 మ్యాచ్‌లు ఆడి 637 పరుగులు సాధించాడు. కాగా ఆవేశ్ ఖాన్ ప్రస్తుతం టీమిండియాతో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ నేపథ్యంలో జట్టుకు ఎంపికైన అతడు.. నవంబరు 23న జరుగనున్న తొలి మ్యాచ్ కోసం సన్నద్ధమవుతున్నాడు. చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం? To all those hits and a smile we'll miss. Go well, DDP! 💗💗💗 pic.twitter.com/ONpXOULjNY — Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2023 🚨Trade Alert: Right-arm quick Avesh Khan will now #HallaBol in Pink! 🔥 Devdutt Padikkal moves to LSG and we wish him the best for his new chapter. 💗 pic.twitter.com/ZiTzxB5f8o — Rajasthan Royals (@rajasthanroyals) November 22, 2023 -
బిల్డప్ బాబాయ్.. ఒక్క మ్యాచ్‌లో అయినా ఆడు నాన్న
-
ఎందుకు బాబు మా మర్యాద తీస్తున్నారు.. ఆర్సీబీ బ్యాటర్లను మించిపోయారు..!
స్టార్ ఆటగాళ్లు, విధ్వంసకర బ్యాటర్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత సీజన్లో వరుసగా రెండో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. సొంతగడ్డపై ఇవాళ (మే 5) గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో శాంసన్ సేన 9 వికెట్ల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్.. బ్యాటర్లంతా మూకుమ్మడిగా చేతులెత్తేయడంతో 17.5 ఓవర్లలో 118 పరుగులకే కుప్పకూలింది. గుడ్డి కంటే మెల్ల మేలు అన్న చందంగా సంజూ శాంసన్ (30) ఒక్కడు కాస్త పర్వాలేదనిపించాడు. విధ్వంసకర హిట్టర్లు యశస్వి జైస్వాల్ (14), జోస్ బట్లర్ (8), హెట్‌మైర్ (7)దారుణంగా నిరాశపరిచారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లతో రెచ్చిపోగా, నూర్ అహ్మద్ 2, షమీ, హార్ధిక్, జాషువ లిటిల్ తలో వికెట్ పడగొట్టారు. 119 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్.. ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. 13.5 ఓవర్లలో గిల్ వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తద్వారా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు వృద్దిమాన్ సాహా (41 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (36) రాణించగా.. వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన హార్ధిక్ పాండ్యా (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. గిల్ వికెట్ చహల్‌కు దక్కింది. రియాన్ పరాగ్, దేవ్‌దత్ పడిక్కల్లపై ధ్వజమెత్తిన ఫ్యాన్స్.. ఈ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాజస్థాన్ ఫ్యాన్స్ ఇద్దరు ఆటగాళ్లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. 7.75 కోట్ల ఆటగాడు దేవ్‌దత్ పడిక్కల్, 3.8 కోట్లు పోసి కొనుక్కున్న రియాన్ పరాగ్‌లపై అభిమానులు ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. వీరి కంటే గల్లీ క్రికెటర్లు వంద రెట్లు నయమని అంటున్నారు. వీరి వల్ల రాజస్థాన్ రాయల్స్ ఇమేజ్ డామేజ్ అయిపోతుందని వాపోతున్నారు. రానురాను రాజస్థాన్ ఆటగాళ్ల ఆటతీరు ఆర్సీబీ మిడిలార్డర్ కంటే చెండాలంగా తయారవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా రియాన్, పడిక్కల్ మారరని, తక్షణమే వీరిని జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పడిక్కల్‌పై కాస్త కనికరం చూపిస్తున్న అభిమానులు రియాన్ పరాగ్‌ను మాత్రం తూర్పారబెడుతున్నారు. వీడికి ఆట తక్కువ ఓవరాక్షన్ ఎక్కువ అంటూ బండ బూతులు తిడుతున్నారు. పైగా ఈ మ్యాచ్‌లో ఇతనేదో పొడుస్తాడని ఆర్ఆర్ యాజమాన్యం ఇతన్ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించడం సోచనీయమని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఇవాల్టి మ్యాచ్‌లో ఓవరాక్షన్ ఆటగాడు రియాన్ పరాగ్ 4 (6), పడిక్కల్ 12 (12) పరుగులు చేశారు. ఈ సీజన్లో పరాగ్ 6 మ్యాచ్‌ల్లో కేవలం 58 పరుగులు మాత్రమే చేస్తే.. పడిక్కల్ 9 మ్యాచ్‌ల్లో 206 పరుగులు సాధించాడు.