రాంఛీ వేదికగా ఫిబ్రవరి 23 నుంచి ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో మంగళవారం రాజ్‌కోట్ నుంచి భారత జట్టు రాంఛీకి పయనమైంది. అక్కడకి చేరుకున్న రోహిత్ సేన బుధవారం నుంచి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోనుంది. అయితే నాలుగో టెస్టులో టీమిండియా పలుమార్పులతో బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది.
బుమ్రా ఔట్.. ముఖేష్ ఇన్
రాంఛీ టెస్టుకు పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాకు జట్టు మేనెజ్‌మెంట్ విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బుమ్రా స్ధానంలో స్పీడ్ స్టార్ ముఖేష్ కుమార్ తుది జట్టులోకి రానున్నట్లు సమాచారం.
మరోవైపు బెంగాల్ పేసర్ ఆకాష్ దీప్ పేరును కూడా మేనెజ్‌మెంట్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్‌తో ఆఖరి మూడు టెస్టులకు ఆకాష్ దీప్‌ను సెలక్టర్లు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఆకాష్‌కు దేశీవాళీ క్రికెట్‌లో ఘనమైన రికార్డుంది.
రాహుల్ రీ ఎంట్రీ.. పాటిదార్‌పై వేటు
ఇక ఇంగ్లండ్‌తో గత రెండు టెస్టులకు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించాడు. అతడు రీ ఎంట్రీ ఇవ్వడం దాదాపు ఖాయమైంది. రాహుల్ జట్టులోకి వస్తే మిడిలార్డర్ బ్యాటర్ బెంచ్‌కే పరిమితవ్వాల్సిందే. వైజాగ్ టెస్టుతో అరంగేట్రం చేసిన పాటిదార్ పెద్దగా అకట్టుకోలేకపోయాడు.
జైశ్వాల్ రెస్ట్..పడిక్కల్ ఎంట్రీ
మరోవైపు రాంఛీ టెస్టుకు యువ ఓపెనర్ యశస్వీ జైశ్వాల్ కూడా దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు వినికిడి. వెన్ను నొప్పితో బాధపడుతున్న జైశ్వాల్ నాలుగో టెస్టుకు విశ్రాంతి ఇవ్వాలని మెనెజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అతడి స్ధానంలో దేవ్‌దత్త్ పడిక్కల్ అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం.
పడిక్కల్ సెంచరీల మోత..
రంజీ ట్రోఫీ 2023-24 సీజన్‌లో పడిక్కల్ సెంచరీల మోత మోగించాడు. పంజాబ్‌తో జరిగిన తొలి మ్యాచ్‍లో భారీ శతకంతో చెలరేగిన పడిక్కల్(193).. అనంతరం గోవాతో మ్యాచ్‍లోనూ సెంచరీతో దుమ్ము లేపాడు. అక్కడతో కూడా పడిక్కల్ జోరు ఆగలేదు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన అనధికారిక టెస్టులో కూడా శతకంతో దేవ్‌దత్(105) మెరిశాడు.
అదేవిధంగా ఆఖరిగా తమిళనాడుతో జరిగిన మ్యాచ్‌లోనూ విధ్వంసకర సెంచరీతో పడిక్కల్(151) చెలరేగాడు. పడిక్కల్ తన చివరి ఆరు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ఒక హాఫ్ సెంచరీ, నాలుగు సెంచరీలను నమోదు చేశాడు. ప్రస్తుత రంజీ సీజన్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన పడిక్కల్ 92.67 సగటుతో 556 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా తన ఫస్ట్‌క్లాస్ కెరీర్‌లో ఇప్పటివరకు 31 మ్యాచ్‌లు ఆడిన ఈ కర్ణాటక ఆటగాడు 2227 పరుగులు చేశాడు.
భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), పడిక్కల్, శుభమన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment