ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సర్ఫరాజ్ ఖాన్ (PC: X)
England Lions vs India A, 2nd unofficial Test: ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక రెండో టెస్టులో భారత-ఏ జట్టు ఘన విజయం సాధించింది. ఇంగ్లిష్ యువ జట్టును ఏకంగా ఇన్నింగ్స్ 16 పరుగుల తేడాతో మట్టికరిపించింది. సమిష్టి ప్రదర్శనతో ఈ సిరీస్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.
భారత్-ఏ- ఇంగ్లండ్ లయన్స్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి అనధికారిక టెస్టు డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం మొదలైన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
వాళ్లిద్దరి అద్భుత సెంచరీల కారణంగా
భారత బౌలర్ల విజృంభణ కారణంగా 52.4 ఓవర్లలో 152 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో తొలి రోజే బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్(58) అర్ధ శతకంతో మెరవగా.. మరో ఓపెనర్ దేవ్‌దత్ పడిక్కల్ సెంచరీ(105)తో సత్తా చాటాడు. తిలక్ వర్మ 6 పరుగులకే అవుటై నిరాశ పరచగా.. నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు.
Dear Sarfraz khan You deserves much better ball knowledge management,
— Captain of DC - PC (RP¹⁷ ) (@Branded_Tweet) January 24, 2024
But unfortunately we don't have we have crupt management ever,#SarfrazKhan #INDvsENG #INDAvENGA #INDvENG#ViratKohli #Ashwin #Jadejapic.twitter.com/fPB49WhrV4
160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఏకంగా 161 పరుగులు రాబట్టాడు. మిగతా వాళ్లలో స్పిన్ ఆల్‌రౌండర్లు వాషింగ్టన్ సుందర్(57), సౌరభ్ కుమార్(77) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు.
నిరాశ పరిచిన తిలక్, రింకూ
రింకూ సింగ్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి విమర్శలు మూటగట్టుకున్నాడు. ఈ నేపథ్యంలో 489 పరుగుల వద్ద యువ భారత్ తమ మొదటి ఇన్నింగ్స్ ముగించింది. తద్వారా 337 పరుగుల భారీ ఆధిక్యం సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన 321 పరుగులకే ఆలౌట్ అయి ఓటమిని చవిచూసింది.
ఆల్‌రౌండర్ సౌరభ్ కుమార్ ఐదు వికెట్లతో చెలరేగి ఇంగ్లండ్ లయన్స్ పతనాన్ని శాసించాడు. తన అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి భారత్-ఏ విజయంలో కీలక పాత్ర పోషించిన సర్ఫరాజ్ ఖాన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య ఫిబ్రవరి 1 నుంచి మూడో అనధికారిక టెస్టు ఆరంభం కానుంది.
చదవండి: Ind Vs Eng 1st Test: పాపం జడ్డూ.. ఇది మరీ అన్యాయం!.. అంపైర్‌ను సమర్థించిన రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment