తిలక్ వర్మ(PC: BCCI)- రింకూ సింగ్(PC: CricCrazyJohns X)
India ‘A’ squad for Matches against England Lions: ఇంగ్లండ్ లయన్స్‌తో ఆఖరి రెండు మ్యాచ్‌లలో తలపడే భారత్-‘ఏ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. అభిమన్యు ఈశ్వరన్ సారథ్యంలో లయన్స్‌తో పోటీ పడనున్న ఈ టీమ్‌లో తిలక్ వర్మ, రింకూ సింగ్‌లకు కూడా చోటు దక్కింది.
కాగా భారత యువ క్రికెట్ జట్టుతో మూడు అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్ యువ టీమ్ ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య జనవరి 12- 13 వరకు రెండు రోజులపాటు ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఇది డ్రాగా ముగిసిపోయింది.
ఇక జనవరి 17 నుంచి భారత్-‘ఏ’- ఇంగ్లండ్ లయన్స్ మధ్య తొలి అనధికారిక టెస్టు మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫలితం శనివారం తేలనుంది. ఇదిలా ఉంటే.. జనవరి 24- 27 వరకు రెండు జట్ల మధ్య రెండో అనధికారిక టెస్టు, ఫిబ్రవరి 1- 4 వరకు మూడో అనధికారిక టెస్టు జరుగనున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ రెండు మ్యాచ్‌లలో ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడే భారత యువ జట్టుకు బెంగాల్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. ఇక రంజీ ట్రోఫీ-2024లో సత్తా చాటుతున్న టీమిండియా స్టార్లు.. హైదరాబాదీ తిలక్ వర్మ, యూపీ బ్యాటర్ రింకూ సింగ్‌లు కూడా ఈ జట్టులో చోటు సంపాదించారు.
తిలక్ రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనుండగా.. రింకూ ఆఖరి టెస్టు కోసం జట్టుతో చేరనున్నాడు. ఈ మ్యాచ్‌లన్నీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగనున్నాయి. యువ జట్ల మధ్య పోటీ ఇలా ఉంటే.. జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానున్న విషయం తెలిసిందే.
ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో మ్యాచ్‌కు భారత్- 'ఏ' జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, తిలక్ వర్మ, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్.
ఇంగ్లండ్ లయన్స్‌తో మూడో మ్యాచ్‌కు భారత్- 'ఏ' జట్టు:
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పాటిదార్, తిలక్ వర్మ, రింకూ సింగ్, కుమార్ కుషాగ్రా, వాషింగ్టన్ సుందర్, షామ్స్ ములానీ, అర్ష్‌దీప్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, విద్వత్ కావేరప్ప, ఉపేంద్ర యాదవ్, ఆకాశ్ దీప్, యశ్ దయాళ్.
చదవండి: Glenn Maxwell Captaincy Quit: గ్లెన్ మాక్స్‌వెల్ సంచలన నిర్ణయం?
Comments
Please login to add a commentAdd a comment