టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులే
కాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.
అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.
ప్రథమ్, తిలక్ శతకాలతో
అయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.
ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్
అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్‌తో నాటౌట్‌గా నిలిచాడు.
అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
తిలక్ వర్మకు ఐదో సెంచరీ
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.
చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలు
Creativity & Placement 👌👌
Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBank
Follow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024
Comments
Please login to add a commentAdd a comment