Pratham
-
తిలక్ వర్మ సూపర్ సెంచరీ.. వీడియో వైరల్
టీమిండియా యువ క్రికెటర్ తిలక్ వర్మ దులిప్ ట్రోఫీ-2024లో శతకంతో మెరిశాడు. ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఇండియా-‘ఎ’ జట్టుకు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇండియా-‘డి’తో జరుగుతున్న మ్యాచ్‌లో మూడో రోజు ఆటలో భాగంగా 177 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.తొలి ఇన్నింగ్స్‌లో పది పరుగులేకాగా తిలక్ వర్మ... ఈ ఏడాది జనవరిలో అఫ్గనిస్తాన్‌తో టీ20 సిరీస్ సందర్భంగా చివరిసారిగా టీమిండియా తరఫున బరిలోకి దిగాడు. అనంతరం జాతీయ జట్టుకు దూరమైన ఈ హైదరాబాదీ బ్యాటర్.. దులిప్ ట్రోఫీ ద్వారా దేశవాళీ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇండియా-‘ఎ’ జట్టుకు ఆడుతున్న తిలక్.. ఆ టీమ్ ఆడుతున్న రెండో మ్యాచ్ సందర్భంగా తుదిజట్టులో చోటు సంపాదించుకున్నాడు.అనంతపురం వేదికగా గురువారం మొదలైన మ్యాచ్‌లో ఇండియా-‘డి’ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 290 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. తిలక్ కేవలం పది పరగులకే పరిమితం కాగా.. షామ్స్ ములానీ(89), తనుశ్ కొటియాన్(53) వల్ల ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు దక్కింది.ప్రథమ్, తిలక్ శతకాలతోఅయితే, ఇండియా-‘ఎ’ బ్యాటర్లు రాణించలేకపోయినా.. బౌలర్లు మాత్రం అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. ఇండియా-‘డి’ని తొలి ఇన్నింగ్స్ 183 పరుగులకే కట్టడి చేశారు. ఈ క్రమంలో వందకు పైగా రన్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన.. ఇండియా-‘ఎ’ ఈసారి బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. ఓపెనర్ ప్రథమ్ సింగ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మరో ఓపెనర్, కెప్టెన్ మయాంక్ అగర్వాల్ అర్ధ శతకం(56) సాధించాడు.ఇంకొక్క రోజే ఆట.. ఇన్నింగ్స్ డిక్లేర్అయితే, మయాంక్ నిష్క్రమించిన తర్వాత అతడి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన తిలక్ వర్మ ఆది నుంచే అదరగొట్టాడు. 193 బంతుల్లో 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇతర బ్యాటర్లలో రియాన్ పరాగ్(20) విఫలం కాగా.. శశ్వత్ రావత్ 64 పరుగులతో తిలక్‌తో నాటౌట్‌గా నిలిచాడు. అయితే, ఆటకు మరొక్క రోజే మిగిలి ఉండటంతో ఇండియా-‘ఎ’ జట్టు 98 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 380 పరుగుల వద్ద ఉండగా.. తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఇండియా-‘డి’తో పోలిస్తే 487 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.తిలక్ వర్మకు ఐదో సెంచరీఫస్ట్క్లాస్ క్రికెట్లో తిలక్ వర్మకు ఇదో ఐదో శతకం కావడం విశేషం. ఇప్పటి వరకు 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తిలక్.. ఖాతాలో 1169కి పైగా పరుగులు ఉన్నాయి. ఇక టీమిండియా తరఫున ఇప్పటి వరకు నాలుగు వన్డేలు ఆడి 68, 16 టీ20లలో కలిపి 336 పరుగులు చేశాడు ఈ హైదరాబాదీ బ్యాటర్.చదవండి: AUS vs ENG: చరిత్ర సృష్టించిన ఆసీస్ ఓపెనర్.. 13 ఏళ్ల రికార్డు బద్దలుCreativity & Placement 👌👌Tilak Varma has played a fine knock so far and put India A in a strong position 💪#DuleepTrophy | @IDFCFIRSTBankFollow the match ▶️: https://t.co/m9YW0Hu10f pic.twitter.com/9sMhdgAQ3Z— BCCI Domestic (@BCCIdomestic) September 14, 2024 -
Rukmini Banerji: స్మార్ట్ మామ్ ఈ రుక్మిణి.. ఏం చేస్తారంటే!
పిల్లలు స్కూలుకు వెళ్లి చదువుకుంటున్నారు. కానీ ఏడాది ఏడాదికి తరగతులు మాత్రమే మారుతున్నాయి. వారు నేర్చుకున్నది ఏమీ కనిపించడం లేదు. స్కూళ్లలో చదువుతోన్న యాభైశాతం మంది పిల్లలు కనీసం పదాలు కూడా సరిగా రాయలేకపోతున్నారు. చిన్నపాటి వాక్యాలను కూడా చదవలేకపోతున్నారు. ఇక గణితం అయితే అంతే సంగతులు. ఈ స్థితిని ‘లెర్నింగ్ ప్రావర్టీ’గా పరిగణించాల్సిన అవసరం ఉంది. దీని మీద దృష్టి కేంద్రీకరించకపోతే రేపటితరం భవిష్యత్ అంధకారమవుతుంది అని అర్థవంతంగా చెప్పారు డాక్టర్ రుక్మిణీ బెనర్జి. దీంతో వందకుౖ పెగా దేశాల విద్యావేత్తలు పోటీపడిన బహుమతిని అవలీలగా అందుకున్నారు రుక్మిణీ బెనర్జీ. పాఠశాల విద్యలో అభ్యసన ప్రక్రియను మెరుగు పరచడానికి ఆమె సూచించిన అంశాలకు గాను ఎడ్యుకేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘యిదన్’ బహుమతి అందుకున్నారు. ఈ బహుమతి కోసం 130 దేశాలకు చెందిన విద్యావేత్తలు పోటీపడగా బెనర్జీని బహుమతి వరించడం విశేషం. ఆర్థికవేత్త నుంచి విద్యావేత్తగా... బిహార్‌కు చెందిన డాక్టర్ రుక్మిణీ బెనర్జీ న్యూఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్ కాలేజీ, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో అర్థశాస్త్రాన్ని చదివి, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటి స్కాలర్‌గా చేరారు. తరువాత చికాగో యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఉన్నత విద్య పూర్తయ్యాక అమెరికాలోనే స్థిరపడిన బెనర్జి 1996లో ఇండియా వచ్చారు. అప్పుడు ముంబై కేంద్రంగా పనిచేస్తోన్న ఎన్జీవో ‘ప్రథమ్’లో చేరారు. అప్పటి నుంచి విద్యావ్యవస్థ అభివృద్ధే లక్ష్యంగా కృషిచేస్తున్నారు. వివిధ రకాల కార్యక్రమాల ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్కూలు పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నారు. ఈ క్రమంలోనే బెనర్జీ నేతృత్వంలోని బృందం ‘యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు’(ఏఎస్ ఈఆర్)ను విడుదల చేసింది. 2005–15 వరకు ఇంటింటికి తిరిగి సర్వే చేసి విడుదల చేసిన నివేదిక అది. వందరోజులకు పైగా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ఆరు లక్షలమంది పిల్లల అక్షరాస్యత నాణ్యతపై సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో అనేక స్కూళ్లను సందర్శించి ఎక్కువమంది పిల్లలు ప్రాథమిక అంశాలను కూడా చదవలేకపోవడం, చిన్నపాటి గుణింతాలు కూడా చేయలేకపోవడం గుర్తించి, అంతేగాక ‘టీచింగ్ ఎట్ ద రైట్ లెవల్’ (టీఏఆర్‌ఎల్) కార్యక్రమం ద్వారా విద్యార్థుల అభ్యసనను మెరుగు పరచవచ్చని సూచించారు. అంతేగాక టీఏఆర్ఎల్ను కొన్ని ప్రాంతాల్లో అమలు చేసి మంచి ఫలితాలను చూపించారు. ఈ కార్యక్రమానికి రుక్మిణి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెను యిదన్ ప్రైజ్ వరించింది. ఏఎస్ఈఆర్.. ఏఎస్ఈఆర్తోపాటు .. పిల్లల కోసం హిందీ, ఇంగ్లీష్ భాషల్లో దినపత్రికల్లో ఆరి్టకల్స్ రాయడం, పిల్లలకు సులువుగా అర్థమయ్యే విధంగా కథల పుస్తకాలను బెనర్జీ రాస్తున్నారు. ఏఎస్ఈఆర్ నివేదిక రూపొందించే బృందాన్ని ముందుండి నడిపించారు. ఈ నివేదికను విడుదల చేసిన తరువాత బెనర్జి ప్రథమ్‌కు సీఈవో అయ్యారు. విద్యావ్యవస్థ అభివృద్ధిని గుర్తించిన బిహార్ ప్రభుత్వం 2008లో ‘మౌలానా అబుల్ కలామ్ శిక్షా పురస్కార్’తో సత్కరించింది. రాష్ట్రంలో ఈ అవార్డును అందుకున్న తొలి వ్యక్తి బెనర్జీనే. తాజాగా 2021 సంవత్సరానికి గాను విద్యాభివృద్ధికి కృషిచేస్తోన్న వారికిచ్చే ‘యిదన్’ బహుమతిని అందుకున్నారు. స్మార్ట్ మామ్ విద్యద్వారా మెరుగైన ప్రపంచాన్ని అందించేవారిని సత్కరించేందుకు గాను 2016లో చార్లెస్ చెన్ యిదన్ ‘ద యిదన్ అవార్డు’ను ఏర్పాటు చేశారు. ఈ బహుమతి పొందిన వారికి స్వర్ణ పతకంతోపాటు, 3.9 మిలియన్ డాలర్లు( మన రూపాయల్లో దాదాపు 29 కోట్లు) దీనిలో సగం మొత్తా్తన్ని విద్యాభివృద్దికి వినియోగించాలి. ‘‘యిదన్ ప్రైజ్ విద్యాభివృద్ధికి మరింత కృషిచేసే అవకాశం కల్పించింది. గత 15 ఏళ్లుగా పిల్లల అక్షరాస్యతపై పనిచేస్తున్నాం. మొహల్లా లెర్నింగ్ క్యాంపెయిన్‌లో భాగంగా వలంటీర్లతో ‘టీచింగ్ ఎట్ ది రైట్ లెవల్’ను అందిస్తున్నాము. ‘స్మార్ట్ మామ్’ పేరిట విద్యార్థుల తల్లులకు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ మెస్సేజ్‌ల ద్వారా చిన్నపాటి యాక్టివిటీలను అప్పజెప్పి వారి ద్వారా పిల్లల అభ్యసనను మెరుగుపరుస్తున్నాం. దీనికి మంచి స్పందన లభిస్తోంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పదివేల కమ్యూనిటీల్లో 30 నుంచి 35 వేలమంది తల్లులు పాల్గొంటున్న ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తాము’’ అని రుక్మిణీ బెనర్జీ వివరించారు. చదవండి: కూచునే హక్కు మీకు ఉంది... -
బీవోబీ, యూ గ్రో నుంచి ప్రథమ్ రుణాలు
న్యూఢిల్లీ: పీఎస్‌యూ దిగ్గజం బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) తాజాగా ఫిన్‌టెక్ కంపెనీ యూ గ్రో క్యాపిటల్‌తో చేతులు కలిపింది. తద్వారా ప్రథమ్ పేరుతో రుణాలను అందించనుంది. యూ గ్రో క్యాపిటల్ సహకారంతో ఎంఎస్ఎంఈ రంగంలోని సంస్థలకు రూ. 1,000 కోట్లను రుణాలుగా విడుదల చేయనున్నట్లు బీవోబీ తెలియజేసింది. బీవోబీ 114వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో ప్రథమ్ పేరిట రుణాల జారీని చేపట్టినట్లు చిన్న సంస్థలకు రుణాలందించే టెక్ ఆధారిత ప్లాట్‌ఫామ్.. యూ గ్రో క్యాపిటల్ పేర్కొంది. సహరుణ విడుదల కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు అవసరాలకు అనుగుణంగా(కస్టమైజ్డ్) రుణాలను పోటీస్థాయి వడ్డీ రేట్లతో అందించనున్నట్లు తెలియజేసింది. రూ. 50 లక్షల నుంచి ప్రారంభించి రూ. 2.5 కోట్ల వరకూ రుణాలను మంజూరు చేయనున్నట్లు వివరించింది. 8 శాతం నుంచి ప్రారంభమయ్యే వడ్డీ రేట్లతో గరిష్టంగా 120 నెలల కాలావధితో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. కాగా.. సహరుణ కార్యక్రమం ద్వారా ఎంఎస్ఎంఈ విభాగానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీవోబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ కె. పేర్కొన్నారు. తద్వారా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు మరింత మద్దతివ్వనున్నట్లు తెలియజేశారు. -
బుల్లితెర నటుల రచ్చ రచ్చ...
బెంగళూరు : కన్నడ బుల్లితెర నటులు ప్రథమ్, భువన్ మధ్య చెలరేగిన గొడవ రచ్చకెక్కింది. ఇటీవల నిద్రమాత్రలు మింగి నానా హంగామా చేసిన ప్రథమ్ తాజాగా సహ నటుడు భువన్ తొడను కొరికి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ‘నంజు మత్తు నాను’ టీవీ సీరియల్ సెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై భువన్ ఆదివారం రాత్రి తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నటి విషయంలో వారిద్దరు గొడవపడుతున్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి. భువన్ను ఓ సీరియల్ నుంచి తొలగించడం వల్లే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ప్రథమ్ తెలిపారు. భువన్కు అమ్మాయిల పిచ్చి ఉందని, ఆదివారం షూటింగ్ ముగిసిన తర్వాత గదిలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అక్కడ సంజన, భువన్ ఉన్నారని తనను చూసిన అతడు ఆగ్రహంతో దూషించాడని ప్రథమ్ తెలిపారు. ఓ విషయంలో భువన్ను సీరియల్ నుంచి తొలగించారని పేర్కొన్నారు. కన్నడ బిగ్‌బాస్ 4 విజేత అయిన ప్రథమ్ గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు. తన స్నేహితుడు లోకేశ్‌తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నానంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన ప్రథమ్‌ను సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే. -
లైవ్ లో బిగ్ బాస్ విజేత ఆత్మహత్యాయత్నం
బెంగళూరు: కన్నడ బిగ్ బాస్ 4 విజేత ప్రథమ్ ఆత్మహత్యాయత్నం చేశాడు. ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ నెల 5న బసశ్వేర నగర్ లోని తన ఇంట్లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన అతడిని సకాలంలో ఆస్పత్రికి తరలించారు. తన స్నేహితుడు లోకేశ్ తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నట్టు అతడు వెల్లడించాడు. ఫేస్బుక్ లైవ్‌లో వీడియో అప్లోడ్ చేసి ముంబైలోని అర్జున్ భరద్వాజ్ అనే యువకుడు హోటల్ 19వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న తర్వాతే రోజే అదేవిధంగా ప్రథమ్ కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. 'లోకేశ్ పెట్టే వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. బిగ్ బాస్ షోలో గెలిచినా టీవీ చానల్ నుంచి ఇంకా నగదు అందలేదు. డబ్బులు అవసరమైన వారికి ఎప్పుడు దానం చేస్తారని చాలా మంది పదేపదే అడుగుతున్నారు. షో నిర్వాహకులు చెక్ మాత్రమే ఇచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బులో ఒక్క పైసా కూడా నేను తీసుకోవాలనుకోలేదు. లోకేశ్ నాకు చెడ్డపేరు తెస్తున్నాడు. నా గురించి లేనిపోనివి ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ భరించలేకపోతున్నాను. ఇదే నా చివరి ఫేస్ బుక్ లైవ్ వీడియో. ఎవరినైనా నొప్పించివుంటే మన్నించాల'ని ప్రథమ్ పేర్కొన్నాడు. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అని కొందరు అనుమానిస్తున్నారు.