బుల్లితెర నటుల రచ్చ రచ్చ... | kannada tv actor Pratham bit co-star Bhuvan on the sets of Sanju Mattu Naanu | Sakshi
Sakshi News home page

సహ నటుడి తొడ కొరికాడు...

Published Tue, Jul 25 2017 8:30 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 PM

బుల్లితెర నటుల రచ్చ రచ్చ...

బుల్లితెర నటుల రచ్చ రచ్చ...

బెంగళూరు : కన్నడ బుల్లితెర నటులు ప‍్రథమ్‌, భువన్‌ మధ్య చెలరేగిన గొడవ రచ్చకెక్కింది. ఇటీవల నిద్రమాత్రలు మింగి నానా హంగామా చేసిన ప్రథమ్‌ తాజాగా సహ నటుడు భువన్‌ తొడను కొరికి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు. ‘నంజు మత్తు నాను’ టీవీ సీరియల్‌ సెట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై భువన్‌ ఆదివారం రాత్రి తలఘట్టపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ నటి విషయంలో వారిద్దరు గొడవపడుతున్నట్లు బుల్లితెర వర్గాలు చెబుతున్నాయి.

భువన్‌ను ఓ సీరియల్‌ నుంచి తొలగించడం వల్లే లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని ప్రథమ్‌ తెలిపారు. భువన్‌కు అమ్మాయిల పిచ్చి ఉందని, ఆదివారం షూటింగ్‌ ముగిసిన తర్వాత గదిలో ఉన్న వస్తువులను తీసుకోవడానికి వెళ్లిన సమయంలో అక్కడ సంజన, భువన్‌ ఉన్నారని తనను చూసిన అతడు ఆగ్రహంతో దూషించాడని ప్రథమ్‌ తెలిపారు. ఓ విషయంలో భువన్‌ను సీరియల్‌ నుంచి తొలగించారని పేర్కొన్నారు.

కన్నడ బిగ్‌బాస్‌ 4 విజేత అయిన ప్రథమ్‌ గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశాడు.  ఫేస్ బుక్ ఫాలోవర్లకు లైవ్ వీడియో పెట్టి అతడు ఆత్మహత్యకు యత్నించాడు. తన స్నేహితుడు లోకేశ్‌తో తలెత్తిన విభేధాల కారణంగానే ప్రాణాలు తీసుకుంటున్నానంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించిన  ప్రథమ్‌ను సకాలంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement