యువతితో నటుడి నిశ్చితార్థం.. నిలదీసిన భార్యపై కత్తితో దాడి | Kannada TV Actor Sunny Mahipal Accused Of Stabbing Wife | Sakshi
Sakshi News home page

మరో యువతితో నటుడి ఎంగేజ్‌మెంట్‌.. గర్భిణి అని చూడకుండా భార్యపై దాడి

Jul 24 2024 7:54 AM | Updated on Jul 24 2024 9:21 AM

Kannada TV Actor Sunny Mahipal Accused Of Stabbing Wife

బనశంకరి: మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడాన్ని ప్రశ్నించిన భార్యపై బుల్లితెర నటుడు చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సన్నిమహిపాల్‌ సీరియల్‌లో నటిస్తున్నాడు. జనవరిలో ఫేస్‌బుక్‌ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నట్లు నమ్మించి శారీరకంగా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్‌ చేయడంతో గతనెల 15న దేవస్థానంలో ఇద్దరికి వివాహమైంది.

వివాహమైన అనంతరం వారం పాటు తనతో కలిసున్న భర్త తల్లిదండ్రులను ఒప్పిస్తానని మాటిచ్చాడు. అప్పటివరకు ఇద్దరు స్నేహితులుగా ఉండాలని అలాగే మేనేజ్‌ చేయాలని షరతు విధించాడు. అనంతరం మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెల్సి ఆ యువతి సన్నిమహిపాల్‌ను ప్రశ్నించడానికి అర్ధరాత్రి విజ్ఞాననగరలో అతడి నివాసానికి వెళ్లింది.

ఇద్దరి మధ్‌య గొడవ జరగడంతో సన్నిమహిపాల్‌ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్‌ అయిందని భార్య తెలిపింది. మరోవైపు తను బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్‌ సదరు యువతిపై హెచ్‌ఏఎల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement