Mahipal
-
యువతితో నటుడి నిశ్చితార్థం.. నిలదీసిన భార్యపై కత్తితో దాడి
బనశంకరి: మరో యువతితో నిశ్చితార్థం చేసుకోవడాన్ని ప్రశ్నించిన భార్యపై బుల్లితెర నటుడు చాకుతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న సన్నిమహిపాల్ సీరియల్లో నటిస్తున్నాడు. జనవరిలో ఫేస్బుక్ ద్వారా ఓ అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం ప్రేమిస్తున్నట్లు నమ్మించి శారీరకంగా ఒకటి కావడంతో ఆమె గర్భం దాల్చింది. గర్భిణి కావడంతో తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి డిమాండ్ చేయడంతో గతనెల 15న దేవస్థానంలో ఇద్దరికి వివాహమైంది.వివాహమైన అనంతరం వారం పాటు తనతో కలిసున్న భర్త తల్లిదండ్రులను ఒప్పిస్తానని మాటిచ్చాడు. అప్పటివరకు ఇద్దరు స్నేహితులుగా ఉండాలని అలాగే మేనేజ్ చేయాలని షరతు విధించాడు. అనంతరం మంగళూరు వెళ్లి కొద్దిరోజుల క్రితం తల్లిదండ్రుల సమక్షంలో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఈ విషయం తెల్సి ఆ యువతి సన్నిమహిపాల్ను ప్రశ్నించడానికి అర్ధరాత్రి విజ్ఞాననగరలో అతడి నివాసానికి వెళ్లింది.ఇద్దరి మధ్య గొడవ జరగడంతో సన్నిమహిపాల్ ఆమెపై చాకుతో దాడి చేశాడు. అనంతరం కారులో ఆసుపత్రికి తీసుకెళ్లగా ఈ గొడవలో తనకు అబార్షన్ అయిందని భార్య తెలిపింది. మరోవైపు తను బలవంతంగా వివాహం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించిందని ఆరోపిస్తూ సన్నిమహిపాల్ సదరు యువతిపై హెచ్ఏఎల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. -
‘పరుగు’లోనే ఆగిన గుండె
రేగోడ్ (మెదక్)/సంగారెడ్డి మున్సిపాలిటీ: పోలీసు ఉద్యోగంలో చేరాలనుకున్న ఓ గిరిజన విద్యార్థి గుండెపోటుతో దుర్మరణం పాలైన ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా రేగోడ్ మండలం పెద్దతండాకు చెందిన రంజానాయక్, చాందీబాయి దంపతుల రెండో కుమారుడు మహిపాల్ (20) సంగారెడ్డిలో బీకాం ప్రథమ సంవత్సరం చదువుకుంటూ పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగం రెండు మార్కులతో చేజారిపోయింది. గతంలో ఆర్మీ సెలక్షన్‌కు సైతం వెళ్లాడు. ఇదిలా ఉంటే ఎప్పటిలాగే ఆదివారం ఉదయం సంగారెడ్డిలో ఉన్న గ్రౌండ్లో రన్నింగ్ చేస్తుండగా గుండెపోటు వచ్చింది. 108 అంబులెన్స్ వచ్చేసరికే మహిపాల్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కుమారుడి మరణ వార్త వినగానే కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పెద్దతండాకు తీసుకొచ్చారు. మహిపాల్ కుటుంబీకులను ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
కూతురొస్తుందని ఊరొదిలి..
రామాయంపేట, న్యూస్‌లైన్: ఆడపడుచు వస్తుందంటే చాలు ఆ కుటుంబంలో ఆనందానికి అవధులుండవు. మా ఇంటి మహాలక్ష్మి వస్తుందంటూ తల్లిదండ్రులు గర్వంగా ఫీలవుతారు. ఇళ్లంతా సందడిగా ఉంటుంది. కానీ తమ కూతురు ఊర్లో అడుగుపెడుతుందన్న సమాచారంతో ఓ కుటుంబ సభ్యులు ఇళ్లకు తాళాలు వేసి గొడ్డుగోదా వదిలి వెళ్లిపోయారు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం దంతేపల్లిలో శనివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన గొల్ల సాయిలు కుమార్తె సరిత అదే గ్రామానికి చెందిన మహిపాల్ జూలై 26న ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరుకుటుంబాలతో పాటు స్థానికులు అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ జంట ఆరునెలలుగా రంగారెడ్డి జిల్లా అల్వాల్‌లో నివాసం ఉంటోంది. కాగా, సరిత, మహిపాల్ శుక్రవారం సాయంత్రం సొంతూరుకు వెళ్లాలనుకున్నారు. సరిత రామాయంపేట నుంచి తన తండ్రితో ఫోన్లో మాట్లాడి ఊళ్లోకి అనుమతించాలని వేడుకుంది. ‘మీరొస్తే మా పరువు ఏం కావాలి? మేం ఇక్కడ ఉండలేం’ అని తండ్రి తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో సరిత తన భర్త మహిపాల్‌తో కలిసి వెనుదిరిగింది. అరుునప్పటికీ.. కూతురు ఊళ్లోకి వస్తుందేమోనన్న అనుమానంతో గొల్ల సాయిలు తన సోదరులతో కలసి మొత్తం నాలుగు కుటుంబాలు శుక్రవారం సాయంత్రం ఇళ్లకు తాళాలు వేసి గొడ్డుగోదాను వదిలి వెళ్లిపోయారు.